Thread Rating:
  • 9 Vote(s) - 1.78 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller అభిమాన సంఘం
#9
CHAPTER - 1
ఆరంభం
తెల్లవారి కొద్ది కొద్దిగా ఎండ రావడం మొదలైంది. అతను తన చేతి గడియారాన్ని చూసుకున్నాడు. అతనున్న కొండ చివరినుండి చూస్తే నగరం మొత్తం అద్భుతంగా కనబడుతుంది.
అతను అతని స్నేహితుడు ఇద్దరు కొండ శిఖరం మీద బోర్లా పడుకుని, తాము దగ్గరలో వున్నఇళ్లలోని వారికి కనిపించకుండా పొదలల్లో మాటువేసి వున్నారు. ఇద్దరి చేతుల్లో బైనాక్యూలర్స్ వున్నాయి. ఇద్దరు చాలా జాగ్రత్తగా కింద వున్న ఒక విల్లా ని, విల్లా చుట్టుపక్కల వున్న పరిసరాల్ని గమనిస్తున్నారు.
ఆ విల్లా కి బయట ముందుగా ఒక సెక్యూరిటీ గేట్ వుంది. కొద్దిగా ముందుకి వెళితే అక్కడ అందమైన స్విమ్మింగ్ పూల్ వుంది. స్విమ్మింగ్ పూల్ కి చుట్టుప్రక్కల కొన్ని ఫౌంటెన్ లు వున్నాయి.
ఇప్పుడు, మరోసారి, అతని బైనాక్యూలర్స్ ఆమె ఎస్టేట్ లోపల పరిశీలిస్తూ, చాలా దిగువన ఉన్న రహదారిపై దృష్టి సారించింది. భారీ చెట్ల సమూహాలు మరియు ఒక పండ్ల తోటల మధ్య లాక్ చేయబడిన ద్వారం నుండి అంతకు మించి క్రమంగా పెరుగుతున్న రాజభవనం వరకు వెళ్ళే వాకిలి. అతనిని ఇది ఎప్పటిలాగే ఆకట్టుకుంది. ఇతర సమయాల్లో మరియు ఇతర ప్రదేశాలలో, రాజులు మరియు రాణులు మాత్రమే ఇంత వైభవంగా నివసించేవారు. ఈ సమయంలో మరియు ఈ ప్రదేశంలో, గొప్ప ఇళ్ళు మరియు ఆధునిక రాజభవనాలు చాలా ధనవంతులు మరియు చాలా ప్రసిద్ధుల కోసం కేటాయించబడ్డాయి. అతనికి ధనవంతుల గురించి తెలియదు కానీ ఈ ఎస్టేట్ యొక్క అందగత్తె కంటే మరెవరూ ఎక్కువ ప్రసిద్ధి చెందలేదని అతనికి ఖచ్చితంగా తెలుసు.
అతను ఊపిరి పీల్చుకోకుండా చూస్తూ వేచి ఉన్నాడు.
అకస్మాత్తుగా అతని దృష్టిపధంలోకి ఎవరో వచ్చారు. అతను తన ఖాళీగా వున్న రెండో చేత్తో పక్కనే వున్న అతని స్నేహితునితో "రాహుల్, నేను చెప్పింది తన గురించే. అక్కడున్న చెట్ల మధ్యనుండి నడుస్తూ వస్తుంది. చూడు" అని సంభ్రమంగా చెప్పాడు.
అతని స్నేహితుడు కొద్దిగా జరిగి తన దృష్టిని ఆమె వైపు త్రిప్పడం అతనికి తెలిసింది. "అవును, ఆమెనే. కరెక్ట్ సమయానికి వచ్చింది" అని అతను చెప్పాడు.
తర్వాత వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడుకోకుండా జాగ్రత్తగా, ఏకాగ్రతతో, ఆరాధనతో ఆమె నడుచుకుంటూ చెట్ల మధ్యలో నుండి వస్తూ గేట్ వరకు వెళ్లడాన్ని గమనిస్తున్నారు. ఆమె తో బాటు ఒక చిన్న పోమేరియాన్ కుక్కపిల్ల కాళ్ళ చుట్టూ తిరుగుతూ ఆమె వెంటే నడుస్తుంది. ఆమె గేట్ వరకు వచ్చాక కుక్కపిల్లని ఎత్తుకొని, దాన్ని ముద్దు చేస్తూ తిరిగి దాన్ని కింద దించి మళ్ళీ చెట్ల మధ్యగా నడుస్తూ, రాజమహల్ లా వున్న భవనంలోకి వెళ్లి అదృశ్యం అయిపొయింది.
శరత్ తన బైనాక్యూలర్స్ క్రిందికి దించి, తన ప్రక్కన చుట్టి, తన వెడల్పు బెల్టుకు జతచేయబడిన పాకెట్ లో వాటిని జాగ్రత్తగా ప్యాక్ చేసాడు. ఈ పని కోసం అతనికి మళ్ళీ వాటి అవసరం ఉండదని అతనికి తెలుసు. సరిగ్గా ఒక నెల క్రితం ఈ జాగరణ ప్రారంభమైంది. అతను ఈ ఖచ్చితమైన పరిశీలన స్థలాన్ని ఎంచుకుని, మొదట మే 16 ఉదయం దానిని ఉపయోగించాడు. అది జూన్ 17వ తేదీ ఉదయం. అతను ఇక్కడ ఎక్కువగా ఒంటరిగా వచ్చాడు. కానీ అప్పుడప్పుడు తన సహచరుడు రాహుల్ తో కలిసి, గత ముప్పై రెండు రోజులలో ఇరవై నాలుగు రోజులు ఆమె ఉదయపు నడకను చూస్తూ, సమయాన్ని నిర్ణయించేవాడు. ఇదే చివరిసారి అవుతుంది.
తన వంటికి అంటుకున్న దుమ్ము ధూళిని వదిలించుకుంటూ లేస్తున్న రాహుల్ వైపు చూసాడు.
"ఏమంటావ్ ? అంతా అనుకున్న ప్రకారమే కదా?" అన్నాడు శరత్
"అవును. ఇప్పుడిక మన పధకాన్ని అమలు చెయ్యొచ్చు" అన్నాడు రాహుల్. అతని ముఖం ఒకవిధమైన ఆనందం మరియు కోరికతో మెరుస్తుంది.
అతని వయస్సు శరత్ కన్నా చాలా ఎక్కువే. శారీరకం గా కూడా రాహుల్ చాలా బలవంతుడు. శరత్ కి తెలివితేటలు అమితంగా ఉంటే, రాహుల్ కి బలం తప్ప బుర్ర పెద్దగా లేదు. రాహుల్ ఆరు అడుగుల ఎత్తుతో, కండలు తిరిగిన ఆకారంతో భారీగా ఉంటాడు. క్రమం తప్పకుండ వ్యాయామాలు చేస్తుంటాడు. వంట్లో ఎక్కడా కొవ్వు ఉన్నట్లు అగుపించడు. అతని ముందు శరత్ డిగ్రీ చదివే కుర్రోడిలా కనిపిస్తాడు. శరత్ అయిదు అడుగుల ఎనిమిది అంగుళాల ఎత్తు, బక్క పలచగా ఉంటాడు. రాహుల్ ఒక్క చేత్తో సులభంగా శరత్ ని గాల్లోకి ఎత్తగలడు.  
"మనం అనుకున్న పధకాన్ని రేపు మొదలుపెడదాం" అన్నాడు రాహుల్.
"ఇంకా మనం ఈ దోబూచులాటలు, గమనించడాలు ఆపేద్దాం. ఈ చూడటాలు, మాట్లాడటాలు ఈరోజుతో ఆఖరు. ఇక నేరుగా ఆక్షన్ లోకి దిగిపోదాం. ఇక ఈ నిమిషం నుండి మనం మన పధకానికి కట్టుబడిపోయాం. ఇక వెనక్కి తిరిగే ప్రసక్తే లేదు. సరేనా" అన్నాడు రాహుల్ తన కార్ వైపు నడుస్తూ శరత్ తో.
"సరే" అన్నాడు శరత్.
ఇద్దరు కార్ వైపు అడుగులు వేస్తుండగా శరత్ తన పధకం లో వున్నసవాళ్ళను, వాస్తవాన్నిఅంచనా వేయడానికి ప్రయత్నించాడు. ఈ పధకం తన మనసులో ఎన్నో నెలలుగా వుంది. అది ఒక కలలా, ఒక కోరికలా, ఒక ధ్యేయం లా నిర్మించుకుంటూ వచ్చాడు. అవన్నీ ఇప్పుడు ఇంకో ఇరవైనాలుగు గంటల్లో తీరబోతున్నాయా అని తనకే నమ్మశక్యంగా అనిపించడంలేదు.  
మరోసారి, నమ్మడానికి, అతను ఇటీవలి రోజుల్లో తరచుగా చేసిన పనిని చేశాడు. మళ్ళీ మొదటినుండి తాను తన పధకాన్ని ఎలా ప్లాన్ చేస్తూ వచ్చాడో అన్ని దశల వారీగా మళ్ళీ గుర్తుతెచ్చుకున్నాడు. మొత్తం ప్రక్రియ, ఫాంటసీ త్వరలో వాస్తవంగా మార్చబడుతుంది, దశలవారీగా.
తన పధకం మొత్తం ఎప్పటినుండో ఆలోచనల్లో వున్నా, అది అనుకోకుండా చివరి నెలన్నర లో సరైన దిశలో ప్రారంభించడానికి అతను తరుచుగా వెళ్లే ఒక బార్ వేదిక అయింది. శరత్ అడుగులు వేస్తూ రాహుల్ వైపు చూసి ఇతనికి అదంతా గుర్తు ఉండి వుంటుందా అనుకున్నాడు.
                                                                        **********
[+] 11 users Like anaamika's post
Like Reply


Messages In This Thread
అభిమాన సంఘం - by anaamika - 18-12-2024, 10:40 PM
RE: అభిమాన సంఘం - by Haran000 - 18-12-2024, 10:54 PM
RE: అభిమాన సంఘం - by Manoj1 - 19-12-2024, 01:41 AM
RE: అభిమాన సంఘం - by Deepika - 19-12-2024, 02:09 AM
RE: అభిమాన సంఘం - by Uday - 19-12-2024, 12:20 PM
RE: అభిమాన సంఘం - by sri7869 - 19-12-2024, 01:51 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 19-12-2024, 08:53 PM
RE: అభిమాన సంఘం - by sri7869 - 19-12-2024, 09:15 PM
RE: అభిమాన సంఘం - by Haran000 - 19-12-2024, 09:37 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 19-12-2024, 09:58 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 21-12-2024, 02:49 PM
RE: అభిమాన సంఘం - by sri7869 - 21-12-2024, 02:51 PM
RE: అభిమాన సంఘం - by Uday - 21-12-2024, 03:48 PM
RE: అభిమాన సంఘం - by ramd420 - 21-12-2024, 04:26 PM
RE: అభిమాన సంఘం - by BR0304 - 21-12-2024, 05:43 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 23-12-2024, 12:40 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 24-12-2024, 08:51 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 25-12-2024, 02:50 PM
RE: అభిమాన సంఘం - by Uday - 25-12-2024, 08:21 PM
RE: అభిమాన సంఘం - by Nani666 - 26-12-2024, 08:34 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 26-12-2024, 11:56 PM
RE: అభిమాన సంఘం - by ramd420 - 27-12-2024, 06:58 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 27-12-2024, 03:54 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 27-12-2024, 11:02 PM
RE: అభిమాన సంఘం - by hijames - 28-12-2024, 12:06 AM
RE: అభిమాన సంఘం - by ramd420 - 28-12-2024, 06:52 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 29-12-2024, 01:53 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 29-12-2024, 10:34 PM
RE: అభిమాన సంఘం - by anaamika - 31-12-2024, 12:11 AM
RE: అభిమాన సంఘం - by anaamika - 01-01-2025, 12:26 PM



Users browsing this thread: James Bond 007, 14 Guest(s)