17-12-2024, 09:48 AM
(16-12-2024, 09:35 PM)sshamdan96 Wrote: Chapter – 13
'సరే. ఒక్క సారి ఇంట్లో మాట్లాడి సైన్ చేస్తాము,' అన్నాను.
'సరే. కోర్ట్ లో డేట్ తీసుకోమని లాయరుకి చెప్పాను. అప్పుడు నువ్వు కోర్ట్ కి రావాల్సి ఉంటుంది. మా వాడు కూడా వస్తాడు అమెరికా నుంచి,' అంది.
సరే అని బయలుదేరాము. అను వెనక్కి తిరిగి, 'నాకు సహాయం చేస్తే మీకు ఇబ్బంది కాదా?' అని అడిగింది.
ఆవిడ నవ్వింది. 'ఈ మంచితనం చూసే తల్లి నీకు అన్యాయం జరగకూడదు అని నేను ఇలా చేస్తున్నాను,' అంది.
నా వైపు తిరిగి, 'అది బంగారు తల్లి. జాగ్రత్తగా చుస్కో,' అని చెప్పి వెళ్ళిపోయింది.
నేను అను మొహామొహాలు చూసుకున్నాము. మాకు అర్థం కాలేదు. 'దా అను,' అని చెయ్యి పట్టుకుని బయటకి తీసుకెళ్ళాను.
ఇంకా ఉంది
SS గారూ, ఇప్పటివరకు చాలా అద్భుతంగా కథ, కథనం నడిపిస్తున్నారు. ఇలాగే కొనసాగించండి.
ఇలాంటి కథల్లో సున్నిత శృంగారం బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. ముందు ముందు వచ్చే శృంగారాన్ని మీరేలా నడిపిస్తారో అది మీ ఇష్టం - కవి (రచయిత) నిరంకుశుడు.
ఇక పోతే మీరు Post చేసే Frequency గురించి - మీ వ్యక్తిగత సౌలభ్యం తరువాతే ఏదైనా. దీనిపైన మీ Stand ని చాలా Clear గా చెప్పారు. అభినందనలు.