08-10-2024, 06:09 PM
(This post was last modified: 08-10-2024, 06:42 PM by 3sivaram. Edited 2 times in total. Edited 2 times in total.)
10. అపర్ణ
సుహాసిని మరియు వాణి మాట్లాడుకోవడం:
గదిలో వాణి చుట్టూ చూస్తూ ఉంటే, ఇంటి బయట బంటి సుధాకర్ మరియు సందీప్ లను ఇంట్లికి రానివ్వకుండా కూర్చున్నాడు.
సుహాసిని "అమ్మా..... వాణి... పెళ్లి చేసుకున్నావంట... నాకు చెప్పాలని అనిపించలేదారా!"
వాణి ఏం మాట్లాడకుండా చూస్తూ ఉంది.
సుహాసిని "ఇదిగో రా! నీ కోసం అని కేకు చేయించాను... స్పెషల్ కేకు... నీ పుట్టిన రోజుకి నువ్వు కోమాలో ఉన్నావు" అంటూ దొంగ కన్నీరు కార్చింది.
వాణి ఆ చాకు తీసుకొని ఆ కేకు కట్ చేయకుండా... "నాకు బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవాలని లేదు అమ్మా...."
సుహాసిని, వాణి గడ్డం పట్టుకొని "ఎందుకు రా!" అని అడిగింది.
వాణి "పుట్టిన రోజు అంటే.... అమ్మలు నవ మాసాలు కష్ట పడి మోసి... చాలా నొప్పులు భరించి నన్ను కన్న రోజు... నొప్పి ఎక్కువ అనిపించి నన్ను ఏ కాలవ లోనో వదిలేసింది" అంది.
వాణి మాటలకు, సుహాసినికి కన్న పేగు ఒక్క సారి కదిలినట్టు అనిపించింది. ఇన్నాళ్ళు వాణిని ఒక అవసరం కోసం పెంచుతున్నా వాణి తన సొంత కూతురు, ఎన్నో సార్లు తన కూతురు అందం చూసి తన పోలికే అనుకునేది. తెలివితేటలు, హుందా తనం... అన్ని తనని దించినట్టు అనిపించేది కాని విధి అనుకూలించక వాణిని ద్వేషించాల్సి వస్తుంది.
వాణి "నన్ను ఏ కుక్కో, పందో కొరికేసి తినేసి ఉంటుంది అనుకుంటుంది కదా నా కన్న తల్లి..." అంది.
సుహాసిని మొహం అవతలకు తిప్పెసుకుంది.
వాణి "న్యూస్ పేపర్ లో చదువుతూ ఉంటాం కదా.... ఒక కుక్క ఒక పసికందుని చంపి తినేయడం.... లేదా శరీరభాగాలు తినేయడం చూస్తూ ఉంటాం కదా... అప్పుడు నా కన్న తల్లి సంతోషిస్తూ ఉంటుంది కదా... దీని కోసం ఇన్ని నొప్పులు పడ్డాను తగిన శాస్తి జరిగింది అనుకుని ఉండి ఉంటుంది కదా..." అంటూ సుహాసిని దగ్గరకు వెళ్లి నిలబడింది.
సుహాసిని మొహం అవతలకు తిప్పెసుకుంది. ఆమె కళ్ళలో కన్నీరు చేమ్మలా చేరి మాయమయిపోయింది.
వాణి న్యూస్ పేపర్ ఓపెన్ చేసి ఒక పసికందు-కుక్క కధనం చదివింది. సుహాసిని భరించలేక వాణి చేతి నుండి ఫోన్ లాక్కొని విసిరేసింది.
వాణి నవ్వుతూ ఉంటే, సుహాసిని ఉండబట్టలేక చెంప దెబ్బ కొడుతుంది. అయినా వాణి ఇంకా నవ్వుతూ ఉండే సరికి సుహాసిని ఇంకో సారి ఇంకో సారి చొప్పున కొడుతూనే ఉంది.
వాణి "నేను DNA టెస్ట్ చేయించాను అమ్మా.... చాలా నిజాలు కనుక్కున్నాను"
ఆ మాట వినగానే పిచ్చి దానిలా వాణిని కొడుతున్న సుహాసిని చేతులు ఆగిపోయాయి.
సుహాసిని తత్తర పడుతూ "ఎ.... ఎ.... ఎ.... ఏం కనుక్కున్నావ్?"
వాణి "అపర్ణ..."
సుహాసిని పళ్ళు నూరుకొని "అయితే మీ నాన్న సంగతి కూడా తెలుసుకున్నావ్ అన్న మాట..."
వాణి "హ్మ్మ్.... అవునూ..."
సుహాసిని "అయితే అన్ని తెలిసే వచ్చావ్ అన్న మాట...."
వాణి "హ్మ్మ్...."
సుహాసిని "అయితే ఇంకొకటి చెబుతాను విను.... మీ నాన్నని నేను చంపేశాను... ఆ ఇన్సురెన్స్ డబ్బు తోనే ఈ కంపనీ పెట్టాను.... నిన్ను చూస్తే వాడే గుర్తు వచ్చే వాడు... అందుకే... అందుకే.... నిన్ను టార్చర్ చేస్తూ సంతోషించేదాన్ని"
వాణి "మిస్టర్ గురు నాథ్ చేసిన తప్పు ఏంటి?"
సుహాసిని "హా!" అని వెక్కిరింపుగా నవ్వి.... "నీకు పెళ్లి అయింది కదా... నీకు కూడా తెలుస్తుంది... నీ మొగుడు కుటుంబం కోసం నువ్వు బిడ్డని మోస్తూ ఉంటే, వాడు వేరే దాన్ని... ఛీ.... "
వాణి "చెప్పూ.... వేరే దాన్ని.... అదే అపర్ణని...."
సుహాసిని కన్ను మూసి తెరిచి ఆవేశంగా శ్వాస పీల్చి వదులుతూ తన కోపాన్ని వ్యక్త పరుస్తూ "ఛీ అలాంటి ఆడదాన్ని..." అని ఆగిపోయింది.
వాణి "మిస్టర్ గురునాథ్ కి అపర్ణ కి అఫైర్ ఉందని నీకు ఎవరు చెప్పారు?"
సుహాసిని "వాట్? ఇదేం కొత్త నాటకం...."
వాణి "నీకు ఎలా తెలుసు..."
సుహాసిని తల దించుకొని "సుధాక...." అని "నాకు గుర్తు లేదు" అని చెప్పింది.
వాణి చూస్తూ ఉండే సరికి సుహాసిని "ఇప్పుడు నువ్వేం చెప్పదలుచుకున్నావ్.... మీ నాన్న శ్రీ రామచంద్రుడు అంటావా!"
వాణి "అవునూ... కాని నువ్వు సీతా దేవివి కాదు"
సుహాసిని నుదురు చిట్లించి వాణిని చూస్తూ ఉంది.
వాణి తన ముందుకు ఒక వీడియో పెట్టింది.
అందులో ఒక ముసలమ్మ తెల్ల జుట్టుతో కనిపిస్తుంది. అది అపర్ణ....
అపర్ణ "వినపడుతుందా.... "
వాణి "హ్మ్మ్.... చెప్పండి..."
అపర్ణ "హుమ్మ్ సరే..... హలో సుహాసిని... నేను అపర్ణని గుర్తు పెట్టావా.... అవతలి వాళ్లకు వినపడుతుందా.... ఊ... ఆ.... అని అనరే... "
వాణి "అన్నారు.... మీకే వినపడలేదు..."
అపర్ణ "బాగున్నావా.... సుహాసిని... మన స్నేహితుల్లో ఇప్పటికే అయిదుగురు చనిపోయారు... నేను కూడా పోతా అని చెప్పారు ఈ తెల్ల బట్టలు వేసుకున్న డాక్టర్లు.... అయినా నాకు కూడా బ్రతకాలని లేదు లే...."
వాణి "..."
ఆపర్ణ "మరే... చచ్చిపోయే ముందు చేసిన పాపాలు అన్ని ఒప్పుకొని చనిపోతే.. ఆ దేవుడి చెంతకి చేరుకుంటాము అంట.... అందుకే నిన్ను కలవాలని కబురు చేశాను..... వినపడుతుందా!"
వాణి "వినపడుతుంది చెప్పండి...."
అపర్ణ "ఆ రోజు గురునాథ్ అన్నయ్య తప్పేం లేదు..... సుధాకర్ నాకు డబ్బు రాకుండా చేసి నన్ను బెదిరించి నాకు గురునాథ్ అన్నయ్యకి అక్రమ సంబంధం ఉందని చూపించాడు... నిజానికి గురునాథ్ అన్నయ్య నీకు, నీకు పుట్టబోయే బిడ్డ కోసం చాలా కష్ట పడ్డాడు" అని ఆగిపోయింది.
వాణి "అపర్ణ గారు... అపర్ణ గారు... అపర్ణ గారు... మాట్లాడండి..."
అపర్ణ "ఏం మాట్లాడాలి?.... హ్మ్మ్ అదీ...."
వాణి "..."
అపర్ణ "నేను ప్రాణాలతో ఉన్నా అని సుధాకర్ నన్ను నీళ్ళలో తోసేశాడు.. ఇదిగో నన్ను వీళ్లు పట్టుకొని వచ్చి నన్ను మనిషిని చేశారు" అంటూ నవ్వింది.
వాణి "మాట్లాడు"
అపర్ణ "ఇనేం మాట్లాడాలి...."
వాణి "ఎదో ఒకటి మాట్లాడు"
అపర్ణ "హా..... సుహాసిని నేను చనిపోతే రా..... నీ కోసం వేట మాసం తెప్పించమని చెబుతా... నా పెద్దోడికి.... "
వాణి "ఎదో ఒకటి మాట్లాడు... ఇది వదిలేసెయ్..."
అపర్ణ "అయినా నేను చనిపోయినపుడు నువ్వు వస్తేనే కదా.... నువ్వు చనిపోయినపుడు నేను వచ్చేది" అని ఇంకా ఎదో పిచ్చిగా మాట్లాడడంతో వీడియో ఫీడ్ కట్ అయింది.
వాణి "నువ్వు చెప్పిన అఫైర్ రోజుల్లో మిస్టర్ గురునాథ్ ఊళ్ళో లేరు... అందుకోసం ప్రూఫ్ గా తన ఆఫీస్ ట్రిప్ సాక్షాలు మరియు అతని స్నేహితుల అఫిడవిట్ లు"
వాణి "అపర్ణని నీళ్ళలో తోసేసినపుడు అనుకోకుండా ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్ డీటెయిల్స్ మరియు అతను తీసిన ఫోటో"
వాణి "ఇదిగో ఇది.... మిస్టర్ గురునాథ్ గారి పోస్ట్ మార్టం రిపోర్ట్.... నువ్వు అతన్ని కొండ మీద నుండి తోసేసాక.... అడవి కుక్కలు మరియు కొన్ని అడవి జంతువులూ ఆయన్ని కొరికి చంపాయి"
వాణి "తను చేసిన తప్పు.... నిన్ను పెళ్లి చేసుకోవడం.... నిన్ను ప్రేమించడం.... "
వాణి "నేను చేసిన తప్పు.... నీకు పుట్టడం.... అంతే కదా..."
వాణి "నాన్న ని అయినా అడవి కుక్కలు కొరికి చంపాయి... నన్ను మా అమ్మ చంపుతుంది" అంటూ ఆ కేకు తీసుకొని నోట్లో పెట్టుకోబోయింది.
సుహాసిని పరిగెత్తుకోచ్చి వాణి నోటి నుండి కేకు లాక్కొని విసిరేసి, పెద్దగా "నో..." అని అరుస్తూ పెద్దగా ఏడుస్తూ కింద పడి తల అటూ ఇటూ ఊపుతూ ఏడుస్తూ ఉంది.
వాణి(కరణ్) మరియు బంటి బయటకు వెళ్ళిపోయారు.
సారీ ఇది ఎక్స్ట్రా ఎపిసోడ్..... ఇంకా రెండూ ఎపిసోడ్ మాత్రమే...