Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఎవరికైనా మంచి స్టోరీలైన్ ఉండి, రైటర్ కోసం వెతుకుతుంటే ఈ దారం మీ కోసమే......
#36
ఒక పూజ పునస్కారాలు చేసుకునే 50 ఏళ్ళ పెద్దాయన. గురూపదేశం పొందాడు. ఆయన జీవితము మొత్త్తం బ్రహ్మ చర్యాన్ని వహించాడు. వయసులో ఉన్నప్పుడు అమ్మని తీసుకుని తీర్ధయాత్రలకి కాశీకి ప్రయాణం అయ్యాడు. ఒక అందమైన అమ్మాయి ప్రయాణం లో కలుస్తుంది. అతన్ని ఊరిస్తుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అలానే ఇంకొక ఆవిడ., కానీ ఎందుకో వాళ్ళతో పొసగదు.

ఇప్పుడు అతని వయసు 60 సంవత్సరాలు. ఒకరోజు ఎవ్వరో తలుపు కొట్టారు. చూస్తే 18 ఎల్లా పడుచు పిల్ల. కాళ్ళకి దండం పెట్టి అతని చేతిలో తాళి పెట్టి మెళ్ళో కట్టమంటుంది.

పదిరోజుల సమయం అడుగుతాడు. ఆ పది రోజులూ అతనితోనే ఉంటుంది.

కానీ అతనికి పాలుపోక మౌనం వహిస్తాడు. అతనికి పూజలో ఉండగా ఒక వాణి వినిపిస్తుంది. ఆ వాణిని అనుసరించి వెళ్ళిపోతాడు.
ఒక గుళ్లో., ఒక గుప్త ద్వారం ఆ ద్వారం అతనికోసమే తెరుచుకుంటుంది. అక్కడ గుడిలోని లింగం 7 నిలువు లోతులో దిగువకు 7 అంతస్తుల లోతువరకూ నిలువుగా వ్యాపించి ఉంటుంది.
అక్కడ ఆటను అడుగు పెట్టగానే చుట్టూ ఉన్న నీళ్లు కిందకు మరీ కిందకు వెళ్లిపోతాయి ఆ కింద ఒక స్పటిక లింగం జీవం తో ఉంటుంది ఆ లింగం నుండి వచ్ఛే నీరు ఒక కొలనులా ఏర్పడుతుంది. ఆటను ఆ కొలనులో స్నానం చెయ్యగానే............ముసలితనం పొయ్యి పరిపూర్ణ యవ్వనవంతుడవుతాడు.

(ఇది అంజి మూవీ కాదు. నేను ఎక్కడో చదివాను టైపు చేస్తూండగా అంజి మూవీ జ్ఞాపకం వచ్చింది)

భగవంతుని వాణి మళ్ళీ వినిపించి ఆమెని కళ్యాణం చేసుకోమంటాడు భగవానుడు.

పెళ్లి చేసుకోవాలా వద్దా ? ఇంత చేసిన యవ్వనాన్ని ఇఛ్చిన ఆ భగవంతుని కై తపస్సు చెయ్యాలా?

ఆయన వాణి ప్రకారం సుఖిస్తాడు.

కాశీయాత్రలో కలిసిన వారు పూర్వజన్మలో ఆయనను వివాహం చేసుకుని అనురాగం లేక వదిలేసినవాళ్లు.

కానీ ఈమె అతనిపై అనురాగాన్ని మరువలేదు.

అందుకే కోరి పెళ్ళి చేసుకుంది. ఆమె కోరికకై భగవంతుడు ఆతనికి నిండు యవ్వనాన్ని ఇచ్చ్చాడు.

ఇదీ కధావస్తువు.
Like Reply


Messages In This Thread
RE: ఎవరికైనా మంచి స్టోరీలైన్ ఉండి, రైటర్ కోసం వెతుకుతుంటే ఈ దారం మీ కోసమే...... - by kamal kishan - 28-06-2019, 01:03 AM



Users browsing this thread: 2 Guest(s)