Thread Rating:
  • 9 Vote(s) - 2.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Non-erotic కన్యాశుల్కం
#38
మధు (అంటే నేనే) -  వినగా వినగా ఈ ప్లాన్స్ అన్ని జస్టిఫైడ్ గానే ఉన్నాయిరా..

అనిల్ - జస్టిస్ ఎవరికో జైలు ఎవరికో..

మధు (అంటే నేనే) - ట్రై చెయ్యొచ్చంటావా..

అనిల్ - అదేంట్రా ఇందాకటి దాగా ఊగావ్ గా.. నాకు ఆ పిల్లే కావాలి అని..

మధు (అంటే నేనే) - ఆ 5th టెస్ట్ ఏమై ఉంటుందంటావ్..

అనిల్ - HIV టెస్ట్ ఏమైనా చేయిస్తుందేమో..

నేను - ......

అనిల్ - ఆ ఎక్స్ప్రెషన్ లెస్ ఫేస్ ఏంట్రా..

నేను - మొహం పగలగొడితే నీ లవర్ నీతోనే ఉంటుందా వదిలేసి పోతుందా అని ఆలోచిస్తున్నా..

అనిల్ - నవ్వొచ్చే జోక్స్ వెయ్యరా..

నేను - నీకిది జోక్ లా ఉందా బె..

అనిల్ - ఇది కాదు.. మార్నింగ్ నుంచి నీ జీవితం లో జరిగేదంతా జోక్ లాగే ఉంది..

నేను - సరే లైట్ తీస్కో.. నేను వెళ్లి స్వప్న తో మాట్లాడుకుంటా..

అనిల్ - మామ అల్ ది బెస్ట్ చెప్పడానికి మనసొస్తలేదురా..

నేను - సరే బిల్ పే చేసి దొబ్బెయ్..

నైట్ 8 అయ్యింది..

ఒకేసారి ఇంత ఖర్చు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు.. అకౌంట్ లో 2 లక్షలే ఉన్నాయ్..

లవ్ చేసాక అప్పుల పాలు ఐనవాళ్ళని చూసా కానీ లవ్ స్టార్ట్ చెయ్యడానికే అప్పు చెయ్యాలా..

తను డీల్ చేసే పద్దతి హార్ష్ గా ఉంది కానీ.. కాన్సెప్ట్ పాతదే..లివింగ్  టుగెథెర్..

బట్ దాన్నే పద్ధతిగా పెద్దల సమక్షంలో..

ఓ సంగతి మర్చిపోయా.. అంతా ఓకే ఐన తర్వాత కూడా తను రిజెక్ట్ చేసే ఛాన్స్ ఎంత ఉంది దీనిలో..

మనవాళ్ళ మధ్య మన లైఫ్ బిస్కేట్ అయిపోవడం ఎంత మాత్రం బాగోదు..

సరే కన్ఫ్యూషన్ ఎందుకు..ఏదైతే అదే అవుతుంది అని 0402....... కి డయల్ చేశా..

2024 లో కూడా ల్యాండ్ లైన్ వాడుతున్నారంటే వాళ్ళ ఫామిలీ ని ఓసారి నా ఇమాజినేషన్ క్రియేట్ చేసుకున్న..

17 సెకన్ల తర్వాత.. హలో ఎవరు..

నేను - హలో నేను మధు మాట్లాడుతున్న..ఓసారి స్వప్న ని పిలుస్తారా..

అటునుంచి - స్వప్న ఇంకా రాలేదు.. ఈరోజు ఎదో పబ్ కి వెళ్లి వస్తా అంది.. 1 అవుతుందేమో..

నేను - తన మొబైల్ నెంబర్ ఇస్తారా..

అటునుంచి - తనే ఇవ్వలేదంటే తన నెంబర్ ఇవ్వడానికి నేనెవరిని..

ఫోన్ పెట్టేసి.. ఒక్కొక్కళ్ళు ఒక్కో అని ముత్యాల్లా ఉన్నారు..

ఇంతకీ ఇది ఏ పబ్ కి వెళ్లి ఉంటుందో..

నా శత్రువంటి మిత్రుడికి ఫోన్ చేద్దామా అని అలోచించి.. తర్వాత జరగబోయే డిస్కషన్ గుర్తొచ్చి ఫోన్ పక్కన పడేసా..

ఎరా భోజనం పెట్టనా అని అమ్మ అరిచింది హాల్ లోంచి..

తినాలని మనసుకు లేకపోయినా.. అమ్మ కోసం వెళ్లి కూర్చున్న..

అమ్మ ఎదో మాట్లాడుతోంది.. నా మైండ్ ఎదో ఆలోచిస్తోంది...

మళ్ళీ పొద్దునే తనని చూసేది..

ఓకే చెప్తే ఏమంటుందో.. ఒక నెలలో తనని ఇంప్రెస్స్ చెయ్యాలంటే ఎక్కడెక్కడకి తీసుకు వెళ్లాలో.. అసలు ఇద్దరం లవర్స్ లా ఉంటామ.. ఫ్రెండ్స్ లా ఉంటామా..

అసలు ఉన్నదంతా తనకే ఇచ్చేస్తే ఈ నెల నా ఖర్చుల సంగతేంటో..

భోజనం ఎప్పుడైందో.. చెయ్యి ఎప్పుడు కడుక్కున్నానో.. ఎప్పుడు పడుకున్నానో.. కలలో కూడా తనే..

మెలకువ రాగానే అనిపించింది.. డ్రాప్ అయిపోతే..

హ.. డ్రాప్ అయిపోతే.. ఇంకో పిల్లని చూస్తాం.. లేదా ఇంట్లో వాళ్లే చూస్తారు.. పెళ్ళైపోతుంది..

లేదు.. స్వప్న.. బ్యూటీ విత్ మైండ్.. హార్ట్ కూడా చూడాలి..

మళ్ళీ పడుకున్నా.. నవ్వుకుంటూ..

xxxxx

పొద్దున్నే..సేమ్ టైం.. సేమ్ పార్క్..

ఈరోజు నేనే పలకరించా.. హాయ్..అంటూ..

హాయ్ మధు.. ఏంటి ఇంకా నిద్ర మత్తులోనే ఉన్నట్టున్నావ్...

రాత్రంతా నిద్ర లేదులే..

మరి పద..జాగింగ్ చేస్తే..మత్తు వదులుతుందిగా..

పక్కన వాళ్ళ ఫ్రెండ్ అయోమయం గా చూస్తోంది.. స్వప్న నాతో అంత క్యాజువల్ గా మాట్లాడుతోంది ఏంటా అని..

కాఫీ కి పోదాం అన్నా..

వెళ్లి కూర్చున్నాక తనకంటే ముందే నేనే సర్వర్ ని పిలిచి ఆర్డర్ చేశా..

స్వప్న - హ చెప్పు ఏంటి విషయం.. రాత్రి కాల్ చేసావ్ ట..

నేను - నీకు శాలరీ ఇవ్వడానికి నాకు ఓకే.. బట్ నా శాలరీ 2 నే వస్తుంది.. అదే ఆలోచిస్తున్న..

స్వప్న - ఓహ్.. ఫిక్స్ అయ్యావా.. ఆల్రైట్.. 2  ఐన పర్లేదు లే.. ఈసారికి ఎడ్జెస్ట్ అవుతా.. ఐతే నీకు మన కండీషనల్ లవ్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి..

నేను - హ చెప్పు..

స్వప్న - మనం 1st మీ ఇంటికి తర్వాత మా ఇంటికి  వెళ్లి మన లవ్ సంగతి చెప్పాలి..

నేను - సరే..

స్వప్న - తర్వాత మన ఇద్దరం వన్ మంత్ ఒక రూమ్ తీసుకొని కలిసి ఉందాం.. అన్ని పనులు షేర్ చేసుకోవాలి.. ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చెయ్యాలి.. ఒకళ్ళ కోసం ఒకళ్ళు మారకూడదు..

నేను - అదేంటి మనం లవర్స్ లా ఉంటామా స్ట్రేంజర్స్ లా ఉంటామా.. కలిసి ఉంటె కొన్ని విషయాలు కంప్రమైస్ అవ్వాల్సి వస్తుంది కదా..

స్వప్న - అదే.. ఆ విషయాలు మనకి ఎలా వర్క్ అవుతున్నాయో చూద్దామనే కదా ఈ ట్రయిల్..

నేను - అర్ధం అయ్యింది..

స్వప్న - ఐతే వెళ్దామా..

నేను - అంతేనా ఇంకేం లేదా..

స్వప్న - అంటే

నేను - అదే వన్ మంత్ తర్వాత ఓకే అనుకుంటే..

స్వప్న - హ ఓకే అనుకుంటే ఓకే నే కదా.. ఇంకేముంటుంది..

నేను - (మనసులో) అదేంటి వీళ్ళ ఫ్రెండ్ చాల ప్రాసెస్ చెప్పింది..

నేను - ఓకే.. 1st ఎక్కడకి వెళదాం..

స్వప్న - మీ ఇంటికే.. లొకేషన్ పెట్టు.. నేను రెడీ అయ్యి 1 అవర్ లో వస్తా.. అటునుంచి అటు మా ఇంటికి..

నేను - సరే.. ఇప్పటికైనా నెంబర్ చెప్తావా..

స్వప్న - (ఒక స్మైల్ ఇచ్చి) నోట్ చేస్కో.. 99........

తన ఫ్రెండ్ నాకేసి జాలిగా చూస్తూ జాగింగ్ చేసుకోవడానికి వెళ్ళిపోయింది..

దాని మొహం లే.. నిన్న అది చెప్పిన స్క్రీన్ ప్లే కి ఈరోజు జరుగుతున్నా సీన్ కి అసలు సంబంధమే లేదు..

లొకేషన్ షేర్ చేసి స్వప్న కి బాయ్ చెప్పి.. ఇంటికొచ్చి బాత్రూం లో దూరి.. షవర్ ఆన్ చేశా..

ఆహా ఎంత సుఖం గా ఉంది.... స్వాతి ముత్యపు ఝల్లులలో...
[+] 11 users Like nareN 2's post
Like Reply


Messages In This Thread
కన్యాశుల్కం - by nareN 2 - 11-05-2024, 11:42 AM
RE: కన్యాశుల్కం - by Uma_80 - 13-05-2024, 03:26 PM
RE: కన్యాశుల్కం - by Venrao - 17-05-2024, 03:26 PM
RE: కన్యాశుల్కం - by Uday - 17-05-2024, 04:12 PM
RE: కన్యాశుల్కం - by Uday - 17-05-2024, 06:08 PM
RE: కన్యాశుల్కం - by nareN 2 - 19-11-2024, 06:26 PM
RE: కన్యాశుల్కం - by Uday - 20-11-2024, 01:25 PM
RE: కన్యాశుల్కం - by Uday - 21-11-2024, 06:30 PM



Users browsing this thread: 2 Guest(s)