Thread Rating:
  • 9 Vote(s) - 1.89 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller బెస్ట్ కపుల్ (Nov 20)
#20
4. బోర్ కొట్టేశావ్













... గతం ...

విష్ణువర్ధన్ పైకి లేచి ఇషాని చూస్తూ ఉన్నాడు. ఇషా అతన్ని చూడకుండా ఎదో పేపర్ తిరగేస్తూ కాళ్ళు రెండూ ఒక బల్ల మీద పెట్టి ఊపుతూ టీ తాగుతూ ఉంది. విష్ణువర్ధన్ తల దిమ్ముగా ఉండడంతో సరిగా కనిపించడం లేదు. కానీ మెల్లగా అన్ని స్పష్టంగా కనిపించడం మొదలయ్యాయి. సుమారుగా అయిదు నిముషాలుగా ఇషాని చూస్తూ ఉన్నాడు. బన్నీ క్లాత్ తో స్కిన్ టైట్ గా ఉన్న ప్యాంట్ వేసుకున్న ఇషా తొడల నుండి పాదాల వరకు చూస్తూ ఉన్నాడు. స్కిన్ అంతా కవర్ చేస్తూ క్లాత్ కవర్ చేసి ఉన్నా, ఎందుకో ఇషా అందం చూస్తూ చూపు తిప్పుకోబుద్ది కావడం లేదు.






...పాత జ్ఞాపకాలు...

విష్ణువర్ధన్ "ఇషా....  ఎందుకు ఇలా చేస్తున్నావ్....  "

ఇషా "ఏం చేశాను....  "

విష్ణువర్ధన్ "ఇంతకు ముందు బాగుండేదానివి....  ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నావ్....  "

ఇషా "మిస్టర్ విష్ణువర్ధన్....  మనిద్దరం ఒకరికిఒకరం ఏమవుతాం....  "

విష్ణువర్ధన్ గుటకలు మింగాడు, స్పష్టంగా ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది. కాని సడన్ గా ఒక్క రాత్రిలో ఇషా మారిపోయింది.

మాట్లాడడం మానేసింది, అందరితో సరదాగా ఉండడం మానేసింది. తన ఫ్రెండ్స్ కూడా తనతో ఉండలేకపోయారు.

సుమారుగా ప్రతి ఆరు నెలలకు పాత ఫ్రెండ్స్ ని మార్చేసి కొత్త ఫ్రెండ్స్ ని పరిచయం చేసుకుంటుంది. 

నవ్వుతుంది, నవ్విస్తుంది, కాని విష్ణువర్ధన్ కి మాత్రం గతంలో తను చూసిన ఇషా కనిపించలేదు.

సడన్ గా మిస్టర్ ఆకాష్ తో పెళ్ళికి ఒప్పుకుంది.

ఒక రోజు భరించలేక ఇషాని పక్కకి తీసుకొని వెళ్లి విషయం ఏంటి? అని అడిగాడు.

తను చెప్పిన సమాధానం విని మైండ్ బ్లాక్ అయింది. 

ఇషా "బోర్ కొట్టేశావ్....  "






విష్ణువర్ధన్, ఇషాని అలానే చూస్తూ ఉన్నా..... ఎందుకో తెలియదు, గతం మర్చిపోయి ఆమె అందాన్ని చూస్తూ ఉండిపోయాడు.

బహుశా ఆ రోజు నుండి ఈ రోజు వరకు..... ఎప్పుడూ ఇషా గుర్తు వచ్చినా అదే రోజు అదే క్షణం గుర్తు వచ్చి పిచ్చి కోపం వచ్చేది. ఎలా అయినా తను బాధ పడేలా చేయాలని తన ఫ్యామిలీ బిజినెస్ ని చేతుల్లోకి తీసుకొని రెండింతలు చేశాడు. గొడ్డులా కష్టపడి ఇషా వైపు చూస్తే, ఇషా తన కొత్త ఫ్రెండ్స్ తో పబ్ లో నుండి బయటకు వచ్చేది.

తనని ఎవరైనా అటాక్ చేస్తే, అప్పుడైనా తన వైపు చూసి "హెల్ప్ మీ..... " అంటుందని ఎదురు చూస్తే, నలుగురు మగాళ్ళని కుక్కల్ని కొట్టినట్టు కొట్టి "నువ్వు కానీ వీళ్ళతో రాలేదు కదా..... " అని చూసేది.

విష్ణువర్ధన్ తనని అనుమానించినందుకు ఇంకా కోపం తెచ్చుకొని వెళ్ళిపోయాడు. ఇన్ని రోజులు విష్ణువర్ధన్ ఇషాని ద్వేషిస్తూ ఉన్నాడని అనుకున్నాడు.

ఇషాకి యాక్సిడెంట్ అయింది అనగానే తన ప్రాణం పోయినట్టు అనిపించింది. తన కళ్ళ నుండి నీళ్ళు వస్తున్నాయని తనకే తెలియలేదు.

సెక్యూరిటీ ఆఫీసర్లకు ఫోన్ చేసి విషయం కనుక్కున్నాడు, కాని అందరూ యాక్సిడెంట్ అని చెప్పారు. తనకు అది అబద్దం అని అనిపించింది, ఇషా వాళ్ళ ఫ్యామిలీ మీద, ఆకాష్ మీద పిచ్చి కోపం వచ్చింది. తన యాక్సిడెంట్ వెనక వాళ్ళే ఉన్నాడని నమ్మి వాళ్ళను నాశనం చేయడం కోసం వచ్చాడు.

కాని ఎదురుగా ఇషా తన కొత్త ఫెండ్స్ తో కనిపించగానే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది.

తన అటెన్షన్ కోసమే అలా మాట్లాడాడు, తను అందరిలో తన మీద ప్రాంక్ చేసినా ఇంటికి వెళ్లి మనస్పూర్తిగా నవ్వుకున్నాడు. 

కొన్ని రోజులుగా ఇషా పోస్ట్ లు చూస్తూ నవ్వుకుంటూ ఉన్నాడు. 

కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే, ఇషా కాలింగ్ చూసి అగ్లీ గర్ల్ అని కనిపించగానే, ఇషా అది చూస్తే మొహం ఎలా పెడుతుందో అని ఊహించుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాడు.

ఫోన్ ఎత్తగానే, రొమాంటిక్ లైఫ్ కాస్తా యాక్షన్ ఎంటరటైనర్ గా మారిపోయింది.






ఇప్పుడు ఎదురుగా ఉన్న ఇషాని చూస్తూ ఉంటే, కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది. తనని ఇష్ట పడుతుందా..... లేదా..... తనకి అర్ధం కావడం లేదు.

సుమారుగా పది నిముషాలు గడిచాయి, విష్ణువర్ధన్ ఇషాని చూస్తూనే ఉన్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఆమెలో చూసిన సిగ్గు - తనని చూడగానే పరిగెత్తడం, అల్లరి తనం - తన మీద చిన్న చిన్న ప్రాంక్ లు చేయడం, కొంటె తనం - తనని ఆశగా చూస్తూ అతను చూడగానే తల తిప్పెసుకొని దొరికేసి నందుకు అబ్బా అనుకోని పక్కకు తిరగడం.

ఇప్పుడు ఇషా అస్సలు అలా లేదు, నలుగురు మగాళ్ళు తనని కొట్టడానికి వచ్చినా, చావు ఎదురుగా ఉన్నా, తనని చంపాలని అనుకునే వాళ్ళు తన పక్కనే ఉన్నా ఏమి లేదు అన్నట్టు నవ్వుతూ మెక్ అప్ వేసుకుంటూ ఉంటే కోపం వచ్చేస్తుంది.

ఆమెను బాగా చూసుకోవాలని, కాపాడాలని, ఆమె శత్రువులను తన శత్రువులుగా అనుకోని వాళ్ళను నాశనం చేయాలని అనిపిస్తుంది. కాని ఇషా మాత్రం ప్రతి రోజు చావుతో చెలగాటం ఆడుతూ బ్యుటిఫుల్ అనుకుంటూ తిరుగుతుంది.




విష్ణువర్ధన్ ఆలోచనలలో పడిపోయి ఇషా కూడా తన వైపు చూస్తున్న విషయం కూడా గుర్తు పట్టలేకపోయాడు. 

గుటకలు వేస్తూ ఇషా ని చూసి నవ్వాడు. ఇషా మాత్రం విష్ణువర్ధన్ ని చూస్తూనే ఉంది కాని నవ్వలేదు.

విష్ణువర్ధన్ "నన్ను ఎందుకు కాపాడావు" అని అడిగాడు.

ఇషా "నువ్వు హ్యాండ్ సమ్ అవునా కదా అని చూడడం కోసం వచ్చాను"

విష్ణువర్ధన్ "ఇంతకు ముందు కూడా చూశావ్ కదా"

ఇషా "నేను నీ గడ్డం పట్టుకొని దగ్గర నుండి చూస్తా అంటే ఒప్పుకుంటావా..... అందుకే నువ్వు స్పృహ తప్పే వరకు వెయిట్ చేశాను"

విష్ణువర్ధన్ కి నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. కోపం తెచ్చుకోవాలని అయితే లేదు. ఎందుకంటే తనను కాపాడింది.






విష్ణువర్ధన్ "ఇంతకి ఎందుకు కాపాడావు.... అదే.... నేను హ్యాండ్ సమ్ ....  అయితే ఏంటి? లేక పోతే ఏంటి?"

ఇషా "నువ్వు నాకు హ్యాండ్ సమ్....  గా కనిపిస్తే....  "

విష్ణువర్ధన్ "హుమ్మ్ కనిపిస్తే....  " అంటూ ఆశగా చూశాడు.

ఇషా "హ్యాండ్ సమ్....  అని అనిపిస్తే పిల్లలను కందాం అనుకుంటున్నా....  ఓన్లీ పిల్లలు....  ఇంకేం లేదు....  " అంది.

నోరు తెరుచుకున్న విష్ణువర్ధన్, ఇషాని పైకి కిందకు చూసి ఆ గది బాల్కానీ లోకి వచ్చి పెద్దగా "ఆ!" అని అరిచాడు.

ఇంకా తన ఫ్రస్ట్రేషన్ పోక జుట్టు పీక్కుంటున్నాడు.

ఇషా డోర్ దగ్గర నిలబడి చేతులు కట్టుకొని ఉంది, "జుట్టు పీక్కుంటే.....  హ్యాండ్ సమ్....  గా ఉండవు" అని చెప్పింది.






... ప్రస్తుతం ...

దామిని "అమ్మా....  అమ్మా....  " అంటూ ఏడుస్తూ బ్రతిమలాడుతూ ఉంది.

ఇషా పట్టించుకోకుండా, దామినిని చేయి పట్టుకొని s.chool ఆఫీస్ రూమ్ లోకి తీసుకొని వెళ్తుంది.

దామిని అయిదోవ తరగతి చదువుతుంది, ఇది పూర్తీ అవ్వగానే హై s.chool కోసం వాళ్ళ నాన్న విష్ణు వేరే మంచి s.chool లో జాయిన్ చేస్తా అన్నాడు.

అప్పటి వరకు ఈ s.chool లో ఏ గొడవ పడొద్దు, లేదంటే ఆ s.chool లో అడ్మిషన్ రాదు అని పదే పదే తన తల్లి ఇషా వార్నింగ్ ఇచ్చింది.

ఒక సారి గొడవ పడితే, తననే కొట్టింది. ఇప్పుడు ఆ అబ్బాయిని హాస్పిటల్ లో జాయిన్ అయ్యేలా కొట్టడంతో ఇషాని తలుచుకొని భయపడుతుంది.

ఆఫీస్ రూమ్ లో 35+ వయస్సు ఉన్న ఇద్దరు భార్యాభర్తలను చూసింది, బంగారం ముంచి తీశారా అన్నట్టు నగలు దిగేసుకొని వచ్చింది.

అతను కూడా అయిదు వేళ్ళకు అయిదు ఉంగరాలు పెట్టుకొని వచ్చి వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకొని నుదురు ముడిచి దామినిని సీరియస్ గా చూస్తూ ఉన్నాడు.

మరో వైపు ఇషా నార్మల్ ఫాన్సీ సారీ కట్టుకుని లైట్ గా కనిపిస్తూ ఉంది. ఆమె పక్కనే దామిని కాసేపటికి, కాసేపటికి కళ్ళు తుడుచుకుంటూ ఉంది.

ప్రిన్సిపల్ వచ్చి రాగానే ఆ భార్యాభర్తలు ఇద్దరూ రేస్ లో బ్రేక్ వదిలిన కారులా అరుస్తూనే ఉన్నారు. ప్రిన్సిపల్ కూడా సాధ్యమైనంత వరకు దామిని ఫ్యామిలీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అని అర్ధం చేసుకోమని చెప్పుకుంటూ పోతున్నాడు.

పదిహేను నిముషాల పోట్లాట తర్వాత, ప్రిన్సిపల్ చాలా కష్ట పడి బలవంతంగా వాళ్ళను దామిని మరియు ఇషాల చేత క్షమాపణ చెప్పిస్తా అని ఒప్పించాడు.

గదిలో అందరూ మాట్లాడుతూ ఉండగా ఇషా ఒక్క సారిగా ఆవలించింది.

ఆ ఇద్దరూ భార్యాభర్తలు ఇద్దరూ కోపంలో ఇషా మీదకు కొట్టడం కోసం అన్నట్టు వచ్చారు. ప్రిన్సిపల్ గదిలో ఉన్న మరో టీచర్ వైపు చూసి వాళ్ళను ఆపమని అడిగాడు. కాని అప్పటికే అతను ఇషా మీద మీదకు వచ్చేశాడు. 





... గతం ...

ఆరాధ్య మరియు మిగిలిన ఆరుగురు అమ్మాయిలు కంప్యుటర్ లో గేమ్స్ ఆడుతూ ఉండగా పెద్ద పెద్దగా సౌండ్స్ వినపడడంతో స్పీడ్ స్పీడ్ గా ఇషా రూమ్ దగ్గరకు వచ్చారు. అది అబ్బాయిల గొంతు, ఆ ఇంట్లో ఉంది అందరూ అమ్మాయిలే కావడంతో ఆ అబ్బాయి గొంతు విష్ణువర్ధన్ అని అది ఇషా రూమ్ నుండి వస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

గది బయట ఏడుగురు అమ్మాయిలు ఒక వైపు, ఇషా అసిస్టెంట్ మరో వైపు నిలబడి ఉన్నారు. విష్ణువర్ధన్ పెద్ద పెద్దగా అరవడంతో రమాదేవి మరియు ఏడుగురు అమ్మాయిలు వచ్చి విష్ణువర్ధన్ ని ఓదారుస్తున్నారు.  విష్ణువర్ధన్ తన మాటల్లో ఆమెను ప్రేమిస్తున్నా అని కాని ఆమె ఇలా దూరం దూరంగా ఉంటూ తనని ఇబ్బంది పెడుతూ ఆ ఆకాష్ తో పెళ్లి ఫిక్స్ చేసుకుంది అని అరుస్తూ చెబుతూ ఉన్నాడు.

పదిహేను నిముషాల వరకు అరిచి అరిచి విష్ణువర్ధన్ రొప్పు తీసుకోవడం కోసం కూర్చున్నాడు.

ఇంతలోనే ఇషా ఆవలించింది. విష్ణువర్ధన్ మళ్ళి కోపం వచ్చింది, కోపంగా పైకి లేచి విసురుగా బయటకు వెళ్ళిపోయాడు.

ఇషా మాత్రం ప్రశాంతంగా పైకి లేచి మ్యూజిక్ రూమ్ లోకి నడిచింది, అందరూ ఆమెను ఫాలో అవుతూ ఉన్నారు. 

పియానో ముందు కూర్చొని కళ్ళు మూసుకొని ఆ కీబోర్డ్ ని నొక్కుతుంది.

చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ అబ్బురంగా ఇషాని చూస్తూ ఉన్నారు. బయట ఉన్న విష్ణువర్ధన్ కి పిచ్చి కోపం వచ్చింది. 

ఇషాకి ఆ మ్యూజిక్ బిట్ విష్ణువర్దన్ నేర్పించాడు. ఇద్దరూ కలిసి పియానో ముందు కూర్చొని నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉండడం గుర్తు వచ్చింది.

ఆ రూమ్ దగ్గరకు వచ్చి ఆ పక్కనే ఉన్న కుండీ తీసుకొని ఇషా ఆడిస్తున్న పియానో ముందు నేలకేసి కొట్టాడు. 

ఇషా తల దించుకొని ఆ కుండీని చూస్తూ ఉంది. గది మొత్తం సైలెన్స్ తో నిండిపోయి ఉంది. 

ఎవరూ ఏ సౌండ్ చేయడం లేదు. కొద్ది సేపటి తర్వాత ఇషా తల పైకెత్తింది, ఆమె కళ్ళలో క్షణ కాలం పాటు వచ్చిన నీరు ఆమెను మోసం చేసి నీటిబొట్టుగా మారి ఆమె చెంపల మీదుగా జారీ కింద పడింది. అది చూడగానే విష్ణువర్దన్ కోపం అంతా పోయింది. 

ఇషా తిరిగి తన యాక్టింగ్ లోకి వచ్చి "ఆహ్.... రోజు..... మూడు సార్లు స్నానం చేసి నా వంటికి ఉన్న మట్టిని వదిలించుకుంటేనే అందంగా కనిపించగలం" అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోయింది.

విష్ణువర్ధన్ మరో వైపు వెళ్లి పోయాడు, ఇషా మరో వైపు వెళ్ళిపోయింది.

అందరూ కింద పడ్డ ఆమె కన్నీటి చుక్క చుట్టూ చేరారు. అప్పటికే అది నేల మీద పడి ఎప్పుడో ఒక చిన్న మచ్చలా మారిపోయింది.

మంజరి "వావ్.... అయితే తను కూడా ఏడుస్తుందా!"

సోనియా "ఎందుకు అలా అనిపించింది"

మంజరి "అంత పెద్ద బాంబ్ చూసినా కూడా భయపడలేదు, ఏడవలేదు కదా.....  " అంది.

అందరూ "మ్మ్" అని అన్నారు.

ఆరాధ్య మాత్రం ఇషా వెళ్ళిన వైపు చూస్తూ ఉంది.





... ప్రస్తుతం ...

ఇషా "నిన్న ఏం జరిగింది.....  " అని అడిగింది.

అప్పటికే టీచర్ చెప్పడంతో కూర్చున్న ఆ భార్యాభర్తలలో భర్త మళ్ళి కోపంగా పైకి లేచి మాట్లాడబోయాడు.

ఇషా పైకి లేచి సీరియస్ గా "నా కూతురు తప్పు చేయదు.....  నేను సిసి కెమెరా ఫుటేజ్ చూడాలని అనుకుంటున్నాను. తను నిజంగా తప్పు చేసి ఉంటే, క్షమాపణ చెప్పడమే కాదు, ఈ s.chool మాత్రమే కాదు, ఈ ఊరు వదిలి వెళ్లిపోతాము.....  " అంది.

అప్పటి వరకు రణగోణ ధ్వనులతో నిండిపోయిన ప్రిన్సిపల్ ఆఫీస్ ఇషా కంగు లాంటి గొంతుతో రీ సౌండ్ వచ్చింది. పైగా ఆమె కళ్ళు పెద్దవి చేసినపుడు ఆమె నుండి వచ్చిన ఆరా.....  తను అందరిలా డీల్ చేసే వ్యక్తీ కాదు అన్నట్టుగా ఉంది.

కొద్ది సేపటికి సిసి కెమెరా లో ఆ అబ్బాయి s.chool లో వేరే పిల్లలను ఏడిపిస్తూ ఉంటే, దామిని అందరి ముందు అతన్ని టీచర్ కి పట్టించింది. ఆ అబ్బాయి అప్పుడు వదిలేసినా.....   దామిని వెళ్తూ ఉంటే కింద పడేసి మీద మట్టి మరియు రంగు వేశాడు, చుట్టూ అందరూ నవ్వుతూ ఉన్నారు. దామిని పైకి లేచి ఆ అబ్బాయిని పిచ్చి కొట్టుడు కొట్టడంతో ఆ అబ్బాయి భయం భయంగా ఏడుస్తూ వెళ్ళిపోయాడు.....  

అది చూసిన తర్వాత అందరూ కోపంగా ఆ అబ్బాయి పేరెంట్స్ ని చూస్తూ ఉన్నారు. ఆ అబ్బాయి తల్లి మాత్రం కోపంగా దామినిని అరిచే ప్రయత్నం చేసింది అలాగా ఆమె భర్తని కూడా రెచ్చకొట్టడంతో అతను కూడా పైకి లేచి దామినిని s.chool  నుండి డిస్మిస్ చేయాలని డిమాండ్ చేశాడు.

ఇషాని కూడా ఊరు నుండి పంపించాలని డిమాండ్ చేశాడు. ప్రిన్సిపల్ కి ఏం చెప్పాలో అర్ధం కాలేదు. ఇషా పైకి లేచి తన చీర సర్దుకొని "ఇక అయిపొయింది కాబట్టి నేను వెళ్తున్నాను" అని చెప్పింది. ప్రిన్సిపల్ అటూ ఆ పేరెంట్స్ ని ఇటూ ఇషా గంబీరత్వాన్ని చూసి సరే అన్నటు తల ఊపాడు.

ఇషా, దామిని తల నిమిరి చేయి పట్టుకొని ఆఫీస్ రూమ్ నుండి బయటకు వచ్చింది. లోపల పెద్ద పెద్దగా సౌండ్ వినపడుతుంది. ప్రిన్సిపల్ వాళ్ళ ఇద్దరినీ సర్దిపుచ్చడం కోసం చాలా ప్రయత్నించాడు.

దామిని ఇషాని చూసి "అమ్మా.....  " అని మాత్రమే అనగలిగింది. తన మనసులో ఎన్నో మాటలు ఉన్నా అవి బయటకు రావాడం లేదు.

ఇషా, దామిని ముందు మోకాళ్ళ మీద కూర్చొని తన చీర పవిట కొంగుతో దామిని నుదిటి మీద ఉన్న చెమట మొత్తం తుడిచి "చూడు.....  నువ్వు తప్పు చేయవని నాకు తెలుసు.....  అలాగే గుర్తు పెట్టుకో.....  నువ్వు తప్పు చేస్తే.....  నిన్ను అరుస్తాను కాని.....  నీకు ఎవరైనా ఏదైనా అంటే.....  అందరికంటే ముందుగా నీ కోసం అమ్మని, నేనే వస్తాను.....  ఈ అమ్మ నీకు ఎప్పుడూ ఉంటుంది.....   "

దామిని గట్టిగా ఇషా మెడ చుట్టూ తన చిన్న చేతులను ముడి వేసి కొద్ది సేపు అలానే ఉండి, ఇషా బుగ్గ మీద ముద్దు పెట్టింది.

ఇషా దామిని తిరిగి తనని తన క్లాస్ ముందు వదిలిపెడుతూ ఉంటే, దామిని వెనక్కి తిరిగి జాలిగా మొహం పెట్టింది. కాని ఇషా కరగక పోవడంతో చేసేది లేక క్లాస్ రూమ్ లోకి నడిచింది.





....గతం....

విష్ణువర్దన్ చుట్టూ ఏడుగురు అమ్మాయిలు మరియు రమాదేవి నిలబడి ఇషా గురించి చెబుతూ ఉన్నారు. విష్ణువర్దన్ మాత్రం అందరిని సీరియస్ గా చూసి "నన్ను కాపాడినందుకు థాంక్స్....  కాని ఇషా నేను కలవడం జరగదు" అని చెప్పాడు.

చేసేది లేక అందరూ వెళ్లి పోయారు.

ఆరాధ్య మాత్రం అక్కడే నిలబడి ఉంది. అబ్బాయి డ్రెస్ లో ఉన్నా తను అమ్మాయే అని విష్ణువర్దన్ గుర్తు పట్టాడు. నిజానికి ఇషా పక్కన ఉండే వాళ్ళను అతను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాడు.

విష్ణువర్దన్ వెనక్కి తిరగకుండానే "మీకు ఏం కావాలి.....  " అని అడిగాడు.

ఆరాధ్య "నాకు ఒక డౌట్ గురించి చెబుతారా!"

విష్ణువర్దన్ సీరియస్ గా నుదురు ముడి వేసి చూస్తున్నాడు.

ఆరాధ్య "విషం కలిపినా పాలు తాగినపుడు,   మెట్ల మీద నుండి అయిన వాళ్ళే తనని కిందకు తోసేసినపుడు,   ఇంకా చాలా కష్టమైన సందర్బాలలో ఇషా ఇలానే ఉందా.....  ఎప్పుడూ బాధ పడలేదా.....  " అని అడిగింది.

విష్ణువర్దన్ "హుమ్మ్" అన్నాడు.

ఆరాధ్య "ఎందుకు?"

విష్ణువర్దన్ "ఎందుకంటే తనకు అదొక పిచ్చి.....  మెంటల్ మొహంది.....  శత్రువులను పక్కనే పెట్టుకొని చావుతో చెలగాటం ఆడుతూ ఉంటుంది.....  అన్నింటి కంటే ముఖ్యమైనది సేఫ్టీ కాదు.....  తన బ్యూటి.....  మెంటల్.....  మెంటల్.....  " అని అరిచాడు.

ఆరాధ్య "కానీ సర్.....  మీకు నాకు ఇద్దరికీ తెలుసు.....  తనకి ఎటువంటి మెంటల్ లేదు కదా"

విష్ణువర్దన్ నుదురు ముడి వేసి వెనక్కి తిరిగి ఆరాధ్య వైపు చూశాడు. 

ఆరాధ్య చిన్నగా నవ్వి "మెంటల్ కానప్పుడు, మరి ఎందుకు ఇలా ఉంది"

విష్ణువర్దన్ ఏమో అన్నట్టు చూస్తున్నాడు.

ఆరాధ్య "చాలా సింపుల్.....  తను నటిస్తుంది.....  "

విష్ణువర్దన్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు.

ఆరాధ్య "తన నిజమైన ఫీలింగ్స్ బయట పెట్టకుండా లోపల లోపల సమాధి చేసుకొని ఒక రకమైన క్యారక్టర్ ని బయట ప్రపంచానికి చూపిస్తూ నటిస్తుంది.....  " అంది.

విష్ణువర్ధన్ తల పైకెత్తి చూడగా ఇషా రూమ్ నుండి కిటికీ దగ్గర నుండి ఇషా తనని చూస్తూ కనపడింది. వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోయింది.

ఆరాధ్య "తల్లి లేని పిల్ల సర్.....  చుట్టూ అందరూ ఎప్పుడూ అవకాశం దొరుకుతుందా చంపి తినేద్దాం అన్నట్టు ఉండే మోసలి లాంటి మనుషులు.....  అందరి ముందు భయం భయంగా తన భయం దాచుకొని తిరుగుతుంది.....  ఎవరిని నమ్మాలో తెలియక.....  " అని చెప్పి అక్కడ నుండి వెళ్లి పోయింది.

విష్ణువర్ధన్ ఆలోచనలలో పడిపోయాడు.






















[+] 12 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: బెస్ట్ కపుల్ - by Uday - 24-10-2024, 01:43 PM
RE: బెస్ట్ కపుల్ - by Uday - 25-10-2024, 02:48 PM
RE: బెస్ట్ కపుల్ - by 3sivaram - 28-10-2024, 10:49 PM
RE: బెస్ట్ కపుల్ - by Uday - 29-10-2024, 12:40 PM



Users browsing this thread: 2 Guest(s)