Thread Rating:
  • 9 Vote(s) - 1.89 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller బెస్ట్ కపుల్ (Nov 20)
#72
11. యుద్దానికి సిద్దం









గతం:

ఇషా "నువ్వు ఎందుకు వస్తున్నావ్..."

డ్రైవింగ్ సీట్ లో ఉండి నడుపుతున్న ఆరాధ్య అద్దంలో నుండి వెనక్కి చూస్తూ చిన్నగా నవ్వింది.

ఇషా "రమాదేవి... చదువుకుంటుంది కదా... ఎందుకు ఇలా బయటకు పనికి పిలుస్తున్నావ్..."

ఆరాధ్య "నేను చదివినా పాస్ అవ్వను లే..."

ఇషా "మరి ఏం చేద్దాం అనుకుంటున్నావ్..."

ఆరాధ్య "నీకు బాడీ గార్డ్ గా ఉండేదా...  నాకు ఫైటింగ్ వచ్చు... "

ఇషా దీర్గంగా ఆలోచించి "వద్దు" అంది.

రమాదేవి కోపంగా "ఎందుకు వద్దు...  అసలే నీ లైఫ్ ఎపుడూ రిస్కీ గా ఉంటుంది...  ఎప్పుడూ చావు అంచులలో నిలబడతావు..." అంటూ ఎదో చెప్పుకుంటూ పోతుంది. 

ఇషా కారు అద్దం నుండి బయటకు చూస్తూ వెనక్కి వెనక్కి వెళ్ళిపోతున్న బిల్డింగ్స్ ని చూస్తూ "అందుకే వద్దు" అంది.

రమాదేవి మాటలు మధ్యలోనే ఆగిపోయాయి.

ఆరాధ్య అద్దం నుండి వెనక్కి రమాదేవిని చూసింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు.

ఇషా మోహంలో మాత్రమే నవ్వు ఉంది.




ప్రస్తుతం:

ఇషా "ఫోన్ ఎత్తడం లేదు"

ఆరాధ్య "ఏమయింది?"

ఇషా "విష్ణు,  ఫోన్ ఎత్తడం లేదు"

ఆరాధ్య "బిజీగా ఉన్నాడేమో, చూసుకున్నాక కాల్ చేస్తాడు లే!"

ఇషా "ఆ రోజు.....  ఆ రోజు.....  ఆ బెంజ్ కార్ వెనక మరో కారు ఉంది"

ఆరాధ్య "ఏ రోజు.....  ఏం కారు.....  "

ఇషా "విష్ణు వెళ్ళిన రోజు...   ఆ రాత్రి...  చీకటిలో ఒక కారు మన ఇంటి ముందు ఆగి ఉంది అనుమానంగా అనిపించింది"

ఆరాధ్య "అయితే..."

ఇషా "విష్ణు ఆ కారుని పట్టించుకున్నా అన్నాడు...  ఏం లేదని కూడా చెప్పాడు..."

ఆరాధ్య "...."

ఇషా "ఆ రోజు ఆ కారు వెనక వీళ్ళ కారు ఉంది... వీళ్లు ఆ కారుని ఫాలో అయ్యారు... ఎదో జరిగింది..."

ఆరాధ్య "రాజన్ వాళ్ళ కారు..."

ఇషా "అప్పుడే, ఈ రాజన్ వాళ్ళ కార్ ఆ కారుని ఫాలో అయ్యి ఎదో చూశారు"

ఆరాధ్య "ఏం చూశారు"

ఇషా స్పీడ్ గా ఆ లెటర్ ఓపెన్ చేసి చూసింది. 

"నువ్వు, మీ ఫ్యామిలీ నటిస్తున్నారు అని నాకు తెలుసు....  అడిగిన డబ్బులు ఇవ్వక పోతే.... మీ శత్రువులకు చేప్పెస్తాము..."

ఇషా "మనం రిచ్ అని తెలియదు... జస్ట్ మనకు శత్రువులు ఉన్నారని మాత్రం తెలుసు..."

ఆరాధ్య "అంటే ఆ రోజు రాజన్ ఎదో చూసి మనకు శత్రువులు ఉన్నారని కన్ఫర్మ్ చేసుకున్నాడు... మనం ఎవరనేది అతనికి తెలియదు" అంది.

ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ విష్ణు నెంబర్లకి కాల్ చేస్తున్నారు. కాని ప్రతీది మోగుతుంది కాని ఎవరూ ఎత్తడం లేదు.

ఇషా భయం భయంగా దేవుడు గది దగ్గరకు వెళ్లి అమాంతం కూర్చొని విష్ణుకి ఏం జరగకూడదు అనుకుంటూ ప్రార్ధన చేయడం మొదలు పెట్టింది.




గతం:

.....  తన మగాడిని(ఆకాష్ ని) కంట్రోల్ చేయలేక పోయింది.

.....  అంతే జరగాలి, అసలు ఆ ఇషా పోగరుకి అలాగే జరగాలి.

.....  ఆ ఇషా గతంలో నా బాయ్ ఫ్రెండ్ ని చూసి ముసలోడు అంటూ వెక్కిరించింది, ఇప్పుడు చూడు...

.....  ఇషా, పెద్ద దొంగ ముండ...  విష్ణువర్ధన్ కి లైన్ వేస్తుంది...

.....  అబ్బా.....  విష్ణువర్ధన్ ఎంత అందంగా ఉన్నాడో.....  ప్చ్.... ఆ ఇషా బక్క మొహంది తేలిపోయింది.

.....  తిక్క కుదిరింది, ఇషాకీ అంతే జరగాలి.

.....  ఇషా పొగరుకి వాళ్ళ ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయలేదు.

.....  ఇషా, ధనవంతురాలైన అనాధ. తన ఫ్యామిలీ కూడా తన వైపు లేదు.


రమాదేవి ఆన్ లైన్ లో వస్తున్న కామెంట్స్ చదువుతూనే ఉంది. 

ఇషా విసుగ్గా "ఇక ఆపుతావా!" అంది.

రమాదేవి మరియు ఆరాధ్య ఇద్దరూ ఒకరినొకరు అద్దం నుండే చూసుకున్నారు.

కొద్ది సేపటి తర్వాత...

ఆరాధ్య "ఇషా..."

ఇషా "హుమ్మ్"

ఆరాధ్య "విష్ణువర్దన్ బాగుంటాడు కదా... లవ్ చేయొచ్చు కదా..." అంది.

ఇషా, పక్కకు తిరిగి రమాదేవి ఫోన్ లో విష్ణువర్దన్ వింటున్నాడు అని అర్ధం చేసుకుంది.

ఇషా "మా అమ్మకి ఫోన్ అంత బాగా వాడడం చేత కాదు, చిన్నగా నొక్కుతుంది... అలాంటిది చనిపోయే ముందు మా నాన్నకి వంద మెసేజ్ లు పంపింది... మా నాన్న ఒక్కటి కూడా చదవలేదు, తన రెండో పెళ్ళాం తో రోమాన్స్ చేస్తూ ఉండి ఉంటాడు... నాకు ఒక్క మెసేజ్ కూడా చేయలేదు తెలుసా!" అంది.

కారు అంతా సైలెన్స్ గా ఉంది.

ఇషా "విష్ణువర్దన్ నన్ను ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు....  అతన్ని నేను కూడా ప్రేమిస్తున్నా అని కూడా నాకు తెలుసు....  కాని నాకు ప్రేమ మీద నమ్మకం లేదు....  నాకు కేవలం నా బిజినెస్, లాభాలు, నష్టాలు మాత్రమే కనిపిస్తున్నాయి....  " అంది.

కారు మొత్తం సైలెంట్ అయిపొయింది.

ముందు కారులో ఇషా, రమాదేవి మరియు ఆరాధ్య ముగ్గురూ ఉన్నారు.

వెనక కారులో ఆకాష్ ఫ్యామిలీ కోసం గిఫ్ట్ లు వస్తున్నాయి.

రెండూ కార్లు ఆకాష్ ఇంటి ముందు ఆగాయి, సెక్యూరిటీ వాళ్ళను చూసి ఇంట్లోకి ఫోన్ చేసి ఓకే చెప్పడంతో రెండూ కార్లు ఇంట్లోకి కదిలాయి.

ఇంట్లో నుండి కొంత మంది పని వాళ్ళు వచ్చి రెండో కారు నుండి గిఫ్ట్ లను తీసుకొని ఇంట్లోకి చేరుస్తున్నారు.

ఇషా అదంగా రెడీ అయి మెల్లగా అడుగులు వేస్తూ ఆకాష్ ఇంట్లోకి నడిచింది.

ఆకాష్ ఇంట్లో ఫ్యామిలీ అందరితో పాటు ఆకాష్ అక్క భార్గవి కూడా ఉంది. పైగా ఇషాని పులి గుహలోకి వస్తున్న మేక పిల్లని చూసినట్టు చూస్తుంది.

ఇషా కూడా ఇంట్లో అందరిని పలకరించడం కోసం తల పైకెత్తి అందరిని చూస్తూ మనసులో "యుద్దానికి సిద్దం" అనుకుంది.




ప్రస్తుతం:

ఆరాధ్య "దామినికి ఏమంటే ఇష్టం"

ఇషా "దామిని అరగంటలో s.chool నుండి వస్తుంది.  తనకు కావలసిన ఫుడ్ మొత్తం ఫ్రిడ్జ్ లో ఉంది"

ఆరాధ్య "ఏమయినా....   ఏమయినా....   అలర్జీలు....   మెడిసెన్....   ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే చెప్పూ"

ఇషా "అవన్నీ దామినికి తెలుసు....   పైగా ఇంటికి పనిమనిషిని రమ్మని చెబుతాను....   "

ఆరాధ్య "ఎప్పుడూ వస్తావ్....   "

ఇషా రెడీ అయి, గ్యారేజ్ దగ్గరకు వెళ్లి కార్ బయటకు తీసి ఆన్ చేయడం కోసం చూస్తుంది.

ఆరాధ్య "విష్ణు ఎక్కడ ఉన్నాడో నీకు తెలియదు కదా....  ఏం చేస్తావ్...."

ఇషా "ఎక్కడ ఉన్నా కూడా తీసుకొని వస్తా...." అనగానే ఇంజెన్ ఆన్ అయింది.

ఇషా నవ్వుకొని ఇంజెన్ ని కొద్ది సేపు అలానే హీట్ అయ్యేలా చేసింది.

ఆరాధ్య తన నడుము దగ్గర దాచిన గన్ తీసి "హెల్ప్ కావాలా!" అంది.

ఇషా చిన్నగా నవ్వి కారులో చిన్న బటన్ నొక్కింది.

చాలా గన్స్, రకరకాల సైజ్ లు కనిపించాయి. ఇషా మళ్ళి బటన్ నొక్కగానే మాములుగా అయిపొయింది.

ఆరాధ్య చూస్తూ ఉండగానే, ఇషా కారుని బయటకు తీసింది, రోడ్ మీద ఆ కారు రయ్యి మంటూ వెళ్తుంది.

ఇషా "యుద్దానికి సిద్దం" అనుకుంది.














[+] 11 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: బెస్ట్ కపుల్ - by Uday - 24-10-2024, 01:43 PM
RE: బెస్ట్ కపుల్ - by Uday - 25-10-2024, 02:48 PM
RE: బెస్ట్ కపుల్ - by Uday - 29-10-2024, 12:40 PM
RE: బెస్ట్ కపుల్ (Nov 16) - by 3sivaram - 20-11-2024, 09:43 PM



Users browsing this thread: 2 Guest(s)