04-01-2025, 05:42 PM
(01-12-2024, 11:40 AM)Bittu111 Wrote:2. మెప్పు
మూడు రోజుల తరువాత, ప్రొద్దున్నే క్రికెట్ ఆడ్డానికి పోయి ఇంటికి వచ్చి స్నానం చేసి ఇంట్లోకి పోయి చెడ్డీ వేసుకొని టవల్ పక్కన పారేసా. నాకు అలవాటే, ఇంట్లో అన్నయ్య పెద్దమ్మ తప్ప ఎవరూ ఉండేవారు కాదు కదా.
నేను అలా సెలుపులో నా టీషర్ట్ తీసుకుంటూ ఉంటే హఠాత్తుగా వదిన వచ్చింది.
సంధ్య: హా అత్తమ్మా తీసుకొస్తున్నాను.....
నా దగ్గరకి వచ్చి అడిగింది.
సంధ్య: హరి అత్తమ్మ జాకిట్లు ఎక్కడ ఉంటాయి?
నేను కేవలం చెడ్డీ మీద ఉన్నాను, వదిన వచ్చి అలా అడిగేసింది. నా చెంపలు మండిపోయాయి. టక్కున టవల్ తీసుకొని చుట్టుకున్న.
ముసిముసిగా నవ్వింది.
సంధ్య: హహ.... ఎక్కడుంటాయి చెప్పు.
వేలితో పెద్దమ్మ అల్మారా చూపించాను. అటుగా పోయి తీసుకుని వెళ్ళిపోయింది.
నేను బట్టలు వేసుకున్నాక, అప్పుడే వదిన అన్నయ్యకి లంచ్ బాక్స్ పెట్టి ఇచ్చింది. వదిన వంట గదికి పోయాక అన్నని డబ్బులు అడిగాను.
నేను: అన్నయ్య ఐస్క్రీమ్ కొనుక్కుంటా మధ్యాహ్నం.
వెంటనే జేబులోంచి వందనోటు తీసి ఇచ్చాడు. నాకు తెలుసు అది వదిన చూసింది.
సంతోష్: వదినకి కూడా తీసుకురా
నేను: హా.
ఆ తరువాత, వదిన రవ్వ దోసెలు చేసింది. కొబ్బరి పల్లీల పచ్చడి, చాలా రుచిగా ఉంది. నాకు మొహమాటం అనిపించినా ఇంకో ఒక్క దోస తినాలి అనిపించి ఆగలేక వంట గదిలో పెనం మీద దోస పోస్తున్న వదిన దగ్గరికి పోయాను.
వదిన కుడి వైపుకు చేతి కింద బేసిన్ లో ఉన్నాయి రవ్వ దోసెలు. అడగాలంటే ఇబ్బందిగా ఉంది. నేనే తీసుకుందాం అంటే వదిన పక్కనే ఉన్నాయి కష్టం.
ఇక తప్పక అడిగేసాను.
నేను: వదినా....
నన్ను చిరునవ్వుతో చూసింది. ఆమె మొహం చూసి ఒక్కసారిగా నేను మొహం కిందకి వేసుకున్న ధైర్యం లేక.
సంధ్య: ఏంటి మరిది?
నేను: .....
సంధ్య: ఏంటి పచ్చడి వెయ్యాలా?
తలెత్తి చూసా, నన్ను నవ్వుతూ చూస్తుంది.
నేను: వదిన ఇంకో దోసె కావాలి.
సంధ్య: ఇటు ఉన్నాయి వచ్చి తీస్కో, రెండు వేస్కో కావాలంటే.
నేను: ఒకటి చాలు.
సంధ్య: సరే నీ ఇష్టం.
వేసుకోమంది కానీ ఎలా అని ఆలోచిస్తున్న. ఆమె మోచేతి కిందే ఉన్నాయి దోసెలు.
నేను: వదిన ఒకటి ఇవ్వవా?
సంధ్య: చేతికి పిండి ఉంది హరి నువ్వే తీసుకో.
నాకు ఇబ్బందిగా అనిపించింది. ఏంటో తెలీదు, పసుపు రంగు చీరలో, అలా ముంగురులు ఆమె చెవి ముందు నుదుట వాలుతూ, ముందున్న కిటికీ సూర్య వెలుగు ఆమె మొహాన్ని చందమామలా వెలిగిస్తుంటే మళ్ళీ నేను మాయలో మునిగిపోయాను.
సంధ్య: హరి తీస్కో ఎంత సేపు నిల్చుంటావు.
నేను: హ్మ్...
వదినకి అటు వైపు వెళ్ళి కాస్త ఇబ్బందిగా ఆమె భుజం పక్కన వింగుతూ దోసె తీసుకుంటూ ఉంటే ఏం కురుల పరిమళం నాకు మత్తుగా అనిపించింది.
కంగారు పడి టక్కున దోసేని ప్లేటులో వేసుకొని టీవీ దగ్గరకి వచ్చేసాను.
వదిన కూడా స్టవ్ కట్టేసి దోసెలు పెట్టుకొని వచ్చింది.
టివిలో పాటలు చూస్తూ తుంటున్నము.
సంధ్య: ఆయన ఎప్పటి నుంచి జాబ్ చేస్తున్నారు హరి?
నేను: ఆరు సంవత్సరాలు అవుతుంది వదిన
సంధ్య: నిన్నటి నుంచి నిన్ను ఒకటి అడగాలి అనిపిస్తుంది హరి, కాని నువు బాధ పడతావేమో అని.
అర్థం అయ్యింది వదిన నన్ను మా తల్లితండ్రుల గురించి అడగాలి అంటుంకుంటుంది.
నేను: ఎల్ కే జి చదువుతున్నప్పుడు, మంచిర్యాలకి పోయి వస్తుంటే మధ్యలో సుల్తానాబాద్ దగ్గర హైవే మీద ఆక్సిడెంట్ అయ్యింది.
వదిన అవాకయ్యింది. నేను అంత మాములుగా చెప్పేసాను విషాదాన్ని.
కాస్త నా దగ్గరకి జరిగి కూర్చుంది.
సంధ్య: సారీ మరిది. డల్ అవకూ.
నేను: ఎందుకు వదినా డల్ అవుతాను. నాకు మీరంతా లేరా.
వదిన పెదవులు చిన్న నవ్వుతో విరుచుకున్నాయి.
నా చెంప పట్టుకుంది. ఆమె కళ్ళలో ఏదో కుతూహలం, ఆరాటం కనిపించాయి.
గొంతు చిన్న చేసుకొని చాటుగా చెవిలో అడిగింది.
సంధ్య: హరి, నా వంటలు బాగున్నాయా?
తన చెంపల్లో సిగ్గు చూసాను.
నేను: ఎందుకు వదినా, మీ వంట మీద మీకు నమ్మకం లేదా?
కంగుతింది వదిన నా ప్రత్యుత్తరానికి.
మరు క్షణం వదిన మూతి విడుపుకొని, ముక్కు మీద చిన్న అలక కోపంతో మొహం తిప్పేసింది.
ఎంత ముద్దుగా ఉందో, ఆ క్షణం తన వయసు ఇరవై ఎనమిది నుంచి పద్దెనిమిదికి పడిపోయింది.
నేను మాట్లాడకుండా ఉన్నాను. దోసె తుంచి ఒక బుక్క పెట్టుకున్న.
సంధ్య: ఐదు రోజుల నుంచి వండి పెడుతున్న. మీ అన్నయ్య చెప్పడు, అత్త చెప్పదు, ఎంత టెన్షన్ పడ్డానో నేను ఎలా వండినా ఎక్కడ నేను ఫీల్ అవుతానో అని తింటున్నారో అని. పోనీ నువ్వైనా చెప్తావు అనుకుంటే, అలా వెక్కిరిస్తావా? పో మరిది ఇంకోసారి దోసెలు అడిగితే చెప్తాను.
నాకు ఏదో ఐపోయింది. అప్పుడే మాటలు నేర్చిన చిన్నారిలా ఎంత ముద్దుగా అలకతో అలా అనేసిందో.
నేను: క్షమించు వదినా, మిమ్మల్ని వెక్కిరించలేదు. నా ఉద్దేశం, మీ వంటలు ఎంత రుచిగా ఉన్నాయి అంటే మీ మీద మీకు ఇలా అనుమానం ఎందుకూ అని.
సంధ్య: హ్మ్... సరే..
నేను: తినండి వదినా.
మౌనంగా తినడం మొదలు పెట్టింది.
నేను: వదినా నాకు నచ్చకపోతే తినేవాడిని కాను కదా. చాలా బాగున్నాయి కాబట్టే కదా ఇంకో దోసె వేసుకున్నాను.
సంధ్య: హ్మ్... థ్యాంక్స్.
అలా నా తినడం అయిపోయింది. ప్లేటు బయట పెట్టి చేతు కడుక్కొని వచ్చి కూర్చున్న. వదిన ఆఖరి ముక్క తిని తను కూడా కడుక్కొని వచ్చి కూర్చుంది.
నేను: వదినా మీకోటి చెప్పనా?
సంధ్య: హ చెప్పు
నేను: బాగా అందంగా ఉండే వారి వంటలు తప్పకుండా రుచిగా ఉంటాయంటా.... హహ...
వదిన చెంపలు మందార పువ్వులా మెరిసాయి. చాలా మురిసిపోయింది నా మాటకి. నన్ను సూటిగా చూసింది. నేను కళ్ళు కిందకి వేసుకున్న.
నా గడ్డం పట్టుకొని మొహం పైకి లేపింది. మా ఇద్దరి చూపులు కలిసాయి. నా చెంప గిల్లింది.
సంధ్య: అబ్బో మాటలు బాగానే మాట్లాడుతున్నావు మరిది. ఇంట్లో చిన్నకొడుకులు హుషారు ఉంటారు అని అందరూ అంటే ఏమో అనుకున్న, ఇదే అన్నమాట.
నేను: హహ... ఊకొండి వదినా
సంధ్య: అబ్బః చా... వదిననే పొగుడుతున్నావు బయట అమ్మాయిలకి ఇంకెన్ని చెప్తావో
నాకు ఆశ్చర్యం వేసింది, పుసుక్కున అలా అడిగేసింది అని. సిగ్గుతో మొహం పక్కకు తిప్పుకొని.
నేను: చాలు వదినా మీరు ఎక్కడికో పోతున్నారు.
సంధ్య: అబ్బో సిగ్గే... హహ..
వదినకూ నాకు ఇంత త్వరగా మాటలు కలుస్తాయి ఊహించలేదు. చాలా మామూలుగా ఐపోయింది.
నేను అలా మురిసిపోతే నన్ను వదిలేసింది.
సంధ్య: మనం ఒకే ఇంట్లో ఉంటున్నాము, మీరు అనకు హరి. సరేనా?
నేను: హ్మ్
కాసేపు ఆగి, వదినతో ఏదైనా మాట్లాడాలి అనిపించి వాళ్ళ కుటుంబం గురించి అడగాలా వద్దా అనుకుంటూ వేరే ప్రశ్న ఒకటి అడిగాను.
నేను: వదినా నువు...
టక్కున మెడ తిప్పి నన్ను చూసింది. నువ్వు అన్నాను కదా.
సంధ్య: ఏంటి హరి?
నేను: అదే నువు ఎక్కడి దాకా చదువుకున్నావు?
సంధ్య: నేను డిగ్రీ చదివాను హరి. B.sc. computers.
డిగ్రీ చదివిన వదిన డిగ్రీ ఫెయిల్ అయిన మా అన్నని చేసుకుంది.
నేను: అన్నయ్య కంటే నువ్వే ఎక్కువ చదువుకున్నావు వదినా.
సంధ్య: అంటే ఆయన డిగ్రీ చదవలేదా?
నేను: ఏంటి నీకు చెప్పలేదా, అన్నయ్య డిగ్రీ సెకండ్ ఇయర్ ఫెయిల్. రెండు సార్లు ఎగ్జామ్స్ రాసి వదిలేసాడు. హహ...
నేను నవ్వితే, తను కూడా చిన్నగా నవ్వింది.
సంధ్య: ఆహా ఆయనని వెక్కిరిస్తున్నావు, ఆగు చెప్తాను సాయంత్రం వచ్చాక.
నేను: అమ్మో వద్దు వదినా
సంధ్య: హహహ.... ఊరికే అన్నానులే.
తరువాత వదిన ఇంట్లో ఏదో పని చేసుకోడానికి వెళ్ళింది.
మధ్యాహ్నం,
వదిన అన్నం పెట్టింది, ప్లేటులో చూస్తే వంకాయ కూర. నాకు వంకాయ అంటే నచ్చదు. ఇప్పటికిప్పుడు పెద్దమ్మని ఇంకేదైనా చేయమని చెప్తే పెద్దమ్మ వదినకి పని చెప్తుందేమో, నా వల్ల వదినకి అదనపు పని, ఏమైనా అనుకుంటుందో ఏమో అని ఈ పూటకి వంకాయ ఏదో ఒకలా మింగేద్దాం అనుకున్నాను.
నేను కూర కాస్త పల్చగా కలుపుకొని తింటున్న. వదిన నన్ను అనుమనంగా చూసింది. బహుశా నాకు నచ్చలేదు అనుకుంటుంది కావచ్చు.
నేను మెల్లిగా తింటున్న. అడిగేసింది.
సంధ్య: ఇవాళ బాలేదా?
రాజమని: వాడికి వంకాయ నచ్చదు.
సంధ్య: అయ్యో మరి ముందే చెప్పుంటే ఏదైనా చేసేదాన్ని కదా అత్తా.
రాజమని: ఏం కాదులే తింటున్నాడు తినని.
సంధ్య: హరి ఫ్రిజ్ లో ఒక గుడ్డు ఉంది ఆమ్లెట్ వేసుకురావాలా?
రాజమని: ఎందుకులే రాత్రికి తింటాడు. ఇప్పుడు నీకు పని అవసరమా.
పెద్దమ్మ మాట వదిన పట్టించుకోలేదు. నన్ను చూసి అడిగింది.
సంధ్య: చెప్పు హరి కావాలా?
నేను: ఊ.... అనేసా ఆశతో.
పోయి నాకోసం ఆమ్లెట్ చేసి తీసుకొచ్చింది. వంకాయ ముక్కలు పక్కకి ఏరి, ఆమ్లెట్ అంచుకు పెట్టుకొని తిన్నాను.
నేను: థాంక్స్ వదిన
సంధ్య: హహ... పో చేయి కడుక్కోపో
సైకిల్ వేసుకొని సెంటర్ కి పోయాను, బేకరీలో ఐస్క్రీమ్ కొనుకొద్దాం అని. బేకరుకి పోయాక గుర్తొచ్చింది, అసలు వదినకి ఏ ఫ్లేవర్ ఇష్టమో అడగలేదు అని. నాకైతే బటర్స్కాచ్ ఇష్టం. అవే రెండు కోన్స్ తీసుకొని, కవర్ సైకిల్ హండిల్ కి వేసుకొని ఇంటికి పోయాను.
ఇంటి గుమ్మం దగ్గరే అవి బయటకి తీసి, “ వదినా... వదినా...” అంటూ తుత్తరగా పిలుస్తూ ఉంటే వచ్చింది. ఇచ్చేసాను.
సంధ్య: ఏంటి హరి అలా మొసపోసుకుంటున్నావు?
నేను: ఐస్క్రీమ్ కదా, కరిగిపోద్ది అని సైకిల్ ఫాస్ట్ గా తొక్కుకుంటూ వచ్చాను వదిన.
సంధ్య: ఓహో...
వ్రాపర్ విప్పి, ఐస్క్రీమ్ ని కొరికాను, ఇంతలో ఒక ప్రశ్న.
రాజమని: నాకు తెలేదేంట్రా ఐస్క్రీమ్?
ఒరినాయనో, మా పెద్దమ్మకి కూడా ఐస్క్రీమ్ అంటే ఇష్టం కదా, నేనే అలవాటు చేసాను. చిన్నప్పుడు నాకు కొనిచ్చి తను కూడా తినేది.
అమాయకంగా మొహం పెట్టి తనని చూసాను.
నేను: మర్చిపోయానే....
రాజమని: హా మార్చిపోతావులే. నీకు ముడ్డీ మూతి కడిగిన, ఎన్ని ఐస్క్రీములు కొనిచ్చా, ఎన్ని తినపెట్టిన, అవన్నీ తిని ఒంటెలా పెరిగినవ్ గాడిద.
వదిన నవ్వేసింది. నాకు సిగ్గేసింది.
రాజమని: పరీక్షలు అయిపోయినాయి, ఇక రొడ్లెంబడి తిరుగుడే తిరుగుడు, ఇంట్ల కుసోమంటే ఉంటావా. నా మాట ఎన్నడు ఇంటావు నువు.
నేను: అయ్యో పెద్దమ్మా, ఇప్పుడు నువు పెద్దబాలశిక్ష పురాణాలన్నీ చదవకే. నీక్కూడా తెస్తాను.
రాజమని: అవసరం లేదులే తిను.
సంధ్య: లేదు తీసుకొస్తాడు అత్త.
వదిన నా ఐస్క్రీమ్ తీసుకుంది. రెండు చేతుల్లో ఐస్క్రీములు పట్టుకుంది.
సంధ్య: పో హరి నువు ఇంకోటి తెచ్చుకోపో. ఇవి మేము తింటాము.
ఒక్క నిమిషం, అవి రెండు వాళ్ళు తింటారా? నేను వేరేది తెచ్చుకోవాలా? మరి నేను ఎంగిలి చేసింది.
నేను: అది... నెన్... ఎంగ్...
నా మాట నా నోరు దాటలేదు. ఆపేసాను. ఎందుకో తేలేదు. ఆపేసాను.
వదిన నా ఐస్క్రీమ్ తను పట్టుకొని నేను తనకి ఇచ్చిన ఐస్క్రీమ్ పెద్దమ్మకి ఇచ్చింది.
క్షణం ఆగకుండా నేను బయటకి వచ్చి సైకిల్ తీసాను.
నేను ఎంగిలి చేయడం వదిన చూడలేదా? పెద్దమ్మ చూడకపోవచ్చులే అప్పటి వరకు టివిలో సీరియల్ చూస్తుంది. వదిన నా ముందే ఉంది, పక్కా చూసే ఉండాలి. కాని.... ?
వదిన నా ఐస్క్రీమ్ కుడి చేత తీసుకుంది, పిదప ఎడమ చేతిలో ఐస్క్రీమ్ ఆమె కుడి దిక్కు ఉన్న పెద్దమ్మకి ఇచ్చింది. అంటే...?
ఇదంతా ఆలోచిస్తూ దారిలో నాకు బుర్ర వేడెక్కిపోయింది.
సరేలే అని ఐస్క్రీమ్ కొనుక్కొని ఇంటికి వచ్చాను. ఇద్దరూ టీవీ చూస్తూ కూర్చున్నారు. అప్పుడే తినడం ఐపోయింది.
సంధ్య: కూర్చో హరి.
నేను: ఆ సీరియల్స్ నాతో కావు నేను ఇంటెనక కూర్చొని తింటాను.
ఇంటి వెనక్కి పోయి ప్రశాంతంగా తిన్నాను.
సాయంత్రం దోస్తులతో ఆడుకోడానికి బయటెక్కెళ్ళాను.
వదినకి నేను మెచ్చుకోవడం ఇష్టం.
|————————+++++++++
అన్న పిచ్చి ఎక్కించారు
మాది రాయలసీమ మీ కథ చదువుతుంటే మీ తెలంగాణ మాండలికాన్ని మా రాయలసీమ మాండలికానికి ఏదో పెద్ద లింక్ ఉన్నట్లుంది