30-12-2024, 12:36 PM
సోమవారం,
రిలేటివ్ ఫిజిక్స్ క్లాస్ నడుస్తుంది.
మురళీ సార్ క్లాస్ చెపుతుంటే, పక్కన కావ్య పేపర్ లో ముగ్గులు గీస్తూ ఉంది.
వొంగి, మోచేతు డెస్క్ మీద పెట్టి ఏదో ఇంజనీరింగ్ స్పేస్ వెహికిల్ డిజైన్ గీసినట్టు చాలా ఏకాగ్రతతో గీస్తుంది.
చదువే అంటే ఈ కోడి మెదడుది కోడి గీతలు గీస్తుంది.
ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? హీరోయిన్ ని అలా కోడి మెదడు అంటున్నా అని ఫీల్ అవుతున్నారా? కోడి అన్నాను అని మోడీ గారికి ఫిర్యాదు చేస్తారా? నా పెళ్ళాం నా ఇష్టం వ్యా.... మీకేంటి ఆ? హహహ… ఊరికే జోక్.
నాలుగు వేళ్ళు సాపి కావ్య నెత్తి వెనక ఒక్కటి కొట్టిన.
పిల్లల్ని గెలికితే తల్లికి మండినట్టు, కోడి పెట్టలా ముక్కు మీద కోపంతో చూసింది.
నేను: క్లాస్ విను.
కావ్య: ఏ పోరా?
నేను: నువు ఫెయిల్ అయ్యింది ఈ పేపర్ ఏ. వినూ.
కావ్య: విన్నా నాకు రాదు, నువు వినుకో వినాయక.
నేను: నీ కర్మ.
ఇక్కడ ఇదేమో ముగ్గులు వేస్తుంటే, అక్కడ రెండో బెంచీలో మంజూష తాపుకోసారి గుడ్ల గూబలా మెడ వెనక్కి తిప్పి పెద్ద కళ్ళతో నన్నే చూస్తుంది.
దీనమ్మ జీవితం, ఇష్టం ఉన్న పోరి కాంఫుస్ చేస్తది, ఇష్టం లేని పోరి కన్ను కొడ్తది.
మధ్యలో నా చదువు డైసర్బేన్స్. అయినా పెద్దగా పీకేదేంలేదు.
ఆ పీరియడ్ అయిపోయింది. సార్ పోయాడు.
అభీ: పిచ్చి ముగ్గులు వేస్తావేంటే, పిచ్చి పిల్ల.
కావ్య: పిచ్చి ముగ్గులు కాదు, సంక్రాంతికి ప్రాక్టీస్.
నేను: ఇంకా రెండు నెలలు ఉన్నాయ్, క్రికెటర్లు కూడా టోర్నమెంటుకి రెండు నెలల ముందు నుంచి ప్రాక్టీస్ చేయరు.
కావ్య: ఏ మీకు ఆడోల్ల గురించి తెలీదురా. అయినా అది వింటే నిద్రోస్తుంది.
నేను: కాదే నువు నైట్ నిద్రపోవా, అప్పుడప్పుడు క్లాస్ లో నిద్రపోతావు?
కావ్య: నా ఇష్టంరా. నైట్ Netflix లో మూవీ చూసాను.
నేను: హా నాలుగు నెలలు నా subscribtion. నా పైసలు. ఎనమిది వందలు ఇవ్వు.
కావ్య: నన్ను డబ్బులు అడుగుతే కళ్ళు పోతాయి. నువు నన్ను డబ్బులు అడుగుతవా. చి సిగ్గుండాలి.
ఇదేంటి ఏదో పెళ్ళాంలా మాట్లాడుతుంది. నాకే అనిపిస్తుందనుకుంట.
నేను: అది ఉంటే నువు చదవవు.
కావ్య: ఏంట్రా నీ బాధ. ఏదో నాలుగో తరగతి పిల్లలా చేస్తున్నావు. ఫ్రెండ్ వి subscription ఇచ్చావు. ఆ మాత్రం చెయ్యవా ఫ్రెండ్ కోసం.
మళ్ళీ ఫ్రెండ్ అంటది. దీన్నీ.... ఉష్....
ఇంతలో EM సార్ వచ్చాడు.
ఇక సైలెంట్ అయిపోయాము.
పన్నెండున్నరకు లంచ్ తిందాం అని గార్డెన్లో కూర్చున్నాము. మీనాక్షి వచ్చింది. మంజూష వచ్చింది.
గర్ల్స్ ముగ్గురినీ వదిలి నేను అభీ కొంచెం పది అడుగుల దూరంలో కూర్చున్నాము.
తిందడం అయిపోయింది. ఇక నాకు రెండు రోజుల నుంచీ ఆపుకుంటున్న ఆత్రుత బయటకి వచ్చింది. కావ్య ఫోటోలు చూడాలి.
నేను: మామ కావ్య ఫొటోస్ చూపించవా?
అభీ: లేవు డిలీట్ చేసాను.
నేను: రేయ్ అబద్ధం ఆడకు. ప్లీజ్ రా చూపించు.
అభీ: నువు చూడొద్దనే నిన్ను గ్రూప్ లో ఉండనివ్వలేదు.
నేను: ఏ ఇటివ్వు ఫోన్.
అభీ: అది నన్ను తిడతది తెలిస్తే.
నేను: ఇవ్వు ముందు.
వాడి చేతిలోంచి ఫోన్ తీసుకుని, వాడు touch id unlock చేసాకా గ్యాలరి ఓపెన్ చేసి చూసాను.
వాళ్ళింటి వెనక గోరింట చెట్టు కింద పట్టు లంగా ఓణీలో సింగారంగా ఉంది కావ్య.
నేను: ఎంత ముద్దుగా ఉందిరా. పంపించురా అంటే నో అన్నావు.
అభీ: అలా ఎలా పంపిస్తారా?
నేను: నేనేమైనా స్ట్రేంజర్ నా?
అభీ: అంతుంటే దాన్నే అడుగకపోయావా మధ్యలో నేనెందుకు?
నేను: మరీ ఫొటోస్ అని అడిగితే కింద నుంచి పైకి చూస్తాది.
అభీ గాడు నన్ను సూటిగా మౌనంగా అదోలా చూసాడు.
నేను: ఏంట్రా?
అభీ: కావ్యకి నువంటే ఇష్టంరా.
నిజంగా? నమ్మొచ్చా? కానీ అలా ఉండదు కదా?
నేను: ఏంటి?
అభీ: అది చిన్నప్పుడు ఐదో తరగతి వరకు నా క్లాస్మేట్ రా. మేము వాళ్ళ ఇంటి పక్కనే ఉండేవాళ్ళం. ఎనమిది వరకు నేను కావ్య మంచి ఫ్రెండ్స్. తరువాత మేము ఇల్లు మారిపోయాము. డిగ్రీలో మళ్ళీ కలిసాము. నాతో తప్ప వేరే అబ్బాయిలతో మాట్లాడేది కాదు.
నేను మధ్యలో కలగచేస్కోకుండా వింటున్న, కావ్య ఫొటోస్ చూస్తూ.
అభీ: నీకు వీడియో కాల్ లో ఎలా ఉన్నాను అడిగింది, ఫొటోస్ చూపించడానికి ఎందుకు వద్దనుకుంది?
అవును ఎందుకు?
నేను: ఎందుకు?
అభీ: అదే ఎందుకు బే.. నాకేం తెలుసు.
నేను: ఇప్పుడేమంటావు?
అభీ: నేను నిన్న పిలుస్తాను అన్నాను మొన్న. వద్దూ అంది.
నేను: నేను వస్తే ఏంటి?
అభీ: ఏమో. కావ్యకి నువంటే ఇష్టంరా హరి.
కావ్య కూర్చుని దిగిన ఫోటో మొహం జూమ్ చేసి పెదవులు చూసాను. స్ట్రాబెర్రీ ముక్కలు. కొరికేయ్యాలి.
అభీ: వింటున్నావా?
నేను: హా వింటున్న ఐతే ఏం చెయ్యాలి. నాకు చెప్పే ధైర్యం లేదురా.
అభీ: ఎందుకు?
నేను: నువు అనుకుంటున్నావు గాని కాదేమో, ఈ విషయం వల్ల తనతో ఫ్రెండ్షిప్ కూడా పోతే.
అభీ దగ్గర సమాధానం లేదు. నేను కావ్య ఫొటోస్ చూస్తూ ఉన్న.
సిరి సొగసుల వయసిదీ, వయ్యారి హంస అందమా.
మధు మందారాల వచస్సు నీది, చెందనపు చెందామామవా.
నను మురిపించే మగువా, నీకు నా చూపులు తగునా.
నిను చేరాలని నా మనసే, ఇష్టం చెప్పలేని మౌనమా.
నేను కావ్య ఫొటోస్ చూస్తూ ఉంటే అభీ నా భుజం మీద కొట్టాడు.
ఎందుకా అని చూస్తే, ముందుకి సైగ చేసాడు, చూసా, కావ్య మా దగ్గరకి వస్తుంది.
మీనాక్షీ, మంజూష వెళ్లిపోతున్నారు.
ఫోన్ అభీకి ఇచ్చేసాను.
కావ్య: ఇక్కడ నుంచి అక్కడికి చూస్తూ కూర్చుంటావెంట్రా? మీనూ నువ్వు ఒకరినొకరు చూసుకోవడమేనా, చెప్పుకునేది లేదా ఇక?
అభీ: ఏం చెప్పాలే? తనకి తెలీదా నేను లవ్ చేస్తున్నాను అని.
కావ్య: మరి చెప్పూ
అభీ: చెప్పాల్సిన అవసరం లేదు. తనే వచ్చి నువు కూడా నాకు ఇష్టమే అని చెప్పదంటావా?
కావ్య: హా ఇలాగే ఉండండి ఇద్దరూ. వీడిని చూడు, వీడి పని నయ్యం. అదేమో అక్కడ నుంచి సైట్ కొడుతుంటే వీడు ఫోను పట్టుకొని కూర్చుంటాడు ఎదవ.
నేను: నన్ను మధ్యలోకి ఎందుకు తెస్తున్నవే?
కావ్య: ఆ టైమ్ పాస్ కాక.
అభీ: అరేయ్ హరి ఏదో ఒక ఐడియా ఇవ్వురా మీనక్షికి చెప్పాలి.
నేను: డైరెక్ట్ పో.
అభీ: హా...
నేను: రోజూ చూసుకున్నుడు వద్దు. ఎప్పుడు ఏస్కుందాము చెప్పు అను.
ఇద్దరూ నేను చెప్పిందానికి అవాకయ్యి చూసారు.
నోరెత్తి అరుస్తూ, కావ్య: చెప్పు తీసి కొట్టుద్ది. ఐడియా ఇవ్వురా అంటే ఏం మాటలు అవి ఈడియట్.
నేను: అరె నీకు తెలీదే. ఆగు.
అభీ గాడిని చూసాను. వాడి చెవిలో ఏం చెయ్యాలో చెప్పాను.
అభీ: ప్లాన్ తేడా కొడితే నా బతుకు బైగన్ అవుద్దిరా.
నేను: నీ ఇష్టంరా. నువు ఐడియా అడిగినవు నేను చెప్పిన.
కావ్య: ఏం చెప్పావు అసలూ?
నేను: తర్వాత చెప్తాను.
నా మీద కసురుకుంది.
కావ్య: నీ తరువాత చెప్తాను తగలేయ్య. ఇప్పటికీ మూడు ఉన్నాయి తరువాత చెప్తాను అంటవు అవే ఏ ఎట్ల కలుస్తాయో తెలీదు.
నేను: మూడా ఏంటి అవి?
కావ్య: నేను అడిగిన డౌట్లు.
నేను: సరే తర్వాత అడుగు చెప్తాను.... అంటూ నవ్వాను.
కావ్య: నీ ముక్కు పదా పోదాం.
లంచ్ అయ్యింది, మాట్లాడుకున్నాము, క్లాసుకు పోతూ ఉంటే మధ్యలో మహేష్ గాడు ఆపాడు.
మహేష్: ఎంట్రోయ్ ముగ్గురూ బాగా కలసి ఉంటున్నారు? ఏం కావ్యా, నేను గుర్తుకురావట్లేదా నీకు?
కావ్య మౌనంగా తల దించుకొని అవును అన్నట్టు ఆడించింది.
మహేష్: ఓహో గుర్తొస్తున్నానా? ఎప్పుడు వస్తున్నా, బెడ్ లో ఉన్నప్పుడా? బాత్రూంలో ఉన్నప్పుడా?
నాకు కోపం వచ్చింది, వీడు వీని మాటలు.
అమాయకంగా, కావ్య: అది కాదండీ మొన్న గుర్తొచ్చారు?
మహేష్ కావ్య దగ్గరకి వచ్చాడు. కొంచెం మెడ వంచి అడిగాడు.
మహేష్: గుర్తొచ్చానంటరా....
సృజన్: ఇయూ...
మహేష్: చెప్పు ఎప్పుడు గుర్తొచ్చాను?
కావ్య: మరేమో.... మొన్న ఒక వార్తలో అమ్మాయిలని ఇబ్బంది పెడుతూ ఉంటే ఒక అతన్ని చెప్పూ చీపుర్లతో కొట్టారంట. అప్పుడు గుర్తొచ్చారు.
తింగరిది అలా అనేసిందేంటి?
మహేష్ గాడు కావ్య రెండు భుజాలు గట్టిగా పట్టుకున్నాడు. వాడికి మంట పుట్టింది.
మహేష్: ఏంటే అయితే ఇప్పుడు నన్ను కొడతారు అంటావా?
నాకు గుబులు పుట్టింది, ఏంటి అలా పట్టుకున్నాడు అని. వెంటనే మహేష్ ని పట్టుకొని తోసాను.
మహేష్: నువ్వేంద్రా మధ్యలో?
నేను: కూల్ అన్నయ్య కూల్. గుర్తొచ్చావు అంది, అంతే, నిన్ను కొడతారు అనాలేదు కదా. ఎందుకు కోపం.
నేను: పదా కావ్య క్లాస్ టైం అవుతుంది.... అని కావ్య చేయి పట్టుకున్న.
నన్ను కాలర్ పట్టుకొని లాగాడు మహేష్.
మహేష్: ఏంట్రా చెయ్యి పట్టుకుంటున్నావు?
నేను: ఫ్రెండ్ ఏ కదా అని.
వాడి కళ్ళలోకి సూటిగా పొగరుగా చూసాను.
మహేష్: ఫ్రెండ్ ఐతే ఏంట్రా, నేను చెప్పినా కదా, కావ్య....
నేను: అన్నయ్య.... కావ్య నా ఫ్రెండ్ ఓకేనా? ఫ్రెండ్షిప్ వేరు ర్యాగింగ్ వేరు. మీరు అలా మాట్లాడితే కావ్యకి ఇబ్బందిగా ఉంది. అలా ఊకె కావ్యని ఆపకండి.
మహేష్: ఏంట్రా వార్నింగ్ ఇస్తున్నవా? హీరో అనుకుంటున్నావా?
నా మొహం ఇంకా వాడికి పొడిచాను. సూటిగా దడ లేకుండా వాడి కళ్ళలోకి చూస్తూ.
నేను: కాదు నిజాలు మాట్లాడుతున్న.
మహేష్: ఏంట్రా పొగరా?
నేను: కావ్య జోలికి వచ్చినా, ఇబ్బంది పెట్టినా నాకు నచ్చలేదు అన్నయ్య.
నా కాలర్ ఇంకా బిగించాడు.
మహేష్: వస్తారా.... నిన్ను ఎవడు పట్టించుకుంటాడు.
నేను: కావ్యని ఇబ్బంది పెడితే నేను ఊరుకొని?
నన్ను కాలర్ నలిపేస్తూ పైకి లేపి ప్రయత్నం చేసాడు.
చుట్టూ చూసాను, అక్కడ బయట ఉన్న వాళ్ళందరూ మా దిక్కే చూస్తున్నారు.
నేను: నీకు కాలర్ ఉంది, నాకు చేతులు ఉన్నాయి. పట్టుకుంటే నీకే ప్రాబ్లం. అందరూ చూస్తున్నారు.
వదిలాడు.
మహేష్: సాయంత్రం చెప్తాను మీ సంగతి.
నేను వాడిని ఏం హీక్కుంటావో హీక్కో అన్నట్టు చూసి, మేము క్లాసుకి వెళ్ళిపోయాము.
క్లాసులోకెళ్ళి కూర్చున్నాము. ముగ్గురము ఏమి మాట్లాడుకోలేదు. నేను చేసిందానికి వాళ్లకు నాతో ఏం మాట్లాడాలో తోచలేదేమో.
రెండు గంటలు గడిచాక, యూనివర్సిటీ నుంచి బయటకి వచ్చాము. అభీ బండి తీసి వచ్చాడు.
అభీ: కావ్య ఇంటి కాడ దింపాలా?
కావ్య: బస్సులో పోతాలేరా.
అభీ కావ్యతో సరే అంటూ నన్ను చూసాడు. ఇద్దరం కలిసే పోవాలి అని అర్థం.
కావ్య నేను అలా యూనివర్సిటీ కాంపౌండ్ వాల్ నుంచి ఫుట్పాత్ మీద నడుస్తూ ఉన్నాము.
అప్పుడే మహేష్ కూడా మా పక్క నుంచి బండి మీద మమ్మల్ని దాటుకుంటూ వెనక్కి మెడ తిప్పి నన్ను బేధిరింపుగా చూసి పోయాడు.
కావ్య నా కుడి చేతిలో తన ఎడమ చేతిని కలిపి పట్టుకుంది.
కావ్య: వాడితో గొడవ వద్దు కృష్ణ.
ఇంకా గట్టిగా నా అరచేతిని సున్నితంగా పిసికింది.
నేను: వాడి మాటలు నాకు నచ్చలేదు. ఇవాళ మరీ ఓవర్ అనిపించలేదా?
మా నడక ఆగింది.
కావ్య: వాళ్ళు మాములోల్లు కాదు. మనల్ని కంట్ల పెట్టుకొని ఏమైనా చేస్తే.
స్పష్టంగా కావ్య కళ్ళలో గుబులు. నన్ను సూటిగా చూస్తున్నా ఏదో చెప్పలేక మొహమాటపడుతున్నట్టు అనిపించింది.
తన కలువ కళ్ళను ఇష్టంగా చూస్తూ, కంగారుగా ఆడుతున ఆమె కనుపాపలు గమనించి, కుడి చేత కావ్య చెంప కప్పేసాను.
చిన్న చిరునవ్వుతో, నేను: ఇవాళ ఏదో అయిపోయింది. రేపటికి మామూలుగానే ఉంటాడు మహేష్. ఏదో అప్పుడు అలా మాటల్లో కొంచెం కోపం వచ్చింది నాకు.
సిగ్గు పడింది. నేను చూసాను, నా కళ్ళని నమ్మొచ్చా? తెలీదు.
నడక సాగించింది.
కావ్య: చూడానికే హీరోలా ఉన్నావనుకున్నా, హీరోయిజం కూడా ఉంది.
నేను: చ అట్లాంటిది ఏం లేదులే.
కావ్య: అవును.... నీకంత సీన్ లేదులే.
ఇద్దరమూ నవ్వుతూ బస్టాప్ లో ఆగాము. ఏంటో అప్పుడే ఒక బస్సు వచ్చింది. ఇద్దామూ ఎక్కాము.
నిల్చున్నాం. ఎదురెదురుగా. కావ్య మీదకి నా మొహం వంచి తన ముద్దు మోమును కొంటెగా చూస్తూ.
తనూ సిగ్గుగా నవ్వింది.
కావ్య: ఈ మధ్య నన్ను అదో రకంగా చూస్తున్నావు?
నాకేం తెలీడం, లేదు నా మొహంలో, నా చూపులు తను పట్టేస్తుంది.
నేను: అదోలా అంటే?
కావ్య: ఏమో ఇంతకుముందులా కాదు.
మొహం తిప్పుకున్న.
బస్సు బ్రేక్ వేస్తే తను నా మీదకి పడింది. నా బాహులో హత్తుకుంది.
నేనేం తెలీనట్టు ఉన్నాను. సిగ్గుతో మొహం కిందకి దించుకుంది.
నిజంగా అభీ చెప్పినట్టు కావ్యకి నా మీద ఇష్టం ఉందా? ఉంది అనే అనిపిస్తుంది. మెడ వంచి తన కురుల వాసన పీల్చాను.
అడుగు ముందుకి వేసింది. నా ముక్కు తన కురుల్లో పాతుకుంది. మల్లెతీగల గుబాలింపుగా నా మెదడు మబ్బుబారుకుంది.
ఒక నిమిషం, తను కావాలనే అడుగు ముందుకి వేసిందా? లేదు లేదు, తన స్టాప్ దగ్గరికొస్తుంది.
బస్సు స్టాప్ దగ్గర ఆగింది.
నా చెవిలో, కావ్య: కలుద్దాం రా. బై.
బస్సు దిగింది.

…………