16-12-2024, 08:03 PM
(16-12-2024, 05:23 PM)sshamdan96 Wrote: నమస్కారం,
నాకు ఉన్న కమిట్మెంట్స్ వల్ల నేను వారానికి రెండు మహా అయితే మూడు updates మాత్రమే ఇవ్వగలను. ఎప్పుడైనా వీలుంటే ఎక్కువ ఇస్తాను.
కొంతమంది నాకు డైరెక్ట్ మెసేజ్ చేసి పొద్దున్నే కావాలి, రాత్రికి కావాలి అని అడుగుతున్నారు. చిరాకు వస్తున్నపటికీ మర్యాదగానే చెప్తున్నాను. కానీ అదేమీ పద్ధతి? అప్డేట్ కావాలి అని టైం పెట్టడానికి నేను ఎమన్నా ఎవరి కింద అయినా పని చేస్తున్నానా? నేనే కాదు ఏ రచయితకి అయినా సరే, ఆలా టైం పెట్టకూడదు. అదే మెసేజ్ కథ నచ్చితే ఏమి నచ్చిందో, ఎందుకు నచ్చింది పెట్టండి. చాలా హాయిగా అనిపిస్తుంది మనసుకి.
మీరు అప్డేట్ అడుగుతున్నారు అంటే అది ఒక విధంగా చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఆహా నా కథ ఇంత మందికి నచ్చింది అని ఆనందం ఉంటుంది. అప్డేట్ అడగండి కానీ స్పాం చేయకండి.
ఇంకొందరు అయితే 'ఈ స్టోరీ కూడా పోయింది, అటక ఎక్కింది, డెడ్' అనే కామెంట్స్ పెడుతున్నారు. అలాంటివాటిని స్పాం కింద రిపోర్ట్ చెయ్యాలి అనిపిస్తుంది. ఇదొక ఫ్రీ ప్లాట్ఫారం. ఒక ఊహాలోకంలోకి తీసుకెళ్ల సాధనం. మర్యాదగా ఉందాము. ఆర్డర్ వెయ్యకండి. అవమాన పడకండి.
నాది ఉన్నది ఉన్నట్టు చెప్పే మనస్తత్వం. [b]అక్కడికీ మా ఇంట్లో ఒకరు కాలం చేసారు అన్న మాట కూడా చెప్పాను. పర్సనల్ లైఫ్ అనేది ఉండదా? నాకు అయితే ఉంది. నేను ఇక్కడే బ్రతకను. నాకు తెలిసి ఎవరిని నొప్పించలేద్దు. నోచుకున్న వారైతే ఈ మెసేజ్ మీకే అయి ఉంటుంది. దయచేసి సరిదిద్దుకోగలరు.[/b]
మనసున మనసై త్వరలో లక్ష వ్యూస్ దాటబోతోంది. చదువుతూ నన్ను ఫాలో అవుతున్న వారికి నా రచనలని ఆదరిస్తున్న వారికీ ధన్యవాదాలు. త్వరలో రెండో కథ మొదటి చాప్టర్ ప్రచురిస్తాను. పార్లల్ గా రెండు నడుస్తాయి.
Yours,
రాజమార్గంలో గజరాజు వెళ్తుంటే
గ్రామ సింహాలు
నిజం సింహాలు అనుకొని
మొరుగుతాయి
సర్వేజనా సుఖినోభవంతు...