05-01-2025, 11:04 AM
(04-01-2025, 10:45 PM)Uday Wrote: బ్రో పాఠకులు కూడా తెలుసుకోవాలి కదా..(కదా సమంత అంటునట్లు ఊహించుకోండి). రచయితలకూ సమయం, సందర్భం, మూడ్ రావాలికదా (సమంత) రాయడానికి, రాసి పోస్ట్ చేయడానికి. even డబ్బులిచ్చి కొనుక్కునే వార పత్రికలలో కూడా వారానికి ఒకసారే అప్డేట్ వస్తుంది. మన " ప్యాషనేట్ మ్యాన్ " అనే మాష్టారు వుండేవారు, వారు చెప్పినట్లుగానే వారానికి అంటే ప్రతి ఆదివారం అప్డేట్ ఇచ్చేవారు, మేము చకోర పక్షుల్లా ఎదురుచూసేవాళ్ళం తప్పితే వూరికే విసిగించేవాళ్ళం కాము (కథ ఎంత నచ్చినా, తరువాత ఏమౌతుందో అని ఎంత కుతూహలమున్నా).
మీరీ పాట విన్నారో లేదో " కలువకు చంద్రుడు ఎంతో దూరం " అందులో ఓ చరణం లో రచయిత అంటాడు..." చూపుల కన్నా ఎదురు చూపులే తియ్యన " ( ఆఫ్ కోర్స్ ప్రేయసి కోసమనుకోండి)...మీ కథలు కూడా ప్రేయసి కంటే తక్కువేం కాదు, ఇప్పటికే చాలా ఎక్కువైనట్లుంది (ఐరిష్ విస్కీ ప్రభావం), ఇక సెలవు తీసుకుంటున్నా...