04-01-2025, 11:24 PM
(04-01-2025, 11:19 PM)anaamika Wrote: ఫ్రెండ్స్, నాకొక కొత్త కథకి, థీమ్ తట్టింది. జస్ట్ టూకీగా ఇంట్రో చెబుతాను.
ఇదొక Sci-Fi, థ్రిల్లర్ కథ. ఇందులో సెక్స్ థీమ్ అసలు ఉండదు.
ఒక వ్యక్తి (హీరో) ఒక ప్రదేశంలో వొళ్ళంతా రక్తం, దెబ్బలతో పడి ఉంటాడు. అతనికి గతమేమీ గుర్తుండదు. తలలో అతనికి ఏవేవో మాటలు వినిపిస్తుంటాయి. తనకి ఎదో చెడు జరిగిందని అతనికి అర్ధం అయింది. అయితే అతనికి తెలియని ఇంకో విషయం ఏమిటంటే, అతని పరిస్థితి ఇంకా దిగజారుబోతున్నదని. అతనిని చంపడానికి కొందరు కిరాయి హంతకులు వెతుకుతుంటారు.
అయితే మన హీరో కి తన మెదడులో అభివృద్ధి చెందిన ఎలక్ట్రానిక్ పరికరమేదో పెట్టినట్లు తెలుసుకుంటాడు. అందువల్ల అతనికి రెండు అద్భుతమైన సామర్ధ్యాలు వస్తాయి. ఒకటి - ఎదుటి మనిషి ఏమి అనుకుంటున్నాడో తెలియడం, రెండవది - అతనికి వచ్చే ఆలోచనల ద్వారా అతని మెదడు పూర్తి ఇంటర్నెట్ ను అతనికి అందించడం.
అసలు తనకి అవి ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు, ఎవరు తనని చంపాలని అనుకుంటున్నారు ?
ఇది కథ సంక్షిప్తంగా. మీ అభిప్రాయాలు చెప్పండి.
అయితే ఇప్పుడు రాస్తున్న అభిమాన సంఘం కథ ఇప్పటి వరకు 30% మాత్రమే అయింది. అది అయ్యాక ఇది మొదలుపెట్టాలని అనుకుంటున్నా.
మీ విలువైన సలహాలు అందిస్తారని ఆశిస్తూ
అనామిక
ఇస్మార్ట్ శంకర్ 3.0....బావుంది బ్రో అయిడియా, ఇంటనెట్ లేకుండానే అంటే కనెక్టివిటీ లేకుండానే ఇంటర్నెట్ మరియు ఎదుటి వ్యక్తి ఆలోచనలు తెలిసిపోవడ అంటే భవిష్యత్తు తెలుసుకోవడ...ఇంటరెస్టింగ్...ఎలా డెవలప్ చేస్తారో చూడాలని ఆశగా వుంది.
: :ఉదయ్