Thread Rating:
  • 11 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller బెస్ట్ కపుల్ (Feb 28, 2025)
#29
5. ప్రేమ  -  భూతం






... గతం ...

ఇషా "ఈ ఫైల్ చూడు.....  ఇందులో కార్ బాంబ్ చేసిన ఐటమ్స్ అన్ని ఫారెన్ కి సంబంధించినవి.....  అలాగే ఈ కార్ బ్యాంబ్ తయారు చేసిన వాళ్ళను పట్టుకున్నాం కాని ఎవరూ చెబితే చేశారు అనేది మాత్రం తెలియలేదు.....  ఇవి నా శత్రువుల లిస్టు.....  ఇందులో నీ శత్రువుల లిస్టు.....  చూసుకొని కామన్ గా ఉన్న వాళ్ళను గుర్తు పడితే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేయిస్తాను.....  " అని చెప్పింది.

విష్ణువర్ధన్, ఇషానే అపురూపంగా చూస్తూ  ఉన్నాడు. ఆమె నల్లని కురులు గాలికి ఎగురుతూ ఉంటే, వయ్యారంగా తన చెవి దగ్గర తన సున్నితమైన చేతితో వెనక్కి అనుకోవడం, మధ్య మధ్యలో ఆమె ఎర్రని పెదవులు కదలడం, మృదువైన ఆమె గొంతు వింటూ తెల్లని ఆమె చెంపలు చూస్తూ మైమరచిపోతూ "నువ్వు చాలా అందంగా ఉన్నావ్" అన్నాడు.

ఇషా పైకి లేచి ఆ ఫైల్ తీసుకొని విష్ణువర్ధన్ నెత్తి మీద కొట్టి కోపంగా చూస్తూ ఉంది.

విష్ణువర్ధన్ తల మీద రుద్దుకుంటూ "కోపంలో కూడా ఇంకా అందంగా ఉన్నావ్.....  " అన్నాడు.

ఇషా పళ్ళు కొరుక్కుంటూ చూసి పెద్దగా "రమాదేవి.....  " అని అరిచింది.

పెద్దగా, రమాదేవి "మేడం.....  " అనుకుంటూ వచ్చింది.

ఇషా "డాక్టర్ ని పిలిపించు.....  మిస్టర్ విష్ణువర్దన్ కి తలకి ఎదో అయింది.....  పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు.....  పిచ్చిపిచ్చిగా చూస్తున్నాడు.....  "

విష్ణువర్దన్ కోప్పడకుండా నవ్వేసి "నీ హ్యూమర్ నాకు బాగా నచ్చుతుంది" అని పైకి లేచి ఆ ఫైల్ తీసుకొని వెళ్ళిపోయాడు.

ఇషా సీరియస్ గా చూస్తూ, రమాదేవి వైపు తిరిగి "ఏంటి? చూస్తున్నావ్.....  డాక్టర్ ని పిలిపించు.....  " అని అరిచి అక్కడ నుండి వెళ్ళిపోయింది.

రమాదేవి, ఇషాని ఫాలో అవుతూ "అవసరం ఉండదు మేడం.....  సర్ కి ఏం కాలేదు.....  "

ఇషా తినేసేడట్టు కోపంగా చూస్తూ ఉంది.

రమాదేవి "సర్ మిమ్మల్ని ఇష్టపడుతున్నారు"

ఇషా ఎదో జోక్ విన్నట్టు చూసి "అయితే.....  " అంది.

రమాదేవి ఆశ్చర్యంగా చూస్తూ "విష్ణువర్దన్ సర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారు"

ఇషా ఎదో జోక్ విన్నట్టు నవ్వుతుంది. 

రమాదేవి తనని చూసి నవ్వుతుంది అని ఇబ్బంది పడి "మేడం" అంది.

ఇషా ఇంకా నవ్వుతూ రమాదేవి భుజం మీద చేయి వేసి ఇంకా నవ్వుతూనే ఉంది.

రమాదేవి ఇబ్బంది కాస్తా ఇషా మీద కోపంగా మారిపోయింది, కాని జీతమిచ్చే యజమాని కావడంతో ఏం చేయలేక పోయింది.

ఇషా నవ్వు చూసి అప్పుడే కాలేజ్ నుండి వచ్చిన ఏడుగురు అమ్మాయిలు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. 

ఇషా అందరిని చూస్తూ "భూతాలు ఉన్నాయని నమ్ముతారా...!"  అని అడిగింది, అందరూ ఆశ్చర్యంగా చూశారు. ఇషా సీరియస్ గా అడుగుతుంది అని అర్ధం చేసుకొని "అవునూ...!" అంటూ తల నిలువుగా ఊపారు. 

ఇషా "మరి మీలో ఎంతమంది భూతాలను చూశారు...!" అని అడిగింది.

అందరూ వింతగా చూసి తల అడ్డంగా ఊపారు.

ఇషా అందరిని చూస్తూ "ప్రేమ కూడా అంతే...   అందరూ ప్రేమ ఉందని నమ్ముతారు కాని ఎవరూ చూడరు...   ప్రేమ కూడా భూతం లాంటిది...   అదొక మాయ అంతే...   " అంది.

అందరూ ఇబ్బందిగా చూస్తూ ఉన్నారు, ఇషా నవ్వుతూ గది నుండి బయటకు వెళ్ళబోయింది.

ఇంతలో విష్ణువర్ధన్ ఎదో భూతం బొమ్మ మాస్క్ వేసుకొని వచ్చి ఇషా ఎదురుగా కనపడ్డాడు. ఇషాకి భయం వేసి ఒక్క సారిగా "ఆహ్...!" అని అరిచి రమాదేవి వెనకకు వెళ్లి దాక్కుంది. 

ఆమె చేతులు వణుకుతూ ఒళ్లంతా చల్లగా చమటలు పట్టేశాయి, విష్ణువర్ధన్ మాస్క్ తీసి నవ్వుతూ ఉన్నాడు. 

ఇషా కళ్ళు తెరిచి విష్ణువర్దన్ చేతిలో మాస్క్ చూసి జరిగింది అంతా అర్ధం చేసుకొని, రమాదేవి వెనక నుండి బయటకు వచ్చి కోపంగా వచ్చి బూతులు తిడుతూ విష్ణువర్ధన్ ని కొడుతుంది. 

రమాదేవితో పాటు ఆ ఏడురుగు అమ్మాయిలు వింతగా చూస్తూ ఉండగా... ఇషా జుట్టు మెక్ అప్ అంతా ఆమె కేర్ ఫుల్ గా ఏర్పాటు చేసుకున్న కవర్ అంతా పోయి అసలైన ఇషా విష్ణువర్దన్ తో గొడవ పడుతుంది.

విష్ణువర్దన్ ఇషాని గట్టిగా హత్తుకొని ఆమె పెదవుల మీద ముద్దు పెట్టేశాడు. ఇషా చేతులు చిన్నగా విష్ణువర్దన్ మెడ చుట్టూ చేరుకొని గట్టిగా బంధించాయి. ఇద్దరూ కొంత సేపు అలా ముద్దులో మునిగి తేలారు.

కొద్ది సేపటి తర్వాత ఇషా ఈ లోకంలోకి వచ్చి విష్ణువర్దన్ ని చూసి అతన్ని తోసేసి మొహం దాచుకొని సిగ్గుగా పరిగెత్తుకొని బయటకు వెళ్ళిపోయింది.

అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు.  మంజరి "సర్ కి మేడం అంటే బాగా ఇష్టం" అని మురిసి పోతుంది.

సోని "అవునూ"

భువన "వీళ్ళ జంట బాగుటుంది"

సుహానా "సర్, తనకి ప్రేమ అంటే ఏంటో చూపిస్తారు"

సనా "హుమ్మ్"

గుడియా "ప్రేమ....  అయితే ఓకే....  కానీ భూతాన్ని చూపిస్తే....." అంది.

ఆరాధ్య "యెహే...." అని చేయి చూపి అక్కడ నుండి వెళ్లి పోయింది.

అందరూ గుడియా వైపు అదోలా చూసి వెళ్ళిపోయారు.





...ప్రస్తుతం...

ఇషా వంట గదిలో వంట చేస్తూ ఉంది, దామిని మొహం నిండా దుప్పటి కప్పుకొని భూతంలా తయారయి వంట గదిలోకి వచ్చింది. ఆమె వెనకే విష్ణు కూడా గోడ పక్కనే దాక్కొని ఉన్నాడు. ఇషా ఎదురుగా ఉన్న స్టీల్ ప్లేట్ లో వెనక జరుగుతుంది అంతా చూస్తూ ఉంది. 

పొయ్యి కట్టేసి తను కూడా సిద్దంగా ఉంది. దామని వెనకగా వచ్చి "బావ్" అని అరిచింది.

ఇషా షాక్ అయినట్టు వెనక్కి తిరిగి తెల్లని దుప్పటిలో ఉన్న దామిని చూసి భయపడ్డట్టు పెద్దగా అరిచి బయటకు పరిగెత్తింది.

దామిని పెద్దగా అరుస్తూ "అమ్మ భయపడింది" అంటూ ఎగురుగుతుంది.

బయట అప్పటికే సిద్దంగా ఉన్న విష్ణు అమాంతం ఇషాని పట్టుకొని తన కౌగిలిలోకి తీసుకున్నాడు.

దామిని వంట గదిలో నవ్వుకుంటూ ఎగురుగుతూ ఉంటే, విష్ణు, ఇషా మొహం నిండా ముద్దుల వర్షం కురిపిస్తున్నాడు. ఇషా కూడా విష్ణు కౌగిలిలో ఉన్నా అతన్ని తోసేస్తున్నట్టు నటిస్తుంది.

విష్ణు ఆత్రంగా ఇషాని తన కౌగిలిలో బంధించి ముద్దులు పెట్టేస్తూ ఉన్నాడు.

ఇంతలో దామిని బయటకు రావడంతో విష్ణు మరియు ఇషా ఇద్దరూ వేరు పడ్డారు.

దామిని "నాన్నా చూశావా! అమ్మ నిజంగానే భూతం అనుకోని భయం వేసి చమటలు పట్టేశాయి" అని వేలు చూపిస్తూ నవ్వుతూ ఉంది.

విష్ణు తన కూతురు దామినిని ఎత్తుకొని ఇషాని నవ్వుతూ చూస్తున్నాడు.

ఇషా దొంగ కోపంతో తండ్రి కూతుళ్ళను చూస్తూ అలిగినట్టు తిరిగి వంట గదిలోకి వెళ్ళింది.

తండ్రి కూతుళ్ళు ఇద్దరూ రాత్రి నిద్ర పోయే వరకు కూడా నవ్వుకుంటూనే ఉన్నారు.

ఇషా నిద్ర పోవడం కోసం రెడీ అవుతూ కిటికీ నుండి దుప్పటి పక్కకు జరిపి బయటకు చూసింది. ఆ చీకటిలో తన ఇంటి ఎదురుగా ఒక బ్లాక్ కలర్ కార్ పార్క్ చేసి ఉంది.

అది అక్కడ ఎంత సేపు ఉందొ తెలియదు, కాని అందులో మనుషులు ఉన్నట్టుగా అనిపిస్తుంది.

అది చూడగానే, ఇషా శ్వాస వేగం పెరిగిపోయింది, పిడికిలి బిగించి కోపంగా ఆ కారును చూస్తూ ఉంది.

వెనక్కి తిరిగి చూడగా తనకు సోఫా కనపడింది, దాని కింద గన్ గుర్తు వచ్చింది.

తిరిగి కిటికీ నుండి కార్ ని, కారు లో ఉన్న మనుషులను చూస్తూ ఉంది. విష్ణు వెనక నుండి వచ్చి ఇషా భుజం మీద చేయి వేశాడు.

ఇషా భయ పడి "హ్" అని శబ్దం చేసి వెనక ఉన్న విష్ణుని చూసి హాగ్ చేసుకుంది. విష్ణు తనని భయపెట్టాలని కాదు మాములుగా వేశాడు.

విష్ణు, ఇషాని హత్తుకున్నాడు. ఇషా కూడా విష్ణుని భయం భయంగా తన రెండూ చేతులను అతని చుట్టూ లాక్ చేసినట్టు వేసి మరి హాగ్ చేసుకుంది.

ఈ సారి ఇషా మరియు విష్ణు ఇద్దరూ కిటికీ నుండి బయటకు చూడగా ఆ కారు అక్కడ లేదు, అక్కడ నుండి వెళ్లి పోయింది.















All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 13 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: బెస్ట్ కపుల్ - by Uday - 24-10-2024, 01:43 PM
RE: బెస్ట్ కపుల్ - by Uday - 25-10-2024, 02:48 PM
RE: బెస్ట్ కపుల్ - by Uday - 29-10-2024, 12:40 PM
RE: బెస్ట్ కపుల్ - by 3sivaram - 30-10-2024, 07:58 PM



Users browsing this thread: 1 Guest(s)