Thread Rating:
  • 9 Vote(s) - 1.89 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller బెస్ట్ కపుల్ (Nov 20)
#64
10. ఫాంటసీలు



....గతం....

ఇషా "ఫంక్షన్ మధ్యలో ఎవడో బుడబుక్కలోడిని పట్టుకొచ్చి నన్ను నాలుగు మాటలు అంటే.... నేను సెక్యూరిటీ ఆఫీసర్లను పిలిచి ఎంక్వయిరీ చేయించనా.... అసలు నేనే మనుషులను పెట్టి ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ చేయించనా.... హుమ్మ్.... అసలు వాడితో నేను దిగిన ఫోటో ఏంటి? ఎదో సెలబ్రిటీ పక్కన దిగినట్టు ఉంది. ప్చ్... ప్చ్... ప్చ్..." అని యాపిల్ ముక్క ఒకటి తీసి నోరు తెరిచి ఉన్న సంజన నోట్లో పెట్టేసింది.

సంజన నోటి నిండా ఉన్న యాపిల్ ముక్కను నోట్లోనే బలవంతంగా మింగింది. సంజన కళ్ళ నుండి నీళ్ళు వచ్చేస్తున్నాయి, కల్పన మరియు పురుషోత్తం ఇద్దరికీ చల్లగా చమటలు పట్టేసాయి.

ఇషా తల పైకెత్తి కల్పనని చూసి "అమ్మా.... ఆకాష్ తో కడుపు వచ్చేస్తే..... పెళ్లి చేసుకుంటా అని ఎవరైనా చెప్పారా..... ఎందుకు అంత ఆత్రం....." అని అడిగింది.

కల్పన తల దించుకుంది.

పురుషోత్తం ని చూస్తూ "నా కంపనీని ఎప్పుడైనా గమనించారా! నాన్నా.... మీ వల్ల అవుతుందా! నేను చనిపోతే... తిమింగలం మింగినట్టు మింగేస్తారు..." అంది.

పురుషోత్తం కోపంగా ఇషా వైపు చూశాడు కాని ఆమె చూపులో వచ్చిన మార్పుకో ఏమో ఎదురు మాట్లాడలేక పోయాడు.

ఇషా పైకి లేచి అటూ ఇటూ తిరుగుతూ ఉంది కానీ ఆమె సీరియస్ గానే ఉంది. 

ఇషా "నన్ను చంపేసి లేదా నా పరువు తీసేసి, పురుషోత్తం గారు నా కంపనీకి యజమానిగా మారిపోయి..... నిన్ను ఆకాష్ కి యిచ్చి పెళ్లి చేసేస్తే..... ఆకాష్ తన అక్కకి ఎదిరించి తన కంపెనీకి యజమాని అయిపోయి ఇటూ మీ నాన్న ఈ కంపనీకి యజమాని అయిపోయి ఇద్దరి మధ్య నువ్వు మోస్ట్ పవర్ ఫుల్ పర్సన్ గా మారిపోతావ్.... శుభం కార్డు.... అంతే కదా..."

ముగ్గురు సిగ్గుగా తల దించుకున్నారు.


ఇషా "నన్ను ఎవడి చేతో నాలుగు అనిపించి నేను ఏమి అనను తలవంచుకొని ఏడుస్తాను అని అనుకోవడం... ఏంటి ఇది.....?  

ఇప్పుడు కడుపు వచ్చి అందరిలో పరువు పోయి.... ఏంటి ఇది....? 

ఆకాష్ ఫ్యామిలీ పెళ్లి చేసుకుంటారు అని పగటి కల కనడం..... ఏంటి ఇది.....?

ఫాంటసీకి కూడా అదుపు ఉండాలి..... ఏంటి ఇది....?  

ఫాంటసీకి అయినా కొంచెం అయినా ఉండాలి కదా.....  ఏంటి ఇది....?" అంది.


సంజన మంచం పై నుండి లేచి ఇషా ముందు మోకాళ్ళ దండ వేసి "సారీ అక్కా....  సారీ....  " అంటూ ఏడ్చేసింది.

కల్పన మరియు పురుషోత్తం కూడా ఇషా ముందు తప్పు చేసిన వాళ్ళు లాగా నిలబడ్డారు.

రమాదేవి కోపంగా వాళ్ళ ముగ్గురిని చూసి "ఏంటి ఇది....?" అంది.

ఇషా వెనక్కి తిరిగి రమాదేవి వైపు తిరిగి చూసింది. రమాదేవి ఇబ్బందిగా చూసి తల దించుకొని చిన్నగా నవ్వుకుంటుంది.

ఇషా "బయటకు వేళ్ళు" అని చెప్పడం తో రమాదేవి గది బయటకు వెళ్లి పోయి తలుపు దగ్గర ఉండి చెవులు పెట్టి వింటుంది.





ఇషా, సంజనని పైకి లేపి "నువ్వు నన్ను అడిగి ఉంటే .....  ఆకాష్ కి నిన్ను భార్యని చేసేదాన్ని.....  ఆ ఇంట్లో అందరూ నిన్ను గౌరవంగా ఉండేలా చేసేదాన్ని.....  కాని నన్ను ఇలా మోసం చేశారు" అంది.

సంజన ఏడ్చేసింది. ఇషాకి నిజం తెలిసాక కల్పన తన ముందుకు కూడా వెళ్ళలేకపోయింది. తన కళ్ళలోకి కూడా చూడడం లేదు.

ఇషా గది నుండి బయటకు వెళ్లి పోయింది. సంజన ఏడుస్తూనే ఉండిపోయింది.





....ప్రస్తుతం....

ఆరాధ్య ఫోటోస్ మరియు వీడియోస్ చూపిస్తూ "ఇతని పేరు రాజన్, భార్య పేరు సౌమ్య..... ఇంతకి ముందు ఎప్పుడైనా చూశావా!"

ఇషా ఫేస్ మాస్క్ పెట్టుకొని తల వెనక్కి వాల్చుకొని పెట్టుకుంది. 

కళ్ళకు పెట్టుకున్న కీర దోసకాయ ముక్కలను అడ్డు తీసి వాళ్ళ ఫోటోస్ చూసి తల వెనక్కి పెట్టుకొని ఆలోచిస్తూ "హుమ్మ్..... వీళ్ల అబ్బాయి మన దామినితో గొడవ పడితే s.chool ఆఫీస్ రూమ్ లో చిన్న గొడవ అయింది" అంది.

ఆరాధ్య "బెదిరించావా...!"

ఇషా  "ప్చ్..."

ఆరాధ్య "కొట్టావా...!"


ఇషా  "ప్చ్..."
ఆరాధ్య "గన్ బయటకు తీశావా...!" అని కరక్ట్ గా గెస్ చేసినందుకు తనని తానూ మెచ్చుకుంది.


ఇషా  "ఆరూ...." అని తన అసహనం వెళ్ళ బుచ్చింది.

ఆరాధ్య "మరి ఏం చేశావ్..."

ఇషా "దామిని అమ్మలా బిహేవ్ చేశాను... అంతే..."

ఆరాధ్య చిన్నగా నవ్వి ఇషా ని చూసింది.
ఆరాధ్య "వీళ్లు తన కొడుకు చేత ఇక్కడ ఆ స్లిప్ వేయించారు"

ఇషా "బాగా ప్రమాదమా అయితే...... లేపెసేయ్.... తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం...... "

ఆరాధ్య "ఇషా..... అంటే అది..... "

ఇషా "చిన్న వాళ్ళా....  అయితే బెదిరించు...... "

ఆరాధ్య "కాదు...... "

ఇషా "మరి...... "

ఆరాధ్య "బెదిరించడానికి ఎక్కువ...... లేపెయడానికి తక్కువ...... "

ఇషా "ఏం మాట్లాడుతున్నావ్...... " అంటూ మాస్క్ తీసేసి ఆరాధ్య వైపు చూసింది.

ఆరాధ్య "హుమ్మ్...... "

ఇషా "ఏం చేద్దాం...... "

ఆరాధ్య "చెప్పూ నువ్వే...... "

ఇషా "ఎహ్......  వీళ్లు వీళ్ళ అర్ధం పర్దం లేని ఫాంటసీలు...... ఛా..... " అని తల కొట్టుకుంది.

ఆరాధ్య "చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు కదా...... "

ఇషా "నువ్వే.... ఎదో ఒకటి చెయ్" అంటూ ఎదో ఆలోచిస్తూ విష్ణుకి ఫోన్ చేస్తుంది.





....గతం....

ఇషా "రమాదేవి.... ఆకాష్ ఫ్యామిలీలో మనిషి నుండి కుక్క దాకా అందరికి గిఫ్ట్ లు తీసుకో...."

రమాదేవి "ఎందుకు మేడం...." అని ఆశ్చర్యంగా చూసింది. ఈ పాటికి ఆకాష్ ఫ్యామిలీని చావగోడుతుంది అనుకుంది.

ఇషా "పెళ్లి ముచ్చట మాట్లాడాలి కదా...." అంటూ నవ్వుకుంటూ వెళ్తుంది.

రమాదేవి "మేడం....  మేడం....  మేడం....  " అని పిలిచి ఇంకా పలకకపోయే సరికి "ఒసేయ్ ఇషా...." అని అరిచింది.

ఇషా వెనక్కి తిరిగి చూసింది.

రమాదేవి గుటకలు మింగి పరిగెత్తుకుంటూ వచ్చి తన ఫోన్ ఓపెన్ చేసి తన ఫ్యామిలీ ఫోటో చూపించి "తిను నా పెద్ద కూతురు UK లో MS చేస్తుంది. వీడు చిన్నోడు ఇక్కడే MBA చేస్తున్నాడు....  ఇదంతా కూడా నీ దయ వల్లే.... ప్లీజ్....  ఇలాంటి రిస్క్ చేయకు....  ఆకాష్ అసలు మంచోడు కాదు....  "

ఇషా నవ్వేసి "పదా....  పదా....  పెళ్లి భాజా మోగాలి పదా....  " అంటూ నవ్వుతూ ముందుకు వెళ్ళింది.

రమాదేవి చేసేది లేక విష్ణువర్ధన్ కి ఫోన్ కి చేస్తుంది.



























[+] 12 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: బెస్ట్ కపుల్ - by Uday - 24-10-2024, 01:43 PM
RE: బెస్ట్ కపుల్ - by Uday - 25-10-2024, 02:48 PM
RE: బెస్ట్ కపుల్ - by Uday - 29-10-2024, 12:40 PM
RE: బెస్ట్ కపుల్ (Nov 13) - by 3sivaram - 16-11-2024, 09:13 PM



Users browsing this thread: 4 Guest(s)