Thread Rating:
  • 1 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
పౌరాణిక కథలు - అనంత
#11
మాధవి
 
[font=var(--ricos-font-family,unset)][Image: image-2024-11-04-132354684.png][/font]
[font=var(--ricos-font-family,unset)] [/font]

విధిరాతను మించిన రాత సమస్త లోకాలలో మరొకటి లేదు. విధికి ఉన్నంత బలం మరి దేనికి లేదు. విధిరాత మీద రాళ్ళు రువ్వేవారి మాటలు కాల చక్రం ముందు వెలవెల పోతాయి. కాల చక్ర ధర్మం తెలుసు కోకుండా కారుకూతలు కూసేవారి మాటలు కాల గమనం లో కరిగిపోతాయి. కాలానికి ఉన్నంత అనుభవం అవని మీద అవతరించిన అవతార పురుషులకు కూడా లేదనడం మాత్రం అతిశయోక్తి కాదు. 



 భూమి మీద మహోన్నత తేజం తో అవతరించిన అవతార పురుషులు సహితం కాల ధర్మాన్ని అనుసరించారు. తమ వనవాసాన్ని ఘన వాసంగా భావించారు. ముని సందోహం నడుమ ప్రశాంతంగా జీవించారు. తాము చేయగలిగినంత పరోపకారం చేసారు. 



వారే మహా పురుషులు గా చరిత్రలో నిలిచిపోయారు. 



 వేద పురాణేతిహాసాల మూలాలు తెలుసుకోకుండా బ్రహ్మ కు సరస్వతీ దేవి ఏమౌతుంది? విష్ణుమూర్తి కి ఎందరు భార్యలు? మహా శివుడు గంగ దగ్గర ఎన్నాళ్ళు ఉంటాడు? పార్వతి దగ్గర ఎన్నాళ్ళు ఉంటాడు? వంటి చర్చలు చేసేవారు ఉన్నంతగా, వైవస్వత మన్వంతరం లో మనం ఇప్పుడు యుగంలో ఉన్నాం? ఇప్పటి వరకు ఎన్ని కృత త్రేతా ద్వాపర యుగాలు గడిచిపో యాయి? ఎన్ని కలి యుగాలు గడిచిపోయాయి? ఆయా యుగాలలో విజ్ఞానాత్మక సంఘటనలు ఏమిటి? అవి మనకు ఎంత వరకు ఉపయోగ పడతాయి? వాటిని ఎలా ఉపయోగించుకోవాలి? అని పరిశోధనా త్మకంగా ఆలోచించేవారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ ఎంత మంది ఉంటారంటే సమాధానం చెప్పడం కష్టమే గానీ మాధవి మాత్రం పరిశోధనాత్మకంగా ఆలోచిస్తుందన్నది నిజం. 



 మాధవి విజ్ఞానాత్మక ఆలోచనలనే చేస్తుంది. వేద పురాణేతిహాసాల లోని విజ్ఞాన తేజస్సునే గమనిస్తుంది. వేద పురాణేతిహాసాలను వక్ర దృష్టితో కాకుండ వాస్తవ దృష్టితో చూస్తుంది. అందలి వాస్తవ ధర్మాన్ని యుగ ధర్మాన్ని పదుగురికి పంచుతుంది. కుటిల ధర్మాల మాటున్న కుళ్ళును బహిర్గతం చేస్తుంది. 



విజ్ఞానాత్మక ఆలోచనలనే తన చెలికత్తెలతో పంచు కుంటుంది. అంతేగానీ వారికి వీరు ఏమౌతారు? వీరికి వారేమవుతారు? వారి ఇరువురు నడుమ ఉన్న అక్రమ సంబంధం ఏమిటి? వంటి ఆలోచనలను మాధవి ఏనాడు చెయ్యలేదు. ఎప్పుడన్నా ఎవరన్నా తన చెలికత్తెలు అలాంటి ఆలోచనలను పదుగురితో పంచు కోవాలని చూస్తే వారిని మృదువుగానే మందలిస్తుంది. 



" ఇలాంటి ఆలోచనలు చేస్తూ కట్టుకథలు అల్లడం చాలా సులభం. పదుగురుకి ఉపయోగ పడే ఆలోచనలు చేయడం చాలా కష్టం. పదుగురికి ఉపయోగ పడే పని ఎంత కష్టమైన ఇష్టపడి చేయాలి. మంచి యోచనల తోనే మెదడుకు పదును పెట్టాలి. " అని మాధవి తన చెలికత్తెలతో అంటుంది. 



 మాధవి యయాతి మహారాజు కుమార్తె. అందాని కి అర్థవంతమైన, పవిత్రమైన, సంప్రదాయ సిద్దమైన, విజ్ఞానవంతమైన నిర్వచనం చెప్పాలంటే మాధవిని చూపిస్తే చాలని ఆనాటి వారందరూ అనుకునేవారు. 



 యయాతి మహారాజు ఆరు రోజులలో మహీ మండలాన్నంత జయించిన ఘనుడు. "పరిపాలనా విషయంలో తన తండ్రి గొప్ప వాడే కానీ స్వంత కుటుంబ సంరక్షణ విషయంలో, బిడ్డల పెంపకం విష యంలో, తన తండ్రి అంత గొప్పవాడు కాదని" మాధవి ప్రగాఢంగా నమ్ముతుంది. 



 ఎక్కువ శాతం మనుషుల మనస్తత్వం మహా విచిత్రం గా ఉంటుందని చెప్పవచ్చు లేదా చెప్పకలేక పోవచ్చు కానీ వాస్తవానికి దగ్గరగా మాత్రం ఉండదు. ఏదన్నా ఒక విషయం లో ఒక మనిషికి గొప్ప కీర్తి ప్రతిష్టలు వస్తే చాలు. మనిషి ని అభిమానించే వారు మనిషి అన్ని విషయాల్లో మహాత్ముడు, మహానుభావుడు అని మనిషిని ఆకాశానికి ఎత్తేస్తారు. చివరికి మనిషి ఏదైనా పొరపాటు చేసినా పొరపాటు కూడా గొప్పదే అంటారు. 



మాధవి సత్యాన్ని తన తండ్రి యయాతి మహారాజు ను గమనిస్తూ తెలుసుకుంది. అయితే కాలం మాత్రం, మనిషి పొరపాటు ను ఏదో ఒక సమయంలో పొరపాటేనని సమాజానికి తెలియ చేస్తుంది. అని ధృడంగా నమ్మే మాధవి తన కోసం నిర్మించిన అందమైన పర్ణశాలలో ఆనందంగ జీవిస్తుంది. తన చెలికత్తెలతో ఆటపాటలతో కాలక్షేపం చేయాల్సిన సమయంలో, ఆటపాటలతో కాలక్షేపం చేస్తుంది. జ్ఞాన సముపార్జన చెయ్యవలసిన సమయంలో, జ్ఞాన సముపార్జన చేస్తుంది. పర్ణశాల పనులు, తోట పనులు చేయవలసిన సమయంలో పర్ణశాల పనులు తోట పనులు చేస్తుంది. 



 మాధవికి రమారమి పదిమంది చెలికత్తెల వరకు ఉన్నారు. అందులో అరవింద, ఆత్రేయి, కళిక, అపర్ణలు చాలా ముఖ్యమైనవారు. మాధవి వారి దగ్గర మనసు విప్పి మాట్లాడుతుంది. 



 మాధవి తన చెలికత్తెలతో సరస్వతీ దృషద్వతి నదులకు వెళుతుంది. అక్కడ దృషద్వతి నదిలో గొంతు లోతు నీళ్ళలో ఉండి శ్రీ సూర్య నారాయణ మూర్తిని ధ్యానిస్తూ విజ్ఞానాత్మక ఆలోచనలను చేస్తుంది. మాధవి ఎక్కువగా దృషద్వతి నదిలో ధ్యానం చేయడం వలన కొందరు చెలికత్తెలు మాధవిని దృషద్వతి అనికూడా పిలిచేవారు. 



 రాణి వాసాన్ని ఆశించి భంగపడిన తన తల్లి మరణించిన పిదప మాధవి చెలికత్తెలతో పర్ణశాల లోనే ఉంటుంది. పర్ణశాలను వశిష్ట మహర్షి యే ప్రత్యేకంగా మాధవి కోసం రాజ సేవకులతో నిర్మింప చేసాడు. 



 యయాతి మహారాజు తన కుమార్తె మాధవి ఆలనాపాలనా చూసే బాధ్యతను వశిష్ట మహర్షి కి అప్పగించాడు. వశిష్ట మహర్షి తనకు అవకాశం చిక్కినప్పుడల్లా మాధవి ఉండే పర్ణశాలకు వచ్చి మాధవి యోగక్షేమాలు తెలుసుకుని వెళుతుంటాడు. మాధవికి కావలసినవన్నీ అంతఃపురం నుండి వశిష్ట మహర్షి యే పంపిస్తాడు. 



 కన్నతండ్రి కాకపోయినా పెంపుడు తండ్రిగా వశిష్ట మహర్షి చూపించే ఆదరాభిమానాలను మాధవి సవినయంగా స్వీకరిస్తుంది. అయితే వశిష్ట మహర్షి చెప్పే ధర్మాలను మాధవి గుడ్డిగా నమ్మదు. తన తండ్రి యయాతి మహారాజు చెప్పే "సమార్గ మాణః కామా నామంతం అంటే మంచి మార్గమున కామం అంతం చూడాలి" అనే ధర్మాన్ని వశిష్ట మహర్షి సమర్థిస్తాడు. మాధవి ధర్మాన్ని అసలు సమర్థించదు. 
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 1 user Likes k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 09:59 PM
RE: పౌరాణిక కథలు - by k3vv3 - 28-10-2024, 10:00 PM
RE: పౌరాణిక కథలు - మాధవి - by k3vv3 - 04-11-2024, 01:27 PM



Users browsing this thread: 3 Guest(s)