Thread Rating:
  • 11 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller బెస్ట్ కపుల్ (Feb 28, 2025)
#6
2.  తల్లి ప్రేమ








గతం:

ఇషా కళ్ళు తెరిచి బలవంతంగా పైకి లేచి నిలబడింది. ఆమె మొహం అంతా దుమ్ముతో నిండిపోయింది తన చుట్టుపక్కల బాంబ్ వల్ల పేలిపోయిన కారు భాగాలు కాలుతూ కనిపిస్తున్నాయి. పైకి లేచి నిలబడగానే తన ముక్కు నుండి చెవుల నుండి వస్తున్నా రక్తం చూసుకుంది.

ఇషా వెనకే ఫాలో అయి వచ్చి హారన్ కొట్టిన కారు ముందు భాగాన్ని కూడా ఇషా కారు బంపర్ వచ్చి కొట్టింది. అంత పెద్ద దెబ్బ కాకపోవడంతో అందరూ ఆ కారులో నుండి మెల్లగా కిందకు దిగారు. డ్రైవర్ సీట్ లో నుండి చొక్కా ప్యాంట్ లో గడ్డం మీసాలు లేని ఒక మగతను, పక్క సీట్ నుండి ఒక అమ్మాయి, వెనక సీట్ నుండి నలుగురు అమ్మాయిలు కిందకు దిగారు అందరూ కాలేజ్ పిల్లలు లాగా ఉన్నారు. వాళ్ళు చూస్తూ ఉండగానే ఇషా దుమ్ముతో నడుచుకుంటూ వస్తుంది.

అమ్మాయిలలో వాళ్లకు వాళ్ళు

'సో'నియా  "ఒసేయ్..... ఎంటే జాంబీలా ఉంది"

'మం'జరి  "అలా చిన్నగా నడుచుకుంటూ వస్తూ ఉంటే అలానే అనిపించింది నాకు కూడా...."

'భు'వన  "నాకు కూడా అలానే ఉంది"

'గు'డియా  "హేయ్ ఆపండి... ఆమె దగ్గరకు వస్తుంది... విన్నదంటే..."

'సు'హానా  "కారులో బాంబ్ పెట్టి చంపాలి అనుకున్నారు అంటే....  ఈ అమ్మాయి ఏమయినా మాఫియానా...."

'స'నా  "ఆపండి.... దగ్గరకు వచ్చేసింది... ఆరాధ్య నువ్వు వేళ్ళు అందరూ నిన్ను మగాడు అనుకుంటారు" అంది.

అందరూ నవ్వేశారు. మగాడిలా కనిపిస్తున్న అబ్బాయి కూడా నిజానికి అమ్మాయే.

'ఆ'రాధ్య నవ్వుతున్న అందరి వైపు కోపంగా చూసి ముందుకు ఇషాకి ఎదురు నడిచి  "మేడం" అంది.



ఇషా ఆరాధ్య దగ్గరకు వచ్చి ముందుకు జాచిన ఆమె చేతిని చిన్నగా పక్కకు నెట్టేసింది. సరాసరి నడుచుకుంటూ వచ్చి వాళ్ళ కారుకి ఉన్న అద్దంలో తన మొహం చూసుకొని "ఆహ్....  మెక్ అప్ అంతా పోయింది" అంటూ వెనక్కి తిరిగి ఏడుగురు వైపు చూసింది. అందరూ ఇషాని పిచ్చి దాన్ని చూసినట్టు చూస్తున్నారు.

ఇషా చిన్నగా నవ్వుతూ "ఇంత పెద్ద యాక్సిడెంట్ తర్వాత కూడా నేనే మీ అందరి కంటే అందంగా ఉన్నాను కదా..." అని వేలు చూపిస్తూ పెద్దగా నవ్వేసింది.

అందరూ కోపంగా చూస్తూ ఉన్నారు. అందరిని చూస్తూ ఇషా పక్కకు కళ్ళు తిరిగి పడిపోయింది.




ప్రస్తుతం:

దామిని ఏడుస్తూ "నేను వెళ్ళను..... డాడీ... నువ్వు అయినా చెప్పూ" 

విష్ణు కూతురిని చూసి కరిగిపోయాడు అలానే తల తిప్పి ఇషా వైపు చూశాడు కాని ఇషా దామినిని రెడీ చేస్తూ ఉన్న సీరియస్ ఫేస్ ని చూస్తూ దామిని వైపు ఏం చేయలేనట్టు చూశాడు.

దామిని ఎంత ఏడుస్తున్నా ఇషా కూతురిని రెడీ చేసి చేతులు పట్టుకొని తీసుకొని వెళ్లి బస్ ఎక్కించి క్యారేజ్ చేతికిచ్చింది. అది తీసుకొని వెళ్తున్నట్టు కంటే లాక్కొని వెళ్తున్నట్టు ఉంది.

దామిని ఇంకా ఏడుస్తూనే ఉంది. ఇషా "ఫుడ్ వేస్ట్ చేయకుండా తిను..." అంది. దామిని ఏడుపు ఆపింది కాని, ఇషా వైపు కోపంగా చూసింది. ఇషా "ఎంటే చూపు... సమాధానం చెప్పూ..." అంది.

దామిని "తింటాను లే అమ్మా..." అని కళ్ళు తుడుచుకొని డ్రైవర్ వైపు చూసి "పోనివ్వండి అంకుల్..." అంది ఇషా వైపు చూడకుండా.... అందరూ నవ్వు మొహం పెట్టినా.... ఇషా మాత్రం ఇంకా కోపంగానే ఉంది.

విష్ణు "తనకు నువ్వంటే చాలా ఇష్టం" అన్నాడు.

ఇషా ఏమి మాట్లాడలేదు, వెళ్ళిన బస్ వైపే చూస్తూ ఉంది.

విష్ణు, ఇషా మోహంలో బాధని చూస్తూ మనసులో "దామినిని కొట్టినా ఆ తర్వాత దామిని పడ్డ బాధ కంటే ఇషానే ఎక్కువ బాధ పడుతుంది" అని అనుకోని "తల్లి ప్రేమ" అన్నాడు.

ఇషా సీరియస్ గా విష్ణుని చూస్తూ "తల్లి ప్రేమ దొరకాలంటే చాలా అదృష్టం ఉండాలి...   నీ కూతురుకి ఆ విషయం తెలియడం లేదు..." అంది.

విష్ణు నవ్వు మొహంతోనే ఇషా భుజం మీద చేయి వేసి ఇంట్లోకి తీసుకొని వెళ్ళాడు.








....గతం....


ఇషా కళ్ళు తెరిచి చూడగానే ఎదో కొత్త ప్లేస్ లా ఉంది. స్మెల్ చూస్తే ఎదో లేడీస్ ఉండే హాస్టల్ లేదా రెంట్ కి తీసుకున్న రూమ్ లా అనిపించింది. తన తలకు కట్టిన గాజు గ్లాస్ ని ఫీల్ అవుతూ ఉంటే, తనకు ఎమర్జన్సీ ట్రీట్ మెంట్ ఇప్పించారని అర్ధం అయింది. తను ఇంకా ఇక్కడే ఉండడం చూస్తూ ఉంటే, తన గురించి ఇంకా బయటకి తెలియలేదని అర్ధం అయింది. కొద్దిగా పైకి లేచి ఒంటి మీద బట్టలు చూసుకుంటే తన బట్టలు మార్చారని అర్ధం అవుతుంది.

తల పక్కకి తిప్పి ఎదురుగా చొక్కా ప్యాంట్ వేసుకొని అబ్బాయిలా కనిపించే అమ్మాయి ఆరాధ్యని చూసి, ఇషా "నువ్వు కానీ నాకు ముద్దు పెట్టావా!" అని అడిగింది.

ఆరాధ్య అదేదో పాపపు పని అన్నట్టు చూసి చెంపదెబ్బలు వేసుకొని "లేదు....  లేదు...." అంది.

ఇషా, ఆరాధ్య వైపు చూసి "అర్ధం అయింది" అని అదోలా చూసి పైకి లేచింది.

ఆమె వంటి మీద ఉన్న నైటీ ఆమె మోకాళ్ళ వరకు మాత్రమే వచ్చింది. స్పష్టంగా అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరూ తన హైట్ లేరు, ఒక్క ఆరాధ్య తప్పించి తను మాత్రం అబ్బాయిల బట్టలు వేసుకుంటుంది.

ఆరాధ్య అద్దంలో చూసుకొని తనని ఇప్పటి వరకు అబ్బాయి అనుకోని మాట్లాడింది అని అర్ధం అయి ఇషా ముందుకు వచ్చి, "నేను అబ్బాయిని కాను" అంది.

ఇషా ఆరాధ్య వైపు పైకి కిందకు చూసి "సరే" అని ముందుకు నడిచింది.

ఆరాధ్య ఇషా భుజం పై చేయి వేసి లాగింది, కింద పడ్డప్పుడు తన భుజం పై దెబ్బ తగలడం తో ఇషా నొప్పితో "ఆహ్" అని అరిచింది.

ఆరాధ్య కంగారుగా ఇషా నొప్పి ఉన్న ప్లేస్ ని చూసి "సారీ...  సారీ...  నేను కావాలని చేయలేదు" అంది.

ఇషా సరే అని చెప్పడంతో ఆరాధ్య కూల్ అయింది కాని తను అమ్మాయి అని ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది.

ఇంతలో బయట నుండి ముగ్గురు అమ్మాయిలు సోనియా, మంజరి, భువన వచ్చారు.

వాళ్ళను చూస్తూ ఇషా "నన్ను కాపాడినందుకు థాంక్స్..." అని చెప్పింది.

ముందు రోజు తమతో అంత పొగరుగా ఉండి ఈ రోజు మాములుగా ఉండడం చూసి షాక్ అయ్యారు.

ఇషా "ఏంటి నిన్నటిలా కాకుండా ఇవాళ ఇలా ఉంది అనుకుంటున్నారా!" అంది.

సోనియా, మంజరి తల అడ్డంగా ఊపగా, భువన నిలువుగా ఊపింది. భువనని చూసి మిగిలిన ఇద్దరూ కూడా నిలువుగా ఊపారు.

ఇషా చిన్నగా నవ్వేసి "అదేం లేదు..... ఒక వేళా నేను చనిపోతే పేపర్ లో నా ఫోటో వేస్తారు కదా.... " అంది.

గదిలో ఉన్న నలుగురు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ఇషా మాత్రం ఇది సాధారణ మైన విషయం అన్నట్టు అద్దంలో చూసుకొని తల దువ్వుకుంటుంది.

గుడియా అప్పుడే అక్కడకు వచ్చి తన ఫోన్ ని తన వెనక దాచుకుంది. 

సుహానా మరియు సనా ఇద్దరూ కూడా అలాగే ఫోన్ వెనక్కి పెట్టుకున్నారు.

కానీ గదిలో ఉన్న అందరూ ఆ ఫోన్ లో న్యూస్ చూస్తూ ఉన్నారు.

ఇషా "నేను చనిపోయిన ఫోటో చూసి అబ్బాయిలు అందరూ 'అబ్బా.... ఇంత అందమైన అమ్మాయి చనిపోయిందే అని బాధ పడాలి' " అని అంది.

అందరూ ఇబ్బందిగా నవ్వారు.

ఆరాధ్య "కాని, ఈ ఫోటో అస్సలు బాలేదు కదా" అని తను చనిపోయినట్టు వచ్చిన ఫోటో చూపించింది.

ఇషా కోపంగా పైకి లేచి ఆ ఫోటో చూస్తూ "బ్లడీ ఇడియట్స్.... మంచి ఫోటోనే కనపడలేదా వీళ్ళకి.... కనీసం.. స్నాప్ షాట్ లో టచింగ్ అన్నా చేయాల్సింది... ఛీ.... ఛీ...." అనుకోని పైకి లేచి ఒకరి ఫోన్ నుండి ఒక కాల్ చేసింది.

అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా... ఒక కారు వచ్చింది. అందులో ఇషా ఎక్కింది, వెనకే వచ్చిన మరో పెద్ద కారులో ఏడుగురు ఎక్కారు.

కారు ఒక లగ్జరీ VIP బ్యూటీ సెలూన్ ముందు ఆగింది. ఇషా కట్లు తోనే లోపలకు వెళ్లి తనను తానూ అందంగా రెడీ అయింది.

ఆ ఏడుగురు కూడా ఇషా ఆర్డర్ మీద అందంగా తయారు అయ్యారు. ఆరాధ్యని కూడా కొంచెం అమ్మాయిలా రెడీ చేసినా కూడా... మగాళ్ళ సూటు బూటులోనే బయటకు వచ్చింది.

అందరూ సంతోషంగా ఫీల్ అయ్యారు.

ఇషా ఆరాధ్యని చూస్తూ "ఇప్పుడు చూడు.... నిన్ను చూసిన ప్రతి మగాడు ఇష్టపడతాడు" అంది. ఆరాధ్య సిగ్గు పడింది. కాని ఇషా ఏ ఉద్దేశ్యంలో అందో ఆమె ఊహించలేక పోయింది.

మరో వైపు ఇషా హాస్పిటల్ నుండి వచ్చిన పేషెంట్ లా కాకుండా ఫ్లాషీ ఫ్లాషీ గా ఉండే డ్రెస్ వేసుకొని కాళ్ళకు ఎనిమిది అంగుల హై హీల్స్ వేసుకొని వచ్చింది. అసలే కొద్దిగా హైట్ ఉండే మనిషి అలాంటిది ఇంకా హై హీల్స్ వేయడంతో ప్రపంచాన్ని చూడాలి అంటే కిందకు మాత్రమే చూడాలి అన్నట్టు ఉంది తన విధానం.

ఇషా వేసుకున్న డ్రెస్, తను పట్టుకున్న బ్యాగ్, తన చేతికున్న పాష్ ఫ్యాషన్ బ్యాంగిల్ మరియు వెలికి ఉన్న ఉంగరం, తను పెట్టుకున్న గాగుల్స్, ఆఖరికి తన దెబ్బలకు వేసిన కట్టు కూడా స్టైల్ గా తను రిచ్ కాదు సూపర్ ఇచ్ అన్నట్టు ఉంది.

బయటకు ఎండలోకి వచ్చిన కొద్ది సేపటికే BMW వచ్చి ఇషాని మరియు దాని వెనకే వచ్చిన మరో లగ్జరీ కారులో మిగిలిన ఏడుగురు భయంగా భయంగా ఎక్కారు.




కారు సరాసరి ఒక విల్లా ముందు ఆగింది, దారి పొడవున కార్లు, జనం అంతా ఇంట్లోకి వెళ్లి ఇషా ఫోటో కింద పూలు వేసి అక్కడే ఏడుస్తున్న ఇషా తండ్రి మిస్టర్ పురుషోత్తంని మరియు అతని భార్య కల్పనని ఒదారుస్తున్నారు. మరో వైపు కల్పన కూతురు ఇషా చెల్లెలు సంజన దిగులుగా కూర్చొని ఉంది, ఆమె పక్కనే ఇషాకి కాబోయే భర్త ఆకాష్ ఉన్నాడు. 

ఇషా, ఆకాష్ మరియు ఇషా ముగ్గురు ఒకే క్లాస్ లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నారు.

చుట్టూ నిలబడ్డ కొందరు కల్పనని చూసి "సవితి కూతురుని, సొంత కూతురు కంటే ఎక్కువగా చూసేది అంట.... ఇప్పుడు పాపం ఈ అమ్మాయియాక్సిడెంట్ లో ఇలా అయిపొయింది"

మరి కొందరు కల్పన తల్లి ప్రేమ, మరియు సంజనలు ఇషా పై చూపించే ఎనలేని ప్రేమ గురించి చెప్పుకుంటూ ఉన్నారు. మరో వైపు ఇషా వాళ్ళను తక్కువ చేసి చూడడం వాళ్ళను ఏడిపించడం గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. అది చూసి ఇషా వల్ల లాభ పడ్డ కొందరు ఇషా ఫోటో చూస్తూ "మనుషులు ఇలా కూడా ఉంటారా..... చనిపోయిన తర్వాతా కూడా అంటున్నారు" అనుకుంటున్నారు.





కొద్ది సేపటిలో అక్కడకు బాడీ గార్డ్స్ తో ఫ్లాషీ డ్రెస్ లతో అక్కడకు వచ్చిన కొంత అమ్మాయిలు, అందులో మధ్యలో ఎత్తుగా ఉన్న ఒక అమ్మాయి సరాసరి అక్కడకు వచ్చి ఇషా ఫోటో తీసుకొని కింద వేసి కొట్టింది. ఆ అమ్మాయి డ్రెస్ ని వింతగా చూస్తూ ఉంటే ఈ అమ్మాయి ఏకంగా ఫోటో కింద వేసి కొట్టడం చూసి ఆశ్చర్య పోయారు.

ఇషా పెద్దగా "సెక్రటరీ" అని పిలిచింది. ఆమె గొంతు విని అక్కడున్న కొందరు అది ఇషా అని గుర్తు పట్టి ఆమె దగ్గరకు వచ్చి మరీ చూస్తున్నారు.

ఇషా మళ్ళి "సెక్రటరీ.....  ఎక్కడ చచ్చావ్" అని పిలవడంతో... "ఇక్కడున్న మేడం" అంటూ ఏడుపును తుడుచుకుంటూ నవ్వుతూ వచ్చిన మధ్య వయస్సులో ఉన్న రమాదేవిని చూస్తూ "ఏం చేస్తున్నావ్? అసలు నీకు జీతం ఎందుకు ఇస్తున్నాను..... ఇలాగేనా పని చేసేది...." అంటూ అరుస్తుంది. రమాదేవి తల దించుకొని ఇషా తిడుతున్నా తిట్లు సంతోషంగా పడుతూ ఉంది. ఇషా బ్రతికి రావడంతో ఆమె జాబ్ ఆమెకు ఉంది అలాగే ఆమె తన సాలారీ తనకు వస్తుంది పైగా EMIలు కూడా హాయిగా కట్టుకోవచ్చు.

ఇషా "అసలు ఎందుకు తిడుతున్ననో నీకు అర్ధం అవుతుందా!" అని అరిచింది.

రమాదేవి "తెలుసు మేడం.....  మీరు బ్రతికి ఉన్నా చనిపోయారని.....  "

ఇషా "దానికి నీ తప్పు ఏముంది? డాక్టర్ మరియు సెక్యూరిటీ ఆఫీసర్ తప్పు చేశారు.....  నీ తప్పు ఏంటో చెప్పూ" అంటూ నడుము మీద చేతులు పెట్టుకొని చూస్తుంది.

రమాదేవి ఇబ్బందిగా చూస్తూ ఉంది, ఏం చెప్పాలో అర్ధం కావడం లేదు.

ఇషా, ముందుకు నడిచి తన కళ్ళజోడుని ఒక చేత్తో పట్టుకొని మరో చేతిని రమాదేవి భుజం చుట్టూ వేసి "ఆ ఫోటో చూశావా.... ఎంత ఓల్డ్ గా అగ్లీగా ఉందొ.... నేను అసలు అలా ఉంటానో..... ఎంత అందంగా ఉంటాను.... చూడు చూడు" అంటూ తన గడ్డం కింద రెండూ చేతులు పెట్టుకొని కళ్ళు రెప్పలు వేస్తూ చిన్న పిల్లలా చూపించింది.

చుట్టూ చూస్తున్న జనలాని అసలు పట్టించుకోవడం లేదు.

రమాదేవి ఇషాని చూసి "సారీ మేడం" అంటూ ఆమెను హత్తుకోబోయింది. ఇంతకు ముందు ఎప్పుడూ ఇషా తనని ఎవరూ పట్టుకోడానికి ఒప్పుకోదు కాని ఇషా చనిపోయి బ్రతికి వచ్చింది అంటే ఆమెను హత్తుకోవాలి అని అనిపించింది, కాని ఇషా ఏమంటుందో అని ఆగిపోయింది. కాని ఇషా చేతులు జాపి రమాదేవిని హత్తుకుంది, రమాదేవి ఏడుస్తూ ఇషాని హత్తుకుంది. 

ఇషా చిన్నగా రమాదేవితో చిన్నగా "బాంబ్ బ్లాస్ట్ వెనక ఎవరు ఉన్నారు" అని సీరియస్ గా అడిగింది.

రమాదేవి ఇషా కౌగిలి నుండి బయటకు వచ్చి ఆమె చేతులను పట్టుకొని దెబ్బలను చూస్తూ "మీ కోసం మీ నాన్న పురుషోత్తం గారు చాలా బాధ పడ్డారు మేడం.... అంత కంటే ఎక్కువ మీ పిన్ని కల్పన గారు అంత కంటే ఎక్కువ మీ సవితి చెల్లెలు సంజన గారు అందరిని కూడా మీకు కాబోయే భర్త ఆకాష్ గారు ఒడారుస్తున్నారు మేడం" అని చెప్పింది.

ఇషా కళ్ళు ఒక్క సారిగా బాధగా భయంగా అనిపించింది, వెంటనే తట్టుకొని నిలబడి అందరిని వెళ్లి పలకరించింది. అందరూ నవ్వుతూ బదులిచ్చారు. ముందుగా రమాదేవితో మాట్లాడడంతో వాళ్లకు కోలుకోవడం కోసం సమయం వచ్చినట్టు అయింది లేక పోతే వాళ్ళ కళ్ళలో ద్వేషం వెంటనే బయట పడిపోయేది. ఇషా అందరితో నవ్వుతూ పలకరించింది. అది నటన అందరికి అర్ధం కాదు.



ఇషా మధ్యలోకి వచ్చి అందరిని చూస్తూ ఒక మైక్ తీసుకుంది.

అందరూ ఆమెను చూస్తూ ఉన్నారు.

ఆమె వెనకే వచ్చిన ఏడుగురు ఆమె చేతిలో ఉన్న మైక్ ని చూస్తూ "ప్రిన్సెస్..... ప్యూర్ ప్రిన్సెస్..... ఆ చేతిలో ఉన్న మైక్ కూడా లక్షల్లో ఉంటుంది" అని అపురూపంగా చూస్తూ ఉన్నారు.

ఇషా ఒక బల్ల మీదకు బాడీ గార్డ్స్ సాయంతో ఎక్కి అందరిని చూస్తూ "మీ అందరికి ఒక గుడ్ న్యూస్..... ఒక బ్యాడ్ న్యూస్....." అని అరిచింది.

అందరూ ఆమెను చూస్తూ ఉన్నారు.

ఇషా "నేను బ్రతికి వచ్చాను....." అని అరిచింది.

అందరూ ఆమెను చూస్తూ ఉన్నారు.

ఇషా "నన్ను ఇష్టపడే వాళ్లకు ఇదే గుడ్ న్యూస్..... నన్ను ద్వేషించే వాళ్లకు ఇదే బ్యాడ్ న్యూస్....." అని అరిచింది.



అప్పుడే అక్కడకు వచ్చిన ఆకాష్ యొక్క అన్నయ్య మిస్టర్ విష్ణువర్ధన్..... ఇషాని చూస్తూ ఉన్నాడు.

విష్ణు "నేను రెండూ కాదు.... కానీ.... నా టైం వెస్ట్ చేశావ్...." అన్నాడు.

ఇద్దరూ ఒకరిని ఒకరు పొగరు బోతుగిత్తలు లాగా చూసుకుంటున్నారు.





ఆరాధ్య ఇషాని చూస్తూ "నిజంగా ప్రిన్సెస్ లాగానే ఉంది" అంటూ అపురూపంగా చూస్తుంది.

"ఇది కాదె అటూ చూడు.... ప్రిన్స్ వచ్చాడు" అంటూ విష్ణువర్ధన్ ని చూపిస్తున్నారు.




















All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
Like Reply


Messages In This Thread
RE: బెస్ట్ కపుల్ - by Uday - 24-10-2024, 01:43 PM
RE: బెస్ట్ కపుల్ - by 3sivaram - 24-10-2024, 10:40 PM
RE: బెస్ట్ కపుల్ - by Uday - 25-10-2024, 02:48 PM
RE: బెస్ట్ కపుల్ - by Uday - 29-10-2024, 12:40 PM



Users browsing this thread: