Thread Rating:
  • 2 Vote(s) - 5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నేటి బాంధవ్యాలు - 6
#15
"నేను ఇరువురికీ బంధువునేగా!.... వారిని గురించీ నాకు బాగా తెలుసు!... చూడు ప్రజా!... నేను అందరి మేలు కోరేవాడిని. నామాట విను. నీవు నేరుగా వెళ్ళి నీ చెల్లికి క్షమాపణ చెప్పు. నీ చెల్లెలు లావణ్యకు నీలాగే ఆవేశం... కోపం ఎక్కువ. ఎదుటి వారి మాటలు తనకు నచ్చకపోతే నిర్భయంగా తన నిర్ణయాన్ని చెప్పేస్తుంది. మొహమాటపడదు, భయపడదు. ఆమె మనస్సు చాలా మంచిది. ఇక హరికృష్ణ... వాడు ధర్మరాజు... వాడిని గురించి నీకు బాగా తెలుసుగా!..." అనునయంగా చెప్పాడు మాధవయ్య.
తలాడించాడు ప్రజాపతి శూన్యంలోకి చూస్తూ.
"వస్తారా... చెప్పవలసింది నీకు చెప్పాను. ఇక నీ ఇష్టం!..." మాధవయ్య లేచి వెళ్ళిపోయాడు.
ప్రజాపతి... ఆలోచనలో మునిగిపోయాడు.
* * * *
ప్రణవి... దీప్తి తల్లి. మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. తండ్రి హైకాలేజీ మాస్టారు. ప్రణవిని ఎంతో క్రమశిక్షణతో పెంచారు. ఆమెను బి. వరకు చదివించారు. ప్రణవి... బి.ఇడీ ట్రైనింగ్ కూడా పూర్తి చేసింది.
ప్రజాపతి శ్రీరామనవమి నాడు ప్రణవిని రామాలయంలో చూచాడు. ఆమె అందచందాలకు భ్రమించి... పలకరించి... మాట్లాడాలని ప్రయత్నించాడు. కానీ ప్రణవి అతనికి అవకాశాన్ని కలిగించలేదు.
బి.ఇడీ కాలేజి నుండి తిరిగి వస్తుండగా ఒకనాడు దారికాచి పలకరించాడు ప్రజాపతి. తన మనస్సులోని మాటను నిర్భయంగా చెప్పాడు. పెండ్లి చేసికొందాం అన్నాడు. "నేను మీకు అంతగా నచ్చితే... మీ అమ్మానాన్నలను వచ్చి నా తల్లిదండ్రులను కలిసి మాట్లాడమని చెప్పండి. ఇలా దారికాచే ప్రయత్నాన్ని ఇకపై చేయకండి. మాది ఎంతో పరువు ప్రతిష్టలున్న కుటుంబం. ఇంట్లో నేను పెద్ద బిడ్డను. నా తర్వాత ఒక చెల్లి, తమ్ముడు ఉన్నారు. మేము మధ్య తరగతి కుటుంబీకులం. మీ తల్లిదండ్రులు కట్నకానుకలు ఆశిస్తే.... వారు కోరిన రీతిగా ఇచ్చే స్థోమత మాకు లేదు. మీరు అడిగిన దానికి నేను అన్ని వివరాలతో జవాబు చెప్పాను. నా దారికి అడ్డు తొలగండి. ప్లీజ్!..." వేగంగా వెళ్ళిపోయింది ప్రణవి.
ఆమె మాటల తీరు... ప్రజాపతికి ఎంతగానో నచ్చింది. ఇంటికి వెళ్ళి తన నిర్ణయాన్ని తల్లి రుక్మిణికి తెలియజేశాడు. ప్రణవి తండ్రి అచ్యుతరామయ్య. రుక్మిణికి దూరపు బంధువు. భర్త కైలాసపతితో కుమారుని నిర్ణయాన్ని తెలియజేసింది.
రుక్మిణి... "పిల్లవాడు ఆశపడుతున్నాడు. పైగా వారు నాకు బంధువులు. కులగోత్రాలను ఎంచుకొన అవసరం లేదు. మీరు సరే అంటే.... వరుసకు అన్నయ్య అయిన అచ్యుతరామయ్యను పిలిపించి మనం మాట్లాడుదాము" అంది.
కైలాసపతి నిగర్వి. కోటీశ్వరుడు. ఆయన చెల్లెలు శ్యామల. గోపీనంద భార్య. వారే హరికృష్ణ తల్లిదండ్రులు... కైలాసపతి చెల్లెకి పెళ్ళిచేసిన తర్వాత తాను పెళ్ళి చేసుకొన్నాడు. వారి భార్య పేరు రుక్మిణి. వారిరువురి సంతతి... కొడుకు ప్రజాపతి, కూతురు లావణ్య. అచ్యుతరామయ్య తన భార్య రుక్మిణికి బంధువై వున్నందున... భార్యాభర్తలు ఇరువురూ కలిసి అచ్యుతరామయ్య ఇంటికి వెళ్ళి ప్రజాపతి... ప్రణవిల వివాహాన్ని గురించి ప్రస్తావించారు.
అచ్యుతరామయ్యకు రుక్మిణీ అక్క వరుసైనందున... వారిని ఎంతో గౌరవించి... "మీ నిర్ణయమే మా నిర్ణయం..." అని సవినయంగా చెప్పాడు.
మంచిరోజున నిశ్చితార్థం... మూడు వారాల తర్వాత ప్రజాపతి... ప్రణవిల వివాహాన్ని వారికి వున్నంతలో ఘనంగా జరిపించారు అచ్యుతరామయ్య. ప్రణవి, కైలాసపతి ఇంట్లో కాలు పెట్టిన వేళావిశేషం... వారు చేస్తున్న అబ్రకం వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది. విదేశ ఎగుమతి పెరిగింది. లక్ష్మీదేవి వారిని పరిపూర్ణంగా కటాక్షించింది. ప్రణవికి నోములు, వ్రతాలు, పూజలు అంటే చిన్నతనం నుంచి ఎంతో ఇష్టం. కారణం ఆమె తల్లిదండ్రులు నమ్మకాలు కలిగిన వారైనందున.
కోడలు సుగుణాలను చూచి కైలాసపతి... రుక్మిణి ఎంతగానో సంతసించారు. కానీ ఏడు సంవత్సరాలు గడిచినా ప్రణవికి సంతానం కలుగకపోవడంతో కైలాసపతి... రుక్మిణి... ప్రజాపతి ప్రశాంతతను కోల్పోయారు. తన దుస్థితికి ప్రణవి తనలో తాను ఏడ్చుకొనేది.
కైలాసపతి... వేరుశెనగ, నువ్వుల నూనె ఫ్యాక్టరీని నిర్మించారు. ప్రజాపతి ఫ్యాక్టరీల అజమాయిషీని చూచుకొనేవాడు.
హరికృష్ణ తల్లి మహాలక్ష్మి కైలాసపతి చెల్లెలు. చెల్లెలన్నా ఆమె భర్త నరసింహం అన్నా కైలాసపతికి ఎంతో ప్రేమ, గౌరవం, అభిమానం.
ప్రజాపతి కన్నా హరికృష్ణ ఐదు సంవత్సరాలుపెద్ద. నరసింహం పాలవ్యాపారి. హరి పుట్టిన వేళావిశేషం... ఆర్థిక వసతులు ఏర్పడి వారు పాల ఫ్యాక్టరీని స్థాపించారు. చుట్టు ప్రక్కనున్న ఇరవై గ్రామాల నుండి వారి ఫ్యాక్టరీకి పాలు వచ్చేవి. పెరుగు, వెన్న, నెయ్యి, పాల విక్రయంతో బాటు వాటిని చెన్నైకి కూడా సప్లై చేసేవారు.
ఎం. వరకు చదివిన హరికృష్ణ పాలఫ్యాక్టరీ వ్యవహారాలను స్వయంగా చూచుకొనేవారు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 3 users Like k3vv3's post
Like Reply


Messages In This Thread
RE: నేటి బాంధవ్యాలు - 3 - by k3vv3 - 21-10-2024, 09:09 AM



Users browsing this thread: 2 Guest(s)