02-01-2025, 10:04 AM
"మీరా అన్నయ్యగారు, రండి ఎన్ని రోజులయింది మిమ్మల్ని చూసి"... నవ్వుతూ పలకరించింది పంకజం.
"పదిరోజులు కూడా కాలేదు కదే వీడిని చూసి... ఏదో రెండేళ్ల తర్వాత చూసినట్టు"... అన్నాడు గుర్నాథం.
"అభిమానం ఉన్నప్పుడు అలానే ఉంటుందిరా... నువ్వూ ఉన్నావెందుకు... తలుపు తీయగానే నవ్వనైనా నవ్వకుండా, ఎందుకొచ్చావంటూ కసురుకున్నావు" బదులిచ్చాడు శేఖరం.
"పనిలో ఉన్నారా, నాకిష్టమైన పనిలో ఉన్నా"... చేతిలో కత్తెరని చూపించాడు గుర్నాథం.
అప్పుడు అక్కడున్న వస్తువులని చూసాడు శేఖరం.
"ఓహో షేవింగ్ పనిలో ఉన్నావా... మరి ఆ మాట చెప్పచ్చు కదరా. సరే కాని... నెమ్మదిగా చేసుకో. నేను బయట టీవీ చూస్తూ ఉంటా"... అంటూ బయటకెళ్ళబోయాడు శేఖరం.
"ఎందుకున్నయ్యా బయటకి... మనకి ఇది కొత్త కాదుగా. ఇప్పుడే కాఫీ పెట్టి ఫ్లాస్కులో పోసాను... ఇస్తాను"... అంటూ లేవబోయింది పంకజం.
"నువ్వెందుకమ్మా. పైకి లిఫ్ట్ ఎక్కొచ్చాను, మెట్లు కాదు. నాలుగడుగులు వేస్తా మీ ఇంట్లో. అందరికీ కాఫీ నేను తెస్తా"... అంటూ లోపలికెళ్ళాడు శేఖరం.
నిమిషంలో మూడు కప్పులతో వచ్చాడు.
"నేను చెప్పేలోపే వెళ్ళావు కదరా. పనిలో ఉంటే కాఫీ ఎలా తాగుతాం. మూడెందుకు, రెండు చాలు... నేను తాగను. మీ ఇంట్లో లాగా మా ఇంట్లో వేస్ట్ చెయ్యం"... అన్నాడు గుర్నాథం.
"నోరు మూసుకోరా. నీ షేవింగ్ పిచ్చి నాకు లేదు కదా, ఉండుంటే మా ఆవిడ ఎప్పుడో తన్ని తగలేసేది. మా ఇంట్లో కూడా వేస్ట్ ఉండదు. షేవింగ్ పనేమన్నా స్నానమా... మధ్యలో తాగలేకపోవడానికి. మధ్యలో కాస్త సిప్ చెయ్యడానికి కుదరదా ఏంటి. అందరం కలిసి తాగితే అదో తృప్తి"... అంటూ ఒక కప్పు స్నేహితుని చేతికిచ్చాడు శేఖరం.
"మీ ఇద్దరు ఇంత తిట్టుకుంటారు... పరిచయం అయిన మొదట్లో ఎలా ఉండేవారన్నయ్యా"... నవ్వుతూ అడిగింది పంకజం.
"నాకేమో మీసం ఇష్టమమ్మాయ్... వీడేమో బోడిగుండు ఫ్యాన్... ఏదైనా నున్నగా ఉండాలంటాడు. ఆ రోజుల్లో మీసం పెంచి తిప్పడం ఫ్యాషన్. వీడేమో రోజూ షేవ్ చేసుకుంటాడు. అలా వీడికి నాకు పడేది కాదు. పడకపోయినా స్నేహం కలిసింది. అప్పటి స్నేహం ఇన్నేళ్ళయినా ఇలా కొనసాగుతోంది"... బదులిచ్చాడు శేఖరం.
"మీ స్నేహానికి పునాది గడ్డాలు, మీసాలన్న మాట" నవ్వుతూ అంది పంకజం.
"అవునమ్మా... వీడూ, వీడి శుభ్రత. నేనేమో మీసం తిప్పనిదే ఉండగలిగేవాడిని కాదు. అందుకే వీడిని అందరూ అప్పట్లో షేవింగ్ బాబు అనేవాళ్ళు"... అంటూ పెద్దగా నవ్వాడు శేఖరం.
"మీకు నవ్వుగానే ఉంటుందన్నయ్యా. నాకే ఇబ్బందిగా ఉంది"
"ఏమైందమ్మాయ్"... అడిగాడు శేఖరం.
"ఈ మధ్య మరీ మూర్ఖంగా తయరయ్యారు. ఎప్పుడు పడితే అప్పుడు షేవింగ్ అంటున్నారు. డబ్బు ఖర్చు, టైం వేస్ట్. ఇంట్లో ఉండేవాళ్లకి ఎందుకివన్నీ. చాదస్తం కాకపోతే"... విసుక్కుంటూ అంది పంకజం.
"నేనిక్కడే ఉన్నాను. నా గురించి నేను లేనట్టు మాట్లాడుకుంటున్నారు. నాకు కాదు చాదస్తం. మీకు పిచ్చి. నోరు మూసుకోండి ఇద్దరు. ఒకడికేమో మీసం తిప్పడం ఫ్యాషన్ అంట. ఇంకోదానికేమో షేవింగ్ అంటే డబ్బు దండగంట. ఒక పద్ధతీ లేదూ, పాడూ లేదూ. ఒక స్టైల్ లేదు, టేస్ట్ లేదు, పాషన్ లేదు, ఎస్సెన్స్ లేదు. ఉత్త మాలోకాలు. ఎయిర్ బస్ ఎక్కే లెవల్ వచ్చినా ఇంకా ఎర్ర బస్ ఆలోచనలు మానరు. నా ఇల్లు, నా షేవింగ్, నా ఇష్టం, నా కష్టం. నచ్చనివాళ్లు వెళ్లిపోవచ్చు"... ఇద్దరినీ తిట్టసాగాడు గుర్నాథం.
"ఏరా నన్నేగా అంది?"... అడిగాడు శేఖరం.
"అవును, నిన్నే"... బదులిచ్చాడు గుర్నాథం.
"వెళ్ళమని నన్ను చూసే చెప్పరా" కాఫీ కప్పు కింద పెడుతూ అన్నాడు శేఖరం.
"చెప్తా. నాకేమన్నా భయమా. నా పద్ధతులు నచ్చకపోతే పో. వెళ్ళి నీ పెళ్ళాంకి జడేసి పూలు పెట్టి నీకు నచ్చింది చేసుకో. నా ఇంటికొచ్చి నాకిష్టమైన పని చేసుకోనీకుండా గతాన్ని తవ్వుతూ నాకు బాధ కలిగించే హక్కు నీకు లేదు"... కోపంగా అన్నాడు గుర్నాథం.
"సరేనమ్మా వస్తాను. వీడి పిచ్చి తగ్గితే చెప్పు. అప్పుడొస్తా మళ్ళీ"... బయటకి నడవబోయాడు శేఖరం.
"ఆగండన్నయ్యా... నా ఇల్లు ఇది. నా డబ్బులతో కొన్నది. నా అతిథి మీరు. ఉండండి. ఈయన మూర్ఖత్వం తెలిసిందే కదా"... అంది పంకజం.
"ఏరా ఏమంటావు. ఉండనా. వెళ్లనా?" అడిగాడు శేఖరం.
"ఉండు. ఓనర్ చెప్పింది కదా"
"కాఫీ తాగండన్నయ్యా ముందు, చల్లారిపోతోంది"... అంది పంకజం.
"నా చెల్లెలు చెప్పింది కాబట్టి ఉంటున్నారా. కాస్త నీ పిచ్చిని అదుపులో పెట్టుకో. రిటైర్ అయ్యక నీకు అసలు తోస్తున్నట్టు లేదు. షేవింగ్ ఆలోచనని ట్రిమ్మింగ్ చేసుకో. మనమింకా కుర్రాళ్ళం కాదు" స్నేహితునితో అన్నాడు శేఖరం.
"నీకు శక్తి తగ్గిందేమో. నాకు బానే ఉంది. నిన్న రెండు రౌండ్లు వెయ్యగలిగాను"... మీసం లేకపోయినా ఉన్నట్టుగా తిప్పుతూ బదులిచ్చాడు గుర్నాథం.
"సరే సరే. నీ శక్తి గురించి నాకు తెలుసులే కాని. కాస్త తమాయించుకో. మరీ ఎక్సయిట్ అయితే ఏదన్నా అవుతుంది"... అన్నాడు శేఖరం.
"నేనూ అదే అంటున్నా అన్నయ్యా. రిటైర్ అయ్యాం. ఇక పనులు కాస్త తగ్గించుకోవాలి. ప్రశాంతంగా ఉండాలి అని. నా మాట వింటేగా. పొద్దున లేవగానే షేవింగ్ అంటూ గోల. నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదు అసలు" ...అంది పంకజం.
"ఒరేయ్ నీ వెర్రితో నా చెల్లెల్ని ఇబ్బంది పెట్టకురా"... అన్నాడు శేఖరం.
"ఆపండి ఇద్దరూ. నాకున్న ఒకే ఒక ఇష్టాన్ని దొరకబుచ్చుకుని చావగొడుతున్నారు ఇద్దరూ. నా పద్ధతులు మీ ఇద్దరికీ తెలుసు. ఆపండి ఇక" రంకెలేసాడు గుర్నాథం.
"సరేరా నేను బయట ఉంటా. ఏదన్నా కావాలంటే చెప్పు"... బయటికెళ్లబోయాడు శేఖరం.
"ఆగండన్నయ్యా. ఒక కథ చదువుతున్నా, వింటారా? ఆయన మానాన ఆయనని వదిలేద్దాం. మనం కథ చెప్పుకుందాం" అడిగింది పంకజం.
"అలాగేనమ్మాయ్. ఒరేయ్ నీ పని నువ్వు కానిచ్చుక్కోరా" అంటూ కూర్చున్నాడు శేఖరం.
సంబరంగా అనిపించింది గుర్నాథానికి. బ్రష్ తడి చేసి క్రీం వెయ్యబోయాడు.
"ఆగరా... అవి వేడినీళ్ళేనా?... అడిగాడు శేఖరం.