Thread Rating:
  • 21 Vote(s) - 3.24 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance కృష్ణకావ్యం
7. ప్రశ్న




యూనివర్సిటీకి పోయాను. అక్కడ అటెండర్ ని మా ఫిజిక్స్ 1st year cla…ssroom ఎక్కడో కనుక్కొని పోయి cla….ssroom ని చూస్తే సుమారు ముప్పై బెంచీలు ఉంటే కనీసం ముప్ఫై మంది కూడా లేరు. 

మొదటి బెంచీ ఖాలీ లేదు, రెండోది కూడా లేదు, మూడోది ఉంది, కానీ అందులో ఒకడు మొహం నాకు అదోలా అనిపించింది, ఇక ఆఖరి బెంచిలోకి పోయి కూర్చున్నాను.

జీవితంలో మొదటిసారి ఆఖరి బెంచీలో కూర్చోవడం.

లెక్చరర్ వచ్చాడు, అసలు పరిచయం లేదు ఏమీ లేదు క్లాస్ మొదలు పెట్టాడు. ఇసొంటి టీచర్లు ఉండి దండగ అండి. టీచర్ అంటే చదువు చెప్పలీ అలాగే కాస్త మాటలు కూడా ఉండాలి.

Solid state physics ని social class లో చరిత్ర ప్రారాగ్రాఫులు చదివినట్టు చెప్పి పోయాడు.

అప్పుడు ఒకసారి గది మొత్తం స్కాన్ చేసాను. అమ్మాయిలందరూ ముందుకి చూస్తున్నారు కదా నాకు ఇబ్బంది లేదు.

ఇన్నాళ్లూ అసలు అమ్మాయిలని సరిగ్గా చూడడం అలవాటు లేదు, ఇకమీదటైనా చూసుకుందాం అని ఒక్కో అమ్మాయిని చూస్తూ ఉన్నాను. ఏంటో ఒక్కతీ యావరేజ్ గా కూడా అనిపించట్లేదు.

ఇక రెండో పీరియడ్ కి ఇంకో సార్ వచ్చాడు. 

వచ్చీరాగానే, “ ఇవాళ అందరి పేరులూ తెలుసుకుందాం. తరువాత మీకో మంచి ఫిజిక్స్ fact చెపుతాను. అంటే మీకు అది తెలుసో తెలీదో నాకు తెలీదు అందుకే. ” అన్నాడు సార్.

అందరం తలాడించాము.

“ నా పేరు మురళీధరన్ ” అన్నాడు చిన్న హుషారు నవ్వుతో.

అప్పుడే ఎవరో మూడో బెంచిలో అనుకుంటాను. 

“ ముత్తయ్య మురళీధరన్ ” అని నవ్వారు.

మురళీ సార్: హహహ.... బాగుందయ్యా. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో కూడా గ్రాడ్యూషన్ పిల్లల్లా జోకులు వేయడం అంటే, ఇంకా ఆ కుర్రతనం పోలేదు చూడు, యెస్... ఆ యంగ్ స్పిరిట్ మనలో ఎప్పటికీ ఉండాలి.


అందరం దీర్ఘంగా చూసాము.

సార్ నిజంగా ఎంత మాములుగా, కొంచెం కూడా విసుగులేకుండా, అలా చెప్పేసాడు.

మురళీ: మీకోటి తెలుసా, ఈ ఫిజిక్స్ సబ్జెక్టు అలాంటిది. ఈ ఫిజిక్స్ అంటే ఇష్టం, ప్యాషన్, కసి ఉన్న వాళ్ళకి ఒక కుతూహలం ఉంటుంది. ఏదో తెలుసుకోవాలి, ఏదో కనుక్కోవాలి, ఏదో ఏదో ఇంకేదో నాకు తెలేనిది ఈ విశ్వం దాచుతుంది, అది వెతకాలి అనే కుతూహలం ఉంటుంది చూడండీ, అదిగో ఆ కుతూహలం మనల్ని చిన్న పిల్లలు ముందున్నది ఏంటో అర్థం కాక, మమ్మీ ఇది ఏంటి, డాడి ఇది ఏంటి, అన్నయ్యా ఇది ఇలా ఎందుకు ఉంది? ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు.

అందరం అలాగే వింటున్నాము.

మురళీ సార్: ఈ ఫిజిక్స్ లో కుతూహలం కూడా ఇది ఇలా, అలా, ఎలా అని చిన్న పిల్లల్లా అడిగేలా చేస్తుంది. ఇది చదివేవారు ఎప్పటికీ ఎదుగుతున్న పిల్లలు అన్నట్టే. 

వాహ్... ఏం చెప్పారు సారు అనుకున్నా నేను. 

ఆయనకి ఫిజిక్స్ మీద ఎంత ఇష్టం లేకుంటే అలా చెప్తారు. నిజంగా నేను ఒక ఫిజిక్స్ టీచర్ గా ఉద్యోగం చేస్తూ నా స్టూడెంట్స్ తో ఇలాగే ఇంకేదో చెప్పాలి. 

తరువాత అమ్మాయిలతో పేర్లు చెప్పడం మొదలై అలా అబ్బాయిలు కూడా చెప్పడం ఐపోయింది. ఇక సారు ఏదో చెప్తాను అన్నాడు అది చెప్పాలి.

మురళీ సార్: ఒకే. మీరు పేర్లు చెప్పుకుంటూ పోయారు కాని నాకు గుర్తుంటాయి అని గ్యారంటీ లేదు. హహహ...

సార్ నవ్వితే మాకు నవ్వొచ్చింది.

మురళీ సార్: మీరందరూ చిన్నప్పటి నుంచీ సైన్స్ చదువుతూ వచ్చారు, సైన్స్ అంటే ఇష్టం ఉంది కాబట్టే ఫిజిక్స్ తీసుకున్నారు. మీలో చాలా మందికి ఈ fact తెలిసే ఉంటుంది అనుకుంటున్నా.

నాకు రెండు వరుసల ముందున్న కళ్లద్దాలు పెట్టుకున్న అఖిల్ అడిగాడు.

అఖిల్: సార్ ఒక్క నిమిషం. సార్ మీరు చెప్పేది ఏంటో చెప్పలేదు.

మురళీ సార్: ఓహ్ అవును కదా. నేను మీ రిలేటివ్ ఫిజిక్స్ ప్రొఫెసర్ ని. మనం గురుత్వాకర్షణ శక్తీ, స్పేస్ అండ్ టైం రిలేటివ్స్నేస్, einstein general relativity theory, newtonian and Einsteinian gravity, gravitational field properties, time paradox ఇవన్నీ మీ సిలబస్ లో ఉన్నవి చెప్తాను.

ఉఫ్ నాకు ఇష్టమైన టాపిక్స్ కి ఇలాంటి మంచి సార్ కేక అనుకున్న.

మురళీ సార్: పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మే నెల, సంపూర్ణ సూర్య గ్రహణం. Einstien గారు, ఇద్దరు ఆస్ట్రోనామికల్ ఫోటోగ్రాఫర్లను, ఒకరిని princeton, ఆఫ్రికాలో, మరొకరిని సొబ్రెల్, బ్రెజిల్ లో నుంచి ఆ గ్రహణం ఫోటో తీపించారు. ఆ గ్రహణం ఫోటోలో సూర్యుడిని చేంద్రుడు పూర్తిగా కప్పేసి, కేవలం కొరోనా, కొరోనా అంటే ఆ కొరోనా కాదు, సూర్యుని ఉపరితలం కొరోనా. అది మాత్రమే కనిపించింది. ఒకరింగులా కనిపించింది. మిగతా ఆ ఫోటోలో చిన్న చిన్న నక్షత్రాలు కనిపించాయి. తరువాత ఒక ఫోటోగ్రాఫిక్ మైక్రో ఫిల్టర్ మెజరింగ్ ఎక్విప్మెంట్ తో, అసలు సూర్యుడు లేని రాత్రి అవే నక్షత్రాలను తీసిన ఫోటోతో, ఇప్పుడు సూర్యగ్రహణం లో కనిపించిన అవే నక్షత్రాలను పోలిస్తే, అవి కొంచెం పక్కకి జరిగినట్టు కనిపించింది. అంటే ఆ రాత్రి అక్కడే ఉండాల్సిన నక్షత్రాలు కొంచెం డివియేట్ అయినట్టు కనిపించాయి, ఉండాల్సిన చోట లేవు. ఎందుకూ?

అందరూ కాసేపు మౌనంగా, క్లా..స్రూమ్ నిశ్శబ్ధంగా ఉంది. 

Hehe.... I know the answer. కానీ ఇంకెవరైనా చెప్తారా అని చుసాను..
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

ఎవ్వరూ చెప్పట్లేదు. నాకు ఆశ్చర్యం వేసింది, వీళ్ళు అకాడెమీ పుస్తకాల్లో ఉన్నది చదువుతున్నారు కానీ, ఫిజిక్స్ చరిత్ర తెలుసుకోవట్లేదా అని. నేనైతే యూట్యూబ్ లో ఇలాంటివి బాగా చూసాను. న్యూటన్, ఐన్స్టీన్, లియోనార్డో డావిన్సీ జీవిత కథలు లాంటి వీడియోలు. 

మురళీ సార్: నో సప్పుడు ఇస్ కమింగ్. 

మురళీ సార్: ది బ్రెయిన్ ఇస్ థింకింగ్. ది బ్రెయిన్ ఇస్ ప్రాసెసింగ్. ది బ్రెయిన్ ఇస్ నాట్ గివింగ్ ఆన్సర్. 

అలా అంటూ ఉంటే అందరం నవ్వుకున్నాము.

మురళీ సార్: అయ్యో ఎవ్వరికీ తెలీదా?

నేను: సార్ నేను చెప్తాను.

మురళీ సార్: యో... చెప్పు

నేను లేచి నిల్చున్న.

నేను: సార్, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తికి ఆ నక్షత్రాల కాంతి కిరణాలు సూర్యుడి పక్కన నుంచి భూమి దిక్కు ప్రయాణిస్తుంటే కొంచెం చాలా తక్కువ యాంగిల్ లో బెండ్ అవుతాయి.

మురళీ సార్: కాంతి straight గా పయనిస్తుంది, కాంతికి mass లేదు. Mass లేని object మీద గురుత్వాకర్షణ శక్తి ఉండదు. అలా ఎలా బెండ్ అవుతుంది హీరో. అసలు లాజిక్ ఏ లేదు.

సార్ నన్ను అలా వ్యంగ్యంగా అనడం నాకు నచ్చలేదు. 

అప్పుడు మళ్ళీ వాడే, వాడెవడో తెలీదు, అదే గొంతు. “ పడింది పంచు కూర్చోరా టాపర్ ”... అని వెక్కిరించాడు. 

నా నోరు ఆగదు.

నేను: ఆన్సర్ మొత్తం చెప్పలేదు. పంచుకి రెడీగా ఉండు మూడో బేంచ్....

ఒకసారి అందరూ నన్నే చూసారు. అమ్మాయిలు కూడా చూడడం నాకు కాస్త కష్టంగా అనిపించింది.

సార్ ని చూసాను. ఇక పూర్తి చెయ్యాలి.

నేను: సార్ న్యూటోనియన్ గ్రావిటీతో అది అంతవరకే లిమిట్. కాకపోతే, ఐన్స్టీన్ జనరల్ రిలేటివిటీతో, మీరు చెప్పిన ఎక్సపెరిమంట్ ద్వారా ప్రూవ్ చేసింది ఏమిటి అంటే.....

మురళీ సార్: హ్మ్... ఫార్ములేషన్ ఇవ్వగలవా?

నేను: లేదు సార్ నేను ఇది యూట్యూబ్ అండ్ కొన్ని ఆర్టికల్స్ లో చదివాను. అక్కడ బెండ్ అయ్యేది కాంతి కిరణాలు కాదు. స్పేస్ టైం ఫాబ్రిక్ మీద మన సూర్యుడి బరువు వలన ఒక డిప్(గుంత) ఏర్పడుతుంది. అంటే స్పేస్ అనేది డిస్టార్ట్ (ఒత్తిడి) అవుతుంది. దాని వల్ల ఆ స్పేస్ కర్వ్ (వొంపు) అవుతుంది.

మురళీ సార్: సింపుల్ గా చెప్పు, ఒకే.

అందరూ నిశ్శబ్దంగా నా మాటలని ప్రాతఃకాల భక్తి రాగాలలా వింటున్నారు. 

నేను: మన విశ్వంలో ఏదైనా ఈ స్పేస్ లోనే ఉండేది. మ్యాటర్ కి మాస్ ఉంటుంది.  అన్నీ ఈ స్పేస్ లోనే ఒక్కోటి ఒక్కో డైరెక్షన్, అంటే వెక్టార్ గా, ఒక వెలాసిటీ అండ్ ఆక్సెలరేషన్ తో పయనిస్తుంది అంటుకుంటే, అది స్పేస్ మీదే పయనిస్తుంది. ఉదాహరణకు, హైహ్ వే మీద కారు పోతుంటే ఒక వద్ద రోడ్డు కిందికి వొంపు ఉంటే కారు కూడా ఆ వొంపు మీద పోతుందే గాని, స్ట్రెయిట్ గా గాల్లో పోదు కదా. అలాగే, స్ట్రెయిట్ గా పయనించే కాంతి కిరణం, సూర్యుడి వలన ఆ చోట ఏర్పడిన స్పేస్ వొంపు మీద పయనిస్తుంది. అంటే అక్కడ బెండ్ అయ్యేది కాంతి కాదు, space itslef is curved.

[Image: IMG-7620.jpg]



ఈ విషయం మా క్లాస్ లో వాళ్ళకి తెలీదనుకుంటాను. అందరూ ఒక షాక్ లో ఉండిపోయారు.

మురళీ సార్: సూపర్ హరికిరణ్. చాలా బాగా ఎక్సప్లెయిన్ చేసావు.

నేను: థాంక్స్ సార్, but my name is హరికృష్ణ.

మురళీ సార్: ఓ ఒకే ఒకే.

మురళీ సార్: సరే రేపు కలుద్దాం. 


తరువాత పీరియడ్స్ చెప్పుకునేంతగా ఏమి లేవు. మధ్యాహ్నం లంచ్ చేసాక క్యాంపస్ లోనికి పోతుంటే అక్కడ చెట్టు కింద ఎవరో ముగ్గురు సీనియర్లు జూనియర్ అబ్బాయిని నిల్చోబెట్టి ఏదో ప్రశ్నలు అడగడం చూసాను.

మధ్యాహ్నం ఒక క్లాస్ మాత్రమే ఉంది. అది చూసుకొని ఇక ఇంటికి వెళ్ళాల్సిన సమయం అయ్యింది. నేను కారిడార్ దాటి బయటకు వస్తూ ఉంటే అదే చెట్టు దగ్గర తోవలో వాళ్ళు ఉన్నారు. నేను ఫోన్ తీసి టైం చూసుకుంటూ Instagram open చేసి టైంపాస్ చూస్తూ నడుస్తూ వాళ్ళని దాటేసాను. 

“ రేయ్... బ్లాక్ టీషర్ట్ ” అని నన్ను పిలిచాడు.

వెనక్కి తిరిగాను.

నేను: అన్నా...?

అతను నాలాగే ఎత్తుగా ఉన్నాడు, జిమ్ చేస్తాడేమో బాగా భారీ అనిపించాడు. 

“ ఏంట్రా ఇక్కడ మేము ఉంటే ఫోన్ నొక్కుకుంటూ పట్టించుకోకుండా పోతున్నావు ? ”

నేను: ఏ ఫోన్ అన్నా... నేను ఫోన్ తీసుకురాలేదు క్లాస్ లో allow లేదు కదా.

నా చేతిని చూసాడు. అవును ఫోన్ కనిపించదు. నాకు ఒక చిన్న మ్యాజిక్ తెలుసు. క్షణంలో నా ఫోన్ ని వెనక నా ప్యాంటులోకి పోయేలా చేయగలను. వెనక చూస్తే ముందు పొట్ట దగ్గరకి వచ్చేలా. 

అలా నేను వెనక్కి తిరుగుతూ నా ఫోన్ మాయం చేసాను. 

అతను ఆశ్చర్యంగా చూసాడు.

“ ఇందాక ఫోన్ నొక్కుకుంటూ పోయావు. ఇప్పుడిప్పుడే జేబుల్లో పెట్టుకున్నవా తీయూ బయటకి ”

నేను: లేదు బ్రో, నేను అసలు ఫోన్ తెలేదు. మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారో.

అతని పక్కన ఉన్న వాడిని అడిగాడు. 

“ ఒరేయ్ కార్తీక్, వీడు ఇందాక ఫోన్ వాడుకుంటూ నడిచాడు చూసావు కదా? ”

కార్తీక్: అవును. రేయ్ ఫోన్ తియ్యి బే. సీనియర్స్ కి రెస్పెక్ట్ లేదా. నమస్తే పెట్టి పోవాలి అని తెలీదా?

నేను: నిజం అన్నా. నేను ఫోన్ తెలేదు. 

పక్కన మూడో వ్యక్తికి చెప్పాడు.

“ సృజన్ వాడి జేబులు చెక్ చేయరా”

పొట్టిగా ఉన్నా సృజన్ వచ్చి నా జేబులు వెతికాడు. లేదు. దొరకదు. హహ... లోలోపల నవ్వుకొన్నాను.

నా జేబులూ భుజాలు నడుము దగ్గర చేతిలేస్తున్నాడు. 

నేను: అన్నా ఏంది ఇది, ర్యా...గింగ్ అనుకున్నాను, సెక్సువల్ హరాస్... మెంట్ ఏంటి నాకు?

“ రేయ్ పోనీ వాడిని, పోరా నువు ”

ఇక నన్ను వెళ్ళిపొమ్మన్నారు. 

నేను: అన్నా నీ పేరు ఏంటి?

“ నా పేరు మహేష్ ”

నేను: సరే అన్నా పోతాను.
Like Reply


Messages In This Thread
RE: కృష్ణకావ్యం - by BR0304 - 30-11-2024, 10:07 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 02-12-2024, 04:22 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 04-12-2024, 09:07 PM
RE: కృష్ణకావ్యం - by Kethan - 06-12-2024, 11:23 AM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 06-12-2024, 11:36 AM
RE: కృష్ణకావ్యం - by Hydboy - 07-12-2024, 01:05 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 07-12-2024, 02:45 PM
RE: కృష్ణకావ్యం - by Sweatlikker - 07-12-2024, 06:58 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 09-12-2024, 01:02 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 10-12-2024, 10:37 AM
RE: కృష్ణకావ్యం - by Uday - 10-12-2024, 01:26 PM
RE: కృష్ణకావ్యం - by Hydboy - 10-12-2024, 10:48 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 11-12-2024, 07:49 AM
RE: కృష్ణకావ్యం - by Uday - 11-12-2024, 02:18 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 14-12-2024, 09:26 AM
RE: కృష్ణకావ్యం - by Uday - 14-12-2024, 02:27 PM
RE: కృష్ణకావ్యం - by Ajayk - 17-12-2024, 08:30 AM
RE: కృష్ణకావ్యం - by Akhil - 17-12-2024, 04:28 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 18-12-2024, 04:03 PM
RE: కృష్ణకావ్యం - by Akhil - 18-12-2024, 04:42 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 18-12-2024, 05:00 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 18-12-2024, 08:19 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 20-12-2024, 05:36 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 20-12-2024, 07:52 PM
RE: కృష్ణకావ్యం - by Uday - Yesterday, 12:25 PM



Users browsing this thread: 17 Guest(s)