Thread Rating:
  • 9 Vote(s) - 1.78 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller అభిమాన సంఘం
#44
CHAPTER – 4

శరత్ నోట్ బుక్ - మే 18 నుండి 24 వరకు (శరత్ కథనం)

సినిమా హీరోయిన్స్ గురించి ఎంతో మంది ఎన్నో రకాల ఊహల్లో గడుపుతుంటారు. అలాటిది స్మిత గురించి చెప్పాలంటే - అసలే తానొక సెక్స్ సింబల్. ఎంతమంది ఆమెని ఊహించుకుంటూ తన భార్యతో పని కానించుకుంటారు ? ఎంతమంది పెళ్లికాని అబ్బాయిలు తమ ఊహాలోకాల్లో ఆమెతో గడుపుతున్నట్లు, తమ సహజ, అసహజ ఫాంటసీ కోరికల్ని నెరవేర్చుకుంటూ ఉండి వుంటారు ? ఎంతమంది ఆమెని తాము బలవంతంగా అనుభవిస్తున్నట్లు కలలు కంటుంటారు ? ఆమెకి ఎప్పుడైనా సడన్ గా ఒక రాత్రి మెలకువ వస్తే, తన గురించి మగవాళ్ళు ఇలా ఊహించుకుంటూ ఉండి వుంటారు అన్న ఆలోచన తడుతుందా ?

నాకు ఇలాంటి ఆలోచనలు ఎప్పుడూ వస్తుంటాయి. ఇలాంటి స్టార్ లు, తమని జనాలు ఇదే కోణంలో చూస్తారని తెలిసే, కొన్ని సార్లు ఇంటర్వూస్ లో తమ అసహనాన్ని చూపిస్తూ వుంటారు. నాకు తెలిసినంతవరకూ స్మిత ఈ విషయంలో పరిణితితో వ్యవహరించిందని అనుకుంటున్నాను. చాలావరకు తాను బయటకూడా ఒరిజినల్ గానే ఉంది. చాలామంది తెరముందు ఒకలా, తెర వెనుక ఇంకోలా ప్రవర్తిస్తారు. అలాంటివారిని నేను చాలామందిని చూసాను.

ఒక్కోరోజు గడుస్తున్నకొద్దీ, మా పధకం ముందుకు వెళుతున్న కొద్దీ, నేను స్మిత కి దగ్గరగా వెళుతున్న అనుభూతి కలుగుతుంది. మా అభిమాన సంఘం చివరి సమావేశం మే 17, శనివారం రోజు జరిగింది. అప్పుడు మేము ఏమేం విషయాల్ని పూర్తి చేయాలనీ అనుకున్నామో, అన్నిటిని పూర్తి చేస్తూ వస్తున్నాము. అప్పుడు మేము వారానికి ఒక్కసారో లేదా పది రోజులకి ఒక్కసారో కలిసేవాళ్ళం. అయితే ఇప్పుడు మా సమావేశాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మేము మా పధకం అమలుచేయాలి అనుకున్న రోజు కూడా దగ్గరికి వస్తుంది.

మా సంఘం లో వున్నపెళ్లి అయిన ఇద్దరు వ్యక్తులు కూడా వాళ్ళ పాత్రలని ఇప్పుడు బాగానే చేస్తున్నారు. మేము కూడా వాళ్ళకి ఆటంకాలు కలగకుండా మావంతు సహాయం చేస్తున్నాం. పోయిన ఆదివారం నుండి ఈరోజు అంటే శనివారం వరకు చేసిన పనుల గురించి వివరిస్తా.

మేము అందరం ఈవారంలో రెండు సార్లు కలిసాం. ఒకసారి వాళ్ళు నా రూమ్ కి వస్తే, రెండోసారి అకౌంటెంట్ ఆఫీసులో కలిసాం. (ఇక్కడ నేను పేర్లు రాయను ఎందుకంటే ఇది రహస్యంగా జరగాల్సిన పని కాబట్టి. అన్ని కోడ్ భాషలోనే రాస్తా) ఈ వారంలో మేము ఈ కింది పనులని విజయవంతంగా పూర్తి చేసాం.

ఇన్సూరెన్స్ మనిషి, తాను చెప్పినట్లుగా సెక్యూరిటీ కి సంబందించిన విషయాల్ని కనుక్కున్నాడు. మేము ఇంటికి అనుకున్న సెక్యూరిటీ అలారమ్ ఇంటి వరకే పరిమితమైందని కనుక్కున్నాడు. మేము భయపడ్డట్లుగా గేట్ కి, అలాగే ఇంటి ఫెన్సింగ్ కి అలారమ్ లేదు. అందువల్ల మా పని సులభంగానే జరుగుతుంది. కాకపొతే ఇంటికి పెట్టిన అలారమ్ చాలా కొత్తది. ప్రతి తలుపుకి, ప్రతి కిటికీకి అలారమ్ పెట్టబడి ఉంది. ఎవరన్నా దొంగలు ఇంట్లోకి వెళ్లాలని, తలుపునొ, కిటికీనో తెరవాలని ప్రయత్నిస్తే, అక్కడ అలారమ్ శబ్దం వినబడదు కానీ సెక్యూరిటీ అధికారి స్టేషన్ కి, సెక్యూరిటీ ఆఫీస్ కి వెంటనే తెలిసిపోతుంది. వాళ్లకి సెక్యూరిటీ కలిపించే ఆఫీస్ వాళ్లకి గన్ లైసెన్స్ ఉంది కాబట్టి సెక్యూరిటీ అధికారి లకన్నా ముందే వాళ్ళు వచ్చేస్తారు. ఆ అలారమ్ సిస్టం ని బ్రేక్ చెయ్యడం అసాధ్యం. అందుకే ఆ ఇంటివరకే అలారమ్ పెట్టబడింది. గేట్ కి, ఫెన్సింగ్ కి పెట్టాల్సిన అవసరంలేదు కాబట్టి పెట్టలేదు.

ఇక గేట్ విషయానికి వస్తే, గేట్ కి ఆటోమేటిక్ మోటార్ పెట్టారు. అందువల్ల ఆ గేట్ ని మనిషి వచ్చి తెరవాల్సిన పని లేదు. గేట్ పక్కన చిన్న మైక్రోఫోన్ ఉంది. మనం ఆ బటన్ ని నొక్కి మనమెవరిమో చెబితే, లోపలున్న మనిషి వాళ్ళని లోపలి రావాలని అనుకుంటే, తన దగ్గరున్న బటన్ ని నొక్కితే, గేట్ ఆటోమేటిక్ గా తెరుచుకుంటుంది. కొన్ని క్షణాల తర్వాత అదే తిరిగి మూసుకుపోతుంది.

ఈ గేట్ ని ఎలా వాడాలో తనకి తెలుసునని మెకానిక్ చెప్పాడు. దానికొక మోటార్ ఉంటుందని, అందులో వున్న బెల్ట్ కి సంబంధించిన ఒక చిన్న సర్దుబాటు చేస్తే, అప్పుడు గేట్ ని మనం ఎప్పుడు తెరవాలని అనుకుంటే అప్పుడు మన చేతుల ద్వారా తెరవొచ్చునని, అది తాను చూసుకుంటాను అని చెప్పాడు. ముహూర్తం టైం కి ముందుగా వెళ్లి తాను ఆపని చేస్తే, అప్పుడు మిగిలిన పని సులభంగా చేయవచ్చని చెప్పాడు.

ఇన్సూరెన్స్ మనిషి ఇంకో విషయాన్నీ కనుక్కున్నాడు - ఎవరైతే సెక్యూరిటీ ఇస్తున్నారో వాళ్ళు ప్రతిరోజూ ఉదయం, మధ్యాన్నం, రాత్రి వచ్చి అన్ని ఇల్లులు బయటినుండి చెక్ చేసుకుంటూ వెళతారని.

పోయిన బుధవారం మెకానిక్ ఇంకా ఇన్సూరెన్స్ మనిషి ఇద్దరు కొన్ని సామాన్లు తీసుకుని స్వర్గధామం (అతిధి ని ఉంచాలని అనుకున్న ఇల్లు) కి చెక్ చేయడానికి వెళ్లారు. వాళ్లకి వెళ్ళడానికి రెండు గంటల సమయం పట్టింది. అయితే వాళ్ళకి కొండ ఎక్కడానికి గంట టైం పట్టింది.  

వాళ్ళు తమవెంట పెట్రోల్, బాటరీ, బండికి సంబంధించి కొన్ని వస్తువులు తీసుకుని వెళ్లారు. అక్కడికి ఎవరు వచ్చిన జాడలు కనిపించలేదు. ఇన్సూరెన్స్ మనిషి చివరిసారి చూసినప్పుడు ఆ ప్రదేశం ఎలా ఉందొ ఇప్పటికి అలానే ఉంది. అక్కడున్న మోటార్ సైకిల్ లో పెట్రోల్ పోసి, బాటరీ మార్చి బండిని స్టార్ట్ చేసారు. కాకపోతే బండి టైర్ పంక్చర్ అయింది. దాన్ని అతను రిపేర్ చేసాడు. అయితే కిందనుండి పైకి వెళ్ళడానికి గంట సమయం పట్టింది కాబట్టి మా అతిధి ని అలా తీసుకెళ్లడం కష్టం కాబట్టి, మెకానిక్ దానికి, సైడ్ కూర్చోడానికి వీలుగా ఎక్స్ట్రా సీట్ అమర్చాడు. వాళ్ళు ఇంటినంతా శుభ్రం చేసారు. అన్ని వస్తువులు గుడ్డలతో కప్పబడి వున్నాయి కాబట్టి ఫర్నిచర్ అంతా పాడవకుండా శుభ్రంగా ఉంది.

స్వర్గధామం కి పక్కనే చిన్న చెరువు ఉంది. ఇంటికి నీళ్లు దాని ద్వారానే వస్తాయి. ట్యాంక్ లని కడిగి, బాత్రూం లలో నీళ్లు వస్తున్నాయో లేదో చూసి, వాటిని కూడా శుభ్రం చేసారు. అయితే ఒక చిన్న ఇబ్బంది ఇంకా అక్కడ తొలిగిపోలేదు. లైట్స్ పనిచేయడంలేదు. మళ్ళీ వచ్చినప్పుడు ఆ ఇబ్బందిని కూడా సరిచేస్తా అని మెకానిక్ చెప్పాడు.

ఆ ఇద్దరు సంఘ సభ్యలు స్వర్గధామం విషయంలో చాలా సంతృప్తిగా వున్నారు. ఇది అందరికి శుభపరిణామం. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అక్కడ చేయాల్సిన పనులు, ఇంకా మేము చేయాల్సిన మిగిలిన పనులు అన్నిటిని నేను రాసుకున్నా.

వాళ్ళు కొండ ఎక్కడానికి నడక మార్గాన గంట పడితే, బండి రిపేర్ అయ్యాక, బండి మీద వెళితే వాళ్లకి 20 నిముషాలు మాత్రమే పట్టింది. ఇది చాలా ఊరటనిచ్చే అంశం. వాళ్లకి తిరిగి రావడానికి రెండున్నర గంటల సమయం పట్టింది. కారణం తిరుగు ప్రయాణంలో హైవే మీద ట్రాఫిక్ అధికంగా ఉండడమే.

అకౌంటెంట్ తన ఢిల్లీ ప్రయాణం గురించి ఇంట్లో చెప్పి, ఇంట్లో వాళ్ళకి ఎలాంటి అనుమానం కలగకుండా చూసుకోవడంలో విజయవంతమయ్యాడు. దాంతో అతనికి ఒక పెద్ద అడ్డం తొలిగిపోయినట్లు చెప్పాడు.

సంఘానికి చెప్పినట్లుగానే నేను ఇంటిని కనిపెట్టుకుని, ఎవరెవరు ఏ ఏ సమయాల్లో వచ్చిపోయేది, గార్డెన్ పనులు చేసేవాళ్ళు వచ్చే సమయం అన్ని నోట్ చేస్తున్నా. వచ్చే సోమవారం నుండి నేను రోజువారీ గమనించడాన్ని మొదలుపెడుతున్నా అని చెప్పా. అయితే ఇప్పటివరకు వారం లో రెండు సార్లు మెకానిక్ కూడా నాతొ వచ్చాడు.

ఈ వారం ముఖ్యాంశాలు - నేను జుట్టు కత్తిరిన్చుకోవడం మానేశా. మీసాల్ని పెంచడం మొదలుపెట్టా. ముహూర్తం అయ్యాక, సెలవలు అయిపోయాక అప్పుడు మంగలి దగ్గరికి వెళ్లాలని అనుకున్నాను. అయితే ఎందుకు ఇలా జుట్టు, మీసాలు పెంచుతున్నావు అని నా మేనేజర్ వ్యంగ్యంగా అడిగాడు. నేను నవ్వి ఊరుకున్నా. అయితే మెకానిక్ కూడా నాలానే అన్ని పెంచడం మొదలుపెట్టాడు. అతని రూపు మారడం నాకు నిజంగా తెలుస్తుంది. మొత్తానికి ఈ వారం విజయవంతమైంది అనే చెప్పాలి.
[+] 7 users Like anaamika's post
Like Reply


Messages In This Thread
అభిమాన సంఘం - by anaamika - 18-12-2024, 10:40 PM
RE: అభిమాన సంఘం - by Haran000 - 18-12-2024, 10:54 PM
RE: అభిమాన సంఘం - by Manoj1 - 19-12-2024, 01:41 AM
RE: అభిమాన సంఘం - by Deepika - 19-12-2024, 02:09 AM
RE: అభిమాన సంఘం - by Uday - 19-12-2024, 12:20 PM
RE: అభిమాన సంఘం - by sri7869 - 19-12-2024, 01:51 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 19-12-2024, 08:53 PM
RE: అభిమాన సంఘం - by sri7869 - 19-12-2024, 09:15 PM
RE: అభిమాన సంఘం - by Haran000 - 19-12-2024, 09:37 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 19-12-2024, 09:58 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 21-12-2024, 02:49 PM
RE: అభిమాన సంఘం - by sri7869 - 21-12-2024, 02:51 PM
RE: అభిమాన సంఘం - by Uday - 21-12-2024, 03:48 PM
RE: అభిమాన సంఘం - by ramd420 - 21-12-2024, 04:26 PM
RE: అభిమాన సంఘం - by BR0304 - 21-12-2024, 05:43 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 23-12-2024, 12:40 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 24-12-2024, 08:51 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 25-12-2024, 02:50 PM
RE: అభిమాన సంఘం - by Uday - 25-12-2024, 08:21 PM
RE: అభిమాన సంఘం - by Nani666 - 26-12-2024, 08:34 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 26-12-2024, 11:56 PM
RE: అభిమాన సంఘం - by ramd420 - 27-12-2024, 06:58 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 27-12-2024, 03:54 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 27-12-2024, 11:02 PM
RE: అభిమాన సంఘం - by hijames - 28-12-2024, 12:06 AM
RE: అభిమాన సంఘం - by ramd420 - 28-12-2024, 06:52 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 29-12-2024, 01:53 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 29-12-2024, 10:34 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 31-12-2024, 12:11 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 01-01-2025, 12:26 PM
RE: అభిమాన సంఘం - by sri7869 - 02-01-2025, 09:51 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 02-01-2025, 11:36 PM
RE: అభిమాన సంఘం - by sri7869 - 02-01-2025, 11:48 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 03-01-2025, 09:27 PM
RE: అభిమాన సంఘం - by Deepika - 03-01-2025, 01:18 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 03-01-2025, 09:29 PM
RE: అభిమాన సంఘం - by ramd420 - 03-01-2025, 07:16 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 03-01-2025, 09:33 PM
RE: అభిమాన సంఘం - by Uday - 03-01-2025, 11:55 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 03-01-2025, 09:38 PM
RE: అభిమాన సంఘం - by Uday - 03-01-2025, 03:11 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 03-01-2025, 09:57 PM
RE: అభిమాన సంఘం - by ramd420 - 03-01-2025, 10:47 PM
RE: అభిమాన సంఘం - by sri7869 - Yesterday, 02:55 PM
RE: అభిమాన సంఘం - by Uday - Yesterday, 03:24 PM



Users browsing this thread: venkat1979, 10 Guest(s)