25-12-2024, 10:31 AM
# 13 మెసేజ్
ఉదయం తొమ్మిది కావస్తుంది . ఆదివారం అమ్మ పోరు పడలేక ఉదయాన్నే లేసి రెడీ అయింది హారిక . ఆకు పచ్చ చీర , చిలకపచ్చ బ్లౌజ్ , తల నిండా మల్లెపూలు . మెడ లో సింపుల్ గ గోల్డ్ లాకెట్ . లైట్ గా లిప్ స్టిక్ . ఐ లైనర్ .. వెళ్ళేది గుడికి కాబట్టే ఇలా రెడీ అయింది . లేదంటే 29 ఏళ్ళ అమ్మాయి ఇలా చీర కడుద్దా ?
అమ్మ పోరు పడలేక గుడికి వెళ్ళింది .. అదేంటి గుడికి వెళ్ళడానికి కూడా అమ్మ తోయాలా అని అనుకోవద్దు . వెళ్తుంది దేవుణ్ణి చూడడానికి కాదు .. తనకి రాబోయే పతి దేవుణ్ణి చూసేదానికి .. ఊళ్ళో ఉన్న అమ్మ చాదస్తం కొద్దీ ఈ పెళ్లి చూపులకి ఒప్పుకుంది . ఇదేంటి పెళ్లి చూపులు గుళ్లోనా అని అనుకోవద్దు .
ఐదు నెలల క్రితం .. మాదాపూర్ కాఫీ షాప్ లో మోహన్ తో పెళ్లి చూపులు . ఒక నిమషంలోనే లేసొచ్చింది
నాలుగు నెలల క్రితం .. జూబిలీ హిల్స్ మాల్ లో పెళ్లి చూపులు .. జగదీశ్ తో .. రెండు నిముషాలే
ఇలా బేగం పెట్ లో భవాని శంకర్ .. అమీర్ పెట్ లో అమర్ .. గుచ్చి బౌలి లో గిరి ... అన్నీ ఫట్ ..
అందుకే ఈ సారి గుడిలో ఫిక్స్ చేసింది మమ్మి .. కనీసం గుడికొచ్చినందుకు దేవుడి దర్శనం అన్నా దక్కుద్ది అని
గుడి వెనక మెట్ల దగ్గర కూర్చుని ఫోన్ లో మునిగిపోయింది హారిక
"ఒసేయ్ .. అబ్బాయి నచ్చాడా ?"
"నచ్చాడా కాదు .. వచ్చాడా అని అడగాలి "
"అదేంటి ఇంకా రాలేదా ?"
"ఇక రాడేమో "
"హైదరాబాద్ ట్రాఫిక్ తెలిసిందే కదా "
"అమ్మా .. నేనుండేది కూడా హైదరాబాద్ లోనే కదా .. మ్యాచ్ నువ్వు ఫిక్స్ చేసావు కదా అని మాక్ ఫిక్సింగ్ చేసినట్టు మాట్లాడొద్దు "
"ఫోన్ నంబర్ పంపా కదా .. అబ్బాయి కి కాల్ చేయొచ్చుగా "
"వొద్దమ్మా .. ఇప్పటికే నా ఫోన్ నిండా నా ఫ్రెండ్స్ లిస్ట్ కన్నా.. ఇలా పెళ్లి చూపులకి వచ్చిన అబ్బాయల లిస్టే ఎక్కువుంది "
"సరే జాగ్రత్తగా బిహేవ్ చెయ్ "
"అమ్మా .. ఇదేమన్నా ఇంటర్వ్యూ నా .. బాగా బిహేవ్ చేసి సెలెక్ట్ అవడానికి "
"అది కాదే .. వాళ్ళది మంచి కుటుంబం .. మంచి జాబ్ .. నాన్న గారు చాల కష్టపడి ఈ సంభంధం పట్టుకొచ్చారు "
"ఎం .. మనది మంచి ఫామిలీ కాదా ? నాది మంచి జాబ్ కాదా ?"
"ఇలా మాట్లాడతావనే జాగ్రత్త అని చెప్పేది .. లేట్ ఎందుకయ్యిందో కనుక్కుంటా .. నువ్వక్కడే ఉండు "
"సరే అమ్మా .. బై "
కాల్ కట్ చేసి .. ఎదురుగా కొలను పక్కన ఉన్న జంట పక్షుల్ని చూస్తూ ఉండి పోయింది .. ఇంతలో ఎవరిదో వాయిస్
"హారికా "
తలెత్తి చూసింది . ఎవరో అబ్బాయ్ .. చేకేడ్ షర్ట్ .. బ్లూ జీన్స్ .. గాగుల్స్ .. గుడికొచ్చినట్టు లేడు ..
"హలొ .. కూర్చోండి "
హారికా కి ఎదురుగా కూర్చున్నాడు ఆ అబ్బాయ్ .. బహుశా ఇతనేనేమో పెళ్లి కొడుకు ..
"హాయ్ .. థిస్ ఈజ్ .. " చెయ్ ఆఫర్ చేయబోతుంటే
"పేరు ఆల్రెడీ అమ్మ చెప్పింది .. ఇంకేదన్న చెప్పండి "
"7254"
"ఇది నా ఎటిఎం పాస్వర్డ్ .. మీకెలా తెలుసు ?"
"అది మీ అమ్మ చెప్పలేదు .. నేనే తెలుసుకున్నా "
"అది మా అమ్మకి కూడా తెలియదు .. మీకు తెలుసంటే .. నా గురించి చాలానే తెలుసనుకుంటా .. ఇంకేం తెలుసు నా గురించి "
"నువ్వొక అనాధవి .. నిన్ను పెంచుకుంటున్న పేరెంట్స్ అసలు పేరెంట్స్ కాదు .. వాళ్ళకన్నీ ఉన్నా ఆడపిల్ల లేక , పదేళ్ల వయసులో నిన్ను అడాప్ట్ చేసుకుని పెంచుకుంటున్నారు "
"ఈ విషయం నా ఫామిలీ కి నాకు తప్ప ఇంకెవరికి తెలియదే "
"ఇది నీకు తప్ప ఎవరికీ చెప్పలేదు .. చెప్పను కూడా "
"నా బర్త్ సీక్రెట్స్ తెలుసుకున్నావంటే నా లైఫ్ లో అన్ని సీక్రెట్స్ తెలుసుకునే ఉంటావ్ "
"నీకు బుక్స్ అంటే చాల ఇష్టం .. అందుకే నీ రూమ్ లైబ్రరీ గా చేసావ్ .. నీకు మ్యూజిక్ అంటే పిచ్చి .. కానీ మీ ఇంట్లో వాళ్ళకి నువ్వు సాంగ్స్ వినడం కూడా నచ్చదు .. అందుకే నువ్వు రీసెంట్ గా మ్యూజిక్ డిప్లొమో పూర్తి చేసి ఆ సక్సెస్ ని ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియక నీలోనే దాచుకున్నావ్ ఆ నిజాన్ని .. నీ ఫ్రెండ్స్ అందరూ నిన్ను వాడుకుంటూ .. నువ్వు వాళ్ళని వాడుకుంటున్నావ్ అని అనుకుంటున్నారు .. కానీ వాళ్ళకి తెలియంది .. నీకు మాత్రమే తెలిసింది ఏంటంటే నీకు హెల్ప్ చేయడమంటే చాలా ఇష్టం .. దాని కోసం ఎన్ని సార్లు మోసపోడానికైనా సిద్ధంగా ఉంటావ్ .. నీకు బాధగా ఉంటె వంటరిగా ఉండడం ఇష్టం .. అందుకే ఎవరికీ చెప్పకుండా దూరంగా వెళ్లి అక్కడే కాసేపు కూర్చుని .. బాధ తీరేక ఇంటికొచ్చేస్తూ ఉంటావ్ "
"ఇంటరెస్టింగ్ "
"నీకు పానీ పురీ అంటే చాల ఇష్టం .. కానీ నువ్వెప్పుడూ సింగల్ గా వెళ్లి తినలేదు .. నీకిష్టమైన వాళ్ళు నిన్ను తీసుకెళ్లి తినిపిస్తేనే తింటావ్ . ఇప్పటిదాకా ఆ ఛాన్స్ .. మీ నాన్న గారికి .. మీ తమ్ముడి కి మాత్రమే దక్కింది .. మీకు పెట్స్ అంటే చాల ఇష్టం .. కానీ మీ ఇంట్లో వాళ్ళకి అసలు నచ్చదు . అందుకే బ్లూ క్రాస్ లో పెట్ ని అడాప్ట్ చేసుకుని .. వారానికోసారి వెళ్లి దాన్ని చూసొస్తుంటావ్ .. ప్రతి నెల నీ జీతంలో 20% దానికే ఖర్చు పెడతావ్ .. నువ్వు బాగా పాడగలవ్ .. బాగా మాట్లాడగలవ్ .. అలసట లేకుండా ఆటలు కూడా అడగలవ్ .. ఇవన్నీ చేయగలవని నీకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు .. ఎందుకంటే .. నీ వాళ్ళ ఆనందం కోసం నువ్వెలా ఉండాలో కాకుండా .. నీ వాళ్ళు నిన్ను ఎలా చూడాలనుకుంటారో అలా ఉంటూ నీ ఆనందాన్ని వెదుక్కుంటున్నావ్ .. నీకసలు ఈ పెళ్లి చూపులు ఇష్టం లేదు .. పేరెంట్స్ కోసం ఒప్పుకుంటావ్ .. నీకోసం రిజెక్ట్ చేసి తప్పించుకుంటావ్ .. మే బి .. ఇప్పుడు నన్ను కూడా రిజెక్ట్ చేయొచ్చు .. ఇవన్నీ చెప్పి నిన్ను ఇంప్రెస్ చేయడం కాదు నా ఉద్దేశ్యం .. కానీ నిన్ను అర్ధం చేసుకునే వాడు ఒకడున్నాడని చెప్పడమే నా ప్రయత్నం "
"నా గురించి నాకు తప్పా ఎవరికీ తెలియని తెలుసుకుని మరీ నాకే చెబుతుంటే .. అద్దం ముందు నాతో నేనే మాట్లాడుతున్నట్టు ఉంది .. అసలు అన్ని విషయాలు ఎలా తెలుసుకున్నావ్ ?"
"ఇన్ని విషయాలు తెలుసుకున్నా కానీ .. ఒక్క విషయం మాత్రం తెలుసుకోలేకపోయా "
"నా పర్సొనల్ లైఫ్ ని 5 మినిట్స్ ట్రయిలర్ లా చెప్పేసావ్ .. ఇంకేం తెలుసుకోవాలి "
"మీకేదన్నా లవ్ స్టోరీ ఉందా హారికా ?"
"లేదు "
"అవేరేజ్ గా ఉండే అమ్మాయిలకే లవ్ స్టోరీస్ ఉంటాయి .. ఇంత అందంగా ఉండే మీకు లేకపోవడం అంటే నమ్మలేకున్నా "
"నమ్మొద్దు .. కానీ .. అదే నిజం "
"ఎనీ వన్ సైడ్ స్టోరీస్ ?"
"ఏమో .. నా వెనక జరిగాయేమో .. నాకు తెలిసి నో "
"ఒకసారి గుర్తు చేసుకోండి "
"నో .. నో ఛాన్స్ "
"ఒక్క సారి .. ఒక్క సారి .. ఏదైనా " (ఫోన్ ఆమెకు కనిపించకుండా చేసి మెసేజ్ బటన్ నొక్కుతాడు )
(ఫోన్ చెక్ చేసుకుని ) "హా .. గుర్తుకొచ్చింది "
"చెప్పండి "
"కరెక్ట్ గా ఒక ఏడాది క్రితం ఒక తెలియని నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది .. ఓపెన్ చేసి చూస్తే ఎంప్టీ మెసేజ్ "
"ఎంప్టీ మెసేజ్ ?"
"హా .. అవును .. ఆ నంబర్ కి మెసెజ్ చేస్తే రిప్లై లేదు . కాల్ చేస్తే కట్ చేస్తున్నారు .. ఆ రోజు నుంచి ప్రతీ రోజూ .. అదే టైం కి ఒక ఎంప్టీ మెసేజ్ పంపిస్తున్నారు . స్టార్టింగ్ లో రోజూ ఎంప్టీ మెసేజ్ వచ్చే సరికి కొంచెం ఇబ్బందిగా అనిపించేది .. కొన్ని రోజులకి ఆ ఎంప్టీ మెసేజ్ లు నా లైఫ్ లో ఒక భాగం అయ్యాయి .. ఫైనల్ గా వాటి గురించి ఆలోచించడం మానేసి ఆస్వాదించడం స్టార్ట్ చేశా .. అప్పుడు అర్ధమయింది .. అతను నాకు ఒకే సమయంలో ఒకే విషయాన్నీ గుర్తు చేయాలని ట్రై చేస్తున్నాడని "
"ఎవరై ఉండొచ్చు "
"మే బి .. తాను నన్ను ఫస్ట్ టైం చూసిన క్షణం అయిండొచ్చు "
"బహుశా తన అర్ధం .. తన ప్రేమ పుట్టిన క్షణం అయుండొచ్చు "
"కదా .. అలా అయితే .. ఈ రోజుకి .. "
ఇంతలో ఇంకో అతను
"హలొ హారికా .. "
"ఎవరూ ?"
"థిస్ ఈజ్ రిషి .. మీ అమ్మగారు చెప్పారు కదా .. చూడ్డానికొచ్చా "
ఇంతలో .. అప్పటి దాక మాట్లాడిన అతను లేసి వెళ్ళిపోతున్నాడు .. హారిక అతన్నే చూస్తూ ..
"హలొ మీరే కదా హారికా అంటే ?"
హారిక చిరాగ్గా లేసి కాదు అని చెప్పి ఇందాకటి వరకు తన గురించి అన్నీ చెప్పిన అతని వైపు వడి వడిగా అడుగులు వేసి అతన్ని చేరుకుంది
"హలొ .. అర్ధమయింది కదా అని అర్దాంతరంగా వదిలేసి వెళ్ళిపోతావా "
"సారీ "
"సర్లే .. నాకు పానీ పురీ కావాలి .. తినిపిస్తావా "
ఒక్క బైట్ కూడా లేని ఎంప్టీ మెసేజ్ వాళ్ళిద్దర్నీ కలిపింది !!!
... ... ...
మాదాపూర్ కాఫీ షాప్ లో .. పెళ్లికూతురు కోసం వెయిట్ చేస్తున్న పెళ్లి కొడుకు .. అమ్మాయిలెప్పుడూ లేట్ కదా ..
కొంచెం సేపటికి .. బ్లూ జీన్స్ ఎల్లో టీ షర్ట్ లో వచ్చిన అమ్మాయి ..
"హలో .. ఎలా ఉన్నారు "
"అయ్యో .. ఇంకా బీపీ షుగర్ లు ఏమి రాలేదు "
"బ్రహ్మానందం ఫ్యాన్ ?"
"ఎవరు కాదు "
"నైస్... "
(ఏసీ రాక పోతుండేసరికి ) "హా .. సో హాట్ "
(తన గురించి అనుకుని .. సిగ్గుపడుతూ ) "థాంక్స్ "
(తనలో తానే గొణుక్కుంటుంది ) "బానే ఎక్సట్రాలు దెం .. న్నావ్ గా "
"జస్ట్ కిడ్డింగ్ .. అవును నువ్వు ఎందులో వర్క్ చేస్తుంటావ్ "
"చిన్న స్టార్ట్ అప్ లో .. నువ్వు "
"పెద్ద mnc లో "
"నీ రోల్ ఏంటి అందులో "
"ఏ రోల్ అయితే ఏంటి .. చేసేది కూలిపనే కదా "
"అదీ నిజమేలే .. అంటే ..పెద్ద కూలినా .. చిన్న కూలినా ?"
"మొన్నీ మధ్య కూలీ నుంచి మేస్త్రి కి ప్రమోట్ అయ్యా "
"ఇంతకీ ఎమన్నా ఆర్డర్ చేద్దామా ?"
"యాహ్ ... స్యూర్ "
"బాయ్ .. ఆర్డర్ తీసుకుంటారా "
"సర్ .. చెప్పండి "
"మీకేం కావాలి ?"
"హాట్ చాకోలెట్ "
"విత్ ?"
"నో .. జస్ట్ హాట్ చాకొలేట్ "
"ఓకే.. బాయ్ .. ఒక హాట్ చాకొలేట్ .. ఒక హాట్ చాకొలేట్ విత్ వెనీలా "
"నీకు ఈ పెళ్లి ఇంటరెస్ట్ ఉందా ?"
"లేదు .. ఎందుకో మీ ఫోటో చూసాక ఇంటరెస్ట్ కలిగింది .. అందుకే నిన్ను కలుద్దామని వచ్చా .. ఇంతకీ నీకు ఈ పెళ్లి మీద ఇంటరెస్ట్ ఉందా "
"హమ్ .. బొక్కలో ఇంటరెస్ట్ .. అమ్మ పోరు పడలేక వచ్చా .. అయినా .. నీ లాగా డీసెంట్ గా .. ఇన్నోసెంట్ గా .. ఉండలేక "
(డీసెంట్ , ఇన్నోసెంట్ అని పొగిడేస్తుంటే వాడు సిగ్గు పడిబోతుంటే .. వాడి ఫోన్ మొగుద్ది .. కాలర్ ట్యూన్ .. కెవ్వు కేక .. నా ఈడంతా .. కెవ్వు కేక .. వెంటనే కట్ చేస్తాడు )
"మాట్లాడు "
"పర్లేదు పర్లేదు .. తర్వాత మాట్లాడతాలే "
"నీకు గల్ ఫ్రెండ్ ఉందా "
"ఎక్కడకొచ్చి ఎం అడుగుతున్నావు "
"అంటే ఇక్కడకొచ్చి ఇలాంటి ప్రశ్నలు అడక్కూడదా .. జస్ట్ కిడ్డింగ్ .. అంటే .. ఆడ పెళ్లి వాళ్ళం కదా "
"గర్ల్ ఫ్రెండ్ ఎవ్వరూ లేరు .. రాడ్డు సింగల్ .. నీకెవరన్న ఉన్నారా .. బాయ్ ఫ్రెండ్ ?"
"మా వాళ్ళు నన్ను ఎప్పుడెప్పుడు ఇంట్లోంచి పంపిచేస్తామా అన్నట్టు ఉన్నారు .. ఇక బాయ్ ఫ్రెండ్ ఉంటె చచ్చేవాడే "
"అవును ఇందాక మీరు జస్ట్ హాట్ చాకొలేట్ ఆర్డర్ చేసారు .. ఆడ్ ఆన్ ఫ్లేవర్ లేకుండా "
"నాకిష్టం లేదు "
"హాట్ చాకొలేట్ మన జీవితం లాంటిది .. ఆడ్ ఆన్ ఫ్లేవర్ మన పెళ్లి లాంటిది .. అప్పుడే కిక్కోస్తుంది "
"ఏది ఏమైనా బిల్ కట్టాల్సింది మా డాడీ నే కదా "
"అదేంటి ?"
"అంటే .. పెళ్ళికి కట్నం కట్టాల్సింది మా డాడీ నే కదా.. ఎం కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటారా ? "
"అవన్నీ ఇప్పుడెందుకులే "
"ఇంతకీ ఈ రోజు సండే కదా "
"లేదు లేదు .. ఈ రోజు మండే "
"షీట్ .. అయితే శివాలయం వెళ్ళాలి .. ఇక్కడ దగ్గర్లో ఉందా ?"
"పక్కనే ఉంది "
"మీరు .. ఏమి అనుకోపోతే నా తో పాటు జాయిన్ అవుతారా ?"
"వై నాట్ "
ఇద్దరూ శివాలయం వెళ్తారు .. దర్శనం చేసుకుని కొంచెం సేపు అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటారు .. కొంచెం సేపటికి ఆ అమ్మాయి
"బాగా ఆకలేస్తుంది .. బ్రేక్ ఫాస్ట్ చేద్దామా ?"
"పక్కనే ఓ రెస్టారెంట్ ఉంది .. మసాలా దోస సూపర్ గా ఉంటుంది "
"బాగో పోతే అప్పుడు చెప్తా "
"మీరు తినండి .. మీకు నచ్చుద్ది "
రెస్టారెంట్ కి వెళ్తారు .. రెండు మసాలా దోస ఆర్డర్ ఇస్తాడు .. ఆ అబ్బాయి
"ఇక్కడ చట్నీ ఉంటది .. సూపర్ "
"చట్నీ అంటే .. మా వైజాగ్ lic బిల్డింగ్ వెనక పునుగులా బండి ఉంటది చూడు .. అసలు వేరే లెవెల్ "
"అది చేసేది కూడా మా విజయ వాడొల్లే .. ఎవరినన్నా అడగండి .. గతి చట్నీ అంటే మా విజయవాడ అనే చెబుతారు "
ఇంతలో ఆ అబ్బాయికి ఫోన్ వస్తుంది .. ఈస్క్యూజ్ మీ అని ఫోన్ తీసుకుని పక్కకెళ్తాడు .. ఆ అమ్మాయి కూడా ఫోన్ వస్తుంది
ఆ అబ్బాయి ఫోన్ లో
"ఎందుకమ్మా ఫోన్ చేస్తావ్ .. ఆఫీస్ లో చాల బిజి గా ఉన్నా "
"అది కాదురా .. ఉదయం ఒక ఇంపార్టెంట్ విషయం చెబుతుంటే వినకుండా వెళ్లిపోయావ్ "
"ఏంటిది అమ్మా "
"మన పక్కింటి రమ్య ఆంటీ ఉంది కదా .. వాళ్ళ అబ్బాయి కి ఒక సంభంధం వచ్చిందిరా .. ఆ అమ్మాయి పెళ్ళిచూపులకి ముందే కాఫీ షాప్ లో కలుద్దామని అన్నది .. వాడేమో పిల్ల నచ్చలేదని మొండికేస్తున్నాడు .. ఆంటీ నా దగ్గరకొచ్చి బాధ పడింది . సర్లే మీ అబ్బాయిని ఒప్పించే బాధ్యత నాది అని అన్నా .. నువ్వు వాడికన్నా పెద్దోడివి కదా.. నీతో వాడికి చెప్పిద్దామనుకున్న , నువ్వేమో నా మాట వినకుండా వెళ్ళిపోయావ్ "
(ఆ అబ్బాయి టెన్షన్ తో ఫోన్ పెట్టేసి ) "అమ్మా .. మల్లి కాల్ చేస్తా " , అని ఫోన్ పెట్టేసి ఆ అమ్మాయి దగ్గరకి వెళ్తాడు
ఆ అమ్మాయి ఫోన్ లో మాట్లాడుతుంది .. ఆ అబ్బాయి ని చూసి ఫోన్ పెట్టేసింది ..
అతను సారీ ముఖం పెట్టి ..
"ఐ ఆమ్ సారీ .. చిన్న మిస్ అండర్స్టాండింగ్ వల్ల పెద్ద మిస్టేక్ జరిగిపోయింది "
(ఆ అమ్మాయి కూడా చాల బాధ గా , కోపంగా ఉంది .. ఆ అబ్బాయి కంటిన్యూ చేస్తూ )
"మీక్కూడా కాల్ వచ్చిందనుకుంటా .. కాల్ ఏదైనా కరెక్షన్ ఒకటే కదా .. ఐ ఆమ్ రియల్లీ సారీ .. ఐ హోప్ యు డోంట్ మైండ్ .. నేను వెళ్తా "
"వన్ సెకండ్ .. వన్ లాస్ట్ క్వశ్చన్ "
"హా .. చెప్పండి "
"మీ పాయింట్ అఫ్ వ్యూ లో ప్రేమ మీద , లైఫ్ మీద , మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి ?"
"ఏముంటుందండి .. చూడండి ఆ ముసలి జంట ని .. 80 ఏళ్ళు వచ్చినా ప్రపంచంతో ఏ సంభంధం లేకుండా హ్యాపీ గా ఉన్నారు .. అది కదా ప్రేమ అంటే .. చుట్టూ ఉన్న నలుగురు కోసం మన పర్సనాలిటీ ని చంపుకుని బతికే రోజులు .. అలాంటిది ఈ ప్రపంచానికి ఎలాంటి సంభంధం లేకుండా హాయ్ గా ఉన్నారు వాళ్ళు .. నా పార్టనర్ నుంచి అది కావాలి .. లైఫ్ మనకి చాల నేర్పిస్తుంది . అందులోంచి ఎం తీసుకోవాలో , ఏది వదిలేయాలో తెలిసినోడే హ్యాపీ గా ఉంటాడు .. సరే .. నాకు టైం అవుతుంది .. వెళ్తా "
(ఆ అమ్మాయి అతన్ని అలానే చూస్తూ .. ) "వన్ సెకండ్ "
"చెప్పండి "
"నా ఫోటో చూసి నా క్యారెక్టర్ ఏంటో తెలియకుండా రిజెక్ట్ చేసినోన్ని గురించి ఆలోచించమంటారా ? నా ఫోటో చూసి నేనేంటో తెలుసుకోవాలని వచ్చిన మీ గురించి ఆలోచించమంటారా ? "
"అంటే ?"
"మనల్ని నమ్మి మన కోసం వచ్చిన పార్టనర్ ని ఎలా చూసుకొవాలి .. పార్వతి శివుణ్ణి ప్రేమించినంతగా .. అడిగిన వెంటనే గుడికి తీసుకెళ్లినంతగా .. అడక్కుండానే హాట్ చాకొలేట్ తినిపించినంతగా .. ఆకలేసినప్పుడు .. పునుగులు .. గట్టి చట్నీ .. ఇవి చాలు .. ఇంతకంటే ముఖ్యంగా .. తన ప్రపంచం ఏదైనా సరే .. నేనున్నప్పుడు తనకి నేను మాత్రమే తన ప్రపంచం అయిపోవాలి .. అదే కదా లవ్ .. "
"సో ?"
"లైఫ్ నాకు నేర్పిస్తున్న విషయాల్లో నాకు తోడుగా నువ్వుంటావా ? విల్ యు ట్రావల్ విత్ మీ ?"
"స్యూర్ "
"థాంక్స్ "
"ఇందాక .. మీరు ఫ్లో లో గట్టి చట్నీ చేయాలన్నారు .. నాకు వంట రాదండి బాబు "
"పర్లేదండి .. lic బిల్డింగ్ వెనక పునుగుల బండి ఉంది కదా .. "
"హహ .. అలాగే "
"ఇంతకీ ? మీ పేరు ?"
"ఫస్ట్ లో అడగాల్సిన ప్రశ్న .. ఇప్పుడు అడుగుతున్నారు .. నా పేరు అఖిల్ "
"నైస్ నేమ్ "
"థాంక్స్ "
ఇంతకీ ఉదయం ఏమైంది ? అఖిల్ ఆఫీస్ కి అని రెడీ అయ్యి .. వెళ్లబోతుంటే .. అమ్మ , నాన్న మధ్య సంభాషణ వింటాడు .. చాటుగా ..
(ఫోన్ లో ఫోటో చూపిస్తూ ) "ఏవండీ .. అమ్మాయి చాల బాగుంది కదా "
"అమ్మాయి బాగుంది .. ఎవరీ అమ్మాయి ?"
"ఈ అమ్మాయి అబ్బాయిని చూడడానికి మాదాపూర్ కాఫీ షాప్ లో కలుస్తానని చెప్పింది "
ఆ అమ్మాయి ఫోటో చూసేసరికి మనోడికి గుండె కొట్టుకోవడం ఆగింది .. సూపర్ గా ఉంది ..
"అబ్బాయిని బ్లాక్ షర్ట్ లో రమ్మని చెప్పింది "
"ఇంతకీ అమ్మాయి అబ్బాయి ఫోటో చూసిందా ?"
"లేదండి .. ఇప్పుడు ఫోటో లో ఒకలాగా , బయట ఒక లాగా ఉంటున్నారు కదా .. డైరెక్ట్ గా చూస్తా అని చెప్పింది "
అఖిల్ వెంటనే లోపలికెళ్ళి బ్లాక్ షర్ట్ వేసుకుని .. హడావుడి గా ఆఫీస్ కి వెళ్లబోతుంటే .. అమ్మ ఆగరా నీకో ముఖ్యమైన విషయం చెప్పాలని వెళ్ళిపోతాడు .. అదీ జరిగింది !!!
సగం సగం మెసెజ్ విన్న అఖిల్ కి తనకి నచ్చిన అమ్మాయి దక్కింది !!!
********** ********** సమాప్తం ********** **********