10-10-2024, 07:52 PM
(10-10-2024, 06:32 PM)Ravi9kumar Wrote:
కథ చదివి కథ నాకు ఎలా అనిపించిందో అనే విషయాన్ని తెలియజేస్తూ కొన్ని విషయాలు చెప్పాను. కథ యొక్క రచయితగా మీ కోణం ఏమిటో మీరు ఎలా అనుకోని కథ రాశారో చెపుతూ బదులు ఇచ్చారు. ఈ విషయంలో కథ రచయితగా మీ అభిపాయాన్ని మీరు చెప్పిన విషయాలని నేను గౌరవిస్తాను.
ఇక నేను చెప్పిన jump cut గురించి “ఇది థ్రిల్లర్ ..... జంప్ కట్ లు సహజం ....” అని చెప్పారు. నావరకు అయితే ఏ జోనర్ అయినా ఏ కథ అయినా అది థ్రిల్లర్ అయినా కూడా సహజం అనేవి ఉండవు. ఆ విషయం పూర్తిగా కథ రాసే రచయిత ప్రకారం ఉంటుంది.
ఇంత వరకు OK. పై విధంగా నేను చెప్పిన వాటికి మీరు reply ఇచ్చారు అంటే OK.
ఆ తరువాత “ఒక ఐడియా ఇస్తాను ఇలాంటిది ఒకటి రాయండి సర్ ....!” అని మీరు చెప్పారు.
మీరు చెప్పిన దానికి సూటిగా అడుగుతున్నాను ,
ఇలా మీరు ఐడియా చెప్పడం వెనుక ఉద్దేశం ఏమిటి ? మీరు చెప్పిన ఐడియా ప్రకారం నేను కథ ఎందుకు రాయాలి? ఆ అవసరం ఏమిటి?
నాకు అర్ధం కాక అడుగుతాను , నేను కూడా ఇలాంటి ఒక కథ రాయగలను అని ప్రూవ్ చేసుకోవాలా ? కాస్త సమాదానం ఇవ్వండి సర్..
కథ చదువుతుంటే కథనంలో కంటిన్యూ మిస్ అవడం వలన అర్ధం చేసుకోవడానికి ఇబ్బంది పడ్డాను అనే విషయం మీకు చెపితే ఉపయోగపడుతుంది అనే ఉద్దేశం తో మాత్రమే కామెంట్ చేశాను. వేరే కథలు కూడా చదువుతాను ఆ కథలు నచ్చక పోతే పెద్దగా రేయాక్ట్ అవ్వను. కానీ మీరు రాసే కథలో కథ అంశం నాకు నచ్చుతుంది , కానీ కొన్ని కథల కథనం నాకు అర్ధం కావడం లేదు. అలా ఎందుకు అర్ధం కావడం లేదో ఆలోచించి నాకు దొరికిన సమాదానం మీకు చెప్పాను. నేను చెప్పింది అర్ధం చేసుకుంటే సంతోషం.
నా పేరు 3శివరాం.... ఈ వెబ్సైటు లో నాకున్న రేపుటేషన్ ఏంటో తెలుసా......!
ఐడియాలు బాగా ఇస్తారు. అని.... నేను ఇప్పటికే చిన్న చిన్న ఐడియాల పేరు మీద సింగిల్ అప్డేట్ లో చాలా కధలు రాశాను.
నేను ఇంకొకరిని ఎవరినీ ఇలా కధ రాయండి అని అడగలేదు అని మీరు అనుకోవద్దు. నేను చాలా మందిని అడిగాను.
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them