Thread Rating:
  • 21 Vote(s) - 3.24 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance కృష్ణకావ్యం
6. అనుమానం



ఇక్కడ ఒక సంధర్భం గురించి చెప్పుకోవాలి, అందుకే ఇది చెప్తున్నాను.

తరువాత మీమో పెళ్ళి డిన్నర్ ఫంక్షన్ కి పోయాము. నేను వేద్ గాడిని పట్టుకొని ఉన్న. వదినా అన్నయ్యా పెద్దమ్మ, అందరం కలసి ఫంక్షన్ హాల్ లోనికి పోయాము. అది పైన ఫ్లోర్ లో ఫంక్షన్ జరుగుతుంటే కింద ఫ్లోరులో భోజనాలు సిద్ధం చేశారు. 

మనకి తెలిసిందే, ఇసోంటి ఫంక్షన్లలో మనం పీకేదేమీ లేదు.

అక్కడ మా వదినకి తన పిన్ని వాళ్ళు కలిసారు. వాళ్ళతో మా కుటుంబం పోయింది. 

నేను వేద్ గాడిని పట్టుకొని, ఒక ఫ్యాన్ కింద కుర్చీ చూసుకొని కూర్చున్న. 

వాడికి నా ఫోనులో రైమ్స్ చూపిస్తూ ఉన్న. పక్కన ఒక అంకుల్ నన్నే చూసాడు. 

ఇది కూడా మనకి తెలిసిందే, కాపురం లేని కుక్క కాలిగా కూర్చుంటే, మెదట్ల పురుగు మెసిలిన పిలగాడచ్చి దాని తోక లాగిండంట.

అంకుల్: పిలగా ఎవరి కొడుకువి నువ్వూ?

నేను: మా నాన్న కొడుకుని అంకుల్

అంకుల్: అదే మీ నాన్న ఎవరూ?

నేను: నాకు తండ్రి.

అంకుల్: జబ్బర్థస్త్ చూస్తావా పిలగా?

నేను: లేదంకుల్, సినిమాలు చూస్తాను.

అంకుల్: జెంద్యాల సినిమాలా?

నేను: త్రివిక్రం సినిమాలు అంకుల్

అంకుల్: వెటకారమా?

నేను: చమత్కారం అంకుల్...

ఇక మొహం అటు తిప్పుకున్నాడు. 

అప్పుడే మా అన్నయ్య నన్ను పిలిచాడు. 

సంతోష్: ఒరేయ్ స్టేజ్ మీద ఫోటో దిగుదాం రా...

నేను: మీరు దిగండి నన్ను పిలవకు నువ్వు.

సంతోష్: వేద్ రారా కన్నా నువ్వు. 

అన్నయ్య పక్కన ఉన్న అంకుల్ ని చూసాడు.

సంతోష్: ఓహ్ మోహన్ మామ మీరేనా, బాగున్నారా? ఇప్పటిదాక అతయ్యతోనే ఉన్నాము.

మోహన్: అంతా మంచిదేనా? 

సంతోష్: హా మామ... వాడు మా తమ్ముడే, గుర్తున్నాడా?

మోహన్: హా... అదే అడుగుతున్న.

వేద్ గాడు వాళ్ళ నాన్న దగ్గరకి పరిగెత్తాడు.

అంకుల్: ఓహో నువు సంతోష్ తమ్ముడివా, నాకు అల్లుడివే అవుతావు. మా సంధ్య నీ గురించి రెండు మూడు సార్లు చెప్పిందిలే. బాగా ఎత్తు పెరిగావు.  గుర్తు పట్టావా నన్ను?

నేను: నాకు మతిమరుపు ఎక్కువ అంకుల్ క్షమించండి.

అంకుల్: హ్మ్... అప్పట్లో సరిగ్గా కలవలేదులే మనం.

నేను: హ్మ్...

ఇక అంకుల్ నాతో మాట్లాడకుండా ఉన్నాడు. నేను అలా అక్కడున్న జనాల మొహాలు చూస్తూ ఉన్న.

అంకుల్: ఇంకేం సంగతి పిలగా?

నేను: తినేసి వెళ్ళిపోవడమే అంకుల్.

అంకుల్: హహహ.... చదువు?

నేను: గ్రాడ్యుయేషన్ అయిపోయింది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దాం అనుకుంటున్న.

అంకుల్: మంచిగా చదువుకొని ఒక ఉద్యోగం చూసుకో పిలగా, నీకూడా పెళ్ళీడు వచ్చేసింది.

నేను: అప్పుడేనా? 

అంకుల్: ఆరడుగులు ఉన్నావు, ఎర్రగానే ఉన్నావు ఇంకేంది అల్లుడు. మంచి పిల్లని చూసి పెడతాలే. 

నేను: మీకు లేరా అంకుల్ ఆడపిల్లలు?

నా నోటి దూల తగలెయ్య.

అంకుల్: హహహ.... తరువాత కలుద్దాం, ఎప్పుడైనా మీ వదినతో మా ఇంటికి రండి.

నేను: హా సరే అంకుల్.

వెళ్ళిపోయాడు. 

అంకుల్ వల్ల నాకు కాసేపు బోర్ కొట్టకుండా ఉంది. 

నాకు ఎవరితో పని లేదు, కిందకి దిగి మటన్ భగా తిన్న. మెట్లు ఎక్కి పైకి వచ్చేసరికి ఫోనులో ఏదో మెసేజ్ వచ్చిందని ఆగి చూస్తూ మెట్లు దాటి నడుస్తుంటే ఒక అమ్మాయి నాకు ఎదురొచ్చింది.

ఆగాను. 

ఆమె కాళ్ళని చూస్తూ ఉన్న, గంధం రంగు ఎంబ్రాయిడరీ లంగాలో చెంకీల మెరుపు, నా ముందే నిలుచొని ఉంది. 

నేను తనకి ధారివ్వాలని కుడికి అడుగేసాను. తను ఎడమకి అడుగువేసింది. 

అరె ఏంటిది అనుకొని, నేను ఎడమకి అడుగువేశాను, తను కుడికి అడుగు వేసింది. 

ఉఫ్... మళ్ళీ కుడికి జరిగాను, తనూ ఎడమకి జరిగింది.

నేను కదలకుండా  నిల్చున్న. ఎడమ నుంచి నన్ను దాటేసింది. 

మరుక్షణం, ఎవరో నా కళ్ళను చేతులతో మూసి నన్ను వెనక్కి వంచేసారు. నేను కొంచెం కిందకి ఒరిగాను.

నా వీపు ఆ అమ్మాయి రొమ్ముకి తగులుకుంది.

వెచ్చని శ్వాస నా చెవి మీద తగిలింది. నా చెవికి మాత్రమే వినిపించే తియ్యని అమ్మాయి శ్వాస స్వరం. 

అమ్మాయి: ఏంటి బావ ఎప్పుడూ ఇలా తోవలో నిల్చుంటావు, నీకు వేరే పనిలేదా? ముద్దూ ముచ్చట కావాలంటే నన్ను అడకొచ్చుగా, చుట్టాలతో cringe jokes ఎందుకు నీకు?

నా బుగ్గ మీద ముద్దిచ్చింది. నేను ఆశ్చర్యంలో ఉండిపోయాను. తను విడిచి మెట్లు దిగింది. వెనక్కి తిరిగి చూసేసరికి, జింకలా తప్పించుకుంది. 

నేను దిగి చూద్దాం అనుకునేలోపు, వెనక మా మామయ్య పిలిచాడు.

ఈ మేనమామ గాడు ఒకడు, వాడి కూతురిని చేసుకుందాం అంటే పిలల్లు లేరు. ఇక్కడ ఇంకో పిల్లని చూద్దాం అంటే చూడనివ్వడు. ఛ...

అసలు ఆ అమ్మాయి ఎవరు? ఎందుకలా చెప్పింది? నన్ను బావ అని ఎందుకు పిలిచింది? ఏమి అర్ధం కాక జుట్టు పీక్కున్న. నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారా? లేక ఆ అమ్మాయి నన్ను ఆపట్టిద్ధాం అనుకుందా? ఏమీ తేలక ఆలోచిస్తూ మా వాల్ల దగ్గరకి పోతుంటే, దారిలో ఇద్దరు ఆంటీలు నన్ను చూసి ముసిముసిగా నవ్వుకున్నారు. 

ఏంటో అనుకుంటూ ముందుకి వెళుతూ ఉంటే, ఒక అంకుల్ కూడా పక్కున నవ్వాడు నన్ను చూసి. 

మా వాళ్ళకి ఇంకా దగ్గరకి పోతుంటే, అటు వైపు ఉన్న ఇంకో నలుగురు కూడా నవ్వడం నాకు వినిపించింది. 

మా వాళ్ళకి దగ్గరవ్వగానే, మా వదిన కూడా మూతి మీద చెయ్యేసుకొని నవ్వుతూ నన్ను మా అన్నయ్యకి చూపించింది. మా అన్నయ్య తల మీద చెయ్యేసుకున్నాడు. 

వదిన నా దగ్గరికొచ్చి నన్ను ఫోటో తీసింది ముసిముసిగా నవ్వుతూ. 

తీసి నాకు ఆ ఫోటో చూపించింది. 

అందులో నా బుగ్గ మీద అమ్మాయి ముద్దు. లిప్స్టిక్ పెదువుల ముద్ర ఎర్రగా ఉంది.

ఝల్లుమంది నాకు, సిగ్గేసింది. అందుకే నన్ను చూసినవాళ్ళందరూ నవ్వుతున్నారు. 

గబుక్కున జేబులోంచి కర్చీఫ్ తీసి చెంప తుడుచుకున్నాను. 

సంధ్య: దొంగ మరిదిగా ఎవర్రా ముద్దు పెట్టింది?

నేను: నాకు తెలీదు వదినా

సంధ్య: అబఃచ్చా తెలీకుండానే అమ్మాయిల చేత ముద్దులు కూడా పెట్టించుకుంటున్నావా నువు.

సంతోష్: నకరాలు ఎక్కువ ఐతున్నాయి బిడ్డా నీకు. ఇంటికి పా చెప్తా నీ పని.

నేను: అయ్యో అన్నయ్య నాకేం తెలేదురా.

వాళ్ళని చూసి వేద్ గాడు కూడా నవ్వాడు. వాణ్ణి ఎత్తుకున్న.

నేను: ఏంట్రా నీకేం అర్థం అయ్యింది అని నవ్వుతున్నావు. పుస్కి...

సంధ్య: హహ...

అప్పుడే మా పెద్దమ్మ వచ్చేసరికి ముగ్గురం మూస్కున్నాము. కానీ మా వదిన మాత్రం ఇంటికి వెళుతున్న దారిలో నన్ను చూసి నవ్వుతూనే ఉంది.


ఇంట్లోకి పోయాక, బాగానే తిన్నాం, కాసేపు టీవీ చూసాము అంతా సరి అనుకునేసరికి, వదిన నా గదికి పాలు పట్టుకొని వచ్చింది.

సంధ్య: ఎంతగానం పొగిడావురా ముద్దు పెట్టేసింది?

నేను నా చేతులు జోడించాను.

నేను: అయ్యో వదినా, నిజంగా నాకేం తెలీదు. ఒక అమ్మాయికి డాష్ ఇచ్చాను అంతే.

సంధ్య: హహహ....

కుర్చీలో ఉన్న నా వెనక, నా భుజాలు చుట్టేసి వొంగి, ధరహాసంగా నా బుగ్గ ముద్దిచ్చింది.

సంధ్య: నీకంత సీన్ లేదని నాకు తెలుసురా అమాయకపు మరిది. ఇవాళ చదువుకోకు. పాలు తాగి నిద్రపో సరేనా.

నేను: హ్మ్... గుడ్ నైట్..

సంధ్య: గుడ్ నైట్.



=======
=======


ఆ పెళ్ళి తరువాత రోజు నుండీ నేను ఎంట్రన్స్ పరీక్షల కోసం చదవడం మొదలు పెట్టాను. ప్రాబ్లం సాల్వ్ చేయడం, థియరీ చదువుకోవడం ఇవన్నీ చేస్తున్నా నాకు, ఫిజిక్స్ లో కొన్ని టాపిక్స్ చదువుతున్నా కొద్ది అసలు ఈ విశ్వం ఎందుకని ఇలా ఉంది? దేవుడు ఉన్నాడా లేడా? ఇంత యాదృచికంగా చాలా సంఘటనలు ఎలా జరుగుతాయి ఈ విశ్వంలో? గతంలోకి, భవిష్యత్తులోకి పోవడం సాధ్యమా కాదా? ఇటువంటి చాలా ప్రశ్నలను ముందేసుకుని, పుస్తకంలో ఉన్న అసలు ప్రశ్నలను విడిచి కూర్చునే వాడిని.

ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ చేయడంలో నేనో ప్లెషర్ పొందే వాడిని. న్యూటన్ చెప్పినట్టు ఒక వస్తువుకి శక్తి ఇస్తే కానీ అది కదలదు, మరి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందీ అంటే ద్రవ్యరాశి రూపంతరంలో వెలువడేదే అది అని, ద్రవ్యరాశి ఏర్పడ్డానికైనా శక్తి కావాలి, అసలు మొదటగా ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది, బిగ్భ్యాంగ్ అనేది నిజమేనా, లేక పురాణాలలో చెప్పినట్టు దేవుడి సృష్టి అన్నట్టా, అన్నీ ఆలోచిస్తూ, ఫిజిక్స్ ని మతాలతో పోల్చడం ఇలాంటివి బాగా అలవాటు అయిపొయింది నాకు.

అలా ఆలోచించుకుంటూ ఒకరాత్రి తొమ్మిది తరువాత నా గది తలుపు దగ్గర ఆలోచిస్తూ తిరుగుతూ ఉంటే వదిన వచ్చింది. 

సంధ్య: హరీ ఛాయి పెట్టివ్వాలా?

నేను: నేను పెట్టుకుంటానులే వదినా

సంధ్య: ప్రాక్టీస్ చేస్తున్నావు కదరా, ఉండు పెట్టుకొస్తాను.

వదిన పోయి పది నిమిషాల తర్వాత చిన్న కప్పులో ఛాయి పట్టుకొని వచ్చింది.

నేను వదినా తలుపు దగ్గరే, నేను తలుపుకి ఒరిగి మాట్లాడుకుంటూ ఉన్నాము.

నేను: వేద్ పడుకున్నాడా?

సంధ్య: హా...

నేను: నువు వెళ్ళు వదినా, నేను మెల్లిగా నిద్రపోతాను, ఛాయి తాగుతున్న కదా ఇప్పుడే రాదు, ఒక్కటి దాకా ఉంటాను.

సంధ్య: హ్మ్... అయినా ఇవాళా నాకు నిద్ర రావట్లేదులేరా.

నా ఆలోచనలను పేపర్లలో పెట్టి, ఏవో ఏవో లెక్కలూ, బొమ్మలూ గీసి నా గది గోడకు తలిగించేవాడిని. అవి చూసింది.

సంధ్య: ఇవన్నీ ఎందుకు హరీ ఏదో సైన్స్ లాబ్ లో ఉన్నట్టు అతికించావు?

నేను: అవి ఒకటి అనుకుంటున్నా వదినా, ఈ పురాణాలలో కూడా చాలా వరకు నక్షత్రాలు, గ్రహాలు, వీటి వల్ల మన బ్రతుకు నడుస్తుంది అని అంటారు కదా. 

సంధ్య: అంటే జోతిష్యం

నేను: అలా అని కాదు.

వదిన కాస్త నాకు దగ్గరకి వచ్చింది. నా పక్కన తలుపు చెక్కకి చెయ్యి నొక్కి పెట్టి నా మొహం కింద మొహం పెట్టి చూసింది. 

ఏంటో ఆ పెదవులు చూస్తే నాకేదో ఐపోయింది. వాటిని ముద్దు చేసే నా కలలు నా మదిలో మెదిలాయి.

సంధ్య: మరి జోతిష్యం అంటే అదే కదా, పుట్టిన తిథి, నక్షత్రం ఉంటాయి కదా?

నేను: అలా అని కాదు, ఇప్పుడు సూర్యుడి కాంతి వల్లే ఈ చెట్లకి ఫొటోసింథిసిస్ జరుగుతుంది, మన  భూమి వేడెక్కుతుంది, రుతువులు మారుతాయి. 

సంధ్య: హ్మ్మ్... అవును.

నేను ఛాయి ఒక సిప్ తాగాను.

నేను: ఇలా గ్రహణాలు ఉంటాయి, చెంద్రుడుకి పున్నమి, అమావస్యలు ఇవన్నీ మనకి తెలుసు.

వదిన నా ఒళ్ళోకి వచ్చేసింది. నా కళ్ళలోకి కోరగా చూస్తూ పెదవులు చిన్నగా నవ్వు విరిచింది.

నాకేం అర్థం కాలేదు. నా కప్పు ఆమె భుజం తాకుతుంది. పక్కకి జరిపాను. ఇంకాస్త దగ్గరకొచ్చింది, నన్ను తలుపుకి ఆనేస్తూ ఒకవైపు నన్ను చుట్టేస్తూ. 

సంధ్య: హ్మ్.... 

తన గొంతు నాకు ఎందుకో మత్తుగా అనిపించింది.

నేను: చంద్రుడికి ఇరవై ఏడు భార్యలు ఉన్నారని ఇరవై ఏడు నక్షత్రాలకు పేర్లు పెట్టారా లేక...

సంధ్య: ఛాయి బాగుందా?

నా మెడలో వేలు నిమిరింది. నేను చెప్పేది ఆగింది.

నేను: హా బాగుంది.

సంధ్య: చెప్పు ఏదో అంటున్నావు?

నేను: అదే లేక ఇరవై ఏడు నక్షత్రాలు కదలిక వలన అలా చెంద్రుడి భార్యలు అనే కథ రాశారా అని.

సంధ్య: గొప్ప డౌటే వచ్చింది నీకు. అంటే దేవుళ్ళు లేరు అంటున్నవా, అన్నీ కథలు అంటావా?

నేను: అలా అని కాదు, లేదా దేవుళ్ళు ఉన్నారు కాబట్టే మనకి తెలిసిన సైన్స్ ఒక ప్రాపర్ సూత్రాలతో నడుస్తుందా అని.

మళ్ళీ ఛాయి జుర్రాను.

సంధ్య: అంటే ఏంటి ఇప్పుడు నువు దేవుడు ఉన్నాడా లేడా అని ఈ పేపర్లలో గీతలతో తెలుసుకుంటావా?

నేను: అలా అని కాదు.

సంధ్య: ఇది కాదు గాని, నేనోటి అడుగుతాను.

నేను: అడుగు వదినా?

సంధ్య: ఫంక్షన్లో నీకు ఎవరు ముద్దిచ్చారు?

నేను: మళ్ళీ అదేనా, నాకు తెలీదు.

సంధ్య: నిజం చెప్పరా, లవర్ ఉంది కదా నీకు, దొంగ మరిది, నన్ను చాటుగా గుచ్చి గుచ్చి చూస్తావు. చాటుగా లవర్ ని కూడా మెయింటెయిన్ చేస్తున్నావు కదా?

నాకు నవ్వొచ్చింది. నేను అమ్మాయిలతో మాటలే కష్టం అనుకుంటుంటే మా వదిన నన్ను కృష్ణుణ్ణి చేసేస్తుంటే.

సంధ్య: నవ్వుతున్నావు అంటే నిజమా?

నేను: అబ్బ కాదు వదినా. చెప్పిన కదా ఒక అమ్మాయి డాష్ ఇచ్చింది. ఆమె లిప్స్ నాకు తాకినాయి అంతే.

సంధ్య: ఇంత పొడుగున్నావు. నీకు ఎలా ముద్దు పెట్టింది అలా డాష్ లో లాజిక్ లేదు మరిదీ?


అమ్మో వదినా ఇప్పుడు నేను లాజిక్ ఎక్కడ వెతకాలి? జరిగింది ఇలా అని, ఆ అమ్మాయి బావ అని పిలిచింది అని చెప్తే కథ అల్లేస్తది వదిన.

ఈ విషయం ఇక్కడితో కొట్టేయడం మంచిది అనిపించి నా పరుపు వైపు అడుగేసాను.

నేను: అది ఏదో ఆక్సిడెంట్ లో అయిపోయింది. దానికి లాజిక్ ఎలా చెప్తాము.

నేను మొహమాటం, సిగ్గుతో మొహం తిప్పుకుని అటు తిరిగేసాను. 

నా భుజాలు పట్టుకొని నన్ను వెనక్కి వంచింది. నా చెవి దగ్గర మొహం పెట్టింది.

సంధ్య: లేదు, మరిదీ లాజిక్ లేదు, ఐదున్నర అడుగుల ఉన్నా నాకు నీ చెంప అందదు కదా?

నేను: ఎందుకు అందదు వదిన ఇలా పట్టుకొని నన్ను ఇగ్గితే అందదా చెప్పూ...

అలా నేను నా మెడని ఎడమకి తిప్పాను. నా పెదవులు మా వదిన చెర్రీ పెదవులకు తగులుకున్నాయి. 

ఇద్దరం షాక్ కొట్టినట్టు బిగుసుకుపోయాము. ఆశ్చర్యంలో నన్ను వదిలేసింది. 

నేను ముందుకి జరిగాను. నాకు వణుకొచ్చేసింది ఏంటి ఇలా అయ్యిందని. వదిన పరిస్థితి ఏంటో, నాకు భయం పుట్టుకుంది. తిడుతుందో, కొడుతుందో, ఇంకేం అంటుందో అని.

నేను: ఇలాగే ఆక్సిడెంట్ అయ్యింది వదినా…… అన్నాను వణుకుతూ.

తను వెళ్లిపోయింది. నేను వెనక్కి తిరిగి చూసేసరికి లేదు.


మరుసటి రోజు నేను వదినని సూటిగా చూడలేకపోయాను. జరిగింది ఒక ఆక్సిడెంట్ అని ఆమెకి కూడా తెలుసు అందుకే నన్ను తిట్టలేదు. 

అది తలచుకుంటూ నాలో మరిన్ని కోరికలు పెరిగాయి. వదిన పెదవుల వెచ్చదనం అలాగే నన్ను అల్లేసుకుంది.

ఇది జరిగిన కొన్ని రోజులకి అంతా మాములుగా అయ్యింది అనుకుంటున్నప్పుడు, వదిన నాతో మాట్లాడిన ప్రతీసారి నాకు దగ్గరగా జరగడం, ఎక్కువగా నా ముందు సిగ్గు పడడం నేను గమనించాను. మరి తను కావాలనే చేస్తుందో, లేక నాకే అలా అనిపిస్తుందో తెలీదు.

సహజంగా మా వదిన అస్తరు బ్లౌజ్ మాత్రమే వేసుకుంటుంది, లోపల బ్రా ఉండదు. ఎటైనా ఫంక్షన్స్ కి పోతేనే బ్రా వేసుకుంటుంది. పంజాబీ డ్రెస్ వేసుకుంటే లోపల బ్రా వేసుకోవడం నాకు తెలుసు. వేద్ పుట్టాక, తను కాస్త బొద్దుగా అయ్యింది, ఆ తరువాత పంజాబ్ డ్రెస్సులు మానేసింది. కేవలం చీరలు, రాత్రి నైటీలు వేసుకుంటుంది. నైటీలో బ్రా ఉంటుంది అది తెలుసు.

జూలై నెలలో, వేద్ గాడిని ఇక బడికి పంపించడం మొదలు. వాడిని మొదట్లో వదినే దింపేసి వచ్చేది, ఇక ఇప్పుడు నేనే దింపి వస్తున్నాను. అన్నయ్య ఆఫీసుకి వెళ్తాడు, పెద్దమ్మ ఇంటిని పెద్దగా పట్టించుకోకుండా పక్కింటిల్లతో ముచ్చట్లు పెడుతూ ఉంటుంది. ఇలా ఉండగా, ఆ సమయాల్లో రెండు సార్లు అనుకుంటాను, నాకు వదిన నైటీలో కూడా బ్రా వేసుకోలేదు, నేను వదినని చూడడం వదినకి తెలుసు. ఆమె చనుమొనల ఆకరం ఆ నైటీలో కనిపించాయి. అవి నేను క్షుణ్ణంగా గమనించడం, నా చూపులు వదిన పట్టేసింది. వదిన నేను చూసిన ప్రతీ సారి నేను చూపు తిప్పుకున్నాక తను లోలోన నవ్వుకునేదో, లేక సిగ్గుపడేదో అని నాకు అనిపించేది.

ఇవన్నీ తలుచుకుంటూ నాకు అసలు వదిన నానుంచి కేవలం పొగడ్తలు మాత్రమే కోరుకుంటుందా లేక, తనకెవైనా అధిక ఉద్దేశాలు ఉన్నాయా అనే అనుమానం నాలో మొదలైంది. 

అన్నయ్యకి నేను వాళ్ళ గదిలో ఇంత పెద్దయ్యాక కూడా పడుకోవడం ఇబ్బందిగా ఉంది అని చెప్తే నాకెందుకు మద్దతు పలకాలి? ఏదో ఫోన్ ఆడుకొని పడుకుంటాడులే అని అనుకోవచ్చు కదా, నన్నెందుకు ఒళ్ళో తల వాల్చుకొని నెత్తి దువ్వాలి? అది కూడా ఆమె అందాలు నా మొహం దగ్గరకి పొడుస్తూ.


రోజులు గడుస్తూ, ఇక నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ మొదలు అయ్యింది.


ఆగస్టు మొదటి వారం, 

ఆరోజు మొదటి రోజు కాలేజీకి పోవాలి, కానీ నేను ఆలస్యంగా లేచాను. తయారయ్యాను. అన్నయ్య ఎనమిది ముప్పైకే ఆఫీసుకి వెళ్తాడు. ఈరోజు వేద్ ని అన్నయ్యనే బడిలో దింపేసి వెళ్తాను అంటే వదిన అన్నకి లంచ్ బాక్స్ పెట్టిచ్చింది. అన్నయ్య వేద్ ఇద్దరూ వెళ్ళిపోయారు. పెద్దమ్మకి ఇడ్లీ పెట్టిచ్చింది. నేను పెద్దమ్మకి ప్లేట్ ఇచ్చి వంటగదిలో పోయాను. 

నేను: వదిన నాలుగు చాలు, ఎక్కువ తింటే అసలే ఇవాళ మొదటి రోజు. 

సంధ్య: ఏం కాదురా నువు ఎప్పుడైనా ఐదు తింటావు కదా.

నాకు కాలేజ్ పదింటికి. ఇక్కడ నేను బస్ తొమ్మిదింటికి ఎక్కినా అర్థ గంట బస్ ప్రయాణం, అక్కడ బస్టాప్ నుంచి కాలేజ్ పావుగంట నడక. అందుకని తొందర పడుతూ వంటగదిలో వదిన ప్లేట్ ఇవ్వగానే తినడం మొదలు పెట్టి బుక్క పెట్టుకుంటే నాకు ఉక్కపట్టింది. దగ్గుతూ ఉంటే వదిన మంచి నీళ్లు ఇచ్చింది. నాకు దగ్గరగా వచ్చి నెత్తి మీద తట్టింది.

సంధ్య: నిదానం హరి... ఎందుకు తొందర.

నేను: హ్మ్.... బస్సులు రాకపోతే లేట్ ఐపొద్ది వదినా అందుకే.

సంధ్య: ఏమి కాదు. అక్కడ కూర్చొని తీరిగ్గా తిను. ఫస్ట్ రోజు లేట్ అయితే ఏమి కాదులే. ఏదేమైనా స్కూ...ల్ ఆ ఏంటి?

నేను: సరే.... వదిన బాటిల్ లో నీల్లు నింపి బాగ్ లో పెట్టవా?

సంధ్య: నేను పెడతానులే నువు తినుపో.

అలా నేను తిని చెప్పులు వేసుకొని వెళ్ళడానికి సిద్ధం అయ్యాక, బై చెప్పబోతుంటే నా చెయ్యి పట్టుకొని నన్ను దగ్గరకి తీసుకొని నా మొహం వొంచింది. అప్పుడు నేను స్పష్టంగా చూసాను, వదిన నా చెంప ముద్దు పెట్టుకోబోతూ ఆమె పెదవులు నా పెదవులను వెతకడం. 

కానీ టక్కున నన్ను వదిలేసింది, నేను చూడడం తెలిసిందేమో.

సంధ్య: జాగ్రత్త హరి.

నేను: హా వదిన వెళ్లొస్తాను.


ఎందుకో ఈ అనుమానం తెలీదు. వదినని నా బుర్రలోకి బాగా ఎక్కించుకున్నానా? 
అందుకే నాకు ఇలా అనిపిస్తుందా?


|—————————+++++++++++++

మీ కామెంట్ తో అభిప్రాయం చెపితే బాగుంటుంది. Namaskar
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
RE: కృష్ణకావ్యం - by BR0304 - 30-11-2024, 10:07 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 02-12-2024, 04:22 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 04-12-2024, 09:07 PM
RE: కృష్ణకావ్యం - by Sweatlikker - 06-12-2024, 11:07 AM
RE: కృష్ణకావ్యం - by Kethan - 06-12-2024, 11:23 AM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 06-12-2024, 11:36 AM
RE: కృష్ణకావ్యం - by Hydboy - 07-12-2024, 01:05 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 07-12-2024, 02:45 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 09-12-2024, 01:02 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 10-12-2024, 10:37 AM
RE: కృష్ణకావ్యం - by Uday - 10-12-2024, 01:26 PM
RE: కృష్ణకావ్యం - by Hydboy - 10-12-2024, 10:48 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 11-12-2024, 07:49 AM
RE: కృష్ణకావ్యం - by Uday - 11-12-2024, 02:18 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 14-12-2024, 09:26 AM
RE: కృష్ణకావ్యం - by Uday - 14-12-2024, 02:27 PM
RE: కృష్ణకావ్యం - by Ajayk - 17-12-2024, 08:30 AM
RE: కృష్ణకావ్యం - by Akhil - 17-12-2024, 04:28 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 18-12-2024, 04:03 PM
RE: కృష్ణకావ్యం - by Akhil - 18-12-2024, 04:42 PM
RE: కృష్ణకావ్యం - by BR0304 - 18-12-2024, 05:00 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 18-12-2024, 08:19 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 20-12-2024, 05:36 PM
RE: కృష్ణకావ్యం - by Uday - 20-12-2024, 07:52 PM
RE: కృష్ణకావ్యం - by Uday - Yesterday, 12:25 PM



Users browsing this thread: Bala subbu, Bhavin, 23 Guest(s)