Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - 6
#22
వీర ఆవేశంతో మీ అత్తయ్య మన వాకిటికి వచ్చి... ఒరేయ్! ప్రజాపతీ!... రారా బయటికి. మా సమ్మతం లేకుండా నా కూతురి వివాహాన్ని కులం కాని వాడితో జరిపించే హక్కు, అధికారం నీకు ఎక్కడిదిరా!... నీచుడా!... మేము నీకు ఏం అన్యాయం చేశామురా!... నా తండ్రి ఆస్థిలో నాకు అర్థభాగం ఇచ్చాడని మాతో పగతో... అన్నెపున్నెం ఎరుగని నా బిడ్డ జీవితాన్ని నాశనం చేశావు కదరా!... దుర్మార్గుడా!.... నీదీ ఒక బ్రతుకేనా!... ఛీ...ఛీ..." కొట్టి ఎంత ఆవేశంతో వచ్చిందో అదే వేగంతో తిరిగి వెళ్ళిపోయింది మీ అత్తయ్య.



వరండాలో మాటలుడిగి... నేను మీ నాన్న చిత్తరువుల్లా నిలబడిపోయాము.



ఆనాటి ఒక సంఘటన... మన రెండు కుటుంబాల మధ్యన... పగ, ద్వేషాలను పెంచింది. ఇది జరిగి ఈనాటికి మూడు సంవత్సరాలు. గత ఐదారు ఏళ్ళుగా నేను మీ నాన్నగారి నిర్ణయాలతో ఏకీభవించలేకపోతున్నాను. దేవుడా!... ఆయనకు మంచి బుద్ధిని ఇవ్వు అని సర్వేశ్వరుణ్ణి ప్రతిదినం ప్రార్థిస్తున్నాను. ఆడదాన్ని పరువుకలదాన్ని అంతకంటే నేను ఏమీ చేయలేను కదమ్మా!!" అని కన్నీటితో కథను ముగించింది ప్రణవి.



సూర్యరశ్మికి కరిగిన మంచులా... ప్రణవి చెప్పిన కథ మూలంగా దీప్తి మనస్సున వుండిన సందేహాలన్నీ తీరిపోయాయి. తన తండ్రి చర్య వలన... అత్తామామలు ఎంతగానో బాధపడ్డారని గ్రహించింది... బంధువులందరికీ... తల్లిదండ్రులకు దూరం అయిన వాణీ ప్రస్తుతం ఢిల్లీలో వ్యక్తితో ఎలా వుందో అనే సందేహం!...



"అమ్మా!... వాణి ఢిల్లీలో ఎలా వుందో నీకేమైనా తెలుసా!..."



"నాకేం తెలిదమ్మా!..."



"నాన్నగారికి తెలిసుంటుందా!..."



"ఏమో!..."



"నేను ఢిల్లీకి వెళ్ళిరానా!"



"ఎందుకు?"



"వాణిని చూచి వచ్చేదానికి!..."



"వాణిని ఎందుకు చూడాలనుకొంటున్నావు?"



"వాణి వదిన చాలా మంచిదికదమ్మా!..."



" ఇంట్లో వుండే వారంతా చాలామంచివారు. ఒక్క వాణియే కాదు!..." అంది ఆవేదనతో ప్రణవి.



"అమెరికాలో నేనుండే చోటికి పెద్దబావ దినకర్ నెలకు రెండుసార్లు వచ్చి నన్ను కలిసేవాడు. వాణి విషయాన్ని నాకు వారే చెప్పారు. నెలకొకసారి నన్ను వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళేవాడు. నేను నిన్ను ఎత్తుకొని తిరిగేవాణ్ణి దీపూ!... అని చిన్ననాటి జ్ఞాపకాలను నాతో చెప్పేవాడు. అక్క... పద్మినీ, నన్ను సొంత చెల్లెలిలా చూచుకొనేది" సాలోచనగా చెప్పింది దీప్తి.



"దీపూ!... నేను ఒకటి అడుగుతాను నిజం చెప్పాలి!"



"నేను నీ కూతురునమ్మా!... అడుగు!..."



"నీకు మీ ఈశ్వర్ బావ అంటే ఇష్టమేనా!"



దీప్తి ఆశ్చర్యంతో తల్లి ముఖంలోకి చూచింది.



"ఏందే!... అలా చూస్తున్నావ్!... నా ప్రశ్నకు జవాబు చెప్పు!..." అంది ప్రణవి.



" ప్రశ్నను నీవు నన్ను ఎందుకు అడిగావ్?"



"బుద్ధిలేక!" వ్యంగ్యంగా అంది ప్రణవి రెండు క్షణాల తర్వాత "ఎక్కడికి పోతాయ్!... పాడు బుద్ధులు! ఎదుటి వాళ్లను అవహేళన చేయడం, మీ రక్తంలో వున్న సద్గుణం" నిష్టూరంగా అంది ప్రణవి.



దీప్తి తల్లిని సమీపించి ఆమె భుజాలపై తను చేతులు వుంచి ప్రణవి ముఖంలోకి సూటిగా చూస్తూ "మా అమ్మ చాలా చాలా మంచి అమ్మ!" నవ్వుతూ "నీవు చెప్పు నీకు ఇష్టమేనా!..."



"ఏమిటి?"



"అదే, నీవు నన్ను అడిగిన విషయం!..."



"అదా!... అదృష్టం ఉండాలి..."



"దేనికి!..."



"ఈశ్వర్కు ఇల్లాలు కావడానికి!..."



"ఏం ఆయన అంత గొప్పా!..." వెటకారంగా అడిగింది దీప్తి.



"అవును... చాలా గొప్ప. నీకు మీ పెద్ద బావ దినకర్ చెప్పాడో లేదో... ఈశ్వర్ను అమెరికాకు రమ్మని పోయినసారి సంవత్సరం క్రింద వచ్చినప్పుడు ఎంతగానో చెప్పాడట. దానికి ఈశ్వర్... "ఏమన్నాడు!..." ఆత్రంగా అడిగింది దీప్తి ప్రణవి పూర్తి చేయకముందే.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 3 - by k3vv3 - 09-11-2024, 12:19 PM



Users browsing this thread: 3 Guest(s)