04-11-2024, 01:29 PM
గుర్రాలు లాంటి కోరికలను తీర్చుకోవడానికి అవకాశం ఉంది కదా అని పరుల ను అధికారంతో కానీ అనుబంధాల తో కానీ హింసించ రాదు. ఇలాంటి యోచనలున్న రాజులను మనుషులు, మహర్షులు శిక్షించ లేక పోయిన, కాలం కఠినంగా శిక్షిస్తుంది.
కాల ధర్మం వేరు, అదృష్ట బలంతో అహంకరించేవారి ధర్మం వేరు. " అని వశిష్ఠ మహర్షి కి మాధవి సవినయంగా వివరిస్తుంది.
అంతేకాదు, కొందరు పని దొంగలు ధర్మ ప్రచారం పేరుతో ఆశ్రమాలు స్థాపించి, ఆధ్యాత్మికత పేరుతో జుగుప్స కలిగించే విధంగా లైంగిక కోరికలు ఎలా తీర్చుకుంటు న్నారో మాధవి వశిష్ట మహర్షి కి పేర్లతో సహా వివరించి చెప్పింది.
మాధవి మాటలను విన్న వశిష్ట మహర్షి యయాతి మహారాజు సహాయంతో అవకాశవాదుల ఆశ్రమాలు చాలా తొలగించాడు. అలాగే మాధవి మాటలను అనుసరించి ఆ దొంగ మహర్షులను అడవులలో వ్యవసాయం చేసేవారి దగ్గర వ్యవసాయ కూలీలు గా నియమించాడు.
మాధవి వశిష్ట మహర్షి చేసే మంచి పనులను, తన తండ్రి యయాతి మహారాజు ప్రజలకు చేసే మంచి పనులను సదా ప్రశంసించేది. అలాగే అప్పుడప్పుడు తమ విపరీత కోరికలను తీర్చుకోవడానికి కులాలను, సంప్రదాయాలను, ఆచారాలను ఎవరు అడ్డు పెట్టుకు న్నా వారిని తీవ్రంగా విమర్శించేది.
ఋషి సంక్షేమం, ధర్మ సంక్షేమం అంటూ తమ బిడ్డలను బలవంతంగా త్యాగం చేస్తే వారిని మోక్షం వరించదు. యుగ ధర్మానికి కట్టుబడ్డ మనిషినే మోక్షం వరిస్తుందని మాధవి ప్రజలకు చెప్పేది.
కొందరు స్త్రీలు "న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి అంటారు కదమ్మా. అదెంత వరకు నిజం?" అంటే "అదంతా అవకాశవాద పండితులు, దొంగ ఋషులు కల్పించిన మాయా జాలం. భగవంతుని దృష్టిలో అందరూ సమానమే. దక్షుని తల్లి, జటిల వంటి వారు అనేక మంది ఉత్తములైన మగవారికి భార్యలు అయ్యారు. అది గమనించిన కొందరు స్వార్థ పరులు ఋషుల రూపంలో మగ సంతానం నిమిత్తం ఆడది ఎంతమందితోనైనా మగని అనుమతితో కాపురం చేయవచ్చని కుటిల ధర్మ పన్నాలు బోధిస్తున్నారు.
వాటిని నమ్మకండి. కాలం నడిపించే యుగ ధర్మాన్ని అనుసరించండి. " అని మాధవి స్త్రీలకు చెప్పేది..
యయాతి మహారాజు భార్యలు దేవయాని, రావుిష్ట లు మాధవిని అనేక పర్యాయాలు తమ తమ అంతః పురాలకు రమ్మని ఆహ్వానించారు. వారి ఆహ్వానం లో ఆత్మీయతకన్నా వారి స్వార్థమే ఎక్కువగా ఉందనే వాస్తవాన్ని గమనించిన మాధవి వారి ఆహ్వానాన్ని మృదువుగా తోసిపుచ్చింది.
" నువ్వు అంతఃపురానికి వెళితే ఏమవుతుంది?", అని మాధవి చెలికత్తె కళిక ఒకసారి మాధవిని అడిగింది.
అప్పుడు మాధవి కళికతో, " దేవయాని రావుిష్ట లు నన్ను ఆత్మీయతతో అంతఃపురానికి ఆహ్వానించడం లేదు. కచుని ప్రేమలో పడిన దేవయాని, కడకు నా తండ్రి యయాతి మహారాజు ను మనువాడింది. దేవయాని దగ్గర దాసీగ పని చేసిన రావుిష్ట కడకు నా తండ్రి యయాతి మహారాజు నే మనువాడింది. "అని అంది.
" ఒకరు బ్రాహ్మణ కన్య. మరొకరు రాక్షస రాజు కుమార్తె. మీ తండ్రి యయాతి మహారాజు ఇద్దరిని మనువాడారు. కులాలను పాటించని రాజవంశాలు మాలాంటి సామాన్యులను కుల చట్రాలలో ఎందుకు బంధిస్తారు?
అంతేగాక యువరాణి చెలికత్తెలు రాజులకు భార్యలతో సమానం అంటారు. ఇదెంతవరకు న్యాయం?"
మాధవిని కళిక అడిగింది.
"స్వార్థ సంపాదన నిమిత్తం కొందరు అవకాశవాదులు ఇలాంటి ధర్మాలన్నిటిని ప్రచారం చేస్తుంటారు. బ్రాహ్మణుడు క్షత్రియ కన్యను వివాహం ఆడవచ్చును కానీ క్షత్రియుడు బ్రాహ్మణ కన్యను వివాహం ఆడరాదన్నది ఈనాటి ధర్మాలలో ఒక ధర్మం. ఇలాంటి ధర్మాలను ఎవరెన్ని చెప్పినా కాలం మాత్రం విధిరాతను యుగ ధర్మాన్ని మాత్రమే అనుసరిస్తుంది.
మా తండ్రి యయాతి మహారాజు గారు కుతంత్ర కుల ధర్మాన్ని అడ్డు పెట్టుకొనియే మా తల్లి గారిని పెళ్ళాడారు. ఆపై మా తల్లిగారిని అంతఃపురానికి దూరం చేసారు. అదేమంటే వరాలు శాపాలు అన్నారు.
ఋషులతో రాజులతో సంసారం చేసిన వారికి, సంతానం కలిగినా, వారి కన్యత్వం చెడని వరాలు ఉన్నాయి అన్నారు. ఇంతకన్నా దారుణం మరొకటి లేదు. మా తల్లిగారు ఇలాంటి మాయధారి ధర్మాలను బాగా వంట పట్టించుకుంది. అందుకే ఆమె బతుకు పర్ణశాల కు పరిమితం అయ్యింది. " కళికతో అంది మాధవి.
"పర్ణశాల లో ఉన్నా నీకేం తక్కువ మాధవి. కుటిల ధర్మాలను తోసి రాణనగల విజ్ఞాన ధర్మాన్ని ప్రయోగా త్మకంగా వంట పట్టించుకున్నావు. నిరంతరం నవీన విజ్ఞాన సాధనకై ఎక్కువగా ప్రయోగశాలలోనే ఉంటావు. శూద్రులు తో వ్యవసాయ యాగాలు చేయించి మంచి పేరు తెచ్చుకున్నావు" అని మాధవితో ఆమె చెలికత్తె అరవింద అంది.
"ఆ విషయాలలో దైవలీల చాలా గొప్పది అంటాను. నేనింత విజ్ఞానవంతురాలిని కావడానికి పార్వతీ మాత కరుణా కటాక్షణలే కాదు. ఆమె అనుసరించిన సంతానో త్పత్తి మార్గమే నాకు మంచి ప్రేరణను ఇచ్చింది. వినాయకుని ఆమె సృష్టించిన విధానం చాలా చాలా విజ్ఞానాత్మకమైనది. అందులో వరాలు, శాపాలు, మంత్రాలు, తంత్రాలు మరేం లేవు. అదంత ప్రయోగ పూర్వకమైన విజ్ఞాన స్వరూపం.
ఆ తర్వాత దేవయాని తండ్రి శుక్రాచార్య తాతగారు సాధించిన మృత సంజీవని విద్య కూడా నాకు కొంత ప్రేరణను ఇచ్చింది.
నా విజ్ఞానాభివృద్ది కి మరి కొంచెం తోడ్పడి నన్ను తమ చెప్పుచేతల్లో ఉంచుకుని దేవయాని రావుిష్ట లు చక్రం తిప్పాలనుకున్న ఆలోచన దురాలోచన అయిన ప్పటికీ శుక్రాచార్య తాతగారికి సంక్రమించిన మృత సంజీవని విద్య మాత్రం ఆక్షేపణీయమైనది కాదు. " చెలికత్తెలతో అంది మాధవి.
"నిజమే మృతసంజీవనీ విద్య గొప్ప విద్యయే. ఏ విద్య అయినా సరైన వారి చేతుల్లో లేకుంటే దాని వలన సమాజానికి ప్రమోదం కంటే ప్రమాదమే అధికం అవుతుంది.
ఇక ఈ రోజుల్లో మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా ఆడవారు అభ్యసించి ప్రదర్శించే వేద విద్యలకు, విజ్ఞాన శాస్త్ర విద్యలకు ఆదరణ తక్కువ కదా?" మాధవితో అంది ఆమె చెలికత్తె అరవింద.
ఇంకా ఉంది

ఇతర ధారావాహికాలు
అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు
మా తెలుగు తల్లికి మల్లె పూదండ