06-01-2025, 12:12 AM
(This post was last modified: 16-01-2025, 08:31 AM by Sweatlikker. Edited 4 times in total. Edited 4 times in total.)
అందము ~ అంధము
పరిచయం:-
“ గ్రిలిన్ గ్రిలిన్ గ్రిలిన్ గ్రిలిన్ ”..... అలారం మోగింది.
నిద్రలేచాను.
మీ దృష్టిలో చీకటి.
చీకటి అంటున్నాను కదా, అసలు చీకటి ఎలా ఉంటుందండీ?
ఈ ప్రశ్న ఒకరిని అడిగాను. “ నల్లగా ఉంటుంది, ఏమీ కనిపించదు ”... ఇదేగా మీ సమాధానం కూడా.
సరే... ఐతే మరి నల్లగా అంటే ఎలా ఉంటుంది?
నలుపు రంగులో ఉంటుంది ఆంటారేమో, అదీ నాకు కనిపించదు.
అవును. నాకు కనిపించదు.
~ అంధము ~ అనగా గుడ్డి.
రాజా ది గ్రేట్ - సినిమా చూసారా? చూస్తే మీకు కన్నులు ఉన్నట్టే.
అందులో రవితేజ అంటాడు కదా, “ వెల్కమ్ టు మై వరల్డ్, బ్లైండ్ వరల్డ్ ” అని.
కానీ మీకు స్క్రీన్ మీద రవితేజ చేసేవి అన్నీ చూపించారు.
తర్ఖంగా చూస్కుంటే, తర్ఖం అంటే తెలీదా? Logic. హా logic గా చూస్కుంటే ఆ సినిమాలో అలా చెప్పగానే స్క్రీన్ అంతా బ్లాక్ అయిపోవాలి. ఎందుకంటే రవితేజకి అంతా చీకటే.
ఏంటండీ చీకటి తర్ఖం లేదు. మీరూ కొంచెం ఇంగిత జ్ఞానం లేకుండా ఉన్నారు. అసలు గుడ్డి వాళ్ళకి అంతా చీకటిగా ఉంటుంది అని వాళ్ళు చెప్పారా, మీరే అనుకున్నారు అంతే. సినిమా కాకపోతే తర్ఖం చూసుకోలేదు వాళ్ళు.
Movie లో రవితేజ, అనగా ఒక visually disabled person pov అంటే, స్క్రీన్ ని పూర్తిగా turn off చేసి కేవలం speakers మాత్రమే పని చేసేలా ఉండాలి. అది blind perspective అంటే. అది కూడా కాదు, మీరు కళ్ళు మూస్కోవాలి. చచ… ఇది కూడా కాదు.
ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా సినిమాలు చూసేస్తారు, కళ్ళు ఉన్నాయన్న పొగరు కదా మీకు. సర్లే ఏం లాభం, కళ్ళు లేని నాకున్న ఇంగిత జ్ఞానం కూడా లేదు.
ఇంగిత జ్ఞానం అంటే ఏంటో తెలుసా లేక నేనే చెప్పాలా? Common sense అంటారు.
To be continued.......
అర్థం పర్థం లేకుండా To be continued... ఎయ్యడమే నా తరీఖా... జర్రంత యాల ఆగి వస్తాను. క్యాల్ పెట్టుకొని update ఇచ్చినాక సదువుకోండి.
ఉచ్చాగక update please అనకండి నాకు కనిపించదు.
|—————++++++++++
మీకు ఒక చిన్న అనుమానం రావాలి, ఎవరికి వస్తుందో చూద్దాం?