Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక (జానపద) కథలు - వసుదేవా
#38
ప్రియంవద
[font=var(--ricos-font-family,unset)][img]https://i.ibb.co/b5mXwVs/image-2025-01-06-100429378.png[/img][url=https://i.ibb.co/b5mXwVs/image-2025-01-06-100429378.png%5b/img%5d%5b/url][/url][/font]http://[/url][url][url]
[font=var(--ricos-font-family,unset)] [/font]
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు



"ఓం నమశ్శివాయ.. ఓం నమశ్శివాయ.. ఓం నమ శ్శివాయ.. ఓం నమశ్శివాయ.. ఓం నమశ్శివాయ.." అంటూ ప్రియంవద పూజా మందిరం శివ నామస్మరణ తో పులకరించిపోతుంది. మహా శివుని తలపై ఉన్న చంద్రవంక, చంద్రవంశ మహారాణి ప్రియంవద చేసే శివ పూజను కన్నార్పకుండా చూస్తుంది. పూజామందిరం సమస్తం త్రినేత్ర జ్ఞాన తేజంతో ప్రకాశిస్తుంది. త్రినేత్ర జ్ఞాన తేజాన్ని చూడగలిగిన ప్రియంవద త్రినేత్ర జ్ఞాన తేజంలో మైమరచిపోతూ శివ నామస్మరణ చేస్తుంది. 



ప్రియంవద శివనామ స్మరణ కు భండాసుర గణాల చెవుల వెంట రక్తం కారసాగింది. భండాసుర గణాల హాహాకారాలకు అసురులందరూ హడలిపోయారు. 



 ప్రియంవద శివ నామ స్మరణను చూసిన ఆమె అత్తమామలు చంద్రవంశీకులు ప్రభ, ఆయువులు "మంగళాకార! సాం బశివ! సదాశివ! పాహిమాం! పా హిమాం!పరమేశ్వర! అండపిండబ్రహ్మాండాల అణువ ణువున కొలువైన కైలాస వాస! కరుణించి కాపాడ కద లిరావయ్య నందీశ్వర వాహన! నాగాభరణ!" అంటూ శివనామ స్మరణ చేసారు. అటుపిమ్మట రాజ తేజంతో ప్రకాసిస్తున్న తమ కుమారుడు నహుషుని సమీపించారు. 



 "చంద్ర వంశ యశోవర్థన ! దత్తాత్రేయ వర ప్రసాది! వశిష్ట ప్రియ శిష్యా నహుష! నీ సుపరిపాలనలో ప్రతిష్టాన పురము ప్రమోద ప్రభలతో ప్రకాశిస్తుంది. ఎల్లప్పుడు ప్రియాన్నే పలికే ప్రియంవద నీకు ధర్మ పత్ని అయ్యాక ఇలాతలంలో నీ కీర్తిప్రతిష్టలు మరింత పెరిగాయి. నీ ప్రియపత్ని ప్రియంవద పథకానుసారం 99 యజ్ఞాలను నిర్విఘ్నంగా చేసి ధరణీపతుల హృదయాలలో దేవేంద్రుడివయ్యావు. 



 ఇంద్ర లోకాధిపతి దేవేంద్రుడు సహితం నీతో స్నేహసంబంధాలను అధికం చేసుకోడానికి ఆసక్తిని చూపిస్తున్నాడు. ఇక నీ ధర్మపత్ని ప్రియంవద ధర్మపథకానుసారం నూరవ యజ్ఞం ను కూడా చెయ్యి. ", అని ఆయువు కుమారుడు నహుషునితో అన్నాడు. 



"నాయన నహుష! నీ తండ్రిగారు చెప్పింది అక్షర సత్యం. ఇప్పటివరకు గడిచిన మీ భార్యాభర్తల జీవన గమనం చిత్రాతిచిత్రం. మహా విచిత్రం. ప్రియంవద నీ జీవితంలోకి వచ్చాక నీ కీర్తి ప్రతిష్టలు సమస్త లోకాలు వ్యాపించాయి. 



 మన కుల గురువు వశిష్ట మహర్షి ఆదేశానుసారం మహర్షుల ఆశ్రమంలో పెరిగిన ప్రియంవదను నువ్వు వివాహం చేసుకున్నావు. నువ్వు ప్రేమించిన అశోక సుందరి, వశిష్ట మహర్షి నిన్ను వివాహం చేసుకోమన్న ప్రియంవద ఒకరే అవ్వడం లలాట లిఖితం తప్ప మరొకటి కాదు. ప్రియంవదను కొందరు మహర్షులు విరాజా అనికూడా పిలిచేవారట గదా?" కుమారునితో అంది ప్రభ. 



"అవును. కొందరు మహర్షులు ప్రియంవదను విరాజా అనే పిలిచేవారు మాత. ప్రియంవద పుట్టుక గురించి కూడా రకరకాల కథలు ఋషి వాడలలో ప్రచారంలో ఉన్నాయి. కథలన్నీ ప్రియంవద కారణజన్మురాలు. ప్రియంవద నిరంతరం ప్రియంగా మాట్లాడుతూ నవ్వు ముఖంతోనే ఉంటుంది. ప్రియంవద తన తొమ్మిదవ సంవత్సరమునే భండాసురుని 30 మంది పుత్రులను సంహరించి బాలాత్రిపుర సుందరి అయ్యింది అని చెబుతున్నాయి.. 



 కొందరు మహర్షుల అభిప్రాయం ప్రకారం ప్రియంవద పార్వతీపరమేశ్వరుల ముద్దుల కుమార్తె. ఒకనాడు పార్వతీ దేవి కల్పవృక్షం దగ్గరకు వెళ్ళింది. కోరిన కోర్కెలు తీర్చే కల్పం వృక్షం దగ్గర పార్వతీ మాత తన గణపతి సృష్టిని తలచుకుని మహదానంద పడింది. తనకు ఒక కుమార్తె కూడా ఉంటే బాగుంటుందనుకుంది.. కల్ప వృక్షం ఆమె కోరికను తీర్చింది. 



 పార్వతీ మాత ప్రియంవదను అల్లారుముద్దుగా పెంచింది. ప్రయాగలోని అశోకవనం లో ఉన్న మహర్షుల దగ్గర ప్రియంవద పెరిగితే బాగుంటుంది అని పార్వతీ మాతకు పరమేశ్వరుడు సలహా ఇచ్చాడు. పార్వతీ మాత పరమేశ్వరుని సలహా పాటించింది. అశోక వనంలోని మహర్షుల ధర్మపత్నులకు పార్వతీ మాత ప్రియంవదను అప్పగించింది. మహా సుందరంగా ఉన్న ప్రియంవదకు అశోక వనంలోని మునిపత్నులే అశోక సుందరి అని పేరు పెట్టారు. ప్రియం తప్ప అప్రియాన్ని మాట్లాడని అశోక సుందరిని కొందరు మహర్షులు, మునిపత్నులు ప్రియంవద అని పిలవసాగారు. 



 ప్రియంవద చిన్నతనంలోనే సమస్త విద్యలను అభ్యసించింది. అశోకవన సంరక్షణలో తన ప్రతిభను చూపించింది. కొందరు మునిపత్నుల కఠిన హృదయాలను తన మంచి మాటలతో కరిగించింది. మరికొందరు ముని పత్నుల అసూయ ఈర్ష్యా ద్వేషాలను తన ప్రియ మాటలతో మటుమాయం చేసింది. అక్కడి మహర్షులు ప్రియంవదను బాలాత్రిపుర సుందరి, లావణ్య, అన్వి, విరాజా అని రకరకాల పేర్లతో పిలిచేవారు. జీవన శ్వాస మూలాలు తెలిసిన ప్రియంవద నాకు అక్కడే పరిచయం అయ్యింది" .. తల్లి ప్రభతో అన్నాడు నహుషుడు. 



 "ప్రియంవదను సంహరించాలని ఎవరో రాక్షసుడు ప్రయత్నించాడు కదా?" తనయుడు నహుషునితో అన్నాడు ఆయువు. 



"అవును తండ్రి అవును. హుండాసురుడనేవాడు ప్రియంవదను చెరబట్టి ఆమె దివ్య శక్తులను తన వశం చేసుకుని ఆమెను తన దాసీని చేసుకోవాలని చూసాడు. విషయం తెలిసిన పార్వతీపరమేశ్వరులు దేవేంద్రుని దేవతలను పిలిచి, దేవేంద్ర, దేవతలారా! హుండాసురుడు తన తపోశక్తి తో బ్రహ్మ దేవుని మెప్పించాడు. త్రిమూర్తుల చేతిలో తనకు మరణం ఉండరాదని వరం కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు తథాస్తు అన్నాడు. 



తర్వాత తర్వాత హుండాసురుడు త్రిమూర్తుల తర్వాత తనే గొప్ప అనే వర గర్వంతో అనేకమంది మానవ స్త్రీలను చెరబట్టాడు. సమస్త లోకాలలోని లావణ్య వతులంతా తన ఆధీనంలోనే ఉండాలనుకుని నా కుమార్తె ప్రియంవద మీద కన్నేశాడు. ప్రియంవదను మీరే కాపాడాలి " అన్న పరమశివుని మాటలను అనుసరించి దేవేంద్రుడు, తదితర దేవతలు హుండాసురుని మీదకు యుద్దానికి వెళ్ళారు. అయితే వారంతా హుండాసురుని ముందు నిలవలేక పోయారు.



 అప్పుడు దేవేంద్రుడు అనేక దివ్య ఆయుధాలను నాకిచ్చి హుండాసురుని సంహరించమన్నాడు. నేను దేవేంద్రుడు ఇచ్చిన దివ్య ఆయుధాల సహాయం తో హుండాసురుని సంహరించాను. అప్పటినుండి దేవేంద్రుడు నాకు మిత్రుడు అయ్యాడు. అప్పుడే నేను ప్రియంవదను వివాహం చేసుకున్నాను. "తండ్రితో అన్నాడు నహుషుడు. 



"ప్రియంవదను వివాహం చేసుకున్నాక నువ్వు ప్రియంవద మాటలను అనుసరించి 99 యజ్ఞాలు చేసావు కదా?" నహుషుని అడిగాడు ఆయువు. 
[/url]
ఇతర ధారావాహికాలు

నల్లమల నిధి రహస్యం
(https://xossipy.com/thread-66514.html)
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - ప్రభ - by k3vv3 - 06-01-2025, 10:05 AM



Users browsing this thread: 1 Guest(s)