Thread Rating:
  • 91 Vote(s) - 2.41 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: కాలేజ్ బాయ్ (అయిపొయింది)
190. మూడు వందల కోట్లు





మధ్యూస్ కళ్ళు తెరిచి చుట్టూ చూస్తూ ఉన్నాడు. తన పక్కనే సెలైన్ డ్రిప్ నుండి సెలైన్ వాటర్ డ్రాప్స్ రూపంలో తన శరీరంలో కలుస్తూ ఉంటే చూస్తూ ఉన్నాడు. తనకు జరిగింది అంతా ఒక కలలా అనిపిస్తుంది. తనను గోవాలో అందులోనూ తన క్లబ్ లో ఒకరు కొడతారు అని అస్సలు ఊహించలేదు.

మైకేల్ "నువ్వు బాధ పడకు... మన వాళ్ళు వెళ్ళారు... వాడిని చంపి వాడి పెళ్ళాన్ని...." అని అంటూ ఉండగా....

పెద్ద గొంతు "మైకేల్" అని వినపడింది.

మైకేల్ బయటకు వచ్చి చూడగా.... క్రిష్ లోపలకు వస్తూ ఉంటే, సుమారుగా నలుగురు మనుషులు అతన్ని అడ్డుకోవాలని చూస్తూ ఉండడం ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు.

క్రిష్ ఆ నలుగురుని కొట్టి పడేసి, మైకేల్ ముందుకు వచ్చాడు.

మైకేల్ ఆశ్చర్యంగా "క్రిష్...." అని పిలిచాడు.

క్రిష్, మైకేల్ గొంతు పట్టుకొని "నా జోలికి, నా వైఫ్ జోలికి  వస్తావ్..... బ్రతికి ఉండాలని లేదా!" అని అరిచాడు.

మైకేల్ క్రిష్ పట్టు నుండి విడిపించుకొని అతన్ని తోసేశాడు.

అప్పుడే బయటకు వచ్చిన మధ్యూస్... ని ఒక సారి చూసి తిరిగి మైకేల్ వైపు చూస్తూ "మర్యాదగా నా వైఫ్ నా దగ్గరకు సేఫ్ గా రావాలి..... తేడ చేశారో మిమ్మల్ని మీ ఫ్యామిలీ బిజినెస్ లను కుప్పగూల్చి పడేస్తా.... గుర్తు ఉంది కదా... ప్రభు తన పవర్ మొత్తం నాకు ఇచ్చేశాడు" అన్నాడు.

మైకేల్ కి మధ్యూస్ గెలికింది క్రిష్ మరియు క్రిష్ వైఫ్ ని అని అర్ధం చేసుకోవడానికి రెండూ నిముషాలు పట్టింది.

మధ్యూస్ "రేయ్.. ఎవడ్రా నువ్వు...." అని ముందుకు వెళ్తుంటే....

మైకేల్ మధ్యూస్ చెంప మీద కొట్టి.... అతన్ని తోసేసి.... "ఎదో మిస్ అండర్ స్టాండింగ్ భయ్యా.... నేను చూసుకుంటాను..... నువ్వు రిలాక్స్ అవ్వు..... " అంటూ క్రిష్ ని కూర్చోబెట్టి ఫోన్ తీసుకొని మధ్యూస్ వైపు పెద్ద కళ్ళు చేసుకొని క్రిష్ జోలికి వెళ్లొద్దు అని సైగ చేసి వెళ్ళిపోయాడు.

అయిదు నిముషాల తర్వాత మైకేల్ తిరిగి వచ్చి "కిడ్నాప్ చేసింది మావాళ్ళు కాదు భయ్యా...." అన్నాడు.

క్రిష్ పళ్ళు బిగించి సీరియస్ గా పైకి లేచాడు.

మైకేల్ "నేను కనుక్కుంటాను... ఎవరూ ఎక్కడ ఉన్నా... నేను దొరకబుచ్చుతాను.... ప్రామిస్.... రేయ్ మధ్యూస్.... భయ్యాకి ఏవైనా కబుర్లు చెబుతూ ఉండు.... నేను బయటకు వెళ్లి వస్తా..." అని వెళ్ళాడు.

మైకేల్ వెళ్ళగానే, క్రిష్, మధ్యూస్ ని చూసి పదా... అంటూ బైక్ తీసుకొని ఒక చోటకు వెళ్ళాడు.

అక్కడ సుమారుగా పది మంది వరకు కాపు కాసి ఉన్నారు.

క్రిష్, మధ్యూస్ ని చూస్తూ "ఏమి లేని ప్లేస్ కి పది మంది ఎందుకు కాపు కాశారు...." అన్నాడు.

మధ్యూస్ "అన్నకి కాల్ చేద్దాం...." అన్నాడు.

క్రిష్ "నువ్వు ఇక్కడే ఉండి కాల్ చెయ్ నేను లోపలకు వెళ్లి పని చూసుకొని వస్తా...."




క్రిష్ "ఆ పది మంది మీద ఏమయినా పగ ఉందా నా మీదకు తోలావు....." అన్నాడు.

ఏ సమాధానం రాలేదు.

"నీ వైఫ్ కి జరిగింది మొత్తం చెప్పాను"

క్రిష్ "ఓహ్..... నేనే చెబుదాం అనుకున్నా...."

"తనను వదిలేసి నన్ను పెళ్లి చేసుకో...."

క్రిష్ "పిచ్చి కాని పట్టిందా....."

"..."

క్రిష్ "ఏయ్...."

"..."

క్రిష్ "ఏయ్.... ఇటూ చూడు"

"..."

క్రిష్ "పూజ...."

"..."

క్రిష్ "ఏయ్...."

పూజ "అవునూ రా పిచ్చి పట్టింది అందుకే నీకు మూడు వందల కోట్లు ఇచ్చాను" అని అరిచింది.


[Image: 71097284-2226919764078037-5885294149841715200-n.jpg]


క్రిష్ "తు.... తు.... ఏంటి ఆ అరవడం...."

పూజ "చెప్పా కదా... నువ్వంటే పిచ్చి పట్టింది"

క్రిష్ "అయినా నీ మూడు వందల కోట్లు నీకు ఇచ్చేసా కదా... ఇంకా ఆ విషయం ఎందుకు చెబుతున్నావ్... అందరికి ఇలానే చెబుతున్నావా...."

పూజ ఏడుస్తూనే "నీకు అసలు ఆడపిల్లలను అర్ధం చేసుకోవడమే రాదు.... నీ కోసం నేను అంత దూరం నుండి వస్తే..... డబ్బు గురించి మాట్లాడుతున్నావ్..." అంటూ క్రిష్ మీద పడిపోయి ముక్కు తుడుచుకుంది.

క్రిష్ "ఆ మూడు వందల కోట్లు ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తే సంక నాకి పోయాయా...." అన్నాడు.

పూజ "నువ్వు మళ్ళి డబ్బు గురించి మాట్లాడుతావ్... నేను నీకు డబ్బు మనిషిలా కనిపిస్తున్నానా...."

క్రిష్ "లేదు.... లేదు.... నువ్వు చాలా మంచి దానివి..." 

పూజ "మ్మ్" అంటూ క్రిష్ చాతీ మీద తన మొహం అలానే ఉంచింది.

క్రిష్ "ఇంతకి ఎక్కడ పెట్టావ్ డబ్బులు ఉన్నాయా.... లేక పోతే ఉష్ కాకినా....."

పూజ సీరియస్ గా క్రిష్ ని చూస్తూ "కొంచెం నష్ట పోయాను... మిగిలింది సేఫ్...." అంది.

క్రిష్ "సరే... నీ డబ్బు నేను తెప్పిస్తా కాని నా వైఫ్ ని సేఫ్ గా రప్పించు...."

పూజ "నువ్వు ఇలా మాట దాటేస్తున్నావ్ ఎందుకు? మనం పెళ్లి చేసుకుందాం.... తనని వదిలేయ్" అంది.

క్రిష్, పూజ గొంతు పట్టుకున్నాడు.

పూజ "వద్దు... వద్దు... తను సేఫ్ గా ఉంది. సేఫ్ గానే ఉంది" అంది.

క్రిష్ "రప్పించు...." అన్నాడు.

పూజ సరే అంటూ ఫోన్ మాట్లాడింది.

క్రిష్, కాజల్ ని చూశాడు కాని తను ఎప్పటిలా నవ్వుతూ కాకుండా ఏడుస్తూ కనపడింది.


[Image: crying-kajal.gif]

పూజ వైపు సీరియస్ గా చూస్తూ, కాజల్ ని అక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోతున్నాడు.

పూజ "ఓయ్.... నాకు మాట ఇచ్చావ్.... డబ్బు తెప్పిస్తా అని..." అంది.

క్రిష్ వెనక్కి తిరిగి "ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు... ఆరు నెలల తర్వాత... ఇండియాలో అడుగు పెట్టావ్..."

పూజ "నన్ను ఎవడు ఏం చేస్తాడు?" అనుకోని చేతులు కట్టుకుని ఉంది.





















కాజల్ మరియు క్రిష్ ఇద్దరూ బెడ్ పక్కనే కూర్చొని ఉన్నారు. 

క్రిష్ బీర్ ఓపెన్ చేసి ఇచ్చాడు, కాజల్ క్రిష్ ని చూస్తూ ఉంది.

క్రిష్ "ఇప్పటి వరకు నువ్వు తెలుసుకున్న నా జీవితం నాణానికి ఓకే వైపు మాత్రమే..... ఇప్పుడు తెలుసుకునేది మరో వైపు...." అన్నాడు.

కాజల్, బాధ పడుతూ క్రిష్ ని చూస్తూ ఉంది.

క్రిష్ "ముందు తను ఏం చెప్పిందో చెప్పూ.... తర్వాత నేను చెబుతాను.... నాకు తెలిసి ఎదో సోది చెప్పినట్టు ఉంది అందుకే నువ్వు ఇంతగా బాధ పడుతున్నావ్..."

కాజల్ ఎక్కిళ్ళు పెడుతూ "అదీ....  అదీ....  తను ఏం చెప్పింది అంటే..." అంటూ బీర్ బాటిల్ అందుకొని కొంచెం తాగి చెప్పడం మొదలు పెట్టింది.
























పూజ హెగ్డే సీన్స్ వస్తాయి. ఇక ఈ త్రేడ్ లో లాస్ట్ హీరొయిన్ తనే....
[+] 14 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: క్రిష్ :: కాలేజ్ బాయ్ - by 3sivaram - 05-11-2024, 09:29 PM



Users browsing this thread: 25 Guest(s)