08-10-2024, 09:55 PM
13. మూడు నెలల తర్వాత
మూడు నెలల తర్వాత....
ఆపరేషన్ చేయించుకుని సందీప్, సుధాకర్ మరియు సందీప్ గర్ల్ ఫ్రెండ్ షిప్ దిగారు. అక్కడ నుండి డైరక్ట్ గా హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేయించుకున్నారు. డాక్టర్ చెక్ చేసి మీకు ఆపరేషన్ చేసిన వాళ్ళు చాలా ప్రొఫెషనల్ లాగా ఉన్నారు.
సుధాకర్ "అవునూ డాక్టర్...."
డాక్టర్ "ఆయన పేరు ఏంటి?"
సుధాకర్ "డాక్టర్ లీ.... హాంకాంగ్...."
డాక్టర్ నుదురు ముడిచి "ఆయన.... బ్లాక్ మార్కేట్ కదా...." అని వాళ్ళను పైకి కిందకు చూసి "మా అసిస్టెంట్ లు మిమ్మల్ని చూసుకుంటారు... నేను రౌండ్స్ కి వెళ్తాను" అని వెళ్ళాడు.
అసిస్టెంట్ "ఏమయింది డాక్టర్..."
డాక్టర్ "వీళ్లు ఎవరినో చంపి వాళ్ళ బాడీ పార్ట్స్ పెట్టుకున్నారు"
అసిస్టెంట్ "వాట్...."
డాక్టర్ "పెద్దగా అరవకు... అదంతా హాంకాంగ్ బ్లాక్ మార్కెట్ లో జరుగుతుంది"
సందీప్ తన గుండె మీద చేయి వేసుకొని "నేను ఎప్పుడూ అక్కని తిట్టుకుంటూ ఉండే వాడిని... కానీ ఇప్పుడు అక్కని చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది నాన్నా..."
సుధాకర్ యాపిల్ తింటూ "వాళ్ళ నాన్న చచ్చి నాకు వాడి పెళ్ళాన్ని, ఇంత పెద్ద కంపనీని ఇచ్చాడు.... ఇప్పుడు వాడి కూతురు చచ్చి మనకు ప్రాణాలు యిచ్చింది. ఎంతైనా మనం వాళ్ళ ఫోటోలను మన దేవుడు గుడిలో పెట్టుకోవాలి రా..."
ముగ్గురు నవ్వుకున్నారు.
సందీప్ గర్ల్ ఫ్రెండ్ "మనం పెళ్లి ఎపుడూ చేసుకుందాం...."
సందీప్ "త్వరలో.... ఇంకో మూడు నెలలు అయ్యాక ముహూర్తాలు పెట్టుకుందాం"
ఇద్దరూ ఒకరిలో ఒకరు మమేకం అయిపోయారు.
సందీప్ "అవునూ డాడీ..... మమ్మీ ఎక్కడ...."
సుధాకర్ "మీ అమ్మ..... నిజం తెలిశాక బాగా బాధపడింది... ఆ రోజు ఆ హాంకాంగ్ బ్యాచ్ కి మీ అక్కని ఇష్టం లేకుండానే అప్పగించాక.... ఎదో ఊరు వెళ్ళింది... వచ్చాక కలుస్తుంది తను బాధ పడుతుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు...."
సందీప్ "సరే డాడీ..."
నర్సు "మీ కోసం ఒక విజిటర్ వచ్చారు"
సందీప్ "లేడీ ఆ... జంట్ ఆ......"
నర్సు "లేడీ....."
సందీప్ "అమ్మ వచ్చింది... అమ్మ వచ్చింది..." అంటూ సడన్ గా వెళ్లి వీల్ చైర్ లో కూర్చొని యురిన్ బ్యాగ్ పట్టుకొని ఉన్నాడు. ముగ్గురు మూడు వీల్ చైర్ లలో కూర్చొని ఉన్నారు.
రెడ్ సారీ కట్టుకొని ఒక వ్యక్తీ ఫ్లవర్ బోకే పట్టుకొని నడుచుకుంటూ వచ్చి సందీప్ చేతికి యిచ్చింది.
సందీప్ ఆ ఫ్లవర్ బోకే అందుకున్నాక ఆ బోకే ఇచ్చిన వ్యక్తిని చూడగానే..... గుండె ఆగినంత పని అయింది.
అది వాణి....
సందీప్ "దయ్యం..... దయ్యం..... " అని అరుస్తూ వీల్ చైర్ నుండి లేచి దూరం జరిగాడు.
వాణి ముందుకు నడిచి సందీప్ చేయి పట్టుకోవడంతో వాణి బ్రతికే ఉంది అని కన్ఫర్మ్ చేసుకొని దయ్యం కాదు అని కన్ఫర్మ్ చేసుకున్నాడు.
వాణి వాళ్లకు రికవర్ అవ్వమని చెప్పి వెళ్ళిపోయింది.
డోర్ దగ్గర తన కోసం ఎదురు చూస్తున్న బంటి డోర్ తెరిచాడు.