23-12-2024, 05:53 PM
(This post was last modified: 23-12-2024, 06:03 PM by 3sivaram. Edited 2 times in total. Edited 2 times in total.)
సెగ్మెంట్ 1 : కేశవ్
చాప్టర్ 1.8 : అంతర్మధనం
స్టేషన్ లో తల వెనక్కి వాల్చుకొని పడుకొని వుంటే, ఇషా చెప్పిన మాటలు ఒక్కొక్కటిగా గుర్తు వస్తూ ఉన్నాయి. ఆదుర్దాగా పైకి లేచి చుట్టూ చూశాడు, అప్పటికే చీకట్లు కమ్మాయి, కారు తీసుకొని ఇంటికి వెళ్ళాడు. సడన్ గా క్రిష్ గుర్తు వచ్చాడు.
సుమారుగా ఇలాంటి చీకట్లోనే హాస్పిటల్ నుండి క్రిష్ కి ఇదే కారులో తీసుకొని వచ్చాడు.
అప్పటి సంభాషణ గుర్తుకు వచ్చింది.
కేశవ్ "రష్ ని ప్రేమించావా!"
క్రిష్ తల ఊపాడు.
కేశవ్ "ఎప్పటి నుండి..."
రెండు నిముషాల తర్వాత...
క్రిష్ "ఎప్పటి నుండో... చిన్నప్పుడు అనుకుంటా..."
కేశవ్ "మీ ఇద్దరూ ప్రేమించుకున్నారు అంటే అది నాకు గుండెల్లో పొడిసినట్టు ఉంది" అన్నాను.
క్రిష్ "ఎందుకు?"
కేశవ్ "ఎందుకు అంటావేంటి? మీ ఇద్దరూ నాకు రెండూ కళ్ళు లాగా... తనని చెల్లెలు లాగా.... నిన్ను తమ్ముడులా ఫీల్ అయ్యాను ఇన్ని రోజులు.... మీ ఇద్దరూ నా వెనక ప్రేమ కబుర్లు చెప్పుకుంటున్నారు అంటే అది మీరు నాకు చేసిన మోసం కాదా..." అన్నాను.
క్రిష్ "ఇక్కడ దించు"
కారు ఆపాను.
క్రిష్ "మేం ఎప్పుడు సీక్రెట్ గా చేయలేదు.... అందరి ముందునే ఉన్నాం"
కేశవ్ "మరి మీ ఇద్దరూ లవ్ లో ఉన్నారని నాకు ఎప్పుడు అనిపించలేదు.... నా ముందు ఎప్పుడు అలా లేరు కదరా..."
క్రిష్ "ఎందుకంటే నువ్వు కళ్ళు ఉన్న గుడ్డోడివి బావా..." అని నవ్వాడు.
నాకు కోపం వచ్చింది. కాని ఇంతలోనే కారు దిగి నడుచుకుంటూ వెళ్తున్నాడు.
కేశవ్ "ఎక్కడకు వెళ్తున్నావ్.... ఇది మీ రూమ్ కాదు కదా..."
క్రిష్ వెనక్కి తిరగకుండానే "నేను ఒకరికి ప్రామిస్ చేశాను" అని అరిచాడు.
కేశవ్ "కనీసం... థాంక్స్ చెప్పవా...... ఇంత హెల్ప్ చేశాను కదా..." అని అరిచాను.
క్రిష్ ముందుకు తిరిగి "థాంక్స్" అని వెనక్కి వెళ్ళిపోయాడు.
క్రిష్ చీకటిలో కలిసిపోయాడు.
రష్ అప్పటిలో చాలా ఇబ్బందుల్లో ఉంది, తనని ఎవరూ ఆదరించలేదు. కాని క్రిష్ ముందుకు వెళ్లి ఆమెను అక్కున చేర్చుకొని తాళి కట్టి పెళ్ళాన్ని చేసుకున్నాడు, తనకు తన బిడ్డకి ఒక ఇల్లు చేకూర్చాడు. అందుకోసం తన వాళ్ళతో దూరం అయ్యాడు, అయిన వాళ్ళతో కాని వాళ్లతో ఆమె కోసం గొడవ పడ్డాడు.
సంవత్సరం గడవక ముందే ఆమె పరిస్థితులు మెరుగు పడే సరికి అతడు కట్టిన తాళిని ఒక కాగితం మీద బరువుగా పెట్టి వెళ్ళిపోయింది.
ఆరు నెలలు గడిచాక ఆమె మళ్ళి కిడ్నాప్ అయితే క్రిష్ వెళ్లి రిస్క్ చేసి మరీ కాపాడాడు. జాగ్రత్త చెప్పి వెనక్కి తిరిగి వెళ్లిపోయాడు.
క్రిష్ బదులు నేను ఆ ప్లేస్ లో ఉంటే అలా చేసేవాడినా... అనే ఆలోచన వచ్చింది.
ఆలోచన రావడమే నా మనసు క్షణం కూడా ఆలస్యం చేయకుండా నీ వల్ల కాదు అని చెప్పేసింది.
క్రిష్ మొదట సిటీకి వచ్చినపుడు, కేశవ్ "సిటీకి ఎందుకు వచ్చావ్ రా.." అని అడిగితే... క్రిష్ "అమ్మాయిల కోసం" అని చెప్పాడు.
కేశవ్ కి క్రిష్ గురించి అతని యాటిట్యూడ్ గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడు నవ్వొచ్చింది.
పార్ట్ టైం చేశాడు, బిజినెస్ చేశాడు, ఇప్పుడు మంచి పొజిషన్ కి వచ్చాడు.
క్రిష్ బదులు నేను ఆ ప్లేస్ లో ఉంటే అలా చేసేవాడినా... అనే ఆలోచన వచ్చింది.
కచ్చితంగా కాదు, అనే మాట ఈ సారి కేశవ్ నోటి నుండి వచ్చేసింది.
సడన్ గా సుహాస్ గుర్తు వచ్చాడు, ఒక మామూలు సామాన్యుడు, ఒక మామూలు సాఫ్ట్ వేర్ ఇంజనీర్...
తన వైఫ్ ని ఎవరో స్పృహలో లేనపుడు రేప్ చేశాడని అది ఎంతటి వాడు అని కూడా చూడకుండా పగ తీర్చుకునే మార్గం వెతుక్కున్నాడు.
అలాగే ఆమెను సాదరంగా స్వీకరించాడు, అసలు అన్నింటికీ మించి అంతకు ముందు ఎలా ఉన్నాడో అలానే ప్రేమించాడు.
ఆఖరికి ఆమె సూ సైడ్ చేసుకొని చనిపోతే, ఒక మృగంలా మారి వాడిని వెంటాడుతున్నాడు.
సుహాస్ ప్లేస్ లో నేను ఉంటే ఇలా చేసేవాడినా.... అనే ఆలోచన వచ్చింది.
కేశవ్ నోటి నుండి "లేదు" అనే మాట మనసులో నుండి తన్నుకొస్తున్న బాధతో నిండిపోయింది.
కారుని రోడ్ మీద ఇంటికి వెళ్ళకుండా అటూ ఇటూ తిప్పుతూ ఉన్నాడు,
అనుకోకుండా ఒక ఇంటికి వచ్చాడు, అది ఏ ఇల్లో గుర్తుకు వచ్చింది, అనుకోకుండా కారు ఆపేశాడు.
కొద్ది సేపటికి ఆ ఇంట్లో నుండి ఆ పెద్దాయన వచ్చాడు. ఆ రౌడీలు ఈ పెద్దాయననే కంట్రోల్ లోకి తీసుకొని హత్య చేయించారు.
పెద్దాయన "ఇన్సుపెక్తర్ సాబ్... రండి సాబ్... " అంటూ తన చేయి పట్టుకొని ఇంట్లోకి తీసుకొని వెళ్ళాడు.
ఇంట్లో పెళ్ళికి వచ్చిన ఒక కూతురు, చదువుకుంటున్న ఒక కొడుకు ఉన్నారు.
కేశవ్ ఇంట్లోకి తీసుకొని వచ్చి "రేయ్, వెళ్లి ఒక గ్లాస్ మంచి నీళ్ళు తీసుకొని రా...." అన్నాడు.
కేశవ్ "అదేం వద్దండి... ఊరికే ఇటూ వచ్చాను... "
పెద్దాయన "పర్లేదు సర్... అప్పటి నుండి ఇక్కడ పెట్రోలింగ్ సెక్యూరిటీ ఆఫీసర్లు తెగ తిరుగుతున్నారు..." అన్నాడు.
కేశవ్ "ఎందుకు?"
పెద్దాయన నవ్వేసి "అందరూ నేనే హత్య చేశా అనుకుంటున్నారు" అని పెద్ద జోక్ లా చెప్పాడు.
ఆ పెద్దాయన భార్య మాత్రం అన్నింట్లో వేలు పెడుతూ ఉంటాడు అంటూ గొణుక్కుంటూ ఉంది.
"అక్కడ అంత మంది ఉంటే నీకేంటి అంత ఇది..."
"అలా అంటావ్ ఎంటే... మనం ఒకళ్ళని కాపాడితే మనల్ని ఇంకొకరు కాపాడుతారు... అదే సమాజం..."
"ఇప్పుడు చూడండి నువ్వే హత్య చేశావ్ అంటున్నారు"
పెద్దాయన మాత్రం తను చాలా గర్వంగా "అయినా మనల్ని కాపాడడానికి పోలిస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఉంది... అదీ ఇది కాదు అంటే సాబ్ ఉన్నారు" అన్నాడు.
కేశవ్ వాళ్ళతో మాములుగా మాట్లాడి, బయటకు వచ్చాడు, అతని వెనకే... ఆ పెద్దాయన కూడా వచ్చాడు.
పెద్దాయన "సాబ్..."
కేశవ్ "హుమ్మ్"
పెద్దాయన "మీకు చెబితే నమ్మరు... నిజానికి నేను అక్కడే ఉన్నా... ఎందుకో నాకు ఆ కుర్రాడిని వాళ్ళు పొడవడం చూడలేదు సర్... అప్పుడు... అప్పుడు... అతను చిటికే వేశాడు... ఆ తర్వాత ఎదో అయింది... నేను కళ్ళు తిరిగి పడిపోయాను... కళ్ళు తెరిచే సరికి ఆ అబ్బాయి నా ముందు చనిపోయి పడిఉన్నాడు" అని ఆ రోజు సంగతి చెప్పూకొచ్చాడు.
కేశవ్ "హుమ్మ్..."
పెద్దాయన "నేను ఎందుకు పడిపోయాను సర్... నాకేం రోగం లేదు... చిటికే వేయగానే..." అంటూ ఆగిపోయాడు.
కేశవ్ "అది... అది... మత్తు మందు"
పెద్దాయన "హా..." అని పెద్దగా అని "అయ్యుంటుంది... " అని అన్నాడు.
పక్కనే వచ్చిన అతని కొడుకు "మరి మా నాన్న సాక్ష్యం పనికి వస్తుందా సర్" అని అడిగాడు.
కేశవ్ ఆ కుర్రాడిని చూసి నవ్వుతూ "నువ్వు చదువుకో... మిగిలినవి నేను చూసుకుంటా" అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
కొద్ది దూరం వెళ్ళాక మళ్ళి బండి ఆపాడు.
ఈ సారి తన కంటికి సుహాస్ కాని, క్రిష్ కాని, ఇషా చెప్పిన మాటలు కాని గుర్తుకు రాలేదు.
ఆ పెద్దాయన చెప్పిన మాటలు మాత్రమే గుర్తుకు వచ్చాయి "మనల్ని కాపాడడానికి పోలిస్ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఉంది... అదీ ఇది కాదు అంటే సాబ్ ఉన్నారు"
కేశవ్ కారుని మరో వైపు టర్న్ తిప్పి ఒక ప్లేస్ కి వెళ్ళాడు.
అక్కడ...
అది ఒక బ్రోతల్...
"ఎవరూ కావాలి..." అంటూ కేశవ్ భుజం మీద చేయి వేశాడు ఒకతను.
అక్కడే ఉన్న ఒకమ్మాయి అతన్ని తోసేస్తూ "ఇన్సుపెక్టర్ గారు రా.."
అతను కూడా భయపడి... కేశవ్ ని ఫాలో అవుతూ, అతని కూడా వెళ్ళాడు.
"ఎవరూ కావాలి సర్.."
కేశవ్ లోపలకు వెళ్తూ చుట్టూ చూస్తూ ఉన్నాడు.
"ఎవరి కోసం వెతుకున్నారు సర్...."
కేశవ్ "డింపుల్..."
"సర్..."
కేశవ్ "డింపుల్..."
అతను అదోలా చూసి నవ్వుతూ "ఓహో... మంచి దాన్నే అడిగారు సర్... ఉండండి... పిలుచుకొని వస్తాను" అంటూ లోపలకు వెళ్ళాడు.
అతని వెంటే పతివ్రత వేషంలో చీర పవిటని చుట్టుకొని తల దించుకొని ఒద్దికగా ఒకమ్మాయి వచ్చి కేశవ్ ని చూడకుండానే తల దించుకునే నమస్కారం పెట్టి "నమస్కారం సర్" అంది.
కేశవ్ నవ్వుతూ "డింపుల్" అన్నాడు.
డింపుల్ తల పైకెత్తి "సర్" అని ఆశ్చర్యంగా చూసింది.
కేశవ్ "పదా...." అన్నాడు.
డింపుల్ నవ్వుకుంటూ కేశవ్ ని ఫాలో అయి బయటకు వచ్చి కేశవ్ కారు ఎక్కింది.
డింపుల్ డబ్బులు లెక్కపెట్టుకుంటూ ఉంది.
కేశవ్ "లెక్క సరిపోయిందా...."
డింపుల్, కేశవ్ వైపు అదోలా చూసి "ఒకటి తగ్గింది పుష్పా...." అంది.
కేశవ్ నవ్వేసి "గుద్ద పగుల్తుంది" అన్నాడు.
డింపుల్ కూడా నవ్వేసి "ఇంత డబ్బులు ఇచ్చేసి, నన్ను టేస్ట్ చేయవా... బావా... " అంటూ తన సళ్ళు చూపిస్తూ మీద పడి అడిగింది.
కేశవ్ కోపంగా "ముందు పని చూడు..." అన్నాడు.
డింపుల్ కారు దిగి తన ప్లేస్ లోకి వెళ్ళిపోయింది.
కేశవ్ ఆమెనే చూస్తూ ఉండగా ఆమె వెలుగులో నుండి చీకట్లలోకి వెళ్ళిపోయింది.
.