Thread Rating:
  • 41 Vote(s) - 2.44 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller ఆట - వేట (అయిపోయింది)
#60
14. చెక్ మేట్!



నా పేరు బంటి... మా ఇంట్లో నలుగురం ఉంటాం. సుజాత మా అమ్మ.... సుజాత గ్రూప్స్ కి చైర్మన్. వీడు నా అన్న కరణ్... మా అమ్మకి కంపనీలో హెల్ప్ చేస్తూ ఉంటాడు, మా అమ్మ అప్పుడప్పుడు చెబుతూ ఉంటుంది, మీ అన్నకి పని రావడం లేదు నువ్వు చదువు త్వరగా పూర్తీ చేసుకుని రారా.... అని.... ఏం చేసినా మూడు సంవత్సరాల చదువుని సంవత్సరం లో పూర్తీ చేయలేం కదా.... ఇదిగో మా ఇంట్లో నాలుగో మనిషి మా వదిన... చాలా మంచిది. అసలు మా అన్న లాంటి ముర్కుడిని భరిస్తుంది అంటే మంచిదే అవుతుంది కదా....


మూడు నెలల క్రితం... మా కుటుంబంలో ఒక పెద్ద సమస్య వచ్చింది. అదే నేను కిడ్నాప్ అయ్యాను. అందరూ కంగారు పడ్డారు, కాని నాకు చాలా భయం వేసింది.... చచ్చిపోతానేమో అనిపించింది. మా అన్న నాతో ఎంత గొడవ పడ్డా.... నేను కనపడడం లేదు అనగానే హనీమూన్ నుండి పరిగేట్టుకోని వచ్చాడు. వస్తూనే యస్ గ్రూప్ మీద యుద్ధం ప్రకటించాడు. ఒక్కొక్క షేర్ హోల్డర్ ని కూడా భయపెట్టినంత పని చేసాడు. ఒక వైపు డబ్బు, బలం, మరో వైపు హ్యాకింగ్..... దీంతో ముప్పు తిప్పలు పెట్టాడు. ఒక్కో సారి యస్ గ్రూప్ గుడిసిపోతుంది అని అనుకున్నారు. 


కాని 'యస్' గ్రూప్ చైర్మన్ సుహాసిని నన్ను వదిలిపెట్టలేదు. వదినకు కాల్ చేసి రమ్మని చెప్పింది.

(ఆ రోజు ఏమయింది అంటే....)





వాణి "కాని నేను కూడా నీ కూతురునే కదా అమ్మ....."

సుహాసిని "నన్ను క్షమించు" అంటూ గ్లాస్ కింద కొట్టింది. అది ఒక సిగ్నల్.... మనుషులను లోపలకు రమ్మని....

పది నిముషాలు గడిచినా ఎవరూ రాకపోవడంతో వైన్ బాటిల్ కింద పగల కొట్టింది.

వాణి పైకి లేచి తన హై హీల్స్ తో ఆ పగిలిన వైన్ గ్లాస్ మీద నడుస్తూ ఒక చేతిని సుహాసిని చేతికి అందించింది.

సుహాసిని మరియు వాణి ఇద్దరూ ఆ ప్రవేటు గది బయటకు రాగానే బయట అంతా ఖాళీగా ఉంది అక్కడ ఉన్న కొద్ది మంది మనుషులు కూడా స్పృహ తప్పి ఉన్నారు.

వాణి "ప్లాన్ చాలా బాగుంది.... ఎవరికీ తెలియని ప్లేస్... సర్వర్లు మరియు కస్టమర్లు అందరూ నీ మనుషులే... నన్ను కొట్టి కట్టేసి ఆ హాంకాంగ్ బ్యాచ్ కి అప్పగిస్తావు"

సుహాసిని అటూ ఇటూ టెన్షన్ గా చూస్తూ ఉంది.

వాణి "కాని అమ్మ....  నువ్వు నన్ను ఎలా మర్చి పోయావ్.... నేను నీ కూతురుని....  నీ నెక్స్ట్ జనరేషన్ ని.....  నీకే ఇన్ని తెలివి తేటలు ఉంటే.... నాకు ఎన్ని ఉండాలి చెప్పూ.... "

సుహాసిని "ఏం చేశావ్...."

వాణి "మనుషులు అందరూ నీ వాళ్ళే.... వాళ్ళు తాగిన వైన్ నేను పంపింది"

సుహాసినికి మెల్లగా స్పృహ తప్పడం తనకు అర్ధం అవుతూ ఉంది.  వాణి వైపు నవ్వుతూ చూస్తూ స్పృహ తప్పి పడిపోయింది.

వాణి "చెక్ మేట్" అని చెప్పడం విని సుహాసిని నిద్రలోకి జారుకుంది.

వాణి డ్రెస్ చేంజ్ చేసుకొని సుహాసినిని ఒక క్లాత్ బ్యాగ్ లో సర్దింది.

ఇంతలో ఒక వాన్ వచ్చింది. లోపలకు వచ్చిన వ్యక్తికీ ఆ క్లాత్ బ్యాగ్ చూపించగానే తల ఊపి తీసుకొని వెళ్ళిపోయాడు.

నిజానికి వాళ్లకు సుహాసిని వాణిని అప్పగించాలి. కాని వాణినే సుహాసినిని అప్పగించింది.





సందీప్ మరియు సుధాకర్ లు ఇంకా వాణిని చూసిన షాక్ లోనే ఉన్నారు.

ఇంతలో కొంత మంది సెక్యూరిటీ ఆఫీసర్స్ వచ్చి సుధాకర్ ని అరెస్ట్ చేస్తూ సుహాసిని మిస్సింగ్ కేస్ అని చెప్పారు. నెల రోజులుగా చాలా చోట్ల సుహాసినిని మరియు ఆమె కూతురు వాణిని చంపడం కోసం కత్తి పట్టుకొని తిరిగినట్లు సాక్షాలు దొరకడంతో వాణి, సుధాకర్ మీద కేసు పెట్టింది. (వాణి, సుహాసినిని దాచి ఉంచితే వాళ్ళ వెంట తిరిగాడు)

సందీప్ ఆలోచిస్తూ ఉండగా తన గుండెని పట్టుకొని అమ్మా అని పిలిచాడు. మెల్లగా అతని శ్వాస బలహీనపడిపోయి హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది.

సుధాకర్ "నేను కాదు.... వాణినే చంపింది... తనే హంతకురాలు..." అంటూ కేకలు పెట్టాడు. కాని ఎవరూ పట్టించుకోలేదు.

వాణి ఒక గుర్తు తెలియని హత్య చేయబడ్డ ఒక అనాధ శవం చూసి అది సుహాసిని అని చెప్పడంతో సుధాకర్ కి లైఫ్ పడింది.

కాని కోర్టు రూలింగ్ అతనికి మతి స్థిమితం తప్పింది అని చెప్పడంతో మెంటల్ హాస్పిటల్ లో జేర్చారు.

మరో వైపు సందీప్ కి సరైనా సమయంలో వైద్యం అందకపోవడంతో హార్ట్ స్ట్రోక్ తో చనిపోయాడు.



మూడు నెలలలో ఎవరూ మిగలక పోవడంతో సుహాసిని యొక్క దత్త పుత్రిక వాణి 'యస్' గ్రూప్ చైర్మన్ గా అధికారం చేతుల్లోకి తీసుకుంది. కొన్ని రోజులు తర్వాత దాన్ని సుజాత గ్రూప్స్ లో కలిపేసింది.





మా ఇంట్లో నలుగురం చాలా మంచి వాళ్ళం... జాలి హృదయం కలిగిన వాళ్ళం... కాని అదంతా మా మనుషులకు మాకు మాత్రమే.... మా శత్రువులకు మాత్రం మేం రాక్షసులమే.....

నాకు మా అన్న అంటే చాలా ఇష్టం... నేను కిడ్నాప్ అయ్యా అని తెలిశాక... మా అన్న తన అస్త్ర శాస్త్రాలు అన్ని వాడి శత్రువులతో భీకర యుద్ధం చేశాడు. కాని అది ఒక ఆట. ఎత్తు పై ఎత్తు లు వేసుకునే ఒక ఆట.

మా వదిన... సైలెంట్ గా ఒక్క సారి అలా వెళ్లి వచ్చి వాళ్ళ గోతిలో వాళ్ళే పడేలా చేసింది.... దాన్ని వేట అంటారు...

మా అన్న ఆట ఆడితే... మా వదిన వేట ఆడింది.

ఇక ఆ సమస్య తిరిగి లేవకుండా చేసింది.


కరణ్ ఆట ఆడితే.... వాణి వేట ఆడింది.
[+] 13 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: ఆట - వేట - by Babu143 - 28-09-2024, 08:30 PM
RE: ఆట - వేట - by 3sivaram - 28-09-2024, 10:16 PM
RE: ఆట - వేట - by Sindhu Ram Singh - 29-09-2024, 10:22 AM
RE: ఆట - వేట - by Iron man 0206 - 29-09-2024, 05:56 AM
RE: ఆట - వేట - by krish1973 - 29-09-2024, 06:12 AM
RE: ఆట - వేట - by BR0304 - 29-09-2024, 09:13 AM
RE: ఆట - వేట - by Babu143 - 29-09-2024, 07:54 PM
RE: ఆట - వేట - by sri7869 - 29-09-2024, 10:53 PM
RE: ఆట - వేట - by 3sivaram - 30-09-2024, 02:28 PM
RE: ఆట - వేట - by hijames - 30-09-2024, 04:24 PM
RE: ఆట - వేట - by hijames - 30-09-2024, 04:25 PM
RE: ఆట - వేట - by Iron man 0206 - 30-09-2024, 05:47 PM
RE: ఆట - వేట - by appalapradeep - 30-09-2024, 06:18 PM
RE: ఆట - వేట - by 3sivaram - 30-09-2024, 06:53 PM
RE: ఆట - వేట - by Iron man 0206 - 30-09-2024, 09:27 PM
RE: ఆట - వేట - by BR0304 - 30-09-2024, 10:33 PM
RE: ఆట - వేట - by sri7869 - 01-10-2024, 12:31 AM
RE: ఆట - వేట - by hijames - 01-10-2024, 02:37 AM
RE: ఆట - వేట - by Uday - 01-10-2024, 12:03 PM
RE: ఆట - వేట - by 3sivaram - 01-10-2024, 04:29 PM
RE: ఆట - వేట - by appalapradeep - 01-10-2024, 02:43 PM
RE: ఆట - వేట - by Fantassy Master - 01-10-2024, 04:24 PM
RE: ఆట - వేట - by Sushma2000 - 02-10-2024, 04:29 PM
RE: ఆట - వేట - by 3sivaram - 02-10-2024, 10:23 PM
RE: ఆట - వేట - by Iron man 0206 - 03-10-2024, 06:23 AM
RE: ఆట - వేట - by sri7869 - 03-10-2024, 10:51 AM
RE: ఆట - వేట - by Uday - 03-10-2024, 11:53 AM
RE: ఆట - వేట - by BR0304 - 03-10-2024, 12:20 PM
RE: ఆట - వేట - by Sushma2000 - 03-10-2024, 04:25 PM
RE: ఆట - వేట - by 3sivaram - 04-10-2024, 08:49 PM
RE: ఆట - వేట - by sri7869 - 05-10-2024, 02:35 AM
RE: ఆట - వేట - by Iron man 0206 - 05-10-2024, 07:06 AM
RE: ఆట - వేట - by Uday - 05-10-2024, 04:21 PM
RE: ఆట - వేట - by 3sivaram - 05-10-2024, 07:51 PM
RE: ఆట - వేట - by 3sivaram - 05-10-2024, 08:26 PM
RE: ఆట - వేట - by Uday - 05-10-2024, 08:52 PM
RE: ఆట - వేట - by Nightrider@ - 05-10-2024, 09:38 PM
RE: ఆట - వేట - by Babu143 - 07-10-2024, 10:38 AM
RE: ఆట - వేట - by sri7869 - 07-10-2024, 10:43 AM
RE: ఆట - వేట - by 3sivaram - 07-10-2024, 09:06 PM
RE: ఆట - వేట - by Iron man 0206 - 07-10-2024, 10:58 PM
RE: ఆట - వేట - by Sushma2000 - 07-10-2024, 11:12 PM
RE: ఆట - వేట - by 3sivaram - 08-10-2024, 02:14 PM
RE: ఆట - వేట - by Uday - 08-10-2024, 02:52 PM
RE: ఆట - వేట - by Iron man 0206 - 08-10-2024, 03:22 PM
RE: ఆట - వేట - by Sushma2000 - 08-10-2024, 03:37 PM
RE: ఆట - వేట - by Babu143 - 08-10-2024, 04:47 PM
RE: ఆట - వేట - by 3sivaram - 08-10-2024, 06:09 PM
RE: ఆట - వేట - by Iron man 0206 - 08-10-2024, 06:59 PM
RE: ఆట - వేట - by 3sivaram - 08-10-2024, 08:05 PM
RE: ఆట - వేట - by Babu143 - 08-10-2024, 08:10 PM
RE: ఆట - వేట - by Uday - 08-10-2024, 08:36 PM
RE: ఆట - వేట - by 3sivaram - 08-10-2024, 08:53 PM
RE: ఆట - వేట - by 3sivaram - 08-10-2024, 09:55 PM
RE: ఆట - వేట - by 3sivaram - 08-10-2024, 09:56 PM
RE: ఆట - వేట - by TheCaptain1983 - 10-10-2024, 07:41 AM
RE: ఆట - వేట - by Sushma2000 - 08-10-2024, 10:08 PM
RE: ఆట - వేట - by 3sivaram - 08-10-2024, 10:15 PM
ఆట - వేట - by 3sivaram - 28-09-2024, 06:04 PM
RE: ఆట - వేట - by TheCaptain1983 - 28-09-2024, 08:12 PM
RE: ఆట - వేట - by maheshvijay - 28-09-2024, 08:18 PM
RE: ఆట - వేట - by Sindhu Ram Singh - 28-09-2024, 08:23 PM



Users browsing this thread: 10 Guest(s)