Thread Rating:
  • 9 Vote(s) - 1.89 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller బెస్ట్ కపుల్ (Nov 20)
#1
1. చెడ్డ వాళ్ళు








ఇషా (34 సం||) తన కూతురు దామినిని బెడ్ పై పడుకోబట్టి జో కొడుతూ కధ చెబుతుంది. చివరిలో "అలా చెడ్డ వాళ్ళు అందరూ చనిపోయారు, మంచి వాళ్ళు గెలిచారు" అని చెప్పింది.

దామిని "అమ్మా... ఎప్పుడూ మంచి వాళ్ళే గెలిచి చెడ్డ వాళ్ళే చనిపోతారా!" అని అడిగింది.

ఇషా నవ్వుతూ "అవునూ.... చెడ్డ వాళ్ళు చనిపోయి మంచి వాళ్ళు మిగులుతారు..... అందుకే మనం మంచి వాళ్ళు లా ఉండాలి" అని చెప్పింది.

దామిని "కాని అమ్మా.... ఆఖరికి అందరూ చనిపోవాల్సిన వాళ్ళే కదా.... మంచిగా ఉంటే ఏంటి....? చెడ్డగా ఉంటే ఏంటి....?  నేను చెడ్డగా ఉంటా... అప్పుడు అందరూ నన్ను చూసి భయపడతారు" అని చెప్పింది.

ఇషా ఒక్క సారిగా దామిని చెప్పిన మాటలు విని షాక్ అయింది.

దామిని "నేను ఇక నుండి చెడ్డగా ఉండేదా.... అమ్మా..." అని అడిగింది.

ఇషా "రేపు.... మీ నాన్న వస్తాడు తనని అడుగు తను చెబుతాడు..." అని చెప్పి దుప్పటి కప్పింది.

దామిని కళ్ళు మూసుకొని ఇషా చేతి పై హాయిగా పడుకుంది.

ఇషా ఎంత ప్రయత్నించినా..... నిద్ర పట్టలేదు. 

సమయం అప్పటికే రెండూ గంటలు గడిచింది.

అదే గదిలో వారిద్దరితో పాటు ఉన్న అలారం క్లాక్ మాత్రమే టిక్ టిక్ మణి సౌండ్ చేస్తుంది.

ఇషా పైకి లేచి వాటర్ తో ఫేస్ వాష్ చేసుకొని ఎదురుగా అద్దంలో చూడగా అద్దంలో తన రూపం నవ్వుతూ కనపడింది. ఆ నవ్వు ఎప్పుడూ నవ్వే తన అందమైన చిరునవ్వు కాదు, రాత్రిళ్ళు కూడా ఎవరికీ నిద్ర పట్టకుండా చేసే భయంకరమైన నవ్వు. అది ఒక శాడిస్టిక్ నవ్వు.

ఇషా అద్దం పై ఉన్న వేడి ఆవిరి లేయర్ ని చెరిపి తన మొహం తానూ చూసుకొని టవల్ తో తుడుచుకొని బయటకు వచ్చి కిటికీ ద్వారా కిందకు చూసింది. రెండో అంతస్తు నుండి కిందకు చూస్తూ ఉంటే తారు రోడ్ అంతా నల్లగా... అప్పటికే వర్షం పడడంతో మరింత నల్లగా కనిపిస్తుంది. కరెంట్ పోయిందేమో.... చిమ్మ చీకట్లు కమ్మేశాయి. లక్కీగా ఇంట్లో ఇన్వర్టర్ ఉండడంతో AC ఆగిపోయినా.... బెడ్ లైట్లు, ఫ్యాన్ తిరుగుతుంది.

ఆ నల్లని రోడ్ చూస్తూ ఉంటేనే ఇషా గతంలోకి వెళ్ళిపోయింది.





పద్నాలుగు సంవత్సరాల క్రితం.... 

ఒక చీకటి రాత్రి....

హైవే.... పై ఇషా కారు వెళ్తూ ఉండగా.... వెనక కారులో ఒక వ్యక్తీ పదే పదే హార్న్ కొడుతూ ఉన్నాడు. ఇషా నిజానికి ఎదో ఆలోచిస్తూ నడుపుతున్న మాట నిజమే... అందుకే చిన్నగా వెళ్తుంది. వెనక ఉన్న కారు డ్రైవర్ కి దారి ఇవ్వక పోయే సరికి హార్న్ కొడుతున్నాడు. ఇషా తన ఆలోచనల నుండి బలవంతంగా బయటకు వచ్చి వెనక హార్న్ కొడుతున్న వాడి మీద పిచ్చి కోపం వచ్చింది. తన బ్యాగ్ లో ఉన్న గన్ తీసుకొని కారు దిగి సరాసరి వెనక ఉన్న కారు దగ్గరకు వచ్చి అద్దం డోర్ పై కొట్టింది. కారు అద్దం  కిందకు జరుగుతూ ఉండగా... అతను తన తల బయట పెట్టి ఎదో అడగబోయాడు. కాని ఇషా తన గన్ తీసి అతని నుదుటి మీద పెట్టింది. 

అతను నోరు అమాంతం మూసేసుకుంది. ఇషా చిన్నగా నవ్వి ఒకటి..... రెండూ..... అని పలుకుతూ ఉండగా.... అతను సారీ... సారీ... అని చెబుతూనే ఉన్నాడు. అయినా ఇషా మూడు అని ట్రిగ్గర్ నొక్కేసింది.

అతను పెద్దగా "ఆ!" అని అరిచాడు.

ఇషా పెద్దగా నవ్వుతూ ఆ బొమ్మ తుపాకిని అతని ఒళ్లోకి విసిరి... "ఉచ్చ బోసుకున్నట్టు ఉన్నావ్.... వెళ్లి ప్యాంట్ మార్చుకో...." అని నవ్వుకుంటూనే... తన కారు దగ్గరకు తిరిగి వెళ్ళబోతూ తిరిగింది.

కాని ఇంతలో తన కారు పెద్ద యెత్తున బాంబ్ లా పేలిపోయింది. ఆ బాంబ్ ఫోర్స్ కి..... ఇషా కింద పడి అయిదు అడుగుల వరకు వెనక్కి జారుతూ వెళ్ళింది. 

ఈ సారి ఆమె ప్యాంట్ తడిచి పాస్ వచ్చేసింది.



...ప్రస్తుతం...

ఫోన్

ఇషా "ఏం చేస్తున్నావ్? ఎంత సేపటిలో వస్తావ్?"

విష్ణు "నేనే ఆఫీస్ లో లేనే.... బెంగుళూరులో ఉన్నాను...."

ఇషా ఏం మాట్లాడలేదు.

విష్ణు "రేపు పొద్దున్నే నీ కౌగిలిలో ఉంటాను... సరేనా...."

ఇషా మోహంలో చిన్నగా నవ్వు విరిసింది.

విష్ణు గుర్తు రాగానే మనసు ప్రశాంతంగా అనిపించింది, ఆవలింతలు వచ్చేస్తున్నాయి.

సరాసరి వెళ్లి దామిని పక్కనే పడుకొని తనపై ఒక చేయి వేసి మత్తు నిద్రలోకి వెళ్ళిపోయింది.

తెల్లారి తన నుదిటి మీద విష్ణు ముద్దు పెడితేనే కాని మెళుకువ రాలేదు.

కళ్ళు తెరిచి ఎదురుగా కనపడుతున్న విష్ణుని చూసి చిన్నగా నవ్వి అతని పెదవులపై ముద్దు పెట్టింది.

ఇంతలోనే.... దామిని "మమ్మీ..." అని కేక వేయడంతో "వస్తున్నా..." అని పైకి లేచింది.

విష్ణు ఆమెని తన కౌగిలి నుండి విడిపించకుండ పట్టుకున్నాడు. ఇంతలో దామిని "మమ్మీ..." అని మళ్ళి కేక వేసింది.

ఇషా "అబ్బా.... వదులు విష్ణు" అంటూ గింజుకుంటుంది.

విష్ణు "ఒక ముద్దు పెట్టు... వదిలేస్తా...."

ఇషా, ముందుకు వచ్చి విష్ణు పెదవులపై ముద్దు పెట్టింది.

విష్ణు తన పెదవులు తడుపుకొని రుచి చూస్తున్నట్టు మొహం పెట్టి "సరిపోలేదు.... ఇంకో ముద్దు పెట్టు" అని అడిగాడు.

ఇషా, విష్ణుని నవ్వుతూ చూస్తూ రెండో ముద్దు పెట్టింది.

విష్ణు ఇంకొకటి...  ఇంకొకటి...  అని అడుగుతూనే ఉన్నాడు. ఇషా ముద్దు పెడుతూనే ఉంది.

దామిని "మమ్మీ..." అని కేకేయడంతో బలవంతంగా విష్ణు కౌగిలి నుండి విడిపించుకొని అతన్ని మురిపంగా చూస్తూ "రానూ....  రానూ....  చెడ్డవాడివి అయిపోతున్నావు.... వదల మంటే వదలడం లేదు...." అని తిట్టి దామిని దగ్గరకు వెళ్ళింది.

విష్ణువర్ధన్ నవ్వుకుంటూ తల్లి కూతుళ్ళు ఇద్దరి దగ్గరకు నడిచాడు.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
బెస్ట్ కపుల్ (Nov 20) - by 3sivaram - 23-10-2024, 01:15 PM
RE: బెస్ట్ కపుల్ - by Uday - 24-10-2024, 01:43 PM
RE: బెస్ట్ కపుల్ - by Uday - 25-10-2024, 02:48 PM
RE: బెస్ట్ కపుల్ - by Uday - 29-10-2024, 12:40 PM



Users browsing this thread: 1 Guest(s)