05-12-2024, 07:21 PM
(This post was last modified: 05-12-2024, 08:14 PM by 3sivaram. Edited 2 times in total. Edited 2 times in total.)
217. సంగతులు
ఇషా "హమ్మయ్యా.... ఇప్పటికి కాల్ చేయాలని అనిపించిందా.... "
కాజల్ "ఏంటి మేడం! అలా మాట్లాడుతున్నారు.... "
ఇషా "అసలు ఆఫీస్ సంగతి మర్చిపోయావ్ అనుకున్నా.... "
కాజల్ "ఏమయింది? సంగతులు ఏంటో చెప్పూ.... "
ఇషా "ఏముంటాయి.... మా ఆయన స్టేషన్ కి వెళ్తున్నాడు, నేను ఆఫీస్ కి వెళ్తున్నా.... అంతే.... "
కాజల్ "ఆఫీస్ లో కూడా సంగతులు ఏం లేవా.... "
ఇషా "మా సంగతి ఏముంది లే కానీ.... నీ సంగతి చెప్పూ.... నిన్న మొన్నటి దాకా దిగాలుగా ఉండే దానివి ఇవ్వాళా చాలా హ్యాపీగా ఉన్నావ్.... "
కాజల్ నవ్వేసి "నువ్వు భలే పసిగట్టేస్తావ్" అని మెచ్చుకుంది.
ఇషా "హుమ్మ్.... మా సంగతి ఏముంది లే కానీ సంగతి ఏంటి? బ్రదర్ తో గొడవలు అన్ని తగ్గిపోయాయా.... "
కాజల్ "హుమ్మ్"
ఇషా "అయితే నిజంగానే గొడవలు అయ్యాయి అన్నమాట చెప్పూ.... చెప్పూ.... అసలేం జరిగింది... ముందు ఎవరు సారీ చెప్పారు.... చెప్పూ.... చెప్పూ.... "
కాజల్ "గాసిప్ లు అంటే అంత ఇష్టం ఎంటే నీకూ.... "
ఇషా "అబ్బా.... నువ్వు ముందు చెప్పమ్మా.... చెప్పూ.... చెప్పూ.... "
కాజల్ "మా లైఫ్ లో ఏముంటాయ్ చెప్పూ.... "
ఇషా "ఎదో ఉందిలే.... చెప్పూ.... చెప్పూ.... చెప్పమ్మా.... "
కాజల్ "మా ఆయనకీ ఎవరో లవ్ డ్రగ్ ఇచ్చారు.... "
ఇషా "వాట్.... "
కాజల్ "లవ్ డ్రగ్.... అంటే సెక్స్ డ్రగ్.... "
ఇషా "మ్మ్.... మ్మ్.... అర్ధం అయింది.... "
కాజల్ "హుమ్మ్" అంటూ ఆమె నెక్స్ట్ క్వశ్చన్ కోసం ఎదురు చూస్తుంది.
ఇషా "మరి ఏమయింది?"
కాజల్ "ఏముంది.... మా మొండోడు కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు అంట.... అవతల వాళ్ళు ఇంకా ఇంకా డ్రగ్ కలుపుతూనే ఉన్నారు.... "
ఇషా "అయ్యో.... "
కాజల్ "హుమ్మ్.... నాతో దూరంగా ఉండే సరికి నేను ఎదో అనుకున్నా ఇది అని తెలిసింది.... "
ఇషా "మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు"
కాజల్ "హాస్పిటల్ లో ఉన్నాము.... ఇప్పుడు పర్లేదు మాములుగానే ఉన్నాం.... డాక్టర్ కూడా న్యాచురల్ గా తగ్గిద్దాం అన్నారు.... "
ఇషా "న్యాచురల్ గానా.... మరి.... మరి.... "
కాజల్ "ఏంటి మరీ.... "
ఇషా "న్యాచురల్ అంటే ఓహ్...కే... ఓకే... "
కాజల్ "ఎంటే ఓకే... ఏం ఆలోచిస్తున్నావ్... న్యాచురల్ అంటే ఆయుర్వేదిక్... "
ఇషా "ఓహ్... ఓకే... ఓకే... ఆయుర్వేదిక్... నేను కూడా అదే అనుకున్నా" అంటూ నవ్వేసింది.
కాజల్ కి తను కచ్చితంగా అది అనుకోలేదు అని అర్ధం అయి నవ్వుకుంటూ "హుమ్మ్" అంటూ మాట్లాడుతుంది.
ఇషా "ఇంతకి ఎక్కడ ఉన్నారు... "
కాజల్ "ఎందుకు?"
ఇషా "ఎందుకేంటి? కేశవ్ కి చెబుతాను.... ఇన్వెస్టిగేషన్ చేయిస్తాడు... "
కాజల్ "హుమ్మ్... సరే... లొకేషన్ పంపిస్తాను"
ఇషా "హుమ్మ్... సరే... "
కాజల్ "ఇంకేంటి సంగతులు చెప్పూ.... "
ఇషా "సంగతులు అంటే ఇంకేం ఉంటాయ్.... హా!... సుహాస్ సర్ కూడా మూడు నెలలు క్రితం రిజైన్ పెట్టి వెళ్ళిపోయాడు... "
కాజల్ "హుమ్మ్... అవునూ ఎక్కడకు వెళ్ళిపోయాడు... "
ఇషా "తెలియదు... "
కాజల్ "మరి ఏం తెలుసు... " అంటూ కొంచెం కోపంగా అడిగింది.
ఇషా "నిన్న సోషల్ మీడియా లో మెసేజ్ పెట్టాడు... సిటీకి వస్తున్నా అని... "
కాజల్ "అవునా... ఒక సారి కలవాలి చాలా రోజులు అయింది సుహాస్ ని కలిసి... "
ఇషా "హుమ్మ్... "
కాజల్ "ఇంకేంటి సంగతులు చెప్పూ... "
సుహాస్ కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉండగా, ఫ్లైట్ అటెండెంట్ వచ్చి "సర్... సర్... " అంటూ నిద్ర లేపింది.
సుహాస్ పైకిలేచి సరాసరి బాత్రూంలోకి వెళ్లి ఫేస్ వాష్ చేసుకుంటూ ఉన్నాడు.
అంతలో తన ఫోన్ మెసేజ్ వచ్చినట్టు మోగింది. ఓపెన్ చేసి చూడగా సమంత అని కనపడింది.
మెసేజ్ కూడా చదవకుండా తిరిగి వెనక్కి వచ్చి బ్యాగ్ తీసుకొని ఫ్లైట్ దిగి నడుచుకుంటూ తిరిగి ఎయిర్ పోర్ట్ చెకింగ్ లోకి వచ్చి నిలబడ్డాడు.
మళ్ళి మళ్ళి సమంత నుండి మెసేజెస్ వస్తూ ఉన్నాయి, వాటిని చూడకుండానే సెక్యూరిటీ చెకింగ్ దాటాడు.
బయటకు వచ్చి మెసేజెస్ చూడగానే క్రిష్ ఉన్న హాస్పిటల్ లొకేషన్ వచ్చింది.
మరో మెసేజ్ లో 'బయట నీకు నా మనిషి ఒకరు వచ్చి వెపన్ ఇస్తాడు' అని ఎయిర్పోర్ట్ బయట లొకేషన్ ఉంది.
సుహాస్ బయటకు రాగానే ఒక వ్యక్తీ వచ్చి అతనికి గన్ ఇవ్వబోతూ ఉండగానే అది కింద పడింది.
అప్పటికే అక్కడ ఇద్దరూ కానిస్టేబుల్స్ తో పాటు సుమారు పది మంది వరకు ఉన్నారు.
అక్కడకు గన్ తెచ్చిన వ్యక్తీ భయంతో పరిగెత్తాడు. ఆ కానిస్టేబుల్స్ ఇద్దరూ సుహాస్ దగ్గరకు వచ్చారు, ఆ పది మంది అతని చుట్టూ గుమిగూడారు.
సుహాస్ చిన్నగా నవ్వి చిటికే వేశాడు, లోపల నుండి ఎస్సై రేంజ్ అధికారి బయటకు వచ్చి ఆ గుంపు లోకి వెళ్ళాడు, అక్కడ ఏమి లేదు, ఆ కానిస్టేబుల్స్ ని ఏం జరిగింది అని అడగగా వాళ్ళు కూడా ఏం చెప్పలేకపోయారు.
సుహాస్ చిన్నగా నవ్వుకొని ఎయిర్ పోర్ట్ కార్ పార్కింగ్ దగ్గరకు రాగా.... ఇంతకు ముందు గన్ పడేసి పరిగెత్తిన వాడు వచ్చి "మేడం చెప్పింది, నువ్వు టెస్ట్ పాస్ అయ్యావ్... భయపడకు... ఆ కానిస్టేబుల్స్ నిన్ను గుర్తు పట్టలేరు" అంటూ సుహాస్ తల మీద ఎక్స్ట్రాగా పెట్టిన విగ్గు తీసేసాడు.
"ఏమయినా కావాలా!"
సుహాస్ "ప్రశాంతత కావాలి..... ఇస్తే తీసుకుంటాను..... ఇవ్వకపోతే లాక్కుంటాను..... " అన్నాడు.
"హహ్హహ్హ... ఇక్కడ నుండి వెళ్ళేటపుడు పిల్ల నాయాలు లాగా భయంభయంగా ఉండే వాడివి.... మేడం నిన్ను బాగా తయారు చేసింది.... నువ్వు మాత్రమే చేయగలిగిన మిషిన్ అంట కదా.... ఏంటో అది.... "
సుహాస్ చిన్నగా నవ్వి చిటికే వేశాడు.
అతను కళ్ళు తెరిచే సరికి, చుట్టూ నవ్వులు వినపడుతున్నాయి.
ఎదురుగా ఉన్న ఒక ఐరన్ పోల్ ని ముద్దు పెడుతూ ఉన్నాడని అర్ధం అయి సుహాస్ ని తిట్టుకుంటూ "మాయగాడు" అని తిట్టుకున్నాడు.
సమంత ఫోన్ లో "వాడిని మరీ అలా ఏడిపించాలా..."
సుహాస్ "నాకు ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే పంపుతావా! ఇలాంటి కంప్లైంట్స్ కాకుండా..."
సమంత "నువ్వు చంపాల్సిన వ్యక్తీ ఆ లొకేషన్ లోనే ఉన్నాడు" అని చెప్పింది.
సుహాస్ "గుడ్" అని ఫోన్ కట్టేశాడు.
వైభవ్ "అసలు ఎవరు ఈ 'నూతన్'" అని క్రిష్ ని చూస్తూ అడిగాడు.
క్రిష్ మోహంలో సీరియస్ నెస్ ఉన్నా భయం మాత్రం లేదు, వైభవ్ వైపు చూస్తూ "నువ్వు హ్యాండిల్ చేయలేని వ్యక్తీ" అంటూ లావణ్య దగ్గరకు వెళ్ళాడు.
లావణ్య "నూతన్ బ్రతికే ఉన్నాడు అని నీకు ఎప్పటి నుండి తెలుసు...."
లావణ్య క్రిష్ ని కోపంగా చూస్తూ "భయ్యా... వచ్చి నిన్ను అరుస్తాడు" అంటూ చిన్నపిల్లలా మాట్లాడుతుంది.
క్రిష్ చిన్నగా నవ్వి పైకి లేచి "వస్తున్నాడా! అయితే... ఎంత సేపట్లో వస్తున్నాడు" అని అడిగాడు.
లావణ్య "ఈ రాత్రికి..." అంది.
కాజల్ "ఎవరు క్రిష్ ఈ 'నూతన్' " అని అడిగింది.
క్రిష్ "అందరూ ఇంటికి వెళ్ళండి... ఇక్కడ ఎవరూ ఉండొద్దు..."
వైభవ్ "అసలు ఎవరు వాడు.... ఇంత బిల్డ్ అప్ ఇస్తున్నావ్..."
క్రిష్ "అతని పేరు 'నూతన్', ఇప్పుడు ఇక్కడకు నా కోసం వస్తున్నాడు..." అన్నాడు.
నూతన్ "వస్తున్నా క్రిష్.... వస్తున్నా.... ఫైనల్ గా మనం ఎదురు పడుతున్నాం...." అంటూ ఎక్సలేటర్ ని గట్టిగా తొక్కాడు.
.