19-12-2024, 08:59 PM
భాస్కర్ ఒక గులాబి కొని రోడ్ పక్కనే కూర్చొని పువ్వు రేకులను ఒక్కొక్కటి ఒక్కటి తీసేస్తూ... యస్... నో... అంటూ చెప్పుకుంటూ పోతున్నాడు, ఒక గులాబి అయిపోగానే డస్ట్ బిన్ లో పడేసి మరో పువ్వు కొని అదే పని చేస్తూ ఉన్నాడు. యస్ వచ్చినా నో వచ్చినా అతని మనసు మాత్రం ఒప్పుకోవడం లేదు.
అతని ప్రశ్నకి సమాధానం ఏం కావాలో అతనికే అర్ధం కావడం లేదు.
పూలు అమ్మే కుర్రాడు "ఏందీ? సాబ్? ఏందీ సమస్యా... లవ్ ప్రాబ్లమా..."
భాస్కర్ తల పైకెత్తి అతడిని చూసి మోహంలో వెలుగు లేని ఒక నవ్వు నవ్వాడు.
పూలు అమ్మే కుర్రాడు "ఏమయింది సాబ్..." అన్నాడు.
భాస్కర్ తల అడ్డంగా ఊపాడు.
పూలు అమ్మే కుర్రాడు "ఏం పేరు సర్..."
భాస్కర్ "భానూ" అన్నాడు.
పూలు అమ్మే కుర్రాడు "పేరు మంచిగా ఉంది.... ఇంతకీ 18+ కదా..."
భాస్కర్ "3 సంవత్సరాలు... వాళ్ళ అమ్మ పేరు సుష్మ" అన్నాడు.
పూలు అమ్మే కుర్రాడు, గుండెల మీద చేయి వేసుకొని "హమ్మా..." అనుకోని "మీ కూతురా..." అన్నాడు.
భాస్కర్ "సుష్మకి కూడా నేనంటే ఇష్టమే రా... రేపు మా పెళ్లి కూడా.... కాని భానూ వాళ్ళ నాన్న వచ్చాడు... అప్పటి వరకు నన్ను డాడీ డాడీ అనే భాను అతన్ని నాన్న అంటూ అతని వెంట వెళ్లిపోయింది... పాపని తీసుకు రావడం కోసం సుష్మ కూడా వెళ్ళింది..." అని ఆగిపోయి "నాకు భయంగా ఉంది రా...." అన్నాడు.
పూలు అమ్మే కుర్రాడు, ఎవరో పూల కోసం పిలిస్తే వెళ్లిపోయాడు.
భాస్కర్ ఫోన్ మోగింది, సుష్మా కాలింగ్....
ఫోన్ ఎత్తాలంటేనే భయం భయంగా ఉంది.
భాస్కర్ దైర్యం చేసి ఫోన్ ఎత్తాడు....
భాను వాళ్ళ నాన్న వినోద్...
సుష్మ ఇంట్లో గొడవ గొడవ చేస్తూ... సుష్మ కాళ్ళు పట్టుకుంటూ ఉన్నాడు.
పక్కనే కొంచెం దూరంలో భానూ ఏడుస్తూ ఉంది.
భాస్కర్ "హలో...." అన్నాడు.
సుష్మ "భాస్కర్.... నేను సుష్మని మాట్లాడుతున్నాను"
భాస్కర్ "చెప్పూ"
.
.
.
.
.