26-11-2024, 10:33 PM
(This post was last modified: 27-11-2024, 06:36 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
209. న్యాచురల్ మార్గం
కాజల్ "క్రిష్ నన్ను చూస్తూ వేరోకరిని ఊహించుకుంటున్నాడు" అంది.
నిషా "వాట్... నీకెలా తెలుసు..."
కాజల్ నోరు తెరిచి చెప్పేలోగా బయట గొడవ పెద్ద పెద్దగా రోమియో అరుస్తున్న అరుపులు వినిపిస్తున్నాయి, పైగా పెద్ద పెద్దగా కేకలు వినపడుతున్నాయి.
నిషాకి వైభవ్ మీద కోపం వచ్చేసింది, ఇంకొద్ది సేపట్లో తన అక్క విషయం చెబుతుంది అనగా గొడవ చేసినందుకు పిచ్చి కోపం వచ్చింది.
గబా గబా బయటకు వచ్చి చూసే సరికి వైభవ్ మరియు క్రిష్ ఇద్దరూ పిచ్చి పిచ్చిగా కొట్టుకుంటున్నారు. రోమియో కట్టేసి ఉండి, అరుస్తుంది.
నిషా క్రిష్ ని ఆశ్చర్యంగా చూసి వైభవ్ తో ఆగమని అరుస్తుంది.
కాని ఇద్దరి మధ్య ఫైట్ ఫుల్ బీస్ట్ మోడ్ లో ఉంది.
వైభవ్ చిన్నప్పటి నుండి ట్రైనెడ్... పైగా తనకు కొన్ని అండర్ వరల్డ్ కనక్షన్స్ కూడా ఉన్నాయి... కాని క్రిష్ అతడికి ఫుల్ పోటీ ఇస్తున్నాడు.
పైగా చూస్తూ ఉంటే, ఇద్దరిలో ఎవరో ఒకరే మిగిలేలా కొట్టుకుంటున్నారు.
వైభవ్ తన్నులు తినడం చూసి వైభవ్ పెంచుకునే కుక్క రోమియో, గొలుసు లాక్కొని క్రిష్ మీదకు దూకింది.
క్రిష్ వైభవ్ తన మీద విసిరినా ఉన్న ఒక కుండీని చేత్తో కొట్టడంతో అది పగిలిపోయింది, ఆ మట్టి అంతా కింద పడి రోమియో మీద కూడా పడింది. పైగా క్రిష్ చాలా మూర్ఖంగా కనిపించడంతో రోమియో వెనక్కి పారిపోయి అరుస్తుంది.
రోమియో ఎప్పుడూ అలా ఆగి పోడు... అలాంటిది క్రిష్ ని చూసి పారిపోవడం చూసి వైభవ్ కి కూడా ఆశ్చర్యంగా అనిపించింది. వైభవ్ కింద పడి ఉన్నాడు.
క్రిష్ నిషాని చూసి వైభవ్ ని వదిలేసి నిషా దగ్గరకు వచ్చి "ఏంటి? ఏమయింది? డైవర్స్ ఏంటి? నాతో ఏదైనా సమస్య ఉంటే హాస్పిటల్ లో చూపించుకుంటాను... ప్లీజ్ నన్ను వదిలి వెళ్లొద్దు అని చెప్పూ.... ప్లీజ్ నిషా మీ అక్కతో మాట్లాడాలి" అని అడుగుతున్నాడు.
అప్పటి వరకు తన భర్త వైభవ్ తో గొడవ పడ్డ క్రిష్ మీద కోపం ఉండడంతో అలాగే కోపంగా చూస్తూ ఉంది.
ఇంతలో వైభవ్ వచ్చి ఒక కుండీ తీసుకొని క్రిష్ తల వెనక కొట్టాడు. అది పెద్ద దెబ్బ తగలడంతో క్రిష్ వెనక్కి వాలి పెద్దగా అరుస్తూ పడిపోయాడు.
అప్పటి వరకు కోపంగా చూసిన ఎదురుగా క్రిష్ రక్తం మడుగులో కనపడే సరికి పెద్దగా క్రిష్ అని అరుస్తూ అతని దగ్గరకు వెళ్ళింది.
వైభవ్ ని కోపంగా చూస్తూ "ఏం చేశావ్...." అని అడిగింది.
ఇంతలో క్రిష్ సౌండ్ విని కాజల్ బయటకు పరిగెత్తుకొని వచ్చి రక్తపు మడుగులో ఉన్న క్రిష్ ని చూసి అతడి దగ్గరకు వెళ్లి ఏడవడం మొదలు పెట్టింది.
క్రిష్ "ప్లీజ్.... నన్ను వదిలి వేళ్ళకు.... నువ్వు లేకుండా నేను ఉండలేను" అంటూ కళ్ళు మూసేశాడు.
నిషా "ఏం దిక్కులు చూస్తున్నావ్.... హాస్పిటల్ కి కాల్ చెయ్..."
వైభవ్ "మీ అక్క...."
నిషా "తను మా అక్క హస్బెండ్... చిన్న ప్రాబ్లం వచ్చి ఇక్కడకు వచ్చారు" అంది.
వైభవ్ క్లియర్ గా అపార్దం చేసుకున్నాడని అర్ధం అయింది. గబాల్న క్రిష్ ని ఎత్తుకొని కారులో కూర్చోబెట్టి హాస్పిటల్ కి తీసుకొని వెళ్ళాడు.
డాక్టర్ "పేషెంట్ మీకు ఏమవుతాడు...."
కాజల్ "నా హస్బెండ్...."
డాక్టర్ "అతన్ని చంపెద్దావ్ అనుకున్నావా!"
నిషా "ఏమయింది? డాక్టర్..."
డాక్టర్ "అతని బ్లడ్ లో హై ఎండ్ అఫ్రోడిజియక్ డ్రగ్ దొరికింది, పైగా చాలా హై డోసేజ్ ఉంది"
ఇద్దరూ ఒకరిమొహం ఒకరు చూసుకున్నారు.
డాక్టర్ "అది ఒక సెక్స్ కి రిలేటెడ్ డ్రగ్.... బ్యాన్ అయిన డ్రగ్.... అది వాడితే చాలా క్రూరమైన కోరికలు వస్తాయి. అందుకే బ్యాన్ చేశారు"
నిషా "తను ఎప్పటి నుండి వాడుతున్నాడు"
డాక్టర్ "జనరల్ గా దీన్ని ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటారు... కాని ఇతడికి ఓరల్ గా ఇస్తున్నారు... అది కూడా ఒక మూడు నెలల నుండి"
కాజల్ "క్రిష్ చాలా హేల్తి, తను తీసుకోవాల్సిన అవసరం లేదు...."
నిషా "అవునూ లేదు..."
డాక్టర్ ఇద్దరినీ మార్చి మార్చి చూసి "అలా అయితే... అతడికి ఎవరైనా డ్రగ్ ఎందులో అయినా కలిపి ఇస్తున్నారేమో..." అన్నాడు.
ఆ డాక్టర్ వైభవ్ కి పర్సనల్ డాక్టర్ ఇలా జరగడం తను చూస్తూ ఉన్నాడు.
కాజల్ మరియు నిషా ఇద్దరూ భయం భయంగా చూస్తూ ఉన్నారు.
నిషా బయటకు వచ్చి వైభవ్ తో జరిగింది మొత్తం చెప్పింది.
వైభవ్ "అదీ..... ప్రభు ఇన్వెస్ట్మెంట్ జనరల్ మేనేజర్ తో మీటింగ్ ఉంది కదా.... నువ్వు సెట్ చేశావ్...." అని అడిగాడు.
నిషా కోపంగా చూసి "అతడినే నువ్వు కొట్టావ్" అంది.
వైభవ్ నోరు తెరుచుకొని అటూ వైపు చూశాడు.
కాజల్ గదిలోకి వెళ్ళగా క్రిష్ బెడ్ పై పడుకొని నిద్ర పోతూ ఉన్నాడు. సెలైన్ పెట్టి ఉంది.
డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి,
డాక్టర్ "నువ్వు చెప్పిన దాన్ని బట్టి అతను నిన్ను ఇబ్బంది పెట్టకూడదు అని తనను తానూ డైవర్ట్ చేసుకుంటూ భరిస్తూ ఉన్నాడు... కాని అతని బాడీలో ఇప్పుడు చాలా పెద్ద మొత్తంలో ఆ డ్రగ్ ఉంది.... చాలా టైం పడుతుంది"
కాజల్ "దీనికి సొల్యుషన్ లేదా..."
డాక్టర్ "న్యాచురల్ మార్గం ఉంది"
కాజల్ "అంటే...."
డాక్టర్ "ఇప్పుడు తను పేషెంట్.... ఇప్పుడు కరక్ట్ కాదు...." అని బయటకు వెళ్ళిపోయాడు.
కాజల్ "సెక్స్" అంది.