Thread Rating:
  • 91 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: కాలేజ్ బాయ్ (అయిపొయింది)
220. ఇక మొదలెడదామా!












మూడు నెలల క్రితం కేశవ్ మరియు సుహాస్ ఇద్దరూ కలిసి 'మేఘన' అనే మాస్టర్ మీద ఫైట్ చేశారు, ఇప్పుడు సుహాస్ మాస్టర్ గా మారి మరీ కేశవ్ ని కంట్రోల్ లోకి తీసుకొని శత్రువులతో ఫైట్ చేస్తున్నాడని అతనికి తెలియను కూడా తెలీదు.

సుహాస్ "పంచ్...  పంచ్...  రైట్ అప్పర్ కట్...  " అంటూ గైడ్ చేస్తూ ఉంటే, కేశవ్ అలానే ఫైట్ చేస్తున్నాడు.

సమంత గతంలో చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి, 'నువ్వు ఒకరిని కంట్రోల్ లోకి తీసుకొని ఫైట్ చేయాలి అంటే అది చాలా కష్టం, సెక్స్ చాలా సింపుల్... అందులో ప్లెజర్ ఉంటుంది, వాళ్ళు నీ కంట్రోల్ నుండి బయటకు రారు... కానీ ఫైట్ లో నొప్పి పుడుతుంది, అలా అలా నీ కంట్రోల్ నుండి బయటకు వచ్చేస్తారు. అందుకే నువ్వు చాలా ఫుల్ మైండ్ లో కంట్రోల్ చేయాలి... గుర్తు పెట్టుకో.... ఎప్పుడైనా సరే, యుద్ధం గెలవాలంటే అవతల వారి కంటే ఎక్కువ బలవంతుడుని నీ వైపు ఉంచుకోవాలి"

సుహాస్ "కంప్లీట్ రైట్ అప్పర్ కట్...  " అనగానే కేశవ్ దెబ్బకి ఆ వాచ్ మెన్ కింద పడిపోయాడు.

బాయ్1 కోపంగా కేశవ్ మీదకు వచ్చాడు, అప్పటికే కేశవ్ సుహాస్ కంట్రోల్ నుండి బయటకు వచ్చేశాడు, తన మీదకు వచ్చిన ఆ బాయ్1 ని చూసి షాక్ అవుతూ మొహానికి చేతులు అడ్డం పెట్టుకున్నాడు.

కాని తన మీద దెబ్బ పడకపోవడంతో షాక్ అయి కళ్ళు తెరిచాడు.

బాయ్1 ఇబ్బంది పడుతూ ఉన్నాడు, అతని చేయి కేశవ్ ని కొట్టడానికి గాల్లోనే ఆగిపోయింది.

కేశవ్ ఆశ్చర్యంగా చూస్తూ తన వెనక ఉన్న సుహాస్ ని చూశాడు.

అతన్ని చూసి మూడు నెలలు అవుతుంది, అప్పట్లో రక్తం అన్నా, గొడవలు అన్నా దూరం దూరంగా భయం భయంగా ఉండే వాడు, కాని ఇప్పుడు అతని కళ్ళలో వచ్చిన మార్పు కేశవ్ కి స్పష్టంగా కనిపిస్తుంది.

సుహాస్ "రా...." అని పిలిచాడు.

బాయ్1 వచ్చి సుహాస్ ముందు నిలబడి "మాస్టర్" అని పిలిచాడు.

కేశవ్ కి సుహాస్ ఎప్పుడూ మాస్టర్ అయ్యాడు అనే ప్రశ్నకి మూడు నెలలు నుండి కనపడలేదు అనే ప్రశ్న సమాధానం అయినా ఇప్పుడు తన ముందు ఒక మాస్టర్ మరో మాస్టర్ ని కంట్రోల్ లోకి తెచ్చుకోవచ్చు అనేది కొత్తగా అనిపించింది.

అదే ప్రశ్నని తన నోటితో అడిగేశాడు, కేశవ్ "ఒక మాస్టర్ మరొ మాస్టర్ ని కంట్రోల్ చేయొచ్చా...." అని అడిగాడు.

సుహాస్ చాలా కాన్సంట్రేట్ గా బాయ్1 ని చూస్తూ "నీ తలని గోడకేసి కొట్టుకో..." అని ఆర్డర్ వేశాడు.

కేశవ్ చూస్తూ ఉండగానే....  బాయ్1 తన తలని గోడకు కొట్టుకుంటూ ఉన్నాడు.

వాచ్ మెన్ పైకి లేచి వాళ్ళను చూసి పరిగెత్తుకుంటూ బయటకు పారిపోయాడు.

అయిదు నిముషాల తర్వాత...

గోడకు చిన్న బొక్క పడి అక్కడ నుండి కిందకు రక్తం దారాలు దారాలు లాగా కనిపిస్తుంది.

బాయ్1 గోడ కింద స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు.

సుహాస్ "వెళ్దాం పదా..." అన్నాడు.

కేశవ్ కి చాలా ప్రశ్నలు ఉన్నా.... సుహాస్ ని చూస్తూ లిఫ్ట్ లోకి వెళ్ళాడు.

లిఫ్ట్ సౌండ్..... ఫ్లోర్ వన్ అని వినపడగానే డోర్ ఓపెన్ అయింది.

వాళ్ళకు ఎదురుగా బాయ్2 అక్కడ పడిపోయిన హాస్పిటల్ స్టాఫ్ ని పైకి లేపి వాళ్ళను కంట్రోల్ లోకి తెచ్చుకున్నాడు.

ఇప్పుడు సుహాస్ మరియు కేశవ్ ఒక వైపు ఉంటే, సుమారు పది మందితో బాయ్2 ఉన్నాడు.

సుహాస్ తన వెనక చేతులు పెట్టి సడన్ గా గన్ బయటకు తీశాడు, బాయ్2 మోహంలో వచ్చిన నవ్వు మాయమైపోయింది.

కేశవ్ "రేయ్...  వద్దు...  వీళ్ళంతా అమాయకులు...  "

సుహాస్ గాల్లోకి కాల్చాడు, అది పేలలేదు. అలాంటి గన్ ఇచ్చినందుకు సమంతని తిట్టుకున్నాడు.

ఇప్పుడు బాయ్2 నవ్వాడు, అతని వెనక ఉన్న పది మంది సుహాస్ మరియు కేశవ్ లను చూస్తూ ముందుకు నడిచారు.



వైభవ్ కారు ఆపగానే బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ అయి కాజల్ కిందకు దిగింది.

నిషా కూడా తన వెనకే దిగి "అక్కా...  అక్కా...  వద్దు...  వచ్చేయ్...  క్రిష్ చెప్పాడు కదా...  తనతో ఉన్న ఎవరినీ ఆ 'నూతన్' ప్రశాంతంగా ఉండనివ్వడు అని... వద్దు అక్కా..." అంది.

కాజల్ అడుగులు ఆగిపోయాయి, ఏం చేయాలో అర్ధం కాక అలానే అక్కడే నిలబడి ఏడ్చేస్తుంది.

వైభవ్ గట్టిగా కళ్ళు మూసుకొని తెరిచి కోపంగా స్టీరింగ్ వీల్ ని పదే పదే కొట్టాడు.

ఇంతలో తన ఫోన్ మోగింది, "బాస్....  మిస్సిడ్ కాల్ ఉంది"

వైభవ్ గుటకలు మింగి తన నిర్ణయం తీసుకున్నాడు.

కొద్ది సేపటికి సుమారు పది మంది బాడీగార్డ్ లతో తన విల్లాలోకి ఎంటర్ అయ్యాడు.

గ్రౌండ్ ఫ్లోర్ లో వాచ్ మేన్ లేకపోవడం గోడకు తల కొట్టుకొని పడిపోయిన బాయ్1 ని చూడగానే నిషా మరియు కాజల్ ఇద్దరూ భయపడ్డారు.

వైభవ్ వెనక్కి తిరిగి "ఇద్దరూ జాగ్రత్తగా ఉండండి" అని చెప్పి తన మనుషులతో మెట్ల మీద నుండి పై అంతస్తులోకి ఎక్కారు.



మెట్ల మీద చాలా మంది మనుషులు వస్తున్నట్టు సౌండ్ రాగానే తనకు మళ్ళి అవకాశం వచ్చినందుకు సుహాస్ చిన్నగా నవ్వుకుంటూ చేయి పైకి పెట్టి చిటికే వేశాడు.


బాయ్2, సుహాస్ అదృష్టాన్ని చూసి తిట్టుకున్నాడు.

సుహాస్ చాలా తేలికగా బాయ్2 కంట్రోల్ లో ఉన్న మనుషులను పడకొట్టి సరాసరి బాయ్2 ముందుకు వెళ్ళాడు.

బాయ్2 "నువ్వెవరో నాకు తెలీదు.... నాకు ఏమయినా అయిందని తెలిసింది అంటే...." అంటూ ఆగిపోయాడు.

వైభవ్ మరియు కేశవ్ ఇద్దరూ అందరిని తప్పించుకొని ముందుకు వచ్చి చూడగా సుహాస్ ముందు ఆ బాయ్2 నిలబడి మాస్టర్ అన్నాడు.

సుహాస్ "నీ వల్ల ఇంత మందికి దెబ్బలు తగిలాయి... అంటూ హాస్పిటల్ స్టాఫ్ ని చూపిస్తూ... అందుకే ఆ కిటికీ నుండి దూకేసేయ్.... కింద పడ్డాక మళ్ళి పైకి వచ్చి మళ్ళి అలానే దూకేసేయ్... అలా మొత్తం పది సార్లు" అన్నాడు.

బాయ్2 "అలాగే మాస్టర్" అంటూ కిటికీ ఎక్కి ముందుకు దూకేశాడు.

వైభవ్ "ఓయ్....  ఓయ్....  అలా దూకేశాడు....  " అని ఆశ్చర్యపోయాడు.

కాజల్ మరియు నిషా చూస్తూ ఉండగా, తల నుండి రక్తం కారుతూ బాయ్2 వాళ్ళను తప్పుకొని మెట్లు ఎక్కి పైకి వెళ్లి మనుషులను తప్పుకొని ముందుకు వెళ్లి కిటికీ నుండి మళ్ళి దూకాడు.

కాజల్ మరియు నిషా ఇద్దరూ అతన్ని చూసి దడుచుకున్నారు, పెద్దగా "ఆ! ఆ! ఆ!.....  " అని అరిచారు.

వైభవ్ కి కూడా అతన్ని చూసి షాక్ అయ్యాడు.

అంతలోనే బాయ్2 మళ్ళి పైకి వస్తున్నాడు, కాజల్ మరియు నిషా అతన్ని చూసి దడుచుకొని మెట్లు ఎక్కి పరిగెత్తుకుంటూ పై ఫ్లోర్ లోకి వచ్చారు.

అంత మందిని కొట్టించి, ఇద్దరినీ చావు బ్రతుకుల్లో పడేసి కూడా సుహాస్ చాలా ప్రశాంతంగా ఉండడం చూసి అందరూ షాక్ గా ఉన్నారు.

కాజల్ అక్కడ కేశవ్ మరియు సుహాస్ లను చూసినా పలకరించలేకపోయింది.

సుహాస్ అందరిని తప్పించుకోని లిఫ్ట్ లోకి వెళ్తూ, అందరిని చూసి "అందరూ జాగ్రత్తగా ఇక్కడే ఉండండి...  'నూతన్' ని చంపి వస్తాను..." అంటూ లిఫ్ట్ లోకి వెళ్ళాడు.

లిఫ్ట్ డోర్స్ ఆటోమేటిక్ గా క్లోజ్ అయ్యాయి.

సుహాస్ కళ్ళలో కోపం కసి చూస్తుంటే అందరికి కొత్తగా ఉన్నా ఎవరూ ఆపలేదు.

'ఫైనల్ ఫ్లోర్' అని లిఫ్ట్ సౌండ్ వచ్చింది, లిఫ్ట్ డోర్ ఓపెన్ అయింది.


















All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 14 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: కాలేజ్ బాయ్ - by 3sivaram - 07-12-2024, 06:18 PM



Users browsing this thread: 2 Guest(s)