13-11-2024, 02:31 PM
(This post was last modified: 13-11-2024, 04:25 PM by 3sivaram. Edited 2 times in total. Edited 2 times in total.)
9. తట్టుకోగలరా...
-
....గతం....
సంజన హాస్పిటల్ మంచం మీద పడుకొని ఏడుస్తూ ఉంది, ఒక పక్క కల్పన మరియు మరియు పురుషోత్తం ఇద్దరూ కూర్చొని ఉన్నారు.
టక్.... టక్.... టక్.... మని సౌండ్ రాగానే కల్పన పైకి లేచి డోర్ దగ్గరకు వెళ్లి చూసింది.
ఎదురుగా ఇషా వస్తూ ఉండడం చూడగానే పై ప్రాణాలు పైనే పోయాయి.
కల్పన "ఇషా వస్తుంది" అనగానే సంజన బెడ్ పై పడుకుంది. కల్పన వెళ్లి పురుషోత్తం పక్కనే కూర్చుంది.
డోర్ ఓపెన్ అవ్వగానే కల్పన అప్పటి వరకు ప్రిపేర్ అయిన స్క్రిప్ట్ మొత్తం వేస్ట్ చేస్తూ నర్సు లోపలకు వచ్చింది.
నర్సు వచ్చి సంజనకు పెట్టిన సెలైన్ ని చూసి సంజన మెడికల్ చార్ట్ చూసి "ఒక్కళ్ళు ఉండి, ఇంకొకరు బయటకు వెళ్ళండి..... డాక్టర్ గారు వస్తున్నారు... ఎక్కువ మంది ఉంటే తిడతారు" అంది.
పురుషోత్తం, కల్పన వైపు చూసి "బయటకు వేళ్ళు" అన్నాడు.
సంజన కంగారుగా కల్పన వైపు చూసింది, ఆమెకు తన తల్లి పక్కన ఉండాలని అనుకుంటుంది. నిజానికి ఇది ప్రేగ్నేన్సి కేసు కాబట్టి కల్పన ఉండాలి కాని పురుషోత్తం తన అధికారం ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటూ కల్పనని బయటకు వెళ్ళమని చెబుతున్నాడు.
కల్పన, పురుషోత్తంతో "ఇద్దరం ఉందాం" అంటూ సంజన తల దగ్గరకు వెళ్లి నిలబడి ఆమె తల మీద చేయి వేసి హామీ యిచ్చింది.
డాక్టర్ వస్తూనే గదిలో ఉన్న కల్పన మరియు పురుషోత్తంలని కోపంగా చూసి వెళ్లి మెడికల్ చార్ట్ చూశాడు.
నర్సుతో మాట్లాడి సంజనతో "కళ్ళు తిరుగుతున్నాయా! అమ్మా!!" అని అడిగాడు.
సంజన నీరసంగా "తిన్నదంతా వాంతులు అయిపోతున్నాయ్ డాక్టర్" అంది.
డాక్టర్ నవ్వుతూ "అవుతాయ్.... కడుపు కదా, అవుతాయ్.... పైగా అక్కకి కాబోయే వాడితో, కాబట్టి.... వాంతులు ఇంకా ఎక్కువ అవుతాయ్" అన్నాడు.
సంజన కళ్ళ వెంట నీళ్ళు వచ్చేశాయి. డాక్టర్ వచ్చిన దగ్గర నుండి తన వైపు చాలా అసహ్యంగా చూస్తూ ఉన్నాడు.
డాక్టర్ "బాగా ఆలోచించుకో.... ఆకాష్ ఫ్యామిలీ ఒప్పుకోక పోతే అబార్షన్ చేయించుకోవాలని అనుకుంటావ్ కదా.... ఏది అనేది ఎక్కువ రోజులు టైం తీసుకోకు... సరేనా!" అన్నాడు.
సంజన గట్టిగా కళ్ళు మూసుకుంది, ఆమె కళ్ళ నుండి నీళ్ళు పక్కల నుండి కారిపోతున్నాయి, ఫంక్షన్ హాల్ లో జరిగిన దాని తర్వాత ఆకాష్ ఫోన్ ఎత్తడం మానేశాడు.
అంతలో స్వీట్ గా ఇషా వాయిస్ "డాక్టర్ గారికి నా చెల్లెలిని చూసే ఉద్దేశ్యం లేక పొతే వేరే డాక్టర్ ని మారుస్తాం... " అంది.
డాక్టర్ వెనక్కి తిరిగి ఇషాని చూసి "అది కాదు అమ్మా...." అంటూ గౌరవంగా మాట్లాడాడు.
కాని ఇషా డ్రెస్సింగ్ స్టైల్ మరియు ఆమె పక్కనే నిలబడ్డ రమాదేవిని చూసి షాక్ అయ్యాడు.
ఇషా అసలే హైట్ ఉంటుంది, అందులోనూ హై హీల్స్ వేసుకొని మీకు అందని దాన్ని అన్నట్టు ఉంది, అందరిని తల కిందకు వంచి చూస్తూ ఉంది.
డాక్టర్ "అది అమ్మా...."
ఇషా "తన ప్రేగ్నేన్సి ఎలా ఉంది, నల్లగా ఎదో ఫిల్మ్ లా తీస్తారు కదా... ఉందా..."
డాక్టర్ "అది కాదు ఇషా తల్లి..... ఆకాష్ ఫ్యామిలీ...."
ఇషా, డాక్టర్ వైపు చూసి "ఉందా.... పోనీ తన కండీషన్ ఏంటి? వాంతులు తగ్గేలా ఇంజెక్షన్ చేశారా!"
డాక్టర్ "అవసరం లేదు..."
ఇషా "ఎందుకు అవసరం లేదు..."
నర్సు వాళ్ళను చూసి చూసి "ప్రేగ్నేన్సి ఉన్న వాళ్లకు అలా ఇంజెక్షన్ చేయరు మేడం...."
ఇషా "మరి ఆ నల్ల కాగితం..."
నర్సు "అది అల్ట్రా సౌండ్ రిపోర్ట్ మేడం..."
ఇషా "అదేలే ఎదో స్కానింగ్...."
నర్సు "స్కానింగ్ కోసం ఇంకా టైం ఉంది మేడం... ప్రస్తుతం.... ఇంకా ఎర్లీ స్టేజ్ లోనే ఉన్నారు...." అంది.
ఇషా డాక్టర్ వైపు చూసి "ఆకాష్ ఫ్యామిలీ కాని వచ్చారా! కాల్ చేశారా!"
డాక్టర్ అవునని కాదని చెప్పలేకపోతున్నాడు.
ఇషా "పిచ్చి పిచ్చి పనులు చేస్తే మిమ్మల్ని హాస్పిటల్ తో సహా తగలబెట్టేస్తాను" అంది.
అందరిని భయపెట్టే తమ డాక్టర్ అలా ఇషా ముందు భయపడడం చూసి నర్సు ఆలోచిస్తూనే డాక్టర్ ని ఫాలో అయి బయటకు వెళ్లి వేరే నర్సుతో అదే విషయం అడిగింది.
నర్సు 1 "ఇషా వాళ్ళ మదర్ మరియు పురుషోత్తం గారు లేచి పోయి పెళ్లి చేసుకున్నారు. దాంతో ఇషా మదర్ వాళ్ళ పేరెంట్స్ తమ కోట్ల ఆస్తిని ఆమెకు ఇవ్వలేదు కాని వాళ్ళకు ఉంది ఒక్కగానొక్క కూతురు కావడంతో తమకే ఇస్తారన్న నమ్మకం ఉంది. పురుషోత్తం గారు ఇషా మదర్ నే కాకుండా కల్పన గారిని కూడా ప్రేమించి ఆమెకు కూడా కడుపు చేశాడు. ఇషా మదర్, నెలల పిల్లని వదిలేసి తన భర్త తనని ప్రేమించడం లేదు అంటూ ఇదే హాస్పిటల్ పైకెక్కి దూకి చనిపోయింది"
నర్సు 2 "అమ్మో అవునా!"
నర్సు 1 "ఇషా చాలా సంవత్సరాలు వాళ్ళ అమ్మమ్మ తాతయ్యల దగ్గర పెరిగింది. వాళ్ళు చనిపోయిన తర్వాత "నాన్న అమ్మలం" అంటూ పురుషోత్తం మరియు కల్పన వచ్చారు. ఈ అమ్మాయి పిచ్చిగా వాళ్ళను మాత్రమే నమ్ముతుంది"
ఇషా, బయటకు వచ్చి నర్సులు ఇద్దర్ని చూసి "పక్కకు వెళ్లి మాట్లాడుకోండి" అంది.
ఇషా లోపలకు వచ్చి సంజన పక్కనే కూర్చొని యాపిల్ తీసుకొని వచ్చి ముక్కలు కొస్తుంది.
సంజన కోపంగా ఇషాని చూస్తూ ఉంటే తన కళ్ళ నుండి నీళ్ళు వచ్చేస్తున్నాయి.
సంజన "ఎందుకు?"
కల్పన మరియు పురుషోత్తం ఇద్దరూ సంజనని చూస్తూ ఉన్నారు.
సంజన "నీకు తెలుసు... నీకు అంతా తెలుసు... ముందు నుండే అంతా తెలుసు... చదువులో నువ్వు నెంబర్ వన్... ఇప్పటికే కంపనీ ఫైల్స్ చూస్తూ ఉంటావ్... అలాంటి నువ్వు ఎందుకు ఇలా నటిస్తున్నావ్... మేము నిన్ను ఎన్ని చేసినా ఎందుకు ఇలా నటిస్తున్నావ్" అని అరిచింది.
కల్పన మరియు పురుషోత్తం ఎవరూ ఏం మాట్లాడలేదు.
సంజన "నీకు తెలుసు.... నీకు తెలుసు.... ఐ హేట్ యు..... ఐ హేట్ యు..... " అని అరిచింది.
కల్పన ముందుకొచ్చి సంజన దగ్గరకు వచ్చి చేతులు పట్టుకుంది, సంజన కల్పన వైపు చూసి తిరిగి ఇషా వైపు చూసి చిన్నగా నవ్వి "మా అమ్మ నిన్ను నిజంగా లవ్ చేస్తుంది అనుకుంటున్నావా! నా కంటే నిన్ను ఎక్కువ లవ్ చేస్తుంది అనుకుంటున్నావా! అదంతా కూడా అబద్దం... అదంతా ప్లాన్...." అని అరిచింది.
ఇషా తన పాకెట్ నుండి ఫోన్ బయటకు తీసి ఎదో వెతుకుతూ ఉంటే, కల్పన తనని పట్టించుకోకుండా ఫోన్ చూసుకోవడం చూసి కోపంగా "మా అమ్మకి అలా చేయమని నాన్న చెప్పాడు, తను నాకు మాత్రమే నాన్న నీకు కాదు..." అని అరిచింది.
అంతలో పురుషోత్తం వాయిస్ వినపడింది.
అందరూ పురుషోత్తం వైపు చూసి తిరిగి ఇషా వైపు, ఇషా ఫోన్ వైపు చూశారు.
రికార్డింగ్ 1 :
కల్పన "పాపం కదా.... వాళ్ళ అమ్మ చిన్నప్పుడు చనిపోయింది... తనని చంపాలని వాళ్ళ చుట్టాలు చాలా మంది చూస్తున్నారు... తనని తీసుకొని రండి... సంజనతో పాటు పెంచుకుందాం..."
పురుషోత్తం "హుమ్మ్"
కల్పన "మీరు ఎప్పుడూ ఇలానే అంటారు... మర్చిపోయారా! ఆమె నీ కోసం చనిపోయింది"
పురుషోత్తం "నేనేమన్నా చనిపోమని చెప్పానా..... నేను చెప్పానా!" అని అరిచాడు.
కల్పన బిత్తరపోయి చూస్తుంది.
పురుషోత్తం "అదే చచ్చింది... ఇప్పుడు దాని కూతురు మన మాట వినదు..." అన్నాడు.
కల్పనకి పురుషోత్తం క్లియర్ గా కనిపించాడు, అతనికి అవసరం లేకపోతే ఎవరిని ఒప్పుకోడు అనుకుంది.
రికార్డింగ్ 2 :
కల్పన "ఇషాని నేను సముదాయిస్తాను... నేను పెంచుతాను..."
పురుషోత్తం "పిచ్చి పిచ్చిగా మాట్లాడకు... వాళ్ళు అందరూ కన్న తండ్రిని నన్నే అంటున్నారు.... సవితి తల్లివి నిన్ను ఒప్పుకుంటారా!" అంటూ వెక్కిరిస్తున్నట్టు నవ్వుతున్నాడు.
కల్పన "నేను పెంచుతాను... నేను పెంచగలను... వేరే అమ్మాయిని కడుపు చేసిన దరిద్రుడి ప్రేమని పొందడం కోసం, కన్న కూతురుని కూడా వదిలేసి పై నుండి దూకిందే వాళ్ళ అమ్మా, తన కంటే బాగా పెంచగలను... " అని అరిచింది.
పురుషోత్తం "అది కాదు కల్పన....."
కల్పన "చూడండి... ఇషా ఒక ఆడపిల్ల... తనకు ఒక తల్లి అవసరం ఉంది" అని చెప్పింది.
రికార్డింగ్ 3:
కల్పన "వద్దండి.... పాపం చిన్న పిల్ల...."
పురుషోత్తం "నువ్వు మాట్లాడకు... పోయిన సారి కూడా మెట్ల మీద నుండి తోసేశాము... నువ్వేమో సేవలు చేసి తిరిగి నిలబడేలా చేసావు"
కల్పన "పాపం చిన్న పిల్ల అండి"
పురుషోత్తం "చూడు..... ఇషా ఇప్పుడు మనల్ని నమ్ముతుంది తను చనిపోతే ఆస్తి నాకు వస్తుంది, కాబట్టి నీకు, మన కూతురు సంజనకే వస్తుంది"
కల్పన "..."
పురుషోత్తం "నేను పంపిన విషం ఇషా తాగే పాలల్లో కలిపేసేయ్...."
కల్పన "..."
పురుషోత్తం "ఏవే... వింటున్నావా..."
కల్పన "..."
పురుషోత్తం "వింటున్నావా..."
కల్పన "హుమ్మ్"
పురుషోత్తం "కలుపుతావా.... లేదా...."
కల్పన ఇబ్బందిగా "కలుపుతాను" అంది.
పురుషోత్తం సంతోషంగా "ఇబ్బంది పడకే.... ఇషా నాకు కార్డు ఇచ్చింది దీంతో నేను ఎంత బిల్ అయినా చేయొచ్చు... నీ కోసం డిమాండ్ నక్లెస్ తెస్తాను..." అంటూ నవ్వుతున్నాడు.
కల్పన "...."
పురుషోత్తం "వింటున్నావా..."
కల్పన "హుమ్మ్"
పురుషోత్తం "మరి మాట్లాడవే!"
కల్పన "ఈ విషం చేదుగా ఉంటుందా!"
పురుషోత్తం "ఏమో తెలియదు.... ఒక పని చెయ్..... నువ్వు ఒక సారి టేస్ట్ చెయ్..."
కల్పన "హుమ్మ్... సరే...."
పురుషోత్తం "ఒసేయ్ పనికి మాలిన దానా...."
కల్పన "ఏమయింది అండి..."
పురుషోత్తం "విషం తాగుతా అంటావెంటే... పనికి మాలిన దానా!"
కల్పన "..."
పురుషోత్తం "వింటున్నావా..."
కల్పన "హుమ్మ్"
పురుషోత్తం "ఏం చేస్తావ్?"
కల్పన "తేనే కలిపి ఇస్తాను... విషం కదా... చేదుగా ఉంటుందేమో...." అంది.
గదిలో పురుషోత్తం మరియు కల్పన అందరూ ఇషాని షాక్ గా చూస్తూ ఉన్నారు. ఇషా సీరియస్ గా ఉండడంతో ఎవరూ ఏం మాట్లాడలేక పోయారు.
ఇషా "నేను నటించడం ఆపేసి నా ఒరిజినల్ గా రిప్లై ఇవ్వమంటావా...." అని అడిగింది.
సంజన షాక్ గా చూస్తూ ఉంది.
ఇషా "తట్టుకోగలరా"
ముగ్గురు గుటకలు మింగుతూ చూస్తూ ఉన్నారు.
....ప్రస్తుతం....
ఇషా కూరగాయల కోసం బయటకు వెళ్లి వచ్చాక తను వేసిన ముగ్గు మీద ఒక కాగితం ఉంది, ఇషా అది ఓపెన్ చేసి చూసింది.
"నువ్వు, మీ ఫ్యామిలీ నటిస్తున్నారు అని నాకు తెలుసు.... అడిగిన డబ్బులు ఇవ్వక పోతే.... మీ శత్రువులకు చేప్పెస్తాము..."
ఇషా ఆ కాగితాన్ని నలిపేసి ఇంట్లోకి వెళ్లి తన ఇంటి ముందు ఉన్న సిసి కెమెరా ఓపెన్ చేసి చూసింది.
ఎవరో ఒక చిన్న పిల్లాడు వచ్చి అది వేసి వెళ్ళాడు, ఎవరో చెబితే వేసినట్టు ఉన్నాడు.
ఇషా ఆ కాగితాన్ని ఫోటో తీసి, అలాగే ఆ సిసి కెమెరా ఫుటేజ్ ఎదో నెంబర్ కి పంపించింది.
ఇషా చిన్నగా నవ్వి "నేను నటించడం ఆపేసి నా ఒరిజినల్ గా రిప్లై ఇవ్వమంటారా...." అంది.
తన ఫోన్ మోగింది. ఆరాధ్య (లేడి బాడీ గార్డ్)..... కాలింగ్.....
ఇషా సీరియస్ గా లెటర్ ని చూస్తూ "తట్టుకోగలరా..." అనుకొని ఫోన్ ఎత్తింది.
ఇషా "హలో..."
...
...
...
...
-