Thread Rating:
  • 7 Vote(s) - 2.14 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery RE: Revenge Bhaskar
#21
 #3
                అలా ఆ పెళ్లి లోకి ఒక్కొక్కరు గా వెళ్లిన వాళ్ళు, తలొక దిక్కు కి వెళ్లి, ఎవరికీ అనుమానం రాకుండా జనాలలో కలిసిపోసాగారు. మెల్లగా ఎవరిని అయినా పరిచయం చేసుకుని వాళ్ల ద్వారా ఈ పెళ్లి లో సర్వైవ్ అవ్వాలని అందరిలాగానే ప్లాన్ చేసాను 


ఎవరైనా అమాయకుడు కోసం ఎదురు చూస్తున్నాను. ఈ లోగా ఒక బొమ్మ కార్ వచ్చి నా కాలు కి తగిలింది. ఏదో ఆలోచిస్తూ, ఆ కార్ ని తన్నాను. మళ్ళీ వచ్చి తగిలింది. మళ్ళీ తన్నాను. ఈ లోపు ఒక కర్ర వచ్చి తగిలింది. ఏంట్రా అని చూస్తే, ఆ కార్ తో ఆడుకుంటున్న ఒక పిల్లాడు తన కార్ ని రెండు సార్లు తన్నినందుకు నన్ను ఆ కర్ర తో కొట్టాడు. 

నన్ను కొట్టినందుకు కోపం తో భాస్కర్ అతని బుగ్గ గిల్లాను. అంతే వాడు పెద్ద పెట్టున ఏడుపు మొదలు పెట్టేసి పరిగెత్తాడు. నేనేదో సాధించిన వాడిలాగా విజయ గర్వం తో అటు ఇటు తిరగడం మొదలు పెట్టా.. ఎవరికీ అనుమానం రాకూడదని ఏదో పనులు చేస్తున్నట్టు నటించసాగా..  అలా తిరిగిన నాకు ఆ బుడ్డోడు మళ్ళీ ఎదురు పడ్డాడు. ఏంట్రా అని నేను వాడి దగ్గరకి వెళ్లబోయేలోపు వాడు.. 

" నాన్నా.. వీడే నన్ను కొట్టింది"  అన్నాడు. ఒక్కసారి షాక్ అయిపోయా. పక్కనుండి ఒకడు వచ్చి. 

ఏరా నా కొడుకుని ఎందుకు కొట్టావ్. అని అడిగాడు. 

అది పెద్ద నేరం కాకపోయినా నేను బయటి వ్యక్తి ని అని తెలిస్తే, దొంగ అనుకుని కొట్టే ప్రమాదం ఉంది. అందుకని నేను పెళ్లి కొడుకు ఫ్రెండ్ ని అని చెప్పేశా. నేను పెళ్లి కొడుకు తండ్రి ని రా అన్నాడు. నా మైండ్ ఆఫ్. నేను దొరికిపోయాను. అని కాదు. 25 సంవత్సరాల కొడుకు కి పెళ్లి చేస్తూ, ఈ వయసు లో ఈ 5 సంవత్సరాల పిల్లోడిని ఎలా ప్రొడ్యూస్ చేశాడా అని.  

ఎలా కవర్ చేయాలో తెలియలేదు. ఆయనకి చిన్న జర్క్ ఇచ్చి అక్కడ నుండి తప్పించుకుని పరిగెత్తాను. ఆయన కూడా గట్టిగా అరిస్తే పెళ్లి లో అల్లరి అయిపోతుంది అనుకున్నాడో ఏమో. ఒకళ్ళిద్దరికి చెప్పి వెతకమన్నట్టు గా చెప్పి పంపాడు. అందరూ అన్ని వైపుల నుండి వెతుకుతున్నారు. నాకు ఏం చేయాలో తెలియలేదు. ముందు ఏదైనా మూలన రూమ్ లోకి పోయి ఉంటే, వాళ్ళు కాసేపాగి పెళ్లి హడావిడి లో ఉండగా తప్పించుకోవచ్చు అనుకుని, ఆ ఇంట్లో ఒక మూల కి వెళ్ళాను. అక్కడేదో స్టోర్ రూమ్ లా ఉంటే అందులోకి దూరాను. అక్కడ లైటింగ్ చాలా తక్కువ ఉంది. అందుకని అదే సేఫ్ ప్లేస్ అనుకుని ఆ గది లోకి దూరాను. తలుపులు వేసేశా. వెలుతురు లో నుండి చీకటి లోకి వెళ్లిన నాకు కాసేపు ఏమి సరిగా కనిపించలేదు. అలా అని అదేమి కటిక చీకటి కాదు. వెంటిలేటర్ నుండి వెలుతురు వస్తోంది. కానీ ఆ వెలుతురు కి నా కళ్ళు అలవాటు పడాలి అని ఎదురుచూస్తున్నా... 

మెల్లగా వెలుతురు కి అనువుగా నా కంటి చూపు ఆ గాడి లో పరచుకుంటూ ఉండగా.. అక్కడ ఒకరు కుర్చీ లో నిద్ర పోతున్నట్టు గా అనిపించింది. ముందు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను. కానీ వెంటనే ఈ ఫ్యామిలి వాళ్ళు అయితే ఇలా స్టోర్ రూమ్ లో  అది కూడా కుర్చీ లో పడుకోరు కదా అనిపించింది. వెంటనే ఎవరయినా చచ్చిపోతే ఇక్కడ కూర్చోబెట్టి సైలెంట్ గా పెళ్లి చేస్తున్నారా... అని కూడా అనిపించింది. ఆ 10 సెకండ్ గ్యాప్ లో ఇన్ని ఆలోచనలు వస్తూ ఉండగా... పూర్తిగా కళ్ళు స్వాధీనం లోకి వచ్చాక తెలిసింది అక్కడ పడుకుంది ఒక అందమైన ప్రౌఢ. 

బ్రహ్మ, రవి వర్మ కి ఇవ్వక ముందు తన దగ్గర ఉన్న చిత్ర కళ తో ఈ శిల్పాన్ని గీసి తనివి తీరా చూసుకుని కొంత కాలం క్రితం భూమి పైకి వదిలాడా అన్నట్టు చక్కని చెక్కిన శిల్పం లా ఉన్న ఈమె ఉన్న స్థితి చూసి ఈమె నాకు అంత ప్రమాదకారి కాదు. బహుశా మనసుకు అయ్యుండొచ్చు అనుకుని మెల్లగా తనని తట్టి లేపాను.
[+] 8 users Like nenu naa paityam's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: Revenge Bhaskar - by nenu naa paityam - 30-11-2024, 03:47 PM
RE: hello world - by 3sivaram - 30-11-2024, 07:42 PM
RE: hello world - by nenu naa paityam - 30-11-2024, 09:45 PM
RE: hello world - by nenu naa paityam - 30-11-2024, 10:00 PM
RE: Revenge Bhaskar - by nenu naa paityam - 01-12-2024, 07:39 AM
RE: Revenge Bhaskar - by undeleteddata - 01-12-2024, 02:23 PM
RE: Revenge Bhaskar - by nenu naa paityam - 01-12-2024, 07:20 PM
RE: Revenge Bhaskar - by undeleteddata - 05-12-2024, 12:58 AM
RE: RE: Revenge Bhaskar - by nenu naa paityam - 01-12-2024, 07:44 PM
RE: RE: Revenge Bhaskar - by krantikumar - 01-12-2024, 08:35 PM
RE: RE: Revenge Bhaskar - by sri7869 - 03-12-2024, 06:34 PM
RE: RE: Revenge Bhaskar - by nenu naa paityam - 12-12-2024, 01:21 PM
RE: RE: Revenge Bhaskar - by BR0304 - 12-12-2024, 04:23 PM
RE: RE: Revenge Bhaskar - by Uday - 13-12-2024, 03:39 PM
RE: RE: Revenge Bhaskar - by nenu naa paityam - 13-12-2024, 07:36 PM
RE: RE: Revenge Bhaskar - by Uday - 14-12-2024, 01:14 PM
RE: RE: Revenge Bhaskar - by bobby - 14-12-2024, 06:47 PM
RE: RE: Revenge Bhaskar - by Manoj1 - 14-12-2024, 10:23 PM
RE: RE: Revenge Bhaskar - by Paty@123 - 15-12-2024, 12:01 PM
RE: RE: Revenge Bhaskar - by sri7869 - 19-12-2024, 12:34 PM
RE: RE: Revenge Bhaskar - by nenu naa paityam - 20-12-2024, 07:44 PM
RE: RE: Revenge Bhaskar - by nenu naa paityam - 20-12-2024, 07:47 PM
RE: RE: Revenge Bhaskar - by Uday - 20-12-2024, 08:10 PM
RE: RE: Revenge Bhaskar - by K.rahul - 20-12-2024, 09:12 PM
RE: RE: Revenge Bhaskar - by BR0304 - 20-12-2024, 09:36 PM
RE: RE: Revenge Bhaskar - by sri7869 - Yesterday, 09:00 AM
RE: RE: Revenge Bhaskar - by nenu naa paityam - Yesterday, 05:42 PM
RE: RE: Revenge Bhaskar - by Uday - Yesterday, 10:18 PM



Users browsing this thread: nagu65595, 3 Guest(s)