Thread Rating:
  • 11 Vote(s) - 2.09 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery నా అద్దం - నా డైరీ (Dec 19)
#25
**********  **********  **********  ********** 



"కొంచెం స్పీడ్ గ వెళ్తారా , నాకు మీటింగ్ కి టైం అవుతుంది "

(లొకేషన్ ఎలా ?)  "అలాగే ..  అవును మీది జూబిలీ హిల్స్ రోడ్ నంబర్ 36 కదా "  (నాకు ఆమె ఎక్కడకెళ్ళలో తెలియదుగా )

"అయ్యో జూబిలీ హిల్స్ కాదు మాదాపూర్ "

"అవునా .. అదేంటి నాకు వేరేది చూపిస్తుంది "

"నాకంత టైం లేదు .. నేను చెబుతా పోనివ్వండి "

అద్దంలో అమ్మాయిని చూస్తూ బండి నడుపుతున్నా

"ఇదేంటి . క్యూపిడో నుంచి కాల్ వస్తుంది "

"ఆ కాల్ లేపకండి .. ఆన్లైన్ పే చేయమని అడుగుతారు .. నాకు కాష్ ఇచ్చేయండి .. పర్లేదు .. ప్లీజ్ "

"ఓకే "

"మీరు ఉండేది ఇదే కాలనీలోనా మేడం .. ఎక్కడో చూసినట్టుంది "

"అవును .. కొంచెం ఫాస్ట్ గా వెళ్తారా .. నాకు టైం అవుతుంది "


కొంచెం సేపటికి ఆమె చెప్పిన అడ్రస్ వస్తుంది .. మైండ్ స్పేస్ ..

బండి దిగేక .. ఆ అమ్మాయి "ఎంత చూపిస్తుంది "

(నా దగ్గర యాప్ లేదుగా ) "మీకెంత చూపిస్తుంది "

"రైడ్ స్టార్ట్ చేసే ముందు 118 చూపించింది "

ఆమె 118 రూపాయలు చిల్లరతో పాటు ఇచ్చింది .. ఆమె వెళ్లిపోతుంటే .. నేను

"ఎక్స్యూజ్ మీ "

(ఆమె వెనక్కి తిరిగి ) " మీరు ఈవెనింగ్ కూడా క్యూపిడోనే బుక్ చేస్తారా "

"ఉమ్ .. ఎందుకు "

"ఈవెనింగ్ నేను ఇదే ఏరియా లో ఉంటా .. నా నంబర్ ఇస్తా .. కాల్ చేయండి .. "

ఆమె అనుమానంగా చూస్తుంటే .. నేను దీనంగా మొఖం పెట్టి

"అంటే .. నాక్కూడా రైడ్స్ దొరకడం కష్టం .. కావాలంటే మీకు 20% డిస్కౌంట్ కూడా ఇస్తా "

డిస్కౌంట్ అనే మాటకి పడిపోయింది ఆ పిల్ల .. గుడి దగ్గర బేరమాడింది కదా .. పిసినారి పిల్ల

ఎం మాట్లాడకుండా వెళ్ళిపోయింది ఆ అమ్మాయి

కానీ నేను మాత్రం ఆశ వదులుకోలేదు .. సాయంత్రం ముందుగానే బయలుదేరి మైండ్ స్పేస్ దగ్గర వెయిట్ చేస్తున్నా .. ఇంతలీ ఆ అమ్మాయి ఫోన్ చేస్తదా ? అయినా ముక్కు మొఖం తెలియని అబ్బాయికి ఎందుకు ఫోన్ చేస్తుంది ? ఆప్ లో బుక్ చేసుకుంటుంది కానీ నాకు ఎందుకు ఫోన్ చేస్తుంది ? డిస్కౌంట్ మ్యాటరే కాపాడాలి

నా అదృష్టం నక్క తోక తొక్కింది

ఆమె ఫోన్ చేసింది

బండి ఎక్కింది

"అవునూ.. మేడం .. ఇదే కంపెనీ లో పనిచేస్తారా ?"  (అద్దంలో చూస్తుంటే ఆమె ఫోన్ లో మునిగిపోయింది )

"మీ పేరేంటి మేడం "

"అన్నా "

నాకు ఆ ఆమాటకి గుండె ఆగినంత పనయింది .. అద్దం లో కాకా వెనక్కి తిరిగి చూస్తే .. ఆ అమ్మాయి ఎవరితోనే ఫోన్ లో మాట్లాడుతుంది .. నా మనసు కుదుట పడింది

"అన్నా .. రేపటికల్లా స్కూటీ వచ్చేస్తుంది కదా "

"ఇంకో 2-3 రోజులు పట్టుద్ది మేడం "

"ఇంకా అన్ని రోజులా .. కొంచెం త్వరగా పూర్తి చేయండన్నా "

"అలాగే మేడం .. ట్రై చేస్తాం "

కొంచెం సేపటికి ఆమె ఉదయం ఎక్కిన ప్లేస్ వచ్చింది .. అక్కడ ఆమెను దింపా ..

ఆమె 120 ఇస్తూ

"ఉదయం 118 అయింది కదా .. ఇప్పుడు కూడా అంతే ఇస్తున్నాలే "

"థాంక్స్ మేడం .. "  (డబ్బులు జేబులో పెట్టుకుంటూ నవ్వేసా )

"2 రూపాయలు "

"అయ్యో 2 రూపాయాలేగా .. పర్లేదు మేడం "

"మీరు నాకివ్వాలి " (సీరియస్ మొఖం తో అడిగింది ఆమె )

5 రూపాయలు ఇస్తూ

"3 రూపాయలు రేపొద్దున తీసుకుంటాలే "

ఆమె వెళ్లిపోతుంటే

"రేపొద్దున కూడా ఇక్కడికే రమ్మంటారా మేడం "

"ఎందుకు "

"అంటే .. ఇందాక మీరు మాట్లాడుతుంటే విన్నా .. స్కూటీ రావడానికి టైం పడుతుంది కదా .. నేనుండేది కూడా ఇదే ఏరియా .. ఉదయం రైడ్స్ ఉండవు .. "

(నా ఏడుపు మొఖం చూసి ) "ఓకే.. అమౌంట్ ?"

(ఎగిరి గంతేస్తూ) "మీ ఇష్టం .. ఎంతివ్వాలంటే అంతివ్వండి "

"ఓకే.. మార్నింగ్ 9"

"ఓకే అలాగే "

మరుసటి రోజు ఉదయం 9

అమ్మాయొచ్చింది

బండెక్కింది


"సేమ్ డెస్టినేషన్ ?"

"హా "

"టిఫిన్ చేసారా మేడం " (పులిహోర కలపదం స్టార్ట్ చేశా .. కానీ ఆ అమ్మాయి అదేం పట్టిచ్చుకునే స్టేజి లో లేదు .. ఫోన్ లో మునిగిపోయింది )

"మీ పేరేంటి మేడం "

సైలెన్స్

... ... ...

సాయంత్రం రిటర్న్ ట్రిప్ లో

"ఏవండీ మేడం డల్ గా ఉన్నారు "

"ఎం లేదు "

"అంటే .. ఎప్పుడూ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు కదా .. ఎదో ఆలోచనలో ఉన్నట్టున్నారు ?"

"అదీ .. ఆఫీస్ టెన్సన్స్ .. కొంచెం తల నొప్పి .. "

కొంచెం దూరం వెళ్ళాక బండి ఆపా

"ఇదేంటి ఇక్కడాపేరు " (బండి దిగుతూ అడిగింది ఆమె )


"ఇక్కడ అల్లం టీ తాగితే తల నొప్పి ఒక్క దెబ్బకి మాయమవుద్ది "

"అయ్యో .. ఇప్పుడివన్నీ ఎందుకండీ "

"ఎం కాదు మేడం .. ఒక్క క్షణం "

వేడి వేడి టీ కప్పు ని ఆమెకిచ్చా .. బండి కి ఆనుకుని టీ సిప్ చేసింది .. ముఖంలో టెన్షన్ బదులు , ఆనందం .. నేను కూడా ఆమెనే చూస్తూ టీ తాగుతున్నా ..

"థాంక్స్ అండి " (నవ్వేసింది)

నేను కూడా నవ్వుతోనే సమాధానం చెప్పా

మరుసటి రోజు.. సాయంత్రం 4

"హలొ .. "

"మేడం చెప్పండి "

"నాకు ఆఫీస్ లో మీటింగ్ ఉంది .. లేట్ అవుతుంది .. ఒక అరగంట లేట్ గా బయలుదేరండి  "

"అయ్యో .. పర్లేదండి .. ఆలాగే "

సాయంత్రం 7 నుంచి వాళ్ళ ఆఫీస్ ముందు పడిగాపులు కాస్తున్నా .. 8 అయింది .. మధ్యలో ఫోన్ చేసినా .. లేపలేదు .. 9 అవుతుంది

ఆఫీస్ మీటింగ్ లో ఉండి ఫోన్ చూసుకోలేదు .. మీటింగ్ అయ్యాక ఫోన్ చూసుకుని , 10 మిస్ కాల్స్ చూసుకుని కంగారుగా కిందకొచ్చింది

"అయ్యో సారీ అండి .. మీ కాల్స్ చూసుకోలేదు .. సారీ సారీ సారీ " (ఆమె ముఖంలో నిజంగానే తప్పు చేశానన్న భావన కనిపిస్తుంది )

"ఇట్స్ ఓకే మేడం .. రిలాక్స్ "

(ఇంతలోనే ముఖం అదోలా పెట్టుకుని ) "అయినా మీరు ఇంత సేపు ఎందుకు వెయిట్ చేస్తున్నారు .. వెళ్లిపోవాల్సింది కదా "

"ఈ టైం లో మీకు క్యాబ్స్ దొరకడం కష్టం కదండీ .. అందుకే .. "

(మల్లి ముఖంలో ప్రశాంతత ) "థాంక్ యు "


ఇంతలో నాకు ఫోన్ వస్తది

"కన్నా .. ఎక్కడున్నావురా "

"అమ్మా .. ఇక్కడే దగ్గరలోనే ఉన్నా .. గుడి దగ్గర .. ఇంకో గంటలో వస్తా "

(మా సంభాషణ ఆ అమ్మాయి వింటుందేమో .. నవ్వుకుంటుంది )

"సర్లే .. పడుకుంటున్నా .. దోస పిండి ఫ్రిజ్ లోనే ఉంది .. వేసుకుని తిను "

"అలాగే అమ్మా .. బై "

ఫోన్ పెట్టేసి ఆ అమ్మాయితో "సరే .. వెళ్దామా "


కొంచెం దూరం పోయేక .. ఆ అమ్మాయే బండి ఆపమంటుంది

"ఇక్కడ దోశలు బాగుంటాయి "

"పార్సెల్ తెచ్చుకుంటారు మేడం "

"లేదు .. మనం తిందామని "

(నమ్మెను మొఖం అదోలా పెట్టి ) "మనమా ?"

"అంటే .. ఎటు ఇంటికెళ్లి మీరు దోషాలు వేసుకోవాలి కదా .. ఇక్కడైతే ఫ్రెష్ గా బాగుంటాయి "

నేను లోలోపల ఆనందపడుతూ .. వెళ్లి ఇద్దరికీ దోశలు తెచ్చా .. బండికి ఆనుకుని తింటున్నాం

"బావుందా "

"హా హా.. బావుంది "

"ఎం చదువుకున్నారు .. మీకిది ఫుల్ టైం జాబా ?"

"కంప్యూటర్ సైన్స్ .. "

"మరి .. ఈ జాబు ఏంటి "

(ఏదోకటి కవర్ చేయాలనీ) "అంటే .. చిన్నప్పటి నుంచి ట్రావెలింగ్ అంటే ఇష్టం "

(ఎలా కనిపిస్తున్నా నేను అన్నట్టు మొఖం పెట్టింది )

"అంటే మేడం .. నాకు ఇంకా బ్యాక్ లాగ్స్ ఉన్నాయ్ .. అందుకే "

"ఇది కూడా తక్కువేం కాదులెండి .. ఇందులోనే కంటిన్యూ అవుతారా ?"

"మీలాంటి సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాళ్ళని చూస్తున్నప్పుడు అనిపిస్తుంది .. నేను కూడా బాగా చదువుకోవాల్సింది అని "

"మీరు మరీ అంత ఫీలవ్వద్దు .. సాఫ్ట్వేర్ మీరనుకున్నంత ఈజీ గా ఉండదు .. టెన్సన్స్.. ప్రాజెక్ట్ ప్రెషర్ .. "

"మీకెవరి మీదో బాగా పగ ఉన్నట్టుంది "

"అదీ .. మా మేనేజర్ గాడు .. వాడి ప్రపోసల్ రిజెక్ట్ చేశా అని , కక్షకట్టాడు నామీద "

"అంత కష్టంగా ఉంటె .. కంపెనీ మారొచ్చుగా "

"లేదండి .. ఈ కంపెనీ లో నాకు కావాల్సిన పోసిషన్ ఇచ్చారు .. శాలరీ కూడా బావుంది "

"ఓకే "

మల్లి అందుకుంది .. మేనేజర్ గాన్ని తిట్టడం

"వేస్ట్ గాడు .. బుర్రలేనోడు .. సొల్లుగాడు .. సారీ .. న మీముందు "

"పర్లేదండి .. మీ ఫ్రస్ట్రేషన్ వెళ్ళకక్కండి .. అయినా వాడు ఇక్కడ లేడుగా .. ఇంకాస్త గట్టిగ తిట్టండి "

"వెర్రి నా డాష్ గాడు .. సోంబేరి నాకొడుకు .. గాడిద నాకొడుకు .. "

(నాకు ఆ అమ్మాయి అలా తిడుతూ ఉంటె ఎంతో ఆనందంగా ఉంది .. ఆ అమ్మాయిలో ని కోపమంతా పోయి .. ప్రశాంతంగా ఉంది ఇప్పుడు )


అలా .. మరుసటి రోజు కూడా కబుర్లు చెప్పుకుంటూ .. మేనేజర్ ని తిట్టుకుంటూ .. చాయ్ బిస్కట్ లు తింటూ .. సరదాగా ఉన్నాం
..  బాగా దగ్గరయ్యాం

వీకెండ్ కావటంతో .. ఇద్దరం కలిసి పార్క్ కి వెళ్ళాం .. సినిమాకి .. షాపింగ్ కి కూడా ..

మరుసటి రోజు నైట్ 10 అవుతుంటే , ఫోన్ మోగింది... ఈ టైం లో ఎవరబ్బా అని చూస్తే పద్మ .. నేను రోజు క్యూపిడో రైడర్ లా డ్రాప్ లు పిక్ అప్పులు చేసే అమ్మాయి ..

"సిద్దూ .. లొకేషన్ పెట్టా .. ఒకసారి రావా "

ఎలాగోలా అమ్మకి తెలియకుండా బయటకొచ్చి .. లొకేషన్ కి వెళ్తే ... లేడీస్ హాస్టల్ అనుకుంటా .. బయట నుంచొని వుంది పద్మ .. దగ్గరకెల్లా ..

"ఎక్కు పద్మ .. అయినా ఈ టైం లో .. ఇక్కడ "

అనుమానంగా చూసా .. తాగినట్టుంది .. తూలుతోంది

"పద్మా .. తాగావా ?"

నావైపు కోపం గా చూస్తూ

"అమ్మాయలు తాజాగా కూడదా సిద్దు .. నువ్వు కూడా మా మేనేజర్ గాడి లా .. ఛా.. చ్చ .. నువ్వేదో స్పెషల్ అనుకున్నా సిద్దు .. నేను ఆటోలోనో , క్యాబ్ లోనో వెళ్ళిపోతా "

(పద్మ కోపము లోనూ క్యూట్ గా ఉంది ) "పద్మా . నేనేదో కాసుఅల్ గా అడిగా .. సారీ "

"అయినా ఈ క్వచ్చన్స్ ఏంటి .. మా మేనేజర్ లా .. "


"వద్దు సిద్దు .. నేనేదో నువ్వు స్పెషల్ అనుకున్నా .. నువ్వు కూడా అందరిలానే .. "

ఆ మాటలకి నాకు చాల ఆనందంగా ఉంది .. అంటే పద్మ నన్ను స్పెషల్ గా చూస్తుందా ? .. ఎలాగోలా .. పది సార్లు సారీ చెప్పి , బండి ఎక్కించుకున్నా .. నన్ను వాటేసి పట్టుకుంది పద్మ .. పడి పోకుండా ...


తెల్లారేక .. గుడి దగ్గర దమ్ము లాగుతుంటే .. పాల పాకెట్ కని వచ్చింది పద్మ... నన్ను చూసి .. తల
దించుకుని సిగ్గుతో వెళ్లబోతుంటే .. ఆపి ..

"గుడ్ మార్నింగ్ పద్మా "

సైలెన్స్

"ఇంకా దిగలేదా పద్మ "

(సారీ మొఖం పెట్టి ) "సిద్దూ .. సారీ .. ఏదో ఫ్రెండ్స్ పార్టీ అంటే .. బాగా ఇబ్బంది పెట్టానా నిన్ను " , అని దీనంగా ముఖం పెడితే .. నేను అదే ఛాన్స్ అని

"పద్మా .. నన్ను తిడితే తిట్టావ్ .. నా బండిని కొట్టావ్ .. డొక్కు బండి అని .. మేనేజర్ గాడికి ఫోన్ చేసి అమ్మ నా బూతులు తిట్టావ్ .. "

"అయ్యో .. అంత పని చేసానా "  (సిగ్గు పడుతూ )

"అంతే కాదు పద్మా "

"?"

"నాకు .. "

"హ .. నీకు . "

"ముద్దు కూడా పెట్టావ్ "

"చ్చి చ్చి .. అంతపని చేసానా "

(జరిగింది గుర్తు చేసుకున్నా .. పద్మ ని ఇంటిదగ్గర దింపేక .. నాలుగు అడుగులు ముందుకేసి .. వెనక్కి తిరిగి .. ప్రేమగా నా వైపు నుడుసుకుంటూ వచ్చి .. నన్ను వాటేసుకుని ..   .. థాంక్స్ రా సిద్దు . ఇంత రాత్రి దింపావు నన్ను .. అని లోపలకి వెళ్ళిపోయింది )

"సిద్దూ .. దాన్ని హగ్ అంటారు "

"ఐ సి .. మరి ఎందుకు నన్ను చూసి చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావ్ "

"అమ్మాయిలం .. కొంచెం ఆక్వార్డ్నెస్ ఉంటుంది కదా .. తాగుడుతో ఏదేదో వాగేశా .. అయినా నువ్వేదో అనుకుంటావు అనే భయం ఉంటుంది కదా "

(షారుక్ ఖాన్ లా ముఖం పెట్టి ) "నేనేదో అనుకునేవాన్నైతే .. నువ్వు నన్ను పిలిచేదానివి కాదు పద్మ "

సిగ్గుతో తలదించుకుని వెళ్లిపోయింది

పద్మ కి నేనంటే ఏదో స్పెషల్ ఫీలింగ్ ఉండడం నాక్కూడా నచ్చింది

ఇక లేట్ చేయకూడదు .. లవ్ ప్రపోసల్ చేయాలి ..

అదే రోజు మధ్యాహ్నం .. పద్మ తన స్కూటీ లో వెళ్లడం దూరంగా చూసా .. అంటే తన స్కూటీ వచ్చినా కూడా , నాతో వస్తుంది .. నన్నే పిలిస్తుంది డ్రాప్ చేయమని ..

సాయంత్రం 4 అవుతుంది .. కాఫీ షాప్ లో

(నేను చెమట్లు తుడుసుకుంటూ ) "ఇంట్లో అంతా బావున్నారా పద్మ "

(వెటకారంగా ) "హా .. బావున్నారు సిద్దు "

"జాబ్ .. అంతా .. ఓకేనా ?"

"సిద్దు .. వచ్చి 15 నిమషాలాయంది .. ఏదో చెప్పాలన్నావ్ .. ఏంటో చెప్పు "

(గుటకలు మింగుతూ ) "కొంచెం టెన్షన్ గా ఉంది "


(ఎంతో ధైర్యం కూడతెచ్చుకుని .. చెబుతామని నోరు తెరిసేలోగా .. వెయిటర్ కాల్ చేస్తాడు .. ఆర్డర్ రెడీ అని .. నేను వెళ్లి కాఫీ పిక్ చేసుకోడానికి వెళ్ళా )


ఇంతలో నా ఫోన్ మోగింది .. ఫోన్ టేబిల్ దగ్గరే వదిలేసా ...  ఇంపార్టెంట్ కాల్ అనుకుని .. ఫోన్ లేపి .. హలొ , సిద్దు బయటకెళ్లాడని చెప్పబోతుంటే .. అవతల నుంచి వచ్చిన మాటలకి .. ఆమె కోపంగా ఫోన్ పెట్టేసింది ..

నేను కాఫీ ట్రే తో వచ్చా


"కంగ్రాట్స్ సిద్దు "  (వ్యంగ్యంగా )

"ఎందుకు " (టెన్షన్ గా నేను )

"బెస్ట్ ఎంప్లొయీ అవార్డు వచ్చిందంట .. నీకు .. ఇప్పుడే కాల్ వచ్చింది "

(అంటే .. నేను జాబ్ చేసే విషయం తెలిసిపోయిందా .. పద్మ కి )

"పద్మ .. నేను అదే చెబుతామని ట్రై చేస్తున్నా "

(కాఫీ కలుపుకుంటూ ) " భలే మోసం చేసావ్ సిద్దు .. ఒక రోజు కాదు రెండు రోజలు  కాదు .. రెండు వారాలు .. "

"సారీ పద్మా .. అబద్దమాడా .. కానీ దాని వెనక ఉదేశ్యం .. "

"ఏంటి ఉద్దేశ్యం . నాకు అబద్దాలు చెప్పి నన్ను ట్రాప్ చేయాలనేగా ?"

(బాగ్ తీసుకుని వెళ్లిపోతున్నా పద్మ తో ) "సారీ పద్మ .. సారీ .. ఆగు .. ప్లీజ్ .. ఐ లవ్ యు పద్మ .. "

(నా గొంతులో ఆవేదన ఆమె చెవులకి తాకిందేమో .. ఆగి .. వెనక్కి చూసి .. ) "నాకు తెలుసు సిద్దు .. నువ్వు ఇది చెబుతామనే నన్ను ఇక్కడికి రమ్మన్నావ్ అని అనుకున్నా .. నేను కూడా ఒప్పుకుందామనే అనుకున్నా .. కానీ .. నీ జాబ్ విషయం దాచేసి .. ప్లాన్ చేసి లవ్ చేసినట్టుంది .. నాకు ఇలాంటివి నచ్చవు సిద్దు "

"ప్లాన్ ఏంటి పద్మ .. నేను నిజంగానే .. "


"వద్దు సిద్దు .. అబద్దాల పునాదుల మీద మన ప్రేమ ఎన్నాళ్ళో నిలవదు .. బై "

నా గుండెల్లో గునపం గుచ్చుతూ వెళ్ళిపోయింది పద్మ

ఆ తర్వాత .. ఎన్నో సార్లు కాల్ చేశా .. లేపలేదు .. మెసెజ్ లకి రిప్లై లేదు .. ఆమె ఆఫీస్ ముందు పడిగాపులు కాసా .. రాత్రుళ్ళు .. చూసి మొఖం చాటేసుకుని వెళ్లిపోయేది

ఒక రోజు .. ఆఫీస్ లో .. పద్మ ఫోన్ మోగింది .. కాల్ కట్ చేసింది

తన ఫ్రెండ్ "ఏంటి .. సిద్దునా ? మల్లి కట్ చేసావా "

"కట్ చేయక "

"మరీ భూతద్దములో పెట్టి చూడకే .. ఆ ప్లేస్ లో ఎవరున్నా అలానే చేస్తారు "

"లవ్ చేసుంటే .. హానెస్ట్ గా చెప్పేయాల్సింది .. ఇలా అబద్దాలు చెప్పకుండా "

"హానెస్ట్ గా చెబితే .. చూద్దాం అని దాటేస్తాం .. పట్టించుకోము .. అయినా .. సిద్దు అబద్దమా చెప్పాడు సరే .. మరి నువ్వేం చేసావే "

ప్రశ్నర్ధకంగా ముఖం పెట్టిన పద్మ తో .. తన ఫ్రెండ్

"బైక్ రిపేర్ అయినా కూడా వారం రోజులు బైక్ ఇంకా మెకానిక్ దగ్గరే ఉందని అబద్దం చెప్పి సిద్ధుతో తిరిగావ్ .. మీరిద్దరూ చెప్పిన అబద్దాలు వేరే అయినా .. ఉద్దేశ్యం ఒక్కటే .. అయినా .. ఉద్యోగం లేకపోయినా , అబద్దాలు చెప్పి ఉదయిగం ఉందని , దొంగ ప్యాకేజీ లు చెప్పి మోసం చేసే అబ్బాయలు ఎందరో .. అలాంటిది .. సిద్దు .. తనని తాను తక్కువ చేసుకుని .. జాబ్ ఉన్నా .. క్యూపిడో రైడర్ అని పరిచయం చేసుకున్నాడు .. నాకెందుకో అతనిది నిజమైన ప్రేమ  అని అనిపిస్తుంది .. వూరికే ఎక్కువుగా ఆలోచింది సిద్దు ని మిస్ చేసుకోవద్దు .. వెళ్దామా "

ఫ్రెండ్ మాటలకి ఆలోచనలో పడ్డ పద్మ ..

ఆఫీస్ నుంచి బయటకొచ్చింది .. ఫ్రెండ్ తో పాటు .. పార్కింగ్ లో వెయిట్ చేస్తున్న నన్ను చూసింది .. మొఖం తిప్పుకుంటే .. మూసుకొని వెళ్లి మాట్లాడు అని ఫ్రెండ్ తిట్టింది

ముచ్చు మొఖం వేసుకుని నన్నే చూస్తూ .. నావైపు వస్తూ .. గొణుక్కుంటుంది .. చేసిందంతా చేసి , ఎలా నిలబడ్డాడో చూడు , అమాయకంగా ..

"నీకు వేరే పని లేదా .. ఎప్పుడూ ఇక్కడే ఉంటావ్ " (అలిగినట్టుంది )

"నువ్వు నా సారీ యాక్సప్ట్ చేసేదాకా ఇలా వెంటబడుతూనే ఉంటా "  (తగ్గేదెలా అని నేను కూడా రెచ్చిపోయా )

"నీ సారీ ఎందుకు యాక్సెప్ట్ చేయాలి " (అలక , కోపం , ఉక్రోషం కలిపిన ముఖంతో )

"ఎందుకంటే .. నాది నిజమైన ప్రేమ పద్మ .. నిన్ను ట్రాప్ చేసి పడేయాలని నా ఉద్దేశ్యమే కాదు "

"సరే నీది నిజమైన ప్రేమే అనుకుందాం .. నన్ను ప్రేమించేదానికి ఒక్క కారణం చెప్పు "  (దిగొచ్చింది పాప)

"ఒక్కటి కాదు పద్మ .. నాలుగిస్తా ..  ఒకటి ... నువ్వు నా పర్సనల్ లైఫ్ చూసో .. ప్రొఫెషనల్ లైఫ్ చూసో లవ్ చేయలేదు . నా క్యారక్టర్ చూసి లవ్ చేసావ్ .. అది నాకు బాగా నచ్చింది .. రెండోది .. మనమేమి టాపిక్ ఎత్తుకున్నా గంటలు గంటలు మాట్లాడదాం తెలుసా .. ఒకరోజు పారడైజ్ బిర్యానీ గురించి నాలుగు గంటలు మాట్లాడుకున్నాం .. ఇంత కనెక్షన్ .. ఏ అమ్మాయితో అయినా .. ఛాన్స్ లేదు .. ఇక మూడోది .. నాకు ఫైనాన్సియల్ డిసిప్లిన్ సూన్యం .. నీకున్న పిసినారితనానికి బాగా బాలన్స్ అవుద్ది .. ఇక ఫైనల్ గా .. ఇది లాస్ట్ .. కానీ నీకు పడిపోడానికి ముఖ్యమైన కారణం .. నువ్వు మరీ ముద్దుగా ఉంటావ్ పద్మా .. చూడగానే పడిపోయా .. "

పద్మ నసుగుడు ఇంకా ఆగలేదు

"నీకు .. స్కూటీ విషయంలో అబద్దమా చెప్పానని .. ముందే తెలుసు కదా .. "

"ఉమ్ "

"మరెందుకు ఎప్పుడూ అడగలేదు .. "

"ఎందుకంటే .. దాని వెనక ఉన్న ఉద్దేశ్యం కూడా నాకు తెలుసు పద్మ "

పాప పూర్తిగా ఫ్లాట్ .. మొఖంలో అల్లరితనం .. కొంటెగా ..

"0143"

"వాట్ ?"

"ఓటీపీ అండి "  (ఆ మాట చెబుతూ పద్మ ఇచ్చిన ఎక్సప్రెషన్ కి నాకు .. దాన్ని అక్కడే .. పార్కింగ్ లాట్ లోనే .. చ్చి .. చ్చి .. మీరనుకున్నది కాదండి .. ముద్దు మాత్రమే పెట్టాలనుకున్నా .. దానికి ఇంకా టైం ఉంది .. ఎటు పాప పడిపోయిందిగా )


"ఓ .. ఓ .. మేడం .. రండి మేడం .. బండి ఎక్కండి "

వయ్యారంగా నడుస్తూ బండి ఎక్కింది .. రుయ్ మని పోనిచ్చా ..

అలా మొదలయింది .. మా ప్రయాణం .. ప్రేమ ప్రయాణం ..

భుజం మీద వాలిపోతూ

"సిద్దు .. 143 .. ఐ లవ్ యు "

"లవ్ యు టూ "
[+] 11 users Like kavitha99's post
Like Reply


Messages In This Thread
RE: నా అద్దం - నా డైరీ - by kavitha99 - 09-11-2024, 06:09 PM



Users browsing this thread: 6 Guest(s)