10-12-2024, 08:31 AM
(09-12-2024, 06:27 PM)sshamdan96 Wrote: Chapter –10Very very good nice story,just iwould have missed, because of title I studied
రాత్రి తొమ్మిది దాటింది. బయటకి వెళ్లి తిరిగి రావడం వల్ల ఏమో, నాని గాడు త్వరగా నిద్రపోయాడు. నేను అను ఇద్దరం బాల్కనీ లో కుర్చీలు వేసుకుని కూర్చున్నాము. చల్లటి గాలి వస్తోంది.
'ఎక్కడి నుంచి మొదలెట్టాలో ఎలా చెప్పాలో తెలియట్లేదు రా. ఇప్పటి వరకు నా మనసులోనే దాచుకున్న విషయాలు ఇవన్నీ,' అంది.
'అను. నువ్వు నాకు ఏమి చెప్పాల్సిన అవసరం లేదు. నీ జీవితం నీ ఇష్టం. కానీ ఒకటి చెప్తాను. నువ్వు అన్ని విషయాలు నాకు చెప్తే వచ్చే నష్టం లేదు. కానీ ఎవరికీ చెప్పకపోవడం వల్ల వచ్చే ప్రయోజనం ఉందా? అది ఆలోచించుకో. నీ మనసుకి ఏది అనిపిస్తే అది చెయ్యి,' అన్నాను.
ఒక అయిదు నిమిషాలు సైలెంట్ గా ఉంది. గాలి వేగం పెరిగింది. పెరిగిన వేగానికి గుయ్య్ అని సౌండ్ కూడా వస్తోంది. విశాలమైన బాల్కనీ. కార్నర్ ఫ్లాట్ కావడం వల్ల మంచి వ్యూ కూడా ఉంది. అను ఆలోచనలో ఉంది. నా మనసులో ఎదో తెలియని వెలితి, ఆరాటం, అసంతృప్తి ఉన్నాయి.
'అసలు నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు,' అంది.
నా పరధ్యానం నుంచి వాస్తవంలోకి వచ్చాను. 'ఏంటి?' అన్నాను.
'నేను ఇంజనీరింగ్ చేసే టైం లో నా క్లాసుమేట్ ఒకతను ఉండేవాడు. మొదట అంత పరిచయం లేకపోయినా, తరువాత మా మధ్య స్నేహం ఏర్పడింది. స్నేహం ప్రేమగా మారింది. చదువు అయిపోయాక ఇద్దరికీ ఉద్యోగాలు కూడా వచ్చేసాయి,' అంటూ చిన్న బ్రేక్ ఇచ్చింది.
అను చెప్తున్న విషయాలు చాలా సీరియస్ గా వింటున్నాను. ఇదంతా ఎవరికీ చెప్పలేదు. నాకు చెప్తోంది. అంటే తనకి నేను చాలా ముఖ్యమైన మనిషిని. అందుకే ఏది మిస్ కాకుండా వింటున్నాను.
'ఎవరతను?' అని అడిగాను. మా ఊరిలో నాకు తెలిసిన వారా కాదా అని నాకు కుతూహలం.
'మన ఊరు కాదు. నీకు తెలీదు. హాస్టల్ లో ఉండే వాడు,' అంది. నాతో మాట్లాడుతున్న అను అలా దూరంగా సూన్యంలోకి చూస్తోంది.
'హ్మ్మ్,' అని మళ్ళీ కుర్చీలో వెనక్కి అనుకున్నాను. నేను అలాగే దూరంగా ఉన్న లైట్లు, బిల్డింగ్లు, వాహనాలు చూస్తున్నాను.
'జాబ్ వచ్చి తాను పూణే వెళ్ళాడు. నేను బెంగళూరు వచ్చాను. ఆటను నన్ను కలవడానికి మూడు రెండు నెలలకి ఒకసారి బెంగళూరు వచ్చేవాడు. ఒక రెండు మూడు రోజులు ఇక్కడే ఉండేవాడు,' అని కొంచం సొంకోచించింది. 'ఆ సమయంలో తాను హోటల్ రూమ్ తీసుకుని ఉండేవాడు. నన్ను కూడా రమ్మనే వాడు. కాకపోతే అలా వెళ్లి ఏదన్న సమస్యలలో చిక్కుకుంటే కష్టం అని నేను వెళ్లేదాన్ని కాదు. దానికి అతనికి చాలా కోపం వచ్చింది. నీకోసం నేను ఇంత దూరం వస్తే నువ్వు నాకోసం రూంకి కూడా రావా అని కోప్పడేవాడు,' అంది.
నాకు జవాబు తెలిసినప్పటికీ అడిగాను, ' ఎందుకు వెళ్ళలేదు?'
'వెళ్తే ఏమి జరుగుతుందో అని భయం. యవ్వనంలో ఉన్న వాళ్ళకి ఉండే కోరికలు నీకు చెప్పక్కర్లేదు. వెళ్ళాక అదుపు తప్పితే? అదీ కాక బెంగళూరు ఓయో రూమ్స్ లో తరచూ సెక్యూరిటీ ఆఫీసర్లు రైడింగ్ చేస్తారు. హోటల్ కి వెళ్లిన పెళ్లి కానీ అమ్మాయిలు ఎవరైనా అదోలా చీప్ గా చూస్తారు. నా వల్ల అమ్మ నాన్నకి ఎటువంటి చెడ్డ పేరు రాకూడదు అని ఎప్పుడు వెళ్లేదాన్ని కాదు,' అంది.
ఈ సమాజంలో మనకి తేలింది తెలియకుండా ఎన్నో తప్పుడు పద్ధతులు ఉన్నాయి. అందులో ఇలా ఆడవారిని అర్థం పర్థం లేకుండా నిందించే తత్వం ఒకటి. 'మరి ఏమైంది? అతనెక్కడ ఉన్నాడు? అత్తయ్య మావయ్య కి తెలుసా?' అని అడిగాను.
'అలా కొన్నాళ్ళు జరిగాక అతను పూణే నుంచి రావడం మానేశాడు. 'హోటల్ లో ఉండే దానికి డబ్బులు ఎందుకు దండగ' అని వెటకారంగా మాట్లాడేవాడు. ప్రేమలో ఉన్న అబ్బాయికి ఆ ఆశ ఉండటం తప్పు కాదు. అతనికి కోరుకున్నది ఇవ్వలేనిది నేను. నాదే తప్పు అనుకుని నేను తిరిగి ఏమి అనేదాన్ని కాదు,' అంది.
నాకు ఎంత ఆలోచించినా అను తప్పు ఉందో లేదో పక్కన పెడితే, అతను ఒక అమ్మాయిని అలా బలవంత పెట్టడం సబబు కాదు అనిపించింది. కానీ పైకి అనకుండా వింటున్నాను.
'అలా కొన్నాళ్ళు గడిచాక అతనే అన్నాడు. మనము ఇలా లాంగ్ డిస్టెన్స్ లో ఏమి చేయలేము. ఉద్యోగాలు బానే ఉన్నాయి కదా. ఇంట్లో వారికి చెప్పి పెళ్లి చేసుకుందాము అన్నాడు. నేను ఎగిరి గంతు వేశాను అనుకో. కాకపోతే అమ్మ నాన్న కి చెప్పడానికి భయం వేసింది,' అంది.
'అత్తయ్య మావయ్య నేను ఏమి అంటారు అను? నువ్వు వాళ్ళ గారాల పట్టివి,' అన్నాను.
అను చిన్నగా నవ్వింది. 'అవును. కానీ నా బుర్రకి ఏవేవో ఆలోచనలు వచ్చాయి అప్పుడు. నన్ను గుడిమెట్లమీద వదిలి వెళ్ళిపోతే తెచ్చిపెంచుకున్న మహానుభావులు. అలాంటి వారి అనుమతి లేకుండా ఒక అబ్బాయిని ప్రేమించడం తప్పు అనిపించింది. కానీ మనసు మాట వినలేదు. ప్రేమలో పడ్డాను. పడ్డాక అది వారికి చెప్పే ధైర్యం రాలేదు,' అంది.
నేను తలా ఊపాను. బాడ్ టైం అంతే, అనుకున్నాను.
'ఆ విషయం అతనికి చెప్పాను. దానికి అతను ఒక ఐడియా ఇచ్చాడు. ముందు వాళ్ల ఇంట్లో చెప్తాను అని. అలా చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ద్వారా మన ఇంట్లో పెద్దవాళ్ళని అప్రోచ్ అవ్వాలి అని,' అంది.
'మరేమైంది?' అని అడిగాను ఆతృతగా.
'అతని ఇంట్లో వారు ఒప్పుకోలేదు. ఊరు పేరు లేని దాన్ని చేసుకుని ఏమి సుఖపడతావు. నీకు మంచి అమెరికా సంబంధం వచ్చింది అని చెప్పి అతన్ని మార్చేశారు,' అంది. అను మొహం లో చలనం లేదు.
'అలా ఎలా మనసు మార్చుకుంటాడు? ప్రేమించిన మనిషిని అలా ఎలా వదిలేస్తాడు?' అని అడిగాను.
'ఆ ప్రశ్నకి నాకు సమాధానం రాలేదు. కానీ తానూ చాలా ట్రై చేసానని, ఇంట్లో ఒప్పుకోలేదు అని చెప్పాడు. దరిద్రం ఏంటి అంటే, పెళ్ళికి ముందే ఆ అమ్మాయితో వెకేషన్ కి కూడా వెళ్ళాడు. ఆ ఫోటోలు చూసి బాధ వేసింది. కానీ తన హోటల్ రూమ్ కి వేళ్ళని నాకు, అతను సుఖపడుతుంటే ప్రశ్నించే అర్హత లేదు అనిపించింది,' అంది.
'అను, అసలు జరిగిన దాంట్లో నీ తప్పు ఎక్కడ ఉందో నీకు తెలుసా?' అని అడిగాను.
'ఏంటి?' అంది నా వైపు చూస్తూ.
'నిన్ను నువ్వు చాలా తక్కువ అంచనా వేసుకున్నావు. పొద్దున్న నాకు చెప్పావు కదా, మనకి ఉన్నది గుర్తిచాలి అనుభవించాలి అని, నువ్వే నీకున్నది గుర్తించలేదు. నువ్వు ఇంట్లో చెప్పుంటే అత్తయ్య మావయ్య ఊరంతా పిలిచి పెళ్లికి హేసేవారు. వారిని తక్కువ అంచనా వేశావు,' అన్నాను.
నవ్వింది. 'అందుకే కదా రా, నువ్వు అవే తప్పులు చెయ్యకూడదు అని నీకు చెప్పాను. నాకు ఆ జ్ఞానం చేతులు కాలాక వచ్చింది,' అంది.
నేను నవ్వాను. 'ఆ తరువాత ఏమైంది?' అని అడిగాను.
'వాడికి పెళ్లి అయిపోయింది. కానీ నాకు ఏడుపు రాలేదు. నా రాత ఇంతే అనుకున్నాను. అదే సమయంలో ఈ సంబంధం వచ్చింది. అమ్మ నాన్న అడిగారు, ఎవరినైనా ప్రేమిస్తే చెప్పు అని. అదేదో నాలుగు నెలల ముందు అడిగిన బాగుండేది అనుకున్నాను,' అంది.
'అవును. జస్ట్ మిస్,' అన్నాను.
'అబ్బాయి ఫోటో కూడా చూడలేదు. అనాథ పిల్లకి అమెరికా సంబంధం చాలా ఎక్కువ అని ఒప్పేసుకున్నాను,' అంది.
'ఏంటి అను?' అని బాధగా చూశాను.
'ఇప్పుడు కాదులేరా. అప్పుడు ఉన్న డిప్రెషన్ కి అలాంటి ఆలోచనలే వచ్చేవి నాకు. ఇక ఓపిసుకున్నాను. పెళ్లి చేసేసారు,' అంది.
'హ్మ్మ్.. మరి అసలు ఇక్కడ సమస్య ఎక్కడ మొదలైంది?' అని అడిగాను.
అను ఒక నిమిషం ఆలోచించింది. 'ఏదో తేడాగా ఉందని చాలా సంకేతాలు ఉన్నాయిరా. కానీ నేను గమనించలేదు. అసలు అతను నాతో మాట్లాడేవాడు కాదు. నా ఫ్రెండ్స్ అందరు వారికి కాబోయేవారితో గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడేవారు. కానీ నేను మాత్రం టైం కి పడుకుకి లేచేదాన్ని.’
'అంతే కాదు, మిగతా వాళ్ళు గిఫ్ట్స్ అవి పంపేవారు. కానీ నాకు వీడు ఏది పంపేవాడు కాదు. నేను ఇంకా ఆ ప్రేమ విరహంతో ఉన్నానేమో, అసలు పట్టించుకోలేదు,' అని కొంచం గ్యాప్ ఇచ్చింది. ఏదో ఆలోచించి మళ్ళీ మొదలెట్టింది. పెళ్లి అయిపోయింది. మూడు రాత్రులు చెయ్యాలి అన్నారు. కానీ నాకు అప్పడు పీరియడ్ వచ్చింది.' అని ఆగింది.
'హ్మ్మ్ అయితే ఏంటి?' అన్నాను.
'పీరియడ్ రా. ఆ టైం లో అలాంటివి చేయలేము,' అంది.
నా మట్టి బుర్రకి అపుడు అర్థం అయింది. 'సారీ. హా చెప్పు,' అని మళ్ళీ విన్నాను.
అను చిన్నగా నవ్వింది. 'కానీ అందరికి కార్యం జరిగింది అనే చెప్పు అన్నాడు. అలా ఎందుకు అని అడిగితే, అప్పుడు హాయిగా ప్రెషర్ లేకుండా హనీమూన్ కి వెళ్ళినప్పుడు మెమొరబుల్ గా చేసుకుందాము అన్నాడు. నేను సరే అనేశాను,' అంది.
'నీకు అప్పుడు కూడ అనుమానం రాలేదా?' అని అడిగాను.
'లేదు. ఒక విధంగా నేను చాలా సంతోషించాను. అలా ఏమి తెలియని మనిషితో చెయ్యాలి అంటే నాకు మనసు రాలేదు. అందుకేనెమో, మూడు రోజుల తరువాత రావాల్సిన పీరియడ్ ముందే వచ్చేసింది,' అంది.
నా జీవితంలో అలా పీరియడ్ గురించి, శోభనం గురించి ఎవరు మాట్లాడలేదు. చివరికి నవ్యతో కూడా నేను ఎప్పుడు ఈ టాపిక్ మాట్లాడలేదు.
'తరువాత ఏమి జరిగింది?' అన్నాను.
'తాను పదిరోజుల్లో అమెరికా వెళ్లి ఒక నెలలో టికెట్స్ పంపిస్తాను అన్నాడు. అమ్మ నాన్న ఉద్యోగం మానెయ్యమని అన్నారు. నాకు ఎందుకో మనసు ఒప్పక నేను జాబ్ వదలలేదు. సెలవు తీసుకుని ముందు ఒకసారి అమెరికా వెళ్ళొద్దాము. నచ్చితే అప్పడు వచ్చి ఉద్యోగం అదిలేసి ఇంకా నేను కూడా అమెరికా వెళ్ళాలి అనుకున్నాను. అతను అమెరికా వెళ్ళాక కొన్నాళ్ల పాటు ఏమి మాట్లాడలేదు. ఇంట్లో వాళ్ళు అడుగుతుంటే నేను అతన్ని అడిగాను నేను అమెరికా ఎప్పుడు రావాలి అని. 'తొందరేముంది?' అని అడిగాడు. 'నేను సెలవేలుడు తీసుకోవాలి కదా,' అని చెప్పాను. ఏమనుకున్నాడో ఏమో, మరుసటి రోజు టికెట్స్ పంపాడు. నేను వారం రోజుల్లో బయల్దేరి వెళ్ళాను. అక్కడ అంత సంతలాగా ఉంది,' అంది.
'ఏమైంది? ఏమి సంత? నీకు నచ్చలేదా?' అని అడిగాను.
'అక్కడ ఒక పెద్ద ఇంట్లో ఎనిమిది మంది ఉన్నారు. నలుగురు ఆడవాళ్ళూ నలుగురు మగవాళ్ళు. అందరు ఫ్రెండ్స్ అని చెప్పారు. నేను వెళ్ళాక నాకు వాడికి ఒక రూమ్ ఇచ్చారు. కానీ వారు అందరు కూడా అక్కడే అదే ఇంట్లో ఉన్నారు' అంది.
'ఎవరు వాళ్లంతా?' అంది అడిగాను. నాకు విచిత్రంగా అనిపించింది.
'ఫ్రెండ్స్ అన్నాడు. నమ్మశక్యంగా లేకపోయినా నమ్మాను. అలా ఒక వారం గడిచింది. ఉదయం ఆఫీస్ కి వెళ్లేవాడు, రాత్రి లేటుగా వచ్చేవాడు. నేను రోజంతా ఏదో పనులు చేస్తూ టైం పాస్ చేసేదాన్ని. ఆ వీకెండ్ అందరమూ కలిసి డిస్నీలాండ్ కి వెళ్ళాము. ఆ బయట ఒక మోటెల్ లో రూమ్ తీసుకున్నారు అందరు. ఆరోజు రాత్రి బాగా మద్యం సేవించాడు. రూమ్ కి వచ్చాక నాతో చనువుగా ఉన్నాడు. సరే ఇన్నాళ్ళకి భర్తతో ఉన్నాను అనే మంచి ఫీలింగ్ వచ్చి నేను ప్రతిస్పందించాను,' అని ఆగిపోయింది. అను కళ్ళల్లో నీళ్లు తిరిగాయి.
'అను. పర్లేదు. నేనే. చెప్పు,' అన్నాను.
'సిగ్గుగా ఉంది రా,' అనో ఏడ్చింది.
'నేను నీ బెస్టుఫ్రెండ్ అనుకో అను. నాకు నిజంగా నీకంటే ఫ్రెండ్ ఎవ్వరు లేరు. ప్రామిస్. నువ్వు నాతో ఎమన్నా చెప్పచ్చు,' అన్నాను తన చేతిమీద చెయ్యి వేసి.
కొంచం ఏడుపు కంట్రోల్ చేసుకుంది. 'తాగి ఉన్నాడేమో వాసన భరించలేకపోయాను. కానీ అడ్డు చెప్పలేదు. అలా అడ్డు చెప్పి ఒకడిని వదులుకున్నాను. మొగుడు కదా అని సద్దుకున్నాను. ఒక ముద్దు ముచ్చట ఏమి లేకుండా డైరెక్టుగా నా బట్టలు విప్పాడు. నన్ను వెనక్కి తిప్పి నా ప్యాంటు లాగేసాడు. రఫ్ గా చేయటం వాడి ఫాంటసీ ఏమో అనుకుని సైలెంట్ గా ఉన్నాను. కండోమ్ తొడుక్కున్నాడు. భార్యనే కదా, కండోమ్ ఎందుకు? నేనేమి పిల్లలు వద్దు అని అనలేదు. అసలు మా మధ్య పిల్లల టాపిక్ కూడా రాలేదు. మరి కండోమ్ ఎందుకు అన్నాను. కానీ వాడు ఒక్క ఉదుటున,' అని ఆగి.. కాస్త సంయమనం తెచ్చుకుంది మళ్ళీ చెప్పసాగింది. ' వాడు ఒక్క ఉదుటున దూర్చేసాడు. నాకు నొప్పి వచ్చి గట్టిగా అరిచాను. వాడు ఉన్మాది లాగ ఊగసాగాడు. నేను నొప్పికి ఆరవకుండా ఓర్చుకుంటూ ఏడుస్తున్నాను. అంత వాడి నోట్లోనుంచి స్టెల్లా అనే అమ్మాయి పేరు వచ్చింది,' అని ఆగింది. అను ఏడుపు పెద్దది అయింది.
నేను వెంటనే నీళ్లు ఇచ్చి తనని ఓదార్చాను. 'అను అది అయిపోయింది. నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉన్నావు. నిన్ను ఎవ్వడు ఏమి చెయ్యదు. కామ్ డౌన్,' అన్నాను.
నీళ్లు తాగి ఏడుపు ఆపింది. మళ్ళీ నార్మల్గా ఊపిరి తీసుకుంది.
'స్టెల్లా ఎవరు?' అని అడిగాను.
అను నా వైపు బాధగా చూసింది. నాకు అర్థం అయింది. 'వాడి గర్ల్ఫ్రెండ్ ఆ?' అన్నాను.
'అది ఆ ఉన్న ఫ్రెండ్స్ లో ఒక అమ్మాయి. వాడు ఆ అమ్మాయితో లివ్-ఇన్ ఉన్నాడు. నేను వెళ్ళాక అది మాతోటె వచ్చింది. పక్క రూమ్ లో వేరే ఫ్రెండ్స్ తో ఉంది. తాగిన మైకంలో వాడు నన్ను స్టెల్లా అనుకుని నాతో సెక్స్ చేయబోయాడు,' అంది.
నాకు బుర్ర తిరిగింది. ఒకటి జరిగింది తలుచుకుంటే నమ్మలేకపోయాను. సినిమాలలో చూడటమే కానీ ఇలా నిజంగా జరుగుతుందా అని. రెండోది అను ఇంత డిటైల్డ్ గా వివరిస్తోంది. అంటే తన మనసులో ఎంత బాధ దాగి ఉందో,' అనిపించింది.
'మరి నువ్వేమి చేసావు?' అన్నాను.
'గట్టిగా అరిచి వాడిని ఆపమన్నాను. వాడికి కాస్త సెన్స్ వచ్చింది. గబుక్కున బయటకి లాగేసాడు. నాకు నొప్పికి నేను వెంటనే లేవలేకపోయాను. నేను అరిచినా అరుపుకి పక్క రూమ్ ఉంచి ఫ్రెండ్స్ వచ్చారు. ఒక అమ్మాయి వచ్చి నన్ను తన రూంకి తీసుకెళ్లింది,' అని ఆపింది.
'ఆ అమ్మాయికి తెలుసా వీడి గురించి స్టెల్లా గురించి?' అన్నాను.
'తెలుసు. ఆ అమ్మాయి ఒక్కత్తే వీడు చేసేది తప్పు అని చెప్తూ ఉండేదట,' అంది.
'తరువాత?' నాలో ఎన్నో ప్రశ్నలు.
'ఆ రోజు అక్కడే ఏడుస్తూ పడుకున్నాను. కానీ నిద్ర పట్టలేదు. మరుసటి రోజు ఉదయం వాడు వచ్చాడు. నాకు సారీ చెప్పాడు. తనకి స్టెల్లకి ఎప్పటి నుంచో రేలషన్శిప్ ఉందని. తన ఇంట్లో ఒప్పుకోకపోతే బ్రేకప్ చేసుకుని బలవతంగా పెళ్ళికి ఒప్పుకున్నాడట. అయితే పెళ్లి అయ్యాక అమెరికా వచ్చాడు. అప్పటికే స్టెల్లా కూడా ఆన్ సైట్ ప్రాజెక్ట్ గురించి వచ్చింది. అక్కడ ఇద్దరు మళ్ళీ కలిశారు. ప్రేమ తిరిగి చిగురించింది,' అంది.
'అందుకేనా నీకు టిక్కెట్లు పంపలేదు?' అన్నాను. నాకు అన్ని విషయాలు మెల్లిగా అర్థం అవుతున్నాయి.
'అవును. నన్ను డివోర్స్ కావలి అని అడిగాడు. కాకపోతే పెళ్లి ఏడాది కూడా కాలేదు కాబట్టి డివోర్స్ రాదు. కొన్నాళ్ళు వెయిట్ చెయ్యాలి అన్నాడు. నాకు కోపం వచ్చింది. నిన్ను ఊరికే వదిలిపెట్టను అని బెదిరించాను. వాడు భయపడ్డాడు. నాకు సాయపడ్డ వాడి స్నేహితురాలు కూడా వచ్చి వాడి మీద అరిచింది. అసలు అట్టెంప్ట్ తో రేప్ కేసు పెట్టమంది. దానికి వాడు ఇంకా భయపడ్డాడు. నా కళ్ళు పట్టుకుని బ్రతిమాలాడు.
మద్యం మత్తులో నన్ను స్టెల్లా అనుకుని ఆలా చేసానని లేదంటే అలా జరిగేది కాదు అని బాధపడ్డాడు. పశ్చాత్తాపమో భయమో తెలీదు, వెంటనే ఈ ఇంటిని నా పేరు మీద కొంటాను అని ప్రామిస్ చేసాడు' అంది.
'ఓరిని? అంటే నిన్ను కొనెయ్యాలి అనుకున్నాడా?' అన్నాను ఆశ్చర్యంగా.
'అదే కదా. ఈ ఇంటికి అడ్వాన్స్ కట్టేసాడు అప్పటికి. ఇంకా పూర్తి పేమెంట్ చేసాక రిజిస్ట్రేషన్ చెయ్యాలి అది నా పేరు మీద చేయించేస్తాను అన్నాడు. నేను చెప్పాను, నాకు కావాల్సింది ఇల్లు కాదు అని. దానికి వాడు ఏదో సంజాయిషీ ఇచ్చాడు. మేము హ్యాపీగా ఉండలేము అని, అది అని ఇది అని అలా. నేను వాడికి వార్నింగ్ ఇచ్చాను.
ఇండియా వెళ్ళాక వీడి సంగతి చూడాలి అనుకున్నాను.
ఇండియాకి వచ్చాక అమ్మ నాన్న కి ఈ సంగతి ఎలా చెప్పాలో అర్థం కాలేదు. అందుకే బెంగళూరులోనే హాస్టల్ లో ఉన్నాను. కానీ అప్పుడే నాకు తెలిసింది నేను ప్రేగ్నన్ట్ అని,' అంది.
నాకు అర్థం కాలేదు. 'అదెలా? వాడు కండోమ్ వాడాడు కదా?' అని అడిగాను.
అను నిట్టూర్చింది. 'వాడు ఆ రోజు బలవంతంగా చేసేప్పుడు నేను కదిలాను కదా. అప్పుడు కండోమ్ చిరిగినట్టుంది. ప్రేగన్సీ కంఫర్మ్ అవ్వగానే వాడికి ఫోన్ చేసి అడిగాను. అప్పుడు చెప్పాడు, వాడికి కారిపోయిందట. నా దురదృష్టం, కండోమ్ చిరగడం వల్ల కాస్త లోపలికి పోయింది,' అని నీళ్లు తాగింది.
నాకు జాలి వేసింది. నానిగాడు పాపం. వాడు ఏమి తప్పు చేసాడని? అనుకున్నాను.
'తాను బిడ్డని సాకలేనని ప్రెగ్నన్సీ తీయించుకోమని సలహా ఇచ్చాడు ఆ ఎదవ. నాకు మండింది. కానీ ఎంత కాదు అనుకున్న నా బిడ్డ కదా. అలా చెయ్యలేకపోయాను. అందుకే ముందు మన ఊరు వచ్చేసాను. అప్పుడు వాడికి ఇంకో ఛాన్స్ ఇద్దాము అని చెప్పాను. నువ్వు అన్ని వదిలేసి ఇండియా వచ్చేస్తే జరిగింది మర్చిపోయి మన పిల్లలతో బెంగళూరు లో సెటిల్ అవుదాము అన్నాను. వాడు కొంత టైం కావలి అన్నాడు. టైం గడిచిపోయింది. నాని గాడు పుట్టేసాడు. అప్పుడు అడిగాను, ఏమి నిర్ణయించుకున్నావు అని. ఇండియా కి వచ్చి చెప్తాను అన్నాడు. వచ్చాడు. ఒక పది రోజులు ఇంట్లో ఉన్నాడు. అప్పడు నాకు కరాఖండిగా చెప్పేసాడు. తాను స్టెల్లానే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు అని, విడాకులు కావాలని అన్నాడు.
నేను అటుఇటు కాకుండా పోతాను అని భయం వేసింది. వాడికి మళ్ళీ ఇంకో ఆరు నెలలు టైం ఇచ్చాను. ఇండియా కి వచ్చేయమని చెప్పాను. ఆశ చచ్చిపోతున్న, ఫైనల్ గా నా బిడ్డ కోసం, వాడు తండ్రిలేకుండా పెరగకూడదు అని ఇంకో అవకాశం ఇచ్చాను. వాడు మళ్ళీ అమెరికా వెళ్ళాడు. అప్పటి నుండి అమ్మ నాన్న కి ఏదోకటి చెప్తూ నెట్టుకుంటూ వస్తున్నాను. అమ్మ పసిగట్టేసింది. ఒకరోజు నేను వాడితో గొడవ పడుతుంటే వినింది. అందుకే అమ్మకి సగం మేటర్ చెప్పాను.
ఇటు చుస్తే ఇల్లు ఆల్మోస్ట్ పూర్తి అయింది అనగానే ఇక అక్కడ ఉంటె ఈ విషయం నేను ఫ్రీ గా హాండ్ల్ చెయ్యలేను అని ఇక్కడికి వచ్చేసాను. వచ్చిన దెగ్గర నుండి జరిగింది నీకు తెలుసు,' అంది.
నేను సైలెంట్ గా కూర్చున్నాను. మనసులో ఒక ఉప్పెన పెట్టుకుని అను ఎలా ఉండగల్గుతోంది అని ఆశర్యపోయాను.
'డివోర్స్ నోటీసు ఎప్పుడు వచ్చింది?' అని అడిగాను.
'పోయిన వారం వచ్చింది,' అని చెప్పి లోపలి వెళ్లి ఒక envelop తెచ్చి ఇచ్చింది. అందులో కట్ట పేపర్స్ ఉన్నాయి. లీగల్ భాష అర్థం కాలేదు. కానీ అందులో ఉన్న సారాంశం అర్థం అయింది. వాడు డివోర్స్ ఇస్తూ వన్-టైం-సెటిల్మెంట్ కింద ఈ ఇల్లు, మూడు కోట్లు కాష్ ఇస్తాను అన్నాడు. నాని కోసం ఇంకో రెండుకోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ వేసాడట. నానికి 18వ ఏట అది ఇంటరెస్ట్ తో సహా వాడికి దక్కుతుంది.
నేను పేపర్స్ అన్ని మళ్ళీ మడిచి పెట్టేసి అనుకి ఇచ్చాను. 'మరేమి చేద్దాము?' అన్నాను.
'చేద్దాము' అన్నందుకు ఏమో, ఒక పది సెకన్లు అలానే కన్నార్పకుండా చూసింది. అది గమనించి 'అవును. ఇది నీ ఒక్కదాని ప్రాబ్లెమ్ కాదు. మన కుటుంబానికి వచ్చిన ప్రాబ్లెమ్. నీకు నేనున్నాను,' అన్నాను.
'నాకు తోచట్లేదు రా. ఆలోచించే లోపల అమ్మ నాన్న వస్తున్నారు,' అంది.
నేను ఒక పది నిమిషాలు ఆలోచించాను. నాకు ఐడియా వచ్చింది. 'దీన్ని లాగి లాభం లేదు అను. రేపు అత్తామావ రాగానే ఇది తెగ్గొట్టేద్దాము,' అన్నాను.
'అదే ఎలా?' అంది.
'మీ మావగారి ఫోన్ నెంబర్ ఇవ్వు,' అన్నాను.
'అయన ఏమి పట్టించుకోడు. సంబంధం లేదు మా అబ్బాయి జీవితం వాడిష్టం అన్నాడు. ఇంకేం చేస్తాడు?' అంది.
'అది అత్తామావయ్యకి కదా. నేను మాట్లాడతాను ఇవ్వు,' అన్నాను.
అనుకి అర్థం కాలేదు, కానీ నా ధైర్యం చూసి ఏదో చేయబోతున్నాను అని అర్థం అయింది. నెంబర్ ఇచ్చింది. నేను ఫోన్ కలిపాను. అయన ఫోన్ ఎత్తాడు.
'హలో, ఎవరు?' అన్నాడు.
'నమస్తే అండి. నేను చింటూని,' అన్నాను.
'ఏ చింటూ? అన్నాడు చిరాకుగా.
ఎందుకో ఏమో నాకు మండింది. 'అను చింటూ,' అన్నాను.
అను చిన్నగా నవ్వింది.
నేను అను నవ్వు పట్టించుకోలేదు. 'గుర్తు పట్టారా?' అన్నాను.
'ఆ నువ్వా. ఎంటబ్బాయి ఈ టైం లో ఫోన్ ఏంటి?' అన్నాడు.
'మీతో మాట్లాడాలి. రేపు బయల్దేరి బెంగళూరు రావాలి,' అన్నాను. నేను అడగలేదు. చెప్పాను.
'ఎందుకు?' అన్నాడు అదే చిరాకు స్వరంతో.
'మీ అబ్బాయి కోడలు గురించి మాట్లాడాలి,' అన్నాను.
'అదా. ముందే చెప్పాకదా. అది వాళ్ళ పర్సనల్ విషయం అని. మేము తలదూర్చుకోము. అయినా నీకెందుకు రా. నువ్వెందుకు మధ్యలో దూరుతున్నావు?' అన్నాడు బలుపు ప్రదర్శిస్తూ.
నాకు మంటలెక్కిపొయింది. నెత్తిమీద నీళ్లుపోస్తే పొగలు వచ్చేవేమో. 'మర్యాద. మర్చిపోవద్దు. రేపు మా అత్తా మావ వస్తున్నారు. సాయంత్రం ఇక్కడ ఉంటారు. రేపు వాళ్ళు వచ్చేసరికి మీరు ఇక్కడ ఉండాలి,' అన్నాను.
'ఏంటిరా పిల్లనాకొడక. ఒళ్ళు బలిసిందా?' అన్నాడు.
'కొంచం. ఇప్పుడే మొదలైంది. రేపు మధ్యాహ్నం మీరు ఇక్కడ లేకపోతే, ఎల్లుండి పొద్దున్న నేను అక్కడికి రావాల్సి ఉంటుంది. ఆలోచిం[b]చకొండి,' అని ఫోన్ పెట్టేసాను.[/b]
అను నోరు తెరిచి చూస్తోంది. నేను ఫోన్ పక్కన పెట్టాను కానీ ఇంకా కోపం తగ్గలేదు. నాకు ఏమైందో తెలీదు. కానీ త్రివిక్రమ్ డైలాగ్స్ లాగ మాట మాట కి పంచ్ వేసి వార్నింగ్ ఇచ్చి పెట్టేసాను.
'అదేంటిరా అలా మాట్లాడవు?' అంది అను.
'మర్యాద ఎక్కువైంది కదా?' అన్నాను.
చిన్నగా నవ్వింది. 'వస్తాడంటావా?' అని అడిగింది. అను మొహం లో ఏదో చిన్న ఆశ.
'రాకపోతే నేను వెళ్తా అన్న కదా. వస్తాడు అనుకుంటున్నా. రాకపోతే నేను నిజంగా వెళ్తాను,' అన్నాను.
ఒక అయిదు నిముషాలు అయ్యాయి. అను అత్తగారు ఫోన్ చేసింది. అను స్పీకర్ లో పెట్టింది.
'అను, ఎలా ఉన్నావు?' అని అడిగింది.
'చెప్పండి అత్తయ్యగారు,' అంది అను. ఆవిడ అడిగిన దానికి సమాధానం చెప్పలేదు.
'మేము రేపు పొద్దున్నే ఫ్లైట్ తీసుకుని వస్తాము. మధ్యాహ్నం అవుతుంది బెంగళూరు వచ్చేసరికి. సాయంత్రం ఇంటికి వస్తాము,' అంది.
'ఒకే అండి,' అంది అను. ఫోన్ పెట్టేసింది.
'వర్కౌట్ అయింది రా. మరి అమ్మ నాన్నకి ఎలా చెప్పాలి?' అని అడిగింది.
'రేపటి దాకా టైం ఉంది. ఆలోచిద్దాము. వెళ్లి పడుకో. ఒక రెండు మూడు రోజులు నిద్ర ఉండదు నీకు,' అన్నాను.
'నువ్వు?' అని అడిగింది.
'నేను కాసేపు ఇక్కడే కూర్చుంటాను,' అని చెప్పి బాల్కనీ లో కూర్చు లో కూర్చున్నాను.
నా భుజం మీద చేయి వేసి చిన్నగా నొక్కింది అను. 'థాంక్యూ రా,' అంది.
'నేను ఉన్నాను. ఏమి భయం లేదు. వెళ్లి హాయిగా పడుకో,' అన్నాను.
చిన్నగా నవ్వి, 'గుడ్నైట్ రా బంగారం,' అని రూంలోకి వెళ్లి తలుపు వేసుకుంది.
ఇంకా ఉంది
After long time natural good story chaduvu thunnadhuku.
Pl continue your family realistic story
I have enjoyed
Thank you ,if you get time give us big update
Thank you so much