21-11-2024, 12:53 PM
"నా మది నిన్ను పిలిచింది గానమై - వేణుగానమై - నా ప్రాణమై ఎవ్వరివో నీవు నేనెరుగలేను..." రఫీ గొంతు అడుగుజాడల్లో జానపదయాస.
"ఎన్టీవోడి పాట వొద్దు ఏయన్నార్ పాటవొద్దు. నీకొస్తే సిరంజీవి పాటపాడు నేదంటే బాలకృష్ణ పాట పాడు"
"లక్స్ పాపా లక్స్ పాపా లంచ్ కొస్తావా నీ లిల్లిపువ్వు లాంటి సొగసు లీజు కిస్తావా..." పాటంటే అదిరా అలా గుండాలి" కుర్రగొంతు తాతకి హితబోధ చేసింది.
"అవున్రా గంగన్నా ఎవర్రా అది. ముసలాడిని అలా తింటున్నారు" అడిగాను సందేహం తీర్చుకుందామని.
ఆళ్లా మా గౌరుమామ కొడుకులు. గంటలు కాళీ దొరుకుతేసాలు బల్జిపేట సినిమాలు కెళ్లిపోవడమే దానికితోడు ఈ మద్దెన టీవి వొచ్చింది కదా. పెద్దకోడలు తెచ్చినాది. ఆళ్లిష్టమే అన్ని పాటలు అలకే వొచ్చు"
వాళ్ల గౌరుమామ గుర్తుకు వస్తున్నాడుగాని ఆయన పిల్లల పోలిక కూడా నాకు తెలియడం లేదు. తెలియడానికి మా ఊరితో నాకు సంబంధం ఉంటేకదా. చదువులకని కాలేజీలకి వెళ్లిన తరువాత సెలవుల్లో మా ఊరు వెళ్లినా, ఉద్యోగం వచ్చిన తర్వాత భార్యా, పిల్లలు, సంసారం ఏర్పడిం తర్వాత మా ఊరు వెళ్లడం చాలా తగ్గిపోయింది. జననీ జన్మ భూమిశ్చ అని సంవత్సరానికోమార మా ఊరు వెళ్లడం నాలుగు రోజులుండి వెళ్లిపోవడం. ఈ తరంలో యువతరంతో పరిచయాలు ఎలా ఏర్పడతాయి? అందరం రెక్కలొచ్చి ఎగిరి పోయినా ఇల్లు, భూమి వదులుకోలేక అమ్మ మాత్రం ఉండిపోయింది. పండుగ ముందు అమ్మకో చీర కొనిచ్చి చూచి వచ్చేద్దామంది. 'నాలుగురోజుల సెలవు పెట్టి నూర్పుకల్లంలో కూర్చో' అంది అమ్మ. తప్పనిసరి దొరికి పోవలసి వచ్చింది.
"ఇంతకీ ఆ ముసలాడెవర్రా గంగన్నా"
"తమరు పోల్సుకోనేదా మన అరసాడు జంగమయ్య"
"అ... జంగమయ్యా? ఏనాటివాడురా! ఇంకా బతికే ఉన్నాడా?"
ఆశ్చర్యపోవడం నా వంతయింది.
"ఆ... ఏం బతుకు బాబూ. కన్నూనేక... కాలూనేక... బతుకు తెరువూనేక ఏదో ఆడిబతుకలాగయిపోతంది" విచారంగా అన్నాడు మెందోడు.
గంగన్నా, మెందోడు, మరికొందరు కల్లంలో ధాన్యం నూరుస్తున్న రైతుకూలీలు. "ఓసారి పిలుమీ! చూస్తాను. నా చిన్నతనంలో జంగమయ్య ఆడవేషం కట్టి పాటలు పాడుతూ వీధుల్లో తిరుగుతున్నట్టే కనిపిస్తోంది."
"ఆడిని మనం పిలవనక్కర నేదు బాపూ. మరో క్షణానికి ఆడే మన కల్లానికొస్తాడు. చారెడో పిడికెడో గింజలిత్తే పట్టుకుపోతాడు"
"అవున్రా! ఏణూ... ఓ రేణుగోపాలా! తాతని మా కల్లంలో కోపాలి పంపురా బాబు సూత్తారుట" గంగన్న కేక వేశాడు.
"తాత గంగన్న నిన్ను రమ్మంతన్నాడు. బుగతోరి నూర్పుఅయిందట. ఓపాలి ఆ కల్లాని కెల్లు" కుర్ర గొంతు.
"ఎవల్ది? ముసలి బుగతమ్మదా? కల్లాని కెల్లకపోయినా ఇంటికాడి కెలితే నా గింజలు అయమ్మ ఇచ్చేత్తాది. దొంగోడివి. నీ సంగతి ముందు తేల్చు"
"ఓర్నాయినోయ్! ఈ ముసిలోడు మనల్ని ఒగ్గేటట్టు నేడ్రా..."
"అది కాదు తాతా! ఈ నూర్పు మరో ఐదు రోజులుంతాది. ఆ రెండు కుప్పలు మావే! రెండు రోజులు పొయిం తర్వాత మా కల్లానికి రా. నీకేల నీ గింజలు నానిడతాను కదా" నమ్మబలికింది కుర్రగొంతు.
తాత ఏదో గొణుక్కుంటూ కర్ర తాటించు కొంటు చుట్టూరా తిరిగి మా కల్లంలోకి వస్తున్నాడు. గంగన్నని పంపించాను. రెక్కపట్టుకుని జాగ్రత్తగా తీసుకురామ్మని.
"తాతా! బాగున్నావా? రా కూర్చో"
అరచెయ్యి కళ్లకి ఆనించికొని చూపులు సారించి పరికించి పరికించి చూసాడు. కానీ నన్ను పోల్చుకోలేకపోయాడు తాత.
"ఏవుల్లు. రాజా నువ్వు నాను పోల్చుకోలేకపోన్ను?"
"ఎప్పుడో నన్ను చిన్నప్పుడు చూసుంటావు కూర్చో" అన్నాను.
నవ్వుతూ నేను ఎవరినో చెప్పాడు గంగన్న.
"అలాగా బాపు. ఎంత పెద్దాడి వైపోనావు. ఏటిసేత్తన్నావేటి?"
తాత ప్రశ్నలకి గంగన్నే సమాధానాలు చెబుతున్నాడు.
గుండ్రటి మొగం, సోగకళ్ళు, పొడుగు పొట్టికాని రూపం. ఆడవేషం వేస్తే కుందనపు బొమ్మలా ఉండేవాడు తాత. ఇప్పుడు ఎలాగయిపోయాడు? వేలాడుతున్న చెవులు. కౌడుబారిన మొగం, వొళ్ళళ్ళా ఎముకలు కనిపిస్తూ పీక్కుపోయిన చర్మం. ఓహ్! వృద్ధాప్యం ఎలాంటి రూపాన్నయినా పాడుచేయగలదు కదా! వీపుకంటిన పొట్ట, చిరిగి మాసిన దుస్తులు, తైల సంస్కారం లేని జుట్టు అతని దైన్యాన్ని ఎత్తి చూపుతున్నాయి. తాతని తొలిసారిగా చూడడం మా ఇంట్లోనే. చిన్నప్పుడే అయినా బాగా గుర్తున్న సంఘటన.
***
---

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ