26-10-2024, 09:47 PM
(This post was last modified: 29-10-2024, 10:37 AM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
3. పిల్ల చేష్టలు
..ప్రస్తుతం..
దామిని ఇంట్లోకి వస్తూనే గబా గబా తన బట్టలను విప్పేసి బాత్రూంలోకి వెళ్ళిపోయింది.
దామిని కాళ్ళకున్న గజ్జలు సౌండ్ వింటూ దామిని వచ్చిన విషయం అర్ధం అయి. ఇషా "దామిని" అని అరిచింది.
దామిని టెన్షన్ టెన్షన్ గా "బాత్రూంలో ఉన్నాను" అని కేకేసింది.
అంట్లు తోముతున్న ఇషా, దామి గొంతులో ఉన్న తేడా గమనించింది. ఆమె నుదురు ముడుచుకుంది.
దామిని బాత్రూంలో తన బట్టలు నీటిలో తడిపి ఉతకడం కోసం ప్రయత్నిస్తుంది, కొద్ది సేపటికి ఒక సారి వాళ్ళ అమ్మ ఇషా గమనిస్తుంది ఏమో అని భయం భయం గా ఉంది.
ఇషా సైలెంట్ గా సౌండ్ రాకుండా బాత్రూం దగ్గరకు వచ్చి ఒక్క సారిగా తలుపు తెరిచింది.
పెద్దగా దామిని "ఆ...!!" అని కేకేయడంతో అప్పుడే బయట నుండి ఇంటికి వస్తూ, డోర్ దగ్గర ఉన్న విష్ణుకి ఆ సౌండ్ వినపడి చమటలు పట్టేశాయి.
స్పీడ్ గా ఇంట్లోకి వచ్చాడు, బాత్రూం డోర్ దగ్గర ఉన్న ఇషాని చూసి "ఏమయింది?" అనుకుంటూ వచ్చి బాత్రూంలో ముడుచుకొని ఉన్న దామినిని చూశాడు.
దామిని వాళ్ళ నాన్నని చూడగానే పరిగెత్తుకొని వచ్చి అతన్ని హత్తుకుంది. విష్ణు అమాంతం ఎత్తుకున్నాడు, ఓదారుస్తున్నాడు. కాని దామిని ఏడుస్తూనే ఉంది.
ఏం జరిగింది అంటే చెప్పడం లేదు, ఇషాని చూడడానికి కూడా భయ పడుతుంది. విష్ణు దామినిని ఎత్తుకొని అటూ ఇటూ తిప్పాడు. కొద్ది సేపటికి ఆమె ఒళ్ళు వేడిగా ఉండడంతో డాక్టర్ ని పిలిపించాడు.
డాక్టర్ వచ్చి జ్వరం తగ్గేలా దామిని ట్రీట్ చేసి వెళ్ళాడు. దామిని నిద్ర పోతూ ఇషా చేతిని గట్టిగా పట్టుకొని నిద్ర పోయింది.
విష్ణు s.chool కి ఫోన్ చేసి విషయం ఏంటి అని అడిగాడు, కనుక్కొని చెబుతాం అన్నారు. విష్ణు కోపంగా వాళ్లతో మాట్లాడుతూ ఉన్నాడు. s.chool లో ఏం జరిగిందో కనుక్కొని చెప్పమని చెప్పి ఫోన్ పెట్టేశాడు.
కొద్ది సేపటి తర్వాత దామిని గది దగ్గరకు వచ్చాడు. ఇషా తమ కూతురు పక్కనే కూర్చొని దామిని భుజం మీద చేయి వేసి జో కొడుతూ ఉంది.
విష్ణు "s.chool లో ఎదో అయింది" అని అంటూ ఉండగా, ఇషా నోటి మీద వేలు వేసి ఇక్కడ కాదు బయట మాట్లాడుకుందాం అన్నట్టు సైగ చేసింది.
విష్ణు మరియు ఇషా ఇద్దరూ హాల్ లో ఉన్నారు. విష్ణు "s.chool లో " అని ఎదో అంటూ ఉండగా ఇషా చేయి చూపించి ఆపి.... బాత్రూం లోకి వెళ్లి దామిని బట్టలు తీసుకొని వచ్చింది.
వాటి పై మట్టి, ఎదో రంగు ఉంది. విష్ణు "ఎవరైనా తనని తిట్టడం కాని కొట్టడం కాని చేసారా!" అంటూ మళ్ళి ఫోన్ ని అందుకో బోయాడు.
ఇషా విష్ణు చేతిని పట్టుకొని పైకి లేచి "దామిని గొడవ పడింది..." విష్ణు ఎదో అనడంతో చేయి చూపించి ఆపి... దామిని పిడికిలికి ఉన్న చర్మం పోవడం గుర్తు చేసుకొని "దామిని కూడా కొట్టింది" అని చెప్పింది.
రెండూ నిముషాల తర్వాత..... విష్ణు "దామిని గొడవ పడితే.... తనకు ఎందుకు జ్వరం వచ్చింది" అని అడిగాడు.
దామిని నిద్రలో "సారీ అమ్మా..... సారీ అమ్మా..... ఇంకెప్పుడు గొడవ పడను అమ్మా..... సారీ అమ్మా..... " అంటూ కలవరిస్తుంది.
...గతం...
విష్ణువర్ధన్ "నా టైం వెస్ట్ చేశావ్" అని చెప్పడంతో అందరూ తనని చూస్తూ ఉన్నారు.
ఒక టేబుల్ మీదకి ఎక్కినా ఇషా ఆ టేబుల్ చుట్టూ ఉన్న బాడీ గార్డ్స్ ఒక పక్కగా ఉన్న తన ఫ్యామిలీ మరో పక్క ఉన్న ఏడుగురు అమ్మాయిలను అందరూ చూస్తూ ఉన్నారు.
విష్ణువర్ధన్ హ్యాండ్ సమ్ అప్పీరేన్స్ గురించి అమ్మాయిలు మాట్లాడుకోవడం వింటున్నారు.
ఇషా సడన్ గా అమ్మాయిల వైపు చూడగా, భువన తన పక్కనే ఉన్న గుడియా కి విష్ణువర్ధన్ గురించి చెబుతుంది.
సుహానా ఇషాని తడబడింది. కాని ఇషా ఫ్రెండ్లీగా నవ్వి కన్ను కొట్టింది. సుహానా కూడా నవ్వేసింది.
ఇషా మైక్ లోనే "అయ్యో.... అయ్యో.... భువనా.... ఏమయింది? నీకు...." అంటూ ఆ టేబుల్ మీద నుండి జంప్ చేసి భువన ముందుకు వచ్చి "ఎమర్జన్సీ.... ఎమర్జన్సీ.... తప్పుకోండి.... తప్పుకోండి.... మా భువన కళ్ళకు ఎదో అయింది.... " అంటూ భువనని బయటకు తీసుకొని వెళ్ళబోయింది.
అందరూ ఇషా చేస్తున్న హడావిడి చూసి నిజంగానే భువనకు నిజంగానే ఎదో అయింది అని భయపడ్డారు.
భువన "నాకేం కాలేదు.... నాకేం కాలేదు.... " అని అంటున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఇషా ఏం మాట్లాడాలన్నా మైక్ లోనే చెబుతుంది.
ఇషా మాత్రం కంగారు పడుతూనే ముందుకు వెళ్తున్నారు, దారిలో ఇషా కావాలని విష్ణువర్ధన్ ని తోసుకొని వెళ్ళిపోయింది.
విష్ణువర్ధన్ తడబడి కోపంగా ఇషాని చూసి "తను బాగానే ఉందని చెబుతుంది కదా.... " అన్నాడు.
ఇషా వెనక్కి తిరిగి విష్ణువర్ధన్ ని కాకుండా భువనని చూసి "ఇవి ఎన్ని వేళ్ళు" అంటూ తన చేతితో రెండూ వేళ్ళు చూపించింది.
భువన చుట్టూ అందరిని చూసి భయం భయంగా "రెండూ" అని చెప్పింది. ఇషా ఊపిరి పీల్చి తల ఊపింది.
ఇషా నాలుగు వేళ్ళు చూపించింది. ఈ సారి భువన దైర్యంగా "నాలుగు" అని చెప్పింది.
ఇషా తల ఊపుతూ... ఇతను హ్యాండ్ సమ్ గా కనిపిస్తున్నాడా! అని విష్ణువర్ధన్ ని చూపించింది.
భువన సిగ్గు పడాలి అనుకున్నా తేడా చెబితే హాస్పిటల్ అంటారు అని భయపడి తల నిలువుగా ఊపింది.
ఇషా మైక్ లో "వాట్.... విష్ణువర్ధన్ నీకు హ్యాండ్ సమ్ గా కనిపించాడా.... " అని షాక్ గా చూస్తూ "ఇది చాలా సీరియస్ విషయం.... నీ కళ్ళకు ఆపరేషన్ కూడా చేయాల్సి రావచ్చు.... లేక పోతే.... విష్ణువర్ధన్ హ్యాండ్ సమ్ గా కనిపించడం ఏంటి....? డెఫినెట్ గా నిన్ను మంచి కంటి హాస్పిటల్ లో చూపించాలి" అని పెద్దగా అరిచింది.
చుట్టూ జనాలు అందరికి ఇషా కావాలని విష్ణువర్ధన్ ని ఏడిపించాలని ప్రాంక్ చేస్తుంది అని పక్కకు తిరిగి విష్ణువర్ధన్ కి కనపడకుండా నవ్వుకున్నారు.
ఇషా సూటిగా విష్ణువర్ధన్ కళ్ళలోకి చూస్తూ నాలుక బయట పెట్టి వెక్కిరిస్తూ ఉంది.
విష్ణువర్ధన్ చిన్నగా నవ్వి "పిల్ల చేష్టలు...." అన్నాడు.
ఇషా నవ్వు మొహాన్ని కిందకు దించేసి సీరియస్ గా చూస్తూ మైక్ అందుకొని మూతి దగ్గర పెట్టుకొని "పోరా.... పిల్ల పుల్కా.... " అని అక్కడ ఉన్న ఎవరిని పట్టించుకోకుండా బాడీ గార్డ్స్ తో అక్కడ నుండి వెళ్లిపోయింది.
...ప్రస్తుతం...
s.chool నుండి కాల్ వచ్చింది.
ఒక సారి మోగింది, రెండో సారి మోగుతుంది.
విష్ణు ఫోన్ ని ఇషాని మార్చి మార్చి చూస్తున్నాడు.
ఇషా ఫోన్ ని ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి ఆన్ చేసి రికార్డ్ బటన్ మరియు లౌడ్ స్పీకర్ వెంట వెంటనే నొక్కింది.
ఫోన్ ఎదురుగా ఇషా మరియు విష్ణు ఇద్దరూ కూర్చొని ఉన్నారు.
ఫోన్ "మీరు దామిని పేరెంట్స్ యేనా...." అని అడిగారు.
ఇషా "నేను దామిని మదర్ ని మాట్లాడుతున్నాను"
ఫోన్ "మేడం..... ఒక స్టూడెంట్ పేరెంట్స్ కాల్ చేశారు..... అతన్ని మీ అమ్మాయి కొట్టింది..... "
ఇషా "సీరియస్ విషయమా..... "
ఫోన్ "చిన్న పిల్లలు కదా మేడం..... ఎదో పిల్ల చేష్టలు..... కొంచెం భయ పెడితే వాళ్ళే సరి అవుతారు"
ఇషా "ఆ అబ్బాయికి ఎలా ఉంది"
ఇషా "ఆ అబ్బాయి హాస్పిటల్ లో జాయిన్ అయ్యాడు..... ప్రిన్సిపల్ గారు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. రేపు మీరు రావాల్సి ఉంటుంది..... అలాగే ఆ అబ్బాయి పేరెంట్స్ కి క్షమాపణ చెప్పాల్సి ఉంటుంది..... వాళ్లకు పొలిటికల్ గా ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు"
ఇషా "రేపు పొద్దున్నే వస్తాను" అని చెప్పి ఫోన్ కట్టేసింది.
ఇషా పిడికిలి బిగించడం చూశాడు.
విష్ణు "రేపు నేను కూడా వస్తాను..... "
ఇషా వద్దు"
ఇషా వద్దు"
విష్ణు "రేపు నేను సెలవ పెడతాను..... వస్తాను..... ఇషా తను నా కూతురు..... మన కూతురు..... "
ఇషా "వద్దు"
ఇషా పైకి లేచి దామిని రూమ్ దగ్గరకు నడిచింది.
విష్ణు "ఇషా..... తను చిన్న పిల్ల..... నువ్వు ఏమయినా అంటావని భయ పడి జ్వరం తెచ్చుకుంది"
ఇషా నుదురు ముడిచి సీరియస్ గా విష్ణుని చూసి దామిని దగ్గరకు వెళ్లి దుప్పటి కప్పి 'జో' కొడుతుంది.
...గతం...
ఇషా "ఆహ్..... వీడి మొహం చూసి చూసి నాకు నీరసం వచ్చేసింది..... పదండి..... పదండి..... షాపింగ్ కి వెళ్లి ఎనర్జీ పెంచుకుందాం" అని ఆ ఏడుగురు కొత్త ఫ్రెండ్స్ తో కలిసి అదే కారులో కలిసి వెళ్ళింది.
గతంలో చిన్న కారులో ముడుచుకొని ఏడుగురు కూర్చుంటే, ఇప్పుడు పెద్ద కారులో విశాలంగా కూర్చున్నారు.
షాపింగ్ హాల్ లో సాయంత్రం వరకు షాపింగ్ చేస్తూనే ఉన్నారు. ఎంత బిల్ అయినా ఏం అయినా ఇషా చిన్నగా నవ్వేసి తన కార్డ్ ఇస్తుంది. మొదట భయ పడ్డా ఇషా చూపిస్తున్న ఇష్టం స్వచ్చంగా ఉండడంతో ఆమెతో ఈజీగా కలిసిపోయారు. పైగా కొన్ని షాప్స్ ని తనవే అని చెప్పడం పైగా తనవి కాని షాపుల్లో వాళ్ళు కూడా ఇషాని గౌరవంగా చూడడంతో మెల్ల మెల్లగా వాళ్ళలో ఉన్న భయం వదిలించుకొని ఇషాతో కలిసి పోయారు.
ఇషా అందరిని తీసుకొని తన కొత్త విల్లాకి తీసుకొని వెళ్ళింది. అందులో చాలా బెడ్ రూమ్స్ ఉండడం చూసి ఆశ్చర్య పోయారు. గతంలో చిన్న ఇంట్లో రెండు గదుల్లో ఏడుగురు ఇరుక్కుని ఇరుక్కుని ఉండే వాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఇంత పెద్ద ఇల్లు వాళ్ళ అందరికి నచ్చేసింది. పైగా జిమ్, స్విమ్మింగ్ పూల్, మ్యూజిక్ ఐటమ్స్ ఉన్న రూమ్ మరియు పెద్ద సినిమా హాల్ లాంటి రూమ్... అన్ని చూసి ఆశ్చర్య పోయారు.
ఒక రూమ్ లో ఇషా కూర్చొని రమాదేవి ఇచ్చిన ఫైల్స్ అన్ని చూస్తూ ఉంది. ఆరాధ్యతో కలిసి అందరూ ఇషా ఉన్న దగ్గరకు వచ్చారు. ఇషా చిన్నగా నవ్వింది, ఆరాధ్య వెనకే అందరూ రూమ్ లోకి వచ్చారు. రమాదేవి వాళ్ళను వద్దు అని చెప్పాలని అనుకుంది, కాని వెంటనే ఇషా సీరియస్ గా చూడడంతో ఆగిపోయింది.
అందరూ వచ్చి ఇషా వెనకే నిలబడి ఉన్నారు. ఇషా, రమాదేవి మాటలు అయిపోయాక మాట్లాడాలని అనుకున్నారు.
ఇషా "ఫైనల్ గా బాంబ్ బ్లాస్ట్ వెనక ఉంది, నాకు కాబోయే వాడు మిస్టర్ ఆకాష్... అంతే కదా..."
రమాదేవి వెనకే ఉన్న వాళ్ళను చూసి ఇక రహస్యం ఆపలేను అని అర్ధం అయి, "అవునూ మేడం..... అలాగే తనకు సపోర్ట్ చేసింది..... మీ పిన్ని కల్పన..... "
ఇషా "ఆకాష్ ఎందుకు?"
రమాదేవి కొన్ని ఫోటోస్ చూపించింది, అందులో ఇషా యొక్క సవితి చెల్లెలు మరియు ఆకాష్ ఇద్దరూ కిస్ చేసుకున్నట్టు, రోమాన్స్ లో మునిగి తేలినట్టు ఉన్న ఫోటోస్ చూస్తూ ఉంది.
ఇషా "ఈ కుక్క నా వెనక నా చెల్లితో రోమాన్స్ చేస్తున్నాడు..... ఈ చెల్లి నా లంజ..... నా ఫియాన్సి అంటేనే ఇష్టం..... " అని పైకి లేచింది.
రమాదేవి "ఈ ఫోటోస్ చూపించి మీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయించవచ్చు మేడం..... "
ఇషా "వద్దు..... వద్దు..... టైం అపుడే సెట్ అవ్వదు..... " అని పైకి లేచి అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తుంది.
సనా "ఎందుకు మీ నాన్నకి చెప్పకూడదు..... తండ్రికి కూతుళ్ళు అంటే ఇష్టం కదా..... " అంది.
చుట్టూ ఉన్న ఆడపిల్లలు సనాని మాట్లాడవద్దు అని సైగ చేశారు.
రమాదేవి వాళ్ళ వైపు కోపంగా చూసి తిరిగి ఇషా వైపు చూసింది.
ఇషా "చెప్పూ..... " అంది.
రమాదేవి తల ఊపి "మీ నాన్నకి మీ కార్ బాంబ్ గురించి ముందే తెలుసు మేడం..... " అని వాళ్ళ వైపు చూసింది.
అందరూ ఇబ్బందిగా చూసారు. వాళ్ళలో వాళ్ళు "తండ్రి కూతురుని చంపుతాడా!" అని అనుకున్నారు.
ఇషా చిన్నగా వాళ్ళను చూసి నవ్వి "మా నాన్న నన్ను చంపడు..... కాని ఎవరైనా చంపుతుంటే మాత్రం ఏం చేయడు..... "
సనా "వాట్" అని నోరు తెరిచి నమ్మలేనట్టు చూసింది. పైగా ఇషా మీద తనకు జాలి వచ్చేసింది.
సనా సెంటి మెంట్ అవ్వడం చూసి ఇషా చిన్నగా నవ్వేసి సనా దగ్గరకు వెళ్లి హత్తుకుంది. సనా కూడా కొద్ది సేపు ఇషాతో మాట్లాడింది.
కొద్ది సేపటి తర్వాత ఇషా, తనని చూస్తున్న రమాదేవితో "ఆకాష్ వెనక ఎవరు ఉన్నారు?" అని అడిగింది.
రమాదేవి డౌట్ గా చూస్తూ ఉంది.
ఇషా "ఇంతకు ముందు ఫుడ్ లో విషం కలిపారు, కారు బ్రేక్ లు తీశారు, మెట్ల మీద నుండి తోయడం, పై నుండి కుండీ వేయడం చేశారు..... అవన్నీ చీప్ పనులు..... కార్ బాంబ్ పెట్టి..... దొరికితే అది జస్ట్ యాక్సిడెంట్ అని చూపించారు అంటే అది వేరే లెవల్..... ఆ ముండకి అన్ని తెలివి తేటలు లేవు..... వెనక ఎవరూ ఉన్నారో కనుక్కో"
రమాదేవి "సరే మేడం" అని వెళ్లి పోయింది.
ఆ ఏడుగురు నిజానికి ఇషా దగ్గర ఉండము అని చెప్పడం కోసం వచ్చారు కాని ఇషా వాళ్ళను అందరిలా కాకుండా ఫ్రెండ్ లా చూడడంతో వాళ్ళు ఆ మాట చెప్పలేక పోయారు.
ఆ రోజు సాయంత్రం రమాదేవి కంగారుగా వచ్చి ఇషాని కలిసింది. ఎనిమిది మంది అందగత్తెలు కలిసి స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్నారు.
ఇషా ఒక పక్కకు తన నల్లని జుట్టుని వేసుకొని ఒక తెల్లని టవల్ తో తుడుచుకుంటూ ఉంటే, రమాదేవి వచ్చి ఒక ఫైల్ ఇచ్చింది.
సనా ఆశ్చర్యంగా వాళ్ళను చూసి దగ్గరకు వెళ్ళాలా వద్దా అన్నట్టు ఉంది. ఇషా సనాని చూసి కన్ను కొట్టి తల అడ్డంగా ఊపింది.
రమాదేవి ఇచ్చిన ఫైల్ లోని ఫోటో చూసి పక్కన పడేసి పైకి లేచింది.
ఇషా "గర్ల్స్" అని కేకేయడంతో అందరూ ఇషా ముందుకు వచ్చారు.
ఇషా వాళ్ళను చూస్తూ అందరూ తనని చూసే వరకు ఆగి "మిస్టర్ విష్ణువర్ధన్ హ్యాండ్ సమ్ గా కనిపించాడా!" అని అడిగింది.
అందరూ ఏం మాట్లాడాలో అర్ధం కాక చూస్తూ ఉన్నారు.
ఇషా, రమాదేవితో "హ్యాండ్ సమ్ గానే ఉండి ఉంటాడు, అందుకే ఎవరూ ఏం చెప్పడం లేదు" అంది.
రమాదేవి ఇబ్బందిగా నవ్వింది.
ఇషా "ఒక సారి వెళ్లి మీ విష్ణువర్ధన్ ఎంత అందంగా ఉన్నాడో చూద్దాం పదండి" అని ఇంట్లోకి నడిచింది.
వెనకే అందరూ వెళ్ళారు, ఇషా వెనక్కి తిరిగి "గుర్తు పెట్టుకోండి.... అందరూ అందంగా రెడీ అవ్వాలి" అని చెప్పి రమాదేవి వైపు చూసి "బ్యూటిషియన్స్ ని పిలిపించండి" అని ఆర్డర్ వేసింది.
ఒక రోడ్ మీద కారులో విష్ణువర్ధన్ కారుని నడిపిస్తూ వెళ్తున్నాడు, ఇంతలోనే అతని ఫోన్ మోగింది. ఫోన్ పై ఇషా ఫోటో ఉండి, పేరు మాత్రం అగ్లీ గర్ల్ అని రాసి ఉంది.
ఫోన్ లిఫ్ట్ చేశాడు.
విష్ణువర్ధన్ కారు దిగి పరిగెత్తాడు.
కొద్ది సేపటికి కారు బాంబ్ పేలినట్టు పేలింది. అప్పటికే విష్ణువర్ధన్ చాలా దూరం పరిగెత్తినా, కారు బంపర్ వచ్చి అతని వీపుకు తగిలి కింద పడిపోయాడు. అలాగే స్పృహ తప్పాడు.
ఆ పక్కగా కొద్ది దూరంలో పార్క్ చేసిన పెద్ద కారు అన్ని వైపుల డోర్స్ ఓపెన్ అయి అందరూ కిందకు దిగారు.
ఇషా బ్లాక్ కళ్ళ జోడు పెట్టుకొని భుజాల మీదకు నల్ల జాకెట్ వేసుకొని ఉంది.
![[Image: casual-black-leather-jacket-800x980.jpg]](https://i.ibb.co/VBdVHKB/casual-black-leather-jacket-800x980.jpg)
![[Image: 71haia-Gqx-OS-AC-SY445.jpg]](https://i.ibb.co/JBLqQKk/71haia-Gqx-OS-AC-SY445.jpg)
నడుచుకుంటూ, కింద పడ్డ విష్ణువర్ధన్ దగ్గరకు వచ్చింది. అప్పటికే మిగిలిన వాళ్ళు అందరూ వెళ్లి విష్ణువర్ధన్ ని కంగారుగా అతను బ్రతికి ఉన్నాడా లేదా అని చూస్తూ ఉన్నారు. రమాదేవి అంబులెన్స్ కి కాల్ చేస్తుంది.
ఇషా చిన్నగా నడుచుకుంటూ వచ్చి విష్ణువర్ధన్ గడ్డం కింద చేయి వేసి మొహాన్ని అటూ ఇటూ తిప్పి చూసి "ఏ యాంగిల్ లో చూసిన వీడు నాకు హ్యాండ్ సమ్ గా కనిపించడం లేదు..... అనవసరంగా కాపాడాము..... ప్చ్..... వెస్ట్..... " అని చెప్పి విసుగ్గా చూసింది.
రమాదేవి మరియు ఆ ఏడుగురు అమ్మాయిలు ఇషాని ఆమె మాటలను షాక్ గా చూశారు.
ఇషా క్యాజువల్ గా "సర్లెండి..... తీసుకొచ్చి ఆ కార్ లో పడేసి తీసుకొని వెళ్దాం..... దేనికో ఒక దానికి పనికి వస్తాడు" అంది.
కొన్ని గంటల తర్వాత.....
విష్ణు వర్ధన్ కళ్ళు తెరిచి చూడాగా ఎదో కొత్త ప్లేస్ లా..... లేడీస్ రూమ్ ఉండే ప్లేస్ లా అనిపించింది. తల మెల్లగా దిమ్ముగా అనిపిస్తూ తల తిరుగుతున్నట్టు అనిపించింది. చుట్టూ చూడగా ఇషా ఎదురుగా ఉన్న బల్ల మీద కాళ్ళు పెట్టి ఊపుతూ సోఫాలో కూర్చొని టీ తాగుతూ ఉంది.
ఆమె తల మీద ఉన్న దెబ్బ చూసి కొన్ని రోజుల క్రితం తనకు కూడా యాక్సిడెంట్ అయినపుడు తనకు కూడా దెబ్బలు తగిలాయి అని గుర్తుకు వచ్చింది.
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)