21-10-2024, 10:59 PM
(This post was last modified: 23-11-2024, 06:11 PM by 3sivaram. Edited 3 times in total. Edited 3 times in total.)
180. చాటింగ్
హరప్రీత్ ని ఒక వ్యక్తీ లాక్కొని వచ్చి మోకాళ్ళ దండ వేయించి అతని నుదిటి మీద గన్ పెట్టాడు.
హరప్రీత్ "సర్.... సర్.... వద్దు సర్...." అని బరతిమాలాడుతూ ఉన్నాడు.
గన్ పట్టుకున్న వ్యక్తీ "నీకు నేను ఏం చెప్పాను..... క్రిష్ ఇక్కడకు వచ్చిన దగ్గర నుండి అతన్ని ఫాలో అవ్వమని చెప్పాను కదా...."
హరప్రీత్ "అవునూ సర్... ఫాలో అయ్యాను"
గన్ పట్టుకున్న వ్యక్తీ "మరి ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు"
హరప్రీత్ తల దించుకున్నాడు.
గన్ పట్టుకున్న వ్యక్తీ "చెప్పూ"
హరప్రీత్ "తెలియదు సర్... వాళ్ళు వెళ్ళిపోయారు"
గన్ పట్టుకున్న వ్యక్తీ "ఆ రోజు ఏమయింది?"
హరప్రీత్ నోటి నుండి మాటలు రాలేదు. అతని మొహం అంతా చమటలు పట్టేశాయి.
గన్ పట్టుకున్న వ్యక్తీ "వాళ్ళు పొద్దున్నే లేచి వేరే ఊరు వెళ్ళడం కోసం నీకు కాల్ చేశారు, తమరు మందు కొట్టి పడుకుని ఫోన్ ఎత్తక పోయే సరికి వేరే క్యాబ్ తీసుకొని వెళ్లిపోయారు, ఇప్పుడు ఏ ఊళ్ళో ఉన్నారో కూడా తెలియదు"
హరప్రీత్ "హిమాచల్ ప్రదేశ్"
గన్ పట్టుకున్న వ్యక్తీ "అక్కడ నుండి కూడా వెళ్ళిపోయారు... ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు"
హరప్రీత్ "సారీ... సర్.... సారీ... "
గన్ పట్టుకున్న వ్యక్తీ "అరేయ్..... నీకు అసలు అర్ధం కావడం లేదు రా..... దీని వెనక చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు.... మనం జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకే..... పది లక్షలు ఇస్తాం అన్నారు"
హరప్రీత్ "అవునా... మరి నాకు లక్ష మాత్రమే ఇస్తా అన్నావ్"
గన్ పట్టుకున్న వ్యక్తీ, హరప్రీత్ మొహం మీద కొట్టి "పని చేయలేదు కదా...."
హరప్రీత్ మొహం రెండూ చేతులతో పట్టుకొని ముక్కు నుండి వస్తున్నా రక్తాన్ని రుద్దుకుంటూ ఉన్నాడు.
గన్ పట్టుకున్న వ్యక్తీ యొక్క ఫోన్ మోగింది.
అతను ఫోన్ మాట్లాడుతూనే "అలాగే మేడం... అలాగే.... ఓకే..." అంటూ ఉన్నాడు.
అవతల ఒక అమ్మాయి నగ్నంగా కూర్చొని యోగా చేసుకుంటూ ఫోన్ మాట్లాడుతూ ఉంది.
హరప్రీత్ ఎలా వినాలని అనుకున్నా.... అవతల ఎవరో అర్ధం కాలేదు, ముందుకు వంగి మరీ ఫోన్ వినాలని అనుకున్నాడు.
గన్ పట్టుకున్న వ్యక్తీ వెనక్కి తిరిగి హరప్రీత్ ని చూసే సరికి వేరే వైపు చూస్తున్నట్టు కవర్ చేసుకుంటూ ఈల వేసుకుంటూ ఉన్నాడు.
గన్ పట్టుకున్న వ్యక్తీ, హరప్రీత్ చేసిన పని అర్ధం అయినా ఫోన్ లో "హా..... హా..... సరే మేడం" అంటూ మాట్లాడుతూ హరప్రీత్ ని చూసి పళ్ళు నూరుకుంటూ ఉన్నాడు.
హరప్రీత్ వేరే వైపు తిరిగినా ఒక కన్ను ఒక చెవి తన బాస్ మీద వేసి ఉంచాడు కాని విషయం తెలియడం లేదు. ఒక విషయం కన్ఫర్మ్, తన ప్రాణాలు సేఫ్.... ప్రస్తుతం క్రిష్ ఆచూకీ చెబితే ఇంకా చాలా డబ్బులు వస్తాయి.
గన్ పట్టుకున్న వ్యక్తీ, ఫోన్ కట్టేసి హరప్రీత్ దగ్గరకు వచ్చి ఎదో మాట్లాడబోయెంతలో, హరప్రీత్ "అయిదు లక్షలు...." అన్నాడు.
గన్ పట్టుకున్న వ్యక్తీ "ఏంటి?"
హరప్రీత్ "అయిదు లక్షలు.... ఇస్తే క్రిష్ ఆచూకి కనుక్కుంటా...." అన్నాడు.
గన్ పట్టుకున్న వ్యక్తీ పళ్ళు నూరి "సరే చెప్పూ..."
హరప్రీత్ చేయి జాపి "డబ్బులు" అన్నాడు.
గన్ పట్టుకున్న వ్యక్తీ కోపంగా గన్ చూపిస్తూ "ఒళ్ళు బలిసిందా...."
హరప్రీత్ "సరే... నో డీల్.... గుడ్ బాయ్...." అని వెనక్కి తిరిగాడు.
గన్ పట్టుకున్న వ్యక్తీ కంగారుగా "అరె..... హరప్రీత్ భాయ్.... ఎందుకు అంత కోపం.... నువ్వు కనుక్కో.... నీ డబ్బు నీకు పంపిస్తా.... నన్ను నమ్ము... నన్ను నమ్మవా....."
హరప్రీత్ చేయి చూపిస్తూ "నిన్నూ...."
గన్ పట్టుకున్న వ్యక్తీ "హుమ్మ్.."
హరప్రీత్ "నిన్నూ...."
గన్ పట్టుకున్న వ్యక్తీ "హుమ్మ్.."
హరప్రీత్ "నిన్నూ.... జీవితంలో ఎవడైనా నమ్ముతాడా! చెప్పూ.... కామిడీ కాక పోతే..." అంటూ నవ్వుతూ బాస్ చేతిలోని గన్ లాక్కొని నకిలీ అంటూ ఊపుతున్నాడు.
బాస్ "రేయ్.. అది రియల్.... ఇటూ చూపించకు..."
హరప్రీత్ "అబ్బా.... అబ్బా.... నిజమే...."
బాస్ "రేయ్.. నీయబ్బా... అది రియల్.... "
హరప్రీత్ గాలోకి పెట్టి కాల్చాడు. అది రియల్ గన్ అని అర్ధం అయింది.
బాస్ చెవులు మూసుకొని ఒక బల్ల కింద దాక్కున్నాడు.
హరప్రీత్ "ఓడియమ్మా..... బడవా..... కాపండండయ్యా.... నన్ను.... కాపండండయ్యా.... " అనుకుంటూ అటూ ఇటూ పరిగెత్తాడు.
కొద్ది సేపటి తర్వాత.... ఇద్దరూ పక్కపక్కన కూర్చొని ఉన్నారు.
హరప్రీత్ "ఈ అమ్మాయి నాకు పడింది.... నేను ఫోన్ చేయగానే కుక్క పిల్లలా ఫోన్ ఎత్తి మాట్లాడుతుంది" అనుకుంటూ లావణ్యకి ఫోన్ చేశాడు.
లావణ్య అవతల వైపు ఫోన్ లో హరప్రీత్ నెంబర్ చూసి కావాలని ఎత్తకుండా అలానే కోపంగా చూస్తూ ఉంది.
వెళ్ళే రోజు లావణ్య, హరప్రీత్ కి ముందు రోజు నైట్ నుండి చాలా సార్లు ఫోన్ చేసింది, కాని హరప్రీత్ కనీసం గుడ్ బాయ్ చెప్పే చాన్స్ కూడా లేకుండా ఫోన్ ఎత్తలేదు. లావణ్య బాగా ఫీల్ అయి ఫోన్ ఎత్తకూడదు అనుకుంది.
హరప్రీత్, బాస్ ని నవ్వుతూ చూస్తూ "బిజీగా ఉందేమో... మళ్ళి చేస్తా.... మళ్ళి చేస్తా.... " అంటూ రీ డయల్ కొట్టాడు.
లావణ్య ఫోన్ ఎత్తలేదు.
హరప్రీత్, బాస్ సీరియస్ నెస్ చూపులు తట్టుకోలేక "ముచ్చటగా మూడో సారి" అంటూ కాల్ చేశాడు. మనసులో "నీ యమ్మా ఎత్తవే నీకు దండం పెడతా....." అని అనుకుంటూ ఉన్నాడు.
లావణ్య ఫోన్ ఎత్తింది.
హరప్రీత్, బాస్ ఇద్దరూ రిలీఫ్ గా ఫీల్ అయ్యారు.
హరప్రీత్ "హలో" అని వీలైనంత స్వీట్ గా మాట్లాడాడు.
లావణ్య "ఎవరూ..." అని చిన్నగా నవ్వుకుంది.
హరప్రీత్ "నేను హరప్రీత్ ని " అన్నాడు.
లావణ్య "హరప్రీత్ ఎవరూ..." అని నవ్వింది.
హరప్రీత్ "మీరు హనీమూన్ కి వచినపుడు గోవాలో కారులో తిప్పాను" అన్నాడు.
లావణ్యకి కోపం వచ్చి "హనీమూన్ నా బాస్ ది.... నువ్వేమి మాకు హెల్ప్ చేస్తూ కార్ లో తిప్పలేదు.... నువ్వొక క్యాబ్ డ్రైవర్ వి" అని కాల్ కట్ చేసింది.
హరప్రీత్, బాస్ ని చూస్తూ ఉంటే.... బాస్ హరప్రీత్ చెంప మీద చిన్నగా కొడుతూ "సరిగా మాట్లాడడం రాదు రా..... హా...."
హరప్రీత్ "బాస్.... బాస్.... నాకు ఒక్క రోజు టైం యివ్వు..... నేను కనుక్కుంటా...." అని ఫోన్ తీసుకొని బయటకు వెళ్లి లావణ్య ఫోన్ కి "ఐ మిస్ యు..." అని మెసేజ్ పెట్టాడు.
అయిదు నిముషాలు అయింది రిప్లై రాలేదు.
కొద్ది సేపటి తర్వాత కూడా రిప్లై రాలేదు.
కాని గ్రీన్ లైన్స్ పడడంతో చదివింది అని మాత్రం అర్ధం అయింది.
హరప్రీత్ "ఎలా ఉంది మన హైదరాబాదు"
లావణ్య "ఏమో తెలియదు మేం అక్కడ లెం"
హరప్రీత్ "అవునా ఎక్కడ ఉన్నారు...."
లావణ్య రిప్లై పెట్టలేదు.
హరపీత్ తిట్టుకుంటూ వేరే ప్రశ్న వేశాడు.
లావణ్య సమాధానం ఇస్తుంది.
హరపీత్ కి కోపం వచ్చింది కాని కళ్ళ ముందు అయిదు లక్షలు కనిపిస్తున్నాయి.
అలా ఆ రాత్రి మొత్తం ప్రేమ జంటలా వాళ్ళ మధ్య చాటింగ్ జరిగింది.