Thread Rating:
  • 74 Vote(s) - 2.35 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy ముసలోడి రాసలీలలు- update on 08-12-2024
గూడేనికి వెళుతున్న మంగికి స్వామిజీ తారసపడతాడు. ఆయన చాలాసార్లు ఆ గూడేనికి రావడంతో మంగి ఆయనకి నమస్కరిస్తుంది 

మంగి : నమస్కారం స్వామి నన్ను ఆశీర్వదించండి 

స్వామిజీ : ఏమని ఆశీర్వదించాలి మంగి 

మంగి : అలా అంటున్నారు ఏంటి స్వామీ 

స్వామిజీ : తప్పు చేసావ్ మంగి చాలా పెద్ద తప్పు చేసావ్ 

మంగి : మీరు ఏమంటున్నారు స్వామీ

స్వామిజీ : నిన్న రాత్రి మీ ఇద్దరి మధ్య జరిగిన దాని గురించే 

మంగి : అది మీకెలా 

స్వామిజీ : నాకు అన్నీ తెలుసు.నిన్న నువ్వు ఆ పండు తినలేదు అని తెలుసు తెలివిలో ఉండే అతనికి నీపై హక్కు ఇచ్చేసావ్ అని తెలుసు 

మంగి : స్వార్ధం స్వామి, తను అక్కని ఇష్టపడుతున్నాడు కానీ తనతో నాకు ఒక మంచి జ్ఞాపకం ఉండాలి అనుకునే తనకి నాపై హక్కుని ఇచ్చేసా 

స్వామిజీ : అదే నీవు చేసిన పెద్ద తప్పు.దానికి నువ్వు ప్రతిఫలం అనుభవించక తప్పదు 

మంగి : ఏదయినా సంతోషంగా స్వీకరిస్తా 

స్వామిజీ : నీవు అతని వల్ల తల్లివి అయితే 

మంగి : స్వామి 

స్వామిజీ : చెప్పు మంగి

మంగి : అతని ప్రతిరూపాన్ని నా బిడ్డలో చూసుకుంటూ ఈ జీవితాన్ని సంతోషంగా గడిపేస్తా 

స్వామిజీ : మరి వైవాహిక జీవితం 

మంగి : అతను అక్కని ఇష్టపడినప్పుడే నా వైవాహిక జీవితం ముగిసిపోయింది స్వామి 

స్వామిజీ : ( నవ్వుతూ ) మరి తన వల్ల తల్లివి కాబోతున్నావనే విషయం అతనికి తెలిస్తే అతను మీ అక్కని వివాహం చేసుకుంటాడా 

మంగి : చేసుకోడు 

స్వామిజీ : మరి ఈ పని వల్ల మీ అక్క ప్రేమ కూడా చచ్చిపోతుందిగా 

మంగి : అలా జరగడానికి వీల్లేదు. ఈ విషయం తెలిస్తే మా అక్కే చచ్చిపోతుంది అందుకే ఇది తెలియకముందే అక్క పెళ్లి తనతో జరిగిపోవాలి.

స్వామిజీ : మీ అక్క పెళ్లి జరిగిన తర్వాత కూడా నీ బిడ్డకి తండ్రి తనే అని తెలిస్తే అతను ఊరుకుంటాడా 

మంగి : ఊరుకోడు అందుకే నేను తనకి తెలియనివ్వను 

స్వామిజీ : ( నవ్వుతూ ) అతనికి తెలియకపోయిన మీ వాళ్ళకి చెప్పాలి కదా అప్పుడైనా వచ్చే ప్రమాదం నీకు తెలియట్లేదు 

మంగి : అలాగైతే నా బిడ్డకి తండ్రి ఎవరనేది ఎవరికీ తెలియనివ్వను 

స్వామిజీ : దానివల్ల నీవు ఎన్ని నిందలు ఎదుర్కోవాల్సి వస్తుందో నీకు తెలియదు 

మంగి : ఎన్ని నిందలు అయినా సరే నేను భరిస్తాను.ఎన్ని కష్టాలు అయినా అనుభవిస్తాను.నేను చేసిన ఈ తప్పుకి ఇదే నాకు పడే శిక్ష కానీ 

స్వామిజీ : ఇంకేంటి మంగి 

మంగి : రాత్రి మా ఇద్దరి మధ్య జరిగినది మావకి గుర్తు ఉండకూడదు అలాగే అక్క,మావ పెళ్లి త్వరగా జరిగిపోవాలి అది కూడా ఈ రెండు నెలలలోపు జరిగిపోవాలి 

స్వామిజీ : అది నేను చూసుకుంటా మంగి 

మంగి : కృతజ్ఞతలు స్వామి 

స్వామిజీ : నేను చెప్పేది విను మంగి 

మంగి : చెప్పండి స్వామి 

స్వామిజీ : నువ్వు తల్లివి కావడానికి కారణం తనే అని అలాగే మీ మధ్య జరిగింది అతనికి ఏమీ గుర్తుఉండవు 

మంగి : అలానే స్వామి 

స్వామిజీ : మీ అయ్యతో మాట్లాడి మీ అక్క,మావకి పెళ్లి జరిపించే బాధ్యత నాది 

మంగి : సరే స్వామి 

స్వామిజీ : కానీ నీవు నాకు ఒక మాట ఇవ్వాలి 

మంగి : చెప్పండి స్వామి మీరు ఏం చెప్పిన నేను చేస్తాను 

స్వామిజీ : మున్ముందు నీ ముందుకి వచ్చేది కఠిన సమయం.నీవు ఎదుర్కోబోయేది చాలా పెద్ద ప్రమాదం.ఎన్నో అనుమానాలను ఎదుర్కొంటావు.ఇవ్వన్నీ తట్టుకుని నువ్వు నిలబడగలగాలి.ఎట్టి పరిస్థితిలోను నీ గర్భానికి కారణం ఎవరనేది తెలియనివ్వకు 

మంగి : సరే స్వామి నా బిడ్డ గురించి అయినా నేను తట్టుకుని నిలబడతాను అలాగే మావ గురించి ఎవరికీ తెలియనివ్వను 

స్వామిజీ : రాబోయే కొన్ని రోజుల్లో నువ్వు చాలా విచిత్ర సంఘటనలను చూస్తావ్ వాటి గురించి ఆలోచించకుండా నీ బ్రతుకు నువ్వు బ్రతుకు సరైన సమయంలో నీకు అన్నిటికి సమాధానం లభిస్తుంది 

మంగి : ఏమంటున్నారు స్వామి 

స్వామిజీ : అన్నీ త్వరలోనే అర్ధమవుతాయి. నీ సమస్య తీరి సంతోషాలు వచ్చేంతవరకు అవి తట్టుకుని నిలబడేలా ఆ దేవుడు నీకు శక్తిని ప్రసాదించాలని ఆశీర్వదిస్తున్నాను.

                     అటుపిమ్మట మంగి గూడేనికి బయలుదేరగా స్వామిజీ ఆమెని చూస్తూ నీకు ఎప్పుడూ ఆ అమ్మవారు తోడు ఉండాలని కోరుకుంటున్నా ఇప్పుడు జరిగేది అంతా ఆ దైవేచ్ఛ అందుకే నీ గర్భానికి కారణం ఎవరనేది ఎవరికీ తెలియకూడదు అందుకే నీతో అలా మాట్లాడింది. నీ అక్కని మనువాడే వాడే నిన్ను మనువాడతాడు. మీ అక్క ప్రేమ ఎలా విజయవంతమవుతుందో నీ ప్రేమ కూడా అలానే నిన్ను చేరి విజయాన్ని అందుకుంటుంది అప్పటివరకు నీకు కష్టాలు తప్పవు అనుకుని అక్కడనుంచి తను కూడా గూడేనికి వెళ్తాడు.
            మంగి గూడేనికి వెళ్ళేటప్పటికి అందరూ ఘాడనిద్రలో ఉండి ఉంటారు. ఒక్క సూరి మాత్రం వచ్చిన ఆ పట్నపు జనం మళ్ళీ ఆ లోయ దగ్గరకి వెళ్లి తిరిగిరాలేదు అని నిర్ధారించుకుని ఈ సారి కూడా తన వాటా మిస్సవుతున్నందుకు బాధపడుతూ ఉంటాడు. అదే సమయానికి మంగి అక్కడికి రావడం వాడు చూడటం జరుగుతాయి. వాడు దాన్ని చూసి ఇది ఎక్కడి నుంచి వస్తుంది రాత్రి ఇది పడుకోలేదా అనుకుంటూ అది అందరిని చూస్తూ ఉండటంతో దాని దగ్గరికి వెళ్తాడు.

సూరి : నువ్వు ఎక్కడ నుంచి వస్తున్నావ్ 

మంగి : అది ముఖ్యమా ఇప్పుడు వీళ్లంతా ఏంటి ఎక్కడివాళ్ళు అక్కడే పడుకున్నారు 

సూరి : ఏమో నాకు తెలీదు నాకు ఇప్పుడే మెలకువ వచ్చింది 

మంగి : అవునా 

సూరి : నువ్వు ఎక్కడికెళ్లావ్ 

మంగి : అడవిలోకి 

సూరి : ఎప్పుడు 

మంగి : ఉదయాన్నే 

సూరి : నిజమా 

మంగి : హ సూరి 

           ఇంకా ఏదో అనబోయేంతలో అక్కడికి స్వామిజీ వస్తాడు. అతన్ని చూసి సూరి మాటలు ఆపగా ఆయన తన మంత్ర శక్తితో వాళ్ళకి మెలకువ రప్పిస్తాడు. గూడెం దొర ఆయనని సాదరంగా ఆహ్వానించగా స్వామిజీ ఆయనతో అక్కడే అందరిముందు మాట్లాడాలి అని అంటాడు 

మల్లన్న : చెప్పు స్వామి 

స్వామిజీ : నీ పెద్ద కూతురు పెళ్లి గురించి 

మల్లన్న : చెప్పండి స్వామీ 

స్వామిజీ : తనకి ఈ రెండు రోజుల్లోనే వివాహం జరిగిపోవాలి 

మల్లన్న : ఎందుకు స్వామి 

స్వామిజీ : తనకి ఈ రెండు రోజుల్లో వివాహం అవ్వకపోతే తన ప్రాణాలకే ప్రమాదం 

మల్లన్న : అంత మాట అనకండి స్వామి, రేపే తన వివాహాన్ని జరిపిస్తాను 

స్వామిజీ : వరుడు ఎవరు మల్లన్న 

మల్లన్న : ఇంకెవరు నేను మాట ఇచ్చిన ప్రకారం సూరినే నా కూతురికి కాబోయే పెనిమిటి అలాగే నా తర్వాత ఈ గూడేనికి దొర 

స్వామిజీ : ( నవ్వుతూ ) ఏంటి మల్లన్న నువ్వు నీ గూడెం మంచి కోరుకుంటున్నావా లేక నాశనాన్ని కోరుకుంటున్నావా 

మల్లన్న : ఏమంటున్నారు స్వామి,నేను ఈ గూడేనికి దొర ఈ గూడెం నాశనాన్ని ఎందుకు కోరుకుంటా 

స్వామిజీ : నీ తర్వాత సూరినే దొర అంటున్నావ్ అది చాలదా ఈ గూడెం నాశనం అవ్వడానికి 

సూరి : స్వామి నా గురించి తప్పుగా మాట్లాడితే బాగుండదు 

మల్లన్న : సూరి 

సూరి : క్షమించు దొర కానీ ఈ స్వామి నా వల్ల ఈ గూడెం నాశనం అవుతాది అని చెప్తుంటే మీరు మౌనంగా ఉన్న నేను ఉండలేను అయినా నేనేమి చేశాను స్వామీ నాకు తెలుసు ఆ రవిగాడు నీ దగ్గరికి వచ్చి మల్లితో తన వివాహం జరిగేలా చూడమని నిన్ను ఇక్కడికి పంపించి ఉంటాడు 

స్వామిజీ : ( నవ్వుతూ మల్లన్న వైపు చూసి ) నీ అభిప్రాయం కూడా అదేనా మల్లన్న 

మల్లన్న : వాడు చెప్తుంటే అది నిజమేనేమో అనిపిస్తుంది.అది నిజం కాకపోతే వీడు ఈ గూడెం నాశనానికి ఎలా కారణం అవుతాడో మీరే సెలవీయండి 

స్వామిజీ : రాత్రి నుంచి ఇప్పటివరకు మీరు ఇంతలా మత్తులోకి పోవడానికి కారణం ఏంటి ? ఈ సూరి తీసుకొచ్చిన ఈ అడవిని చూడటానికి వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు 

సూరి : వాళ్ళు ఉదయాన్నే వెళ్లిపోయారు. వాళ్ళని దిగబెట్టి నేను ఇప్పుడే వస్తున్నా 

మంగి : అబద్ధం 

మల్లన్న : ఏమంటున్నావ్ మంగి 

మంగి : సూరి చెప్పేది అబద్దం అయ్య, ఇప్పుడే మీరు లెగకముందే నాతో చెప్పాడు తనకి ఇంతకుముందే మెలకువ వచ్చిందని ఇప్పుడు మీతో ఇలా అంటున్నాడు అంటే తను ఏదో దాస్తున్నాడు అనే కదా అర్ధం 

మల్లన్న : ఏంటి సూరి మంగి చెప్పింది నిజమా 

సూరి : లేదు మామ నీ కూతురే ఏదో దాస్తోంది. ఇప్పుడే అడవి నుంచి వస్తుంది అంటే తనే మనందిరిని ఏదో చేసింది 

మల్లన్న : నా కూతురు మీద ఆ మాత్రం నమ్మకం లేదు అనుకుంటున్నావా నువ్వు చెప్పేది నమ్మడానికి.అసలేమైంది స్వామి మీరు చెప్పండి.

స్వామిజీ : ఈ అడవికి ఈశాన్య మూలగా ఒక లోయ ఉంది దాన్లో అమ్మవారు కొలువై ఉన్నారు అని మీ గూడెం ప్రజల నమ్మకం కదా  

మల్లన్న : ( నమ్మకం కాదు అదే నిజం ) అవును స్వామి 

స్వామిజీ : మరి ఆ నమ్మకాన్ని ఈ సూరి కొందరి దుర్మార్గులకు చేరవేసి సొమ్ము చేసుకోవాలి అని చూస్తున్నాడు 

మల్లన్న : స్వామి 

స్వామిజీ : నిన్న ఈ సూరి తీసుకొచ్చిన వాళ్లలో ఎవరూ కూడా ఈ అడవిని దాటి పోలేదు ఒక్కరు తప్ప 

మల్లన్న :  సూరి స్వామి చెప్పేది నిజమా 

సూరి : అంతా అబద్ధం 

స్వామిజీ : నిజం నిర్భయంగా ఒప్పుకోవాలి సూరి 

సూరి : దొరా మీకు అర్ధం కావట్లేదు ఈ స్వామి , మీ కూతుర్లు ఆ రవితో కలిసి ఆడుతున్న నాటకం ఇది 

మల్లన్న : నీ మాటలు ఆపు సూరి ఆయన గురించి నాకు చాలా బాగా తెలుసు ఆయన అబద్ధం చెప్పరు. ఈ రోజు నుంచి నిన్ను ఈ గూడెం నుంచి వెలివేస్తున్నాను 

సూరి : దొరా అంత మాట అనకండి  

స్వామిజీ : వద్దు మల్లన్న ఈసారికి వాడిని క్షమించి వదిలేయ్ 

మల్లన్న : ఎందుకు స్వామి ఇలాంటివాడిని ఇక్కడ ఉండనీయడం అంత మంచిది కాదు స్వామి 

స్వామిజీ : నా మాట విని ఈసారి వాడిని వదిలేయ్  

మల్లన్న : సరే స్వామి 

స్వామిజీ : ఇప్పుడు చెప్పు మల్లన్న ఇప్పటికి కూడా నీ కూతురుని ఈ సూరికిచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నావా 

మల్లన్న : లేదు స్వామి వీడు కాకుండా ఇంకెవరినైనా చూసి చేస్తాను 

స్వామిజీ : అంతేకాని నీ కూతురు మనసుపడ్డ వానితో మాత్రం చేయనంటావ్ 

మల్లన్న : అవును స్వామి 

స్వామిజీ : ఎందుకు మల్లన్న మన పిల్లల సంతోషమే మనకి కావాలి కానీ నీవు మాత్రం ఎందుకు వ్యతిరేకముగా ఉన్నావ్ 

మల్లన్న : స్వామి నాకు మగ పిల్లగాళ్ళు లేరని మీకు తెలిసిందే ఇక్కడి ఆచారం ప్రకారం కొడుకు లేకపోతే కూతురు భర్త నా తర్వాత ఈ గూడేనికి దొర అవుతాడు 

స్వామిజీ : అవును 

మల్లన్న : అది కూడా మొదటి కూతురి భర్తనే అయ్యి ఉండాలి అలాగే ఆ వ్యక్తి మా ఈ గూడేనికి సంబంధించిన వాడే అయ్యి ఉండాలి బయటి వ్యక్తి కాదు ఇప్పుడు చెప్పండి స్వామి ఈ గూడెం మంచి కోరి నా కూతురి ప్రేమని ఒప్పుకోకపోవడం తప్పంటారా 

స్వామిజీ : కాదు మల్లన్న కానీ 

మల్లన్న : నన్ను క్షమించండి స్వామి మీ మాట కాదన్నందుకు 

స్వామిజీ : ( నవ్వుతూ ) నువ్వు ఇంకో విషయం చెప్పలేదు మల్లన్న 

మల్లన్న : ( అయోమయంగా ) ఏంటి స్వామి 

స్వామిజీ : నీ తర్వాత ఈ గూడేనికి దొర నీ కూతురి భర్త మాత్రమే కానక్కర్లేదు ఆమె కొడుకైన చాలు అది కూడా మొదటి కూతురి కొడుకే కాదు రెండో కూతురి కొడుకు కూడా కావొచ్చు 

మల్లన్న : అవును స్వామి కానీ అంతవరకు నా ఈ దేహం ఉండాలి కదా 

లచ్చి : ఏంటి మామ ఇది 

స్వామిజీ : మల్లన్న ఇంకోసారి ఆలోచించు 

మల్లి : వద్దు స్వామి ఇన్నాళ్లు అయ్య ఎందుకు ఇంత పట్టుదలగా ఉన్నాడు అనుకున్నా కానీ ఇప్పుడు అర్ధమయ్యింది ఈ గూడెం దొరగా ఈ గూడెం మంచి కోసం అలోచించి ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయన కూతురిగా నేను ఈ గూడెం కోసం ఆలోచించాలి కదా అందుకే 

స్వామిజీ : అందుకే  

మల్లి:  నేను అయ్యా చెప్పిన వాడినే మనువాడతా 

మల్లన్న : ( సంతోషంగా కూతురివైపు చూస్తాడు ) ... 

స్వామిజీ : ఇదేనా మీ అంతిమ నిర్ణయం 

మల్లన్న : అవును స్వామి 

స్వామిజీ : మల్లన్న నీవు మరో విషయం మర్చిపోయినట్టున్నావ్ 

మల్లన్న : ఏంటి స్వామి నాకు గుర్తురావట్లేదు 

స్వామిజీ : చెబుతా అన్నీ చెబుతా నీ కూతురు ప్రేమించిన రవి ఆ ఊరి ఆ కుటుంబానికి సంబంధిచిన వాడైతే 

మల్లన్న : ( తనకి ఏదో గుర్తొస్తుంటే ) స్వామి మీరనే ఊరు అదేనా 

స్వామిజీ : అవును 

అందరూ అయోమయంగా చూస్తుంటే 

లచ్చి : ఏ ఊరి గురించి మీరు మాట్లాడుకుంటున్నారు మామ 

స్వామిజీ : హరిహరపురం 

      ఆ ఊరు పేరు వినగానే అక్కడ ఉన్న చాలా మందికి ఇంకా అయోమయంగా ఉన్నా కొద్దిమందికి మాత్రం గగుర్పాటు కలిగించింది. అక్కడున్న పెద్దవారు అంటే ముసలివారు ( వయస్సులో మల్లన్న కన్నా పెద్దవారు ) అయితే 45 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటనని గుర్తు చేసుకుంటూ ఆనాడు తమ దొరని ( మల్లన్న తండ్రిని ) ఏ విధముగా కోల్పోయారో జ్ఞప్తి తెచ్చుకుంటూ ఆ తర్వాత జరిగిన సంఘటనలను గుర్తు చేసుకున్నారు. అక్కడి పెద్దవారిలోంచి కొందరు 

వ్యక్తి1 : మీరు చెప్తున్నది నిజమేనా స్వామి  

స్వామిజీ : అవును 

వ్యక్తి2 : అంటే రాజన్న అతని కుటుంబం ఆ ఐదు కుటుంబాలకి చెందినవాళ్ల ? 

వ్యక్తి 3 : అదే నిజమైతే మల్లన్న నీ కూతురిని రవికిచ్చి పెళ్లి చెయ్ 

మల్లన్న : స్వామి మీరు చెప్పేది నిజమేనా 

స్వామిజీ : అనుమానం అక్కర్లేదు మల్లన్న నేను చెప్పేది అక్షరాలా నిజం 

మల్లన్న : అయితే నా కూతురిని రవికిచ్చి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను 

స్వామిజీ : సంతోషం మల్లన్న కానీ ఈ పెళ్లి రెండు రోజుల్లో జరిగిపోవాలి అలాగే రాజన్నకి తన కుటుంబానికి సంబంధించిన విషయాలు ఏవీ తెలియకూడదు 

మల్లన్న : ఎందుకు స్వామి 

స్వామిజీ : సమయం వచ్చినప్పుడు అన్ని నిజాలు వాటంతట అవే బయట పడతాయి అంతకుముందే తెలిస్తే జరిగే అనర్దాలు మనం అంచనా వేయలేము 

మల్లన్న : సరే స్వామి అలాగే ఇక్కడ జరిగిన ఏ విషయాన్నీ నేను కానీ నా ప్రజలు కానీ ఆ కుటుంబానికి తెలియనివ్వము సూరి నీవు కూడా 

సూరి : ( మనస్సులో కుతకుతలాడిపోతూ ) అలాగే దొర 

స్వామిజీ : పెళ్లి జరిగిన రెండు రోజులకే వాళ్ళని పట్నం పంపించు మల్లన్న 

మల్లన్న : స్వామి మీరు చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళకి ఏదైనా ఆపద ఉందా 

స్వామిజీ : వాళ్లిద్దరూ ఇక్కడ ఉంటే పరిస్థితులు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి అందుకే వాళ్ళకి వివాహం జరిపించి ఇక్కడ నుంచి కొన్ని రోజులు దూరంగా పంపించు అంతకు మించిన ప్రమాదం లేదు 

మల్లన్న : సరే స్వామి 

             వీళ్ళ మాటలు అన్నీ పూర్తయ్యేలోపు అక్కడికి రాజన్న,రవి కూడా వస్తారు. వాళ్ళని చూసి మల్లన్న తన నిర్ణయాన్ని చెప్పగా ఇద్దరూ చాలా సంతోషపడతారు.సూరి మాత్రం మనస్సులో పగతో రగిలిపోతూ సమయం కోసం వేచి చూస్తున్నాడు. స్వామిజీ మరోసారి వాళ్ళకి రెండురోజుల్లో వివాహం అవ్వాలని చెప్పి ఇంకొన్ని రోజుల్లో కచ్చితంగా నీ తర్వాత కాబోయే దొర జన్మిస్తాడని చెప్పి అక్కడ నుంచి తన ప్రయాణాన్ని హరిహరపురం వైపు సాగిస్తాడు. మల్లన్నకు స్వామిజీ చివర్లో అన్న మాటలు ఆశ్చర్యం కలిగించిన అప్పుడు తను ఉన్న సంతోషంలో ఆ మాటలు పెద్దగా పట్టించుకోలేదు.

కొనసాగుతుంది .......
[+] 13 users Like rag7rs's post
Like Reply


Messages In This Thread
RE: ముసలోడి రాసలీలలు- update on 23-10-2024 - by rag7rs - 08-12-2024, 05:25 PM



Users browsing this thread: 10 Guest(s)