02-12-2024, 09:27 AM
(This post was last modified: 02-12-2024, 09:29 AM by Sweatlikker. Edited 1 time in total. Edited 1 time in total.)
3. అలవాటు
ఇంటికి వచ్చేసరికి వదిన ఉప్మా చేసింది. మీకు తెలిసిందే కదా, ఉప్మా అంటే మనకి నచ్చదు. పెళ్ళికి పోతే ఉప్మా, పురుడుకి పోతే ఉప్మా, ఏ ఫంక్షన్ అయినా ఉప్మాని వచ్చినవాళ్ల మొహాన కోడ్తారు. ఉప్మా అంటేనే చిరాకు లేస్తది నాకు. కాకపోతే వదినొచ్చాక కాదు.
వదిన పెద్దమ్మకీ నాకు ఉప్మా పెట్టింది. స్పూన్ తీసుకొని అటూ ఇటూ ప్లేట్లో ముగ్గులు వెయ్యాల్సిన నేను అందులో పల్లీలు ఎక్కువ కనిపించి బుక్కలు పెట్టుకోవడం మొదలు పెట్టాను. బాగా ఉల్లిపాయలు, కొత్తిమీర, పల్లీలు వేసింది. అదే మా పెద్దమ్మ ఐతేనా ఏదో కరువు కాలంలో బతికినట్టు అసలు పల్లీలు ఉండవు, కొత్తిమీర నాలుగు ఆకులు వేసిద్ధి అంతే. మొదటి సారి ఉప్మా కూడా నాకు ఇంకొంచెం వేసుకోవాలి అనిపించిందంటే నమ్మండి.
తిన్నాక గదిలో పెద్దమ్మ పక్కన పడుకున్న కాసేపటికి, “ గుర్ర్ ” అని పెద్దమ్మ ఇవాళ బాగా గుర్రు పెడుతుంది. లేపితే విసిగించాను అంటుంది, లేదా నిద్రపోరా అని తిడుతుంది. పావుగంట గడిచినా నాకేమో గుర్రుకి నిద్రపట్టట్లేదు. లేచి ఐదు నిమిషాలు అటూ ఇటూ నడిచాను. ఏమీ తోచక అన్నయ్య గదిలో పడుకోవాలి అనే ఆలోచన వచ్చినా అక్కడ వదిన ఉంది, వాళ్లిద్దరి మధ్యలో నేనెందుకు అనుకున్న.
ఇంతలో వాళ్ళ గది తలుపు తెరుచుకుంది, వదిన, నన్ను చూసింది.
సంధ్య: ఏమైంది మరిది నిద్రపోలేదా, ఇక్కడున్నావు?
నేను: పెద్దమ్మ గుర్రు కొడుతుంది ఇంకా నిద్ర పట్టలేదు వదినా.
సంధ్య: అవునా...
వదిన రంజన్లో నీళ్లు తాగింది. నేను మౌనంగానే ఉన్నాను. లోపల అన్నయ్య కూడా లేచే ఉన్నాడు. వదిన గ్లాసులో అన్నకి నీళ్ళు తీసుకెళ్ళింది. నేను వాళ్ళ గది తలుపు దగ్గర నిల్చొని వింటున్న.
సంధ్య: అత్తమ్మ గుర్రు కొడుతుంది అంట, హరి నిద్రపోలేదు. ఇక్కడ పడుకుంటాడేమో?
సంతోష్: వాడికి అలవాటేలే, ఇక్కడ పడుకుంటే మీద కాలేస్తాడు. అటూ ఇటూ మెసులుతాడు.
సంధ్య: ఏం కాదులే, నిద్ర పోవాలి కదా వాడు మరి.
సంతోష్: సరే... అటు పక్కన పడుకోమని నువు ఇటు జరుగు.
వదిన నా దగ్గరకి వస్తుంటే పట్టీల చప్పుడు విని ఇబ్బందిగా మా గదికి నడిస్తే ఆగమంది.
సంధ్య: హరి... మా రూములో పడుకుందువు రా
నేను: వద్దులే వదినా. ఆ పరుపు ముగ్గురికి సరిపోదేమో
సంధ్య: ఏం కాదు రా.
నేను తలాడించి మౌనంగా లోపలికి పోయాను. వదిన అటు పరుపుకి ఎడమ దిక్కు ఉన్న అన్నయ్య పక్కన ఒరిగి నన్ను ఇటు కుడి కొనకు ఆమె పక్కన పడుకోమంది.
నేను: వదిన నేను చెద్దరి తెచ్చుకుంటాను.
సంధ్య: అవసరం లేదు నాది ఉంది పడుకో.
నేను అలాగే వదిన పక్కన ఒరిగాను. షిలా విగ్రహంలా కదలకుండా ఉన్నాను.
సంధ్య: నిద్రలో మీద కాలేస్తావంట.
నేను: వెయ్యనులే వదినా.
నవ్వింది.
సంతోష్: ఏరా ఇవాళ ఐస్క్రీమ్ తిన్నావా, వదినకి తెచ్చావా?
నేను: హా అన్నా
సంధ్య: అన్నయ్యని ప్రొద్దున్నే డబ్బులు అడగకు. నన్ను అడుగు సరేనా?
నేను: నువ్వైనా అన్నయ్యని అడిగే ఇస్తావు కదా వదిన…… అన్నాను హాస్యంగా
సంధ్య: ఓహో... అలాగా చెప్తా ఆగు... ఓయ్ మీ తమ్ముడు ప్రొద్దున్న మిమ్మల్ని వెక్కిరించాడు.
సంతోష్: ఏమన్నావురా?
నేను: నేనేం వెక్కిరించలేదు అన్నా, నిజం చెప్తే కూడా వెక్కిరిస్తున్నా అంటుంది వదిన.
సంధ్య: ఓహో.... డిగ్రీ ఫెయిల్ అయ్యాడు అని నవ్వావా లేదా...
నేను: నాకప్పుడు నవ్వొచ్చింది వదిన మరీ.
సంధ్య: చూసావా... ఒప్పుకున్నాడు.
సంతోష్: హా...
నేను: అన్నయ్య వదిన కూడా నవ్వింది. అది చెప్పట్లేదు నీకు.
వదిన నన్ను గిల్లింది.
నేను: అచ్.. ఏంటి వదిన గిచ్చుతావు. నువ్వు కూడా నవ్వావు ఒప్పుకో.
సంతోష్: హహహ.... పడుకోండి... చాలు మాటలు.
నేను: ఊ...
వదిన నా దిక్కే మొహం చేసి నన్నే చూస్తూ ఉంది. ఇద్దరం కాసేపు మౌనంగా ఉన్నాము, నేను కళ్ళు మూసుకొని. వదిన కళ్ళు మూస్కుందా అని నేను కొంచెం తెరచి చూసాను, మూస్కుంది. అలా చిన్న లైట్ వెలుతురులో ఆమె ఎర్రని పెదవులు చూస్తూ ఉంటే కళ్ళు తెరచింది, నేను టక్కున మూస్కున్న. నా చెంప మీద చెయ్యేసింది.
ఎంత వెచ్చగా ఉందో.
సంధ్య: హరి...
కళ్ళు తెరిచాను.
నేను: ఆ వదినా..
సంధ్య: కాలేసుకో నేనేం అనను.
నేను: నిజంగా...
సంధ్య: ఉ...
మేము ఇద్దరం ఒకే చెద్దరిలో ఉన్నాము. మరోక్షణం వదిన మీద కుడి కాలేసి కొంచెం దగ్గరకి జరిగి ఆమె మోచేతి దగ్గర నా మొహం పెట్టి పడుకున్న.
నా చెయ్యి కూడా తీసుకొని ఆమె చేతి మీద వేసుకుంది. అలా నా చేతిని ఆమె వీపు వెనక వేసి పడుకోపెట్టుకుంది.
నాకు చాలా హాయిగా అనిపించింది వదిన పక్కన పడుకోపెట్టుకోవడం.
నా సంతోషం ఏంటి అంటే, వదినకి నాకు మా ఇద్దరి మధ్య మంచి స్నేహపూర్వక సంబంధం కుదిరింది.
నావరకు, వదినతో నేను ఒక ఇన్ఫాక్చువేషన్ లో పడ్డాను.
తరువాత రోజులు నేను వదినా ఇంట్లో క్యారం, చెస్ లాంటివి ఆడుకోవడం, తీరిగ్గా కూర్చుని ఏదో ఒకటి మాట్లాడుకోవడం, టీవీ చూడడం జరిగేది. రెండు సార్లు ఆరోజు లాగే వదిన పక్కనే పడుకున్నాను. అందులో ఒకసారి అబద్ధం ఆడాను.
ఇక నేను ఇంటర్మీడియట్ కోసం టౌనులో హాస్టల్ కి వెళ్ళాల్సిన రోజు దగ్గరకొచ్చింది.
జూన్ లో,
నన్ను సోమవారం హాస్టల్ లో పడగొట్టి వస్తాను అని చెప్పాడు అన్నయ్య.
శనివారం, అన్నయ్య జాబ్ ఒక్క పూట పోయొచ్చాడు. మధ్యాహ్నం బోంచేసాక, అన్నావదినలు పక్క టౌన్ లో సినిమాకి మాటినీ షో పోయారు.
నేను పెద్దమ్మ ఇంట్లో ఉన్నాము. సాయంత్రం పెద్దమ్మ ఛాయి చేసింది తాగుతూ కూర్చున్నాను. ఇక అన్నయ్య వాళ్ళు కూడా వచ్చే టైం అవుతుంది అనుకుంటూ ఉంటే, హఠాత్తుగా పెద్దమ్మకి ఏం అవుతుందో తెలీదు, గట్టిగా దగ్గుతుంది. నేను దగ్గరికెళ్ళాను.
నేను: ఏమైంది పెద్దమ్మ...
చెయ్యిని ఆడిస్తూ, ఊపిరి ఆడట్లేదు అని సైగ
ఒక్కసారిగా నాకు కాళ్ళు వణికిపోయాయి.
గట్టిగా, కష్టంగా దగ్గుతూనే ఉంది. మొసపోసుకుంటూ దగ్గుతుంటే తన సొల్లు బయట పడుతుంది.
నేను: పెద్దమ్మ ఏమైంది, ఏమైంది....
నాకు భయమేస్తుంది. ఏమీ అర్థం కాలేదు. కుర్చీలోంచి లేపి నిదానంగా ఇంటి ముందు మెట్ల మీద కూర్చోపెట్టాను, కాస్త గాలి ఆడుద్ది అని. అయినా గాని అలాగే ఉంది.
ఘజ్జమంటుంది నాకు. ఇంట్లో అన్నావదినా లేరు, నా దగ్గర ఫోను కూడా లేదు. వదిన తన ఫోన్ తీసుకుపోయింది.
స్పృహకొల్పోతున్నట్టు అవుతుంది పెద్దమ్మకి, పట్టుకొని తన మొహం, చెంపలు కొట్టాను.
నాకు గుండె వణికిపోతుంది. అప్పట్లో పెద్దనాన్నకి కూడా ఇలాగే అయ్యింది.
ఏం చెయ్యాలో తెలీదు. అన్నయ్య ఉంటే బాగుండు అనుకుంటున్న.
అప్పుడే బండి శబ్దం వినిపించింది. గేటు ముందు వదిన బండి దిగింది.
నాకు ఊపిరి వచ్చింది.
నేను: అన్నయ్య పెద్దమ్మ...పెద్...పెద్దమ్మ....
అలా అరుస్తూ పరిగెత్తి అన్నయ్య చెయ్యి పట్టుకున్న భయంతో.
ముగ్గురం భయం, కంగారుగా పెద్దమ్మ దగ్గరకి పోయాము. వదిన ఇంట్లోకి ఉరికి ఒక దుప్పటి తెచ్చి పెద్దమ్మ రొమ్ము మీద కప్పి, లోపల ఆవిడ జాకిటి హుక్కులు విప్పేసింది.
అన్నయ్య ఎవరికో ఫోన్ చేశాడు. ఐదు నిమిషాల్లో ఇంటి ముందు ఆటో ఆగింది. పెదమ్మని ఎక్కించుకోని ఆసుపత్రికి తీసుకుపోయాము. అక్కడ ఆక్సిజన్ పెట్టారు. అప్పుడు కుదుట పడింది పెద్దమ్మ ఊపిరి.
నా జీవితంలో అంత గుబులు నేనెప్పుడూ పడలేదు. అమ్మానాన్నలను, పెద్దనాన్నను పోగొట్టుకున్న ఇప్పుడు పెద్దమ్మ కూడా అని అనుకునేంత పని అయ్యింది. ఏడుపొచ్చింది. అన్నని పట్టుకొని ఏడ్చాను.
సంతోష్: ఏం కాదు, ఐపోయింది. ఏం కాదు... అంటూ ఊకుంచాడు.
పెద్దమ్మకి బీపీ కదా, అందుకే మొస వచ్చింది. ఆ సమస్య వల్లే రాత్రి గుర్రు కొడుతుంది. అందుకేనేమో ఈ మధ్య గుర్రు ఎక్కువైంది.
రాత్రికి ఇంటికి వెళ్ళిపోయాం.
నేను పెద్దమ్మ మంచంలోనే, మీద చెయ్యి కాలు వేసి పడుకున్న.
డాక్టర్ ఆవిడ ఏదో టెన్షన్ పడింది అందుకే బీపీ పెరిగి మొస వచ్చిందేమో అని చెప్పాడు.
నేను: పెద్దమ్మ టెన్షన్ పడ్డావంటా ఎందుకు?
ఆప్యాయంగా నా నెత్తి నిమిరింది.
రాజమని: ఇద్దరూ కలిసి పక్కూరుకి పోయారు సాయంత్రం అవుతుంది, అసలే పెద్ద రోడ్డు కదా...
నాకర్థమైంది, మా అమ్మా వాళ్ళ లాగే ఏదో అవుతుందేమో అని టెన్షన్ పడింది.
నేనేం మాట్లాడలేదు, పెద్దమ్మ దిగులుగా కళ్ళు మూసుకుంది. నేను ఇక నిద్రపోయాను.
కాళు వేసే అలవాటే కథ అవుతుందని అప్పుడు నాకేం తెలుసు?
|—————————+++++++++++
మీ కామెంట్ తో అభిప్రాయం చెపితే బాగుంటుంది