08-10-2024, 02:14 PM
(This post was last modified: 08-10-2024, 02:16 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
9. గోరంత.... కొండంత....
భగభగ మండుతున్న ఎండలో నల్లటి తారు రోడ్ మీద బ్లాక్ కలర్ హెల్మెట్ పెట్టుకొని బ్లాక్ కలర్ బైక్ వేగంగా దూసుకొని వెళ్తుంది. రోడ్ పక్కన నాటిన చెట్లు, బైక్ వాటి పక్కనే వెళ్తూ ఉండడంతో ఆ గాలోకి వేగంగా కదులుతూ ఉన్నాయి.
బంటి మనసులో ఒకటే లక్ష్యం, వేగంగా వెళ్లి తన వదిన వాణిని ఆపాలి.
చూస్తూ ఉండగానే అతని బైక్, కొంచెం దూరంలో కారుని గుర్తించాడు.
బంటి స్పీడ్ గా కారుని దాటేసి కొంచెం దూరంలో కారుకు అడ్డంగా ఆపాడు.
డ్రైవింగ్ సీట్ లో ఉన్న వాణి స్పీడ్ గా కారుని పోనిస్తూ సడన్ గా తన ముందు ఉన్న బంటిని చూడలేదు.
స్పీడ్ గా వచ్చి ఫాస్ట్ గా బ్రేక్ వేయడంతో రోడ్ మీద క్రీక్ మంటూ శబ్దం చేస్తూ గీత పడుతూ కారు ఆగింది.
బంటి ఆఖరి నిముషంలో చెవులకు చేతులు అడ్డం పెట్టుకొని "ఆ!" అని పెద్దగా అరిచాడు.
కారు ఓపెన్ చేసుకుని బాటు కాళ్ళతో వాణి కారు దిగి బంటి ముందుకు వచ్చి కోపంగా చూస్తూ "ఏరా.... ఒళ్ళు బలిసిందా... ఎందుకు ఇక్కడకు వచ్చి బైక్ ఆపావు..." అంటూ తిడుతూ ఉన్నాడు.
బంటి చెవులకు తన చేతులు అడ్డం పెట్టుకొని వాణి తిడుతున్నా తిట్లు తింటూ ఒక్క సారిగా ఎదో అర్ధం అయిన వాడిలా, వాణిని చూసి "అన్నా..." అని పెద్దగా అరిచాడు.
వాణి, బంటిని విసుగ్గా చూస్తూ ఉంది.
వాణి మరియు కరణ్ ఇద్దరూ తమ ఆత్మలు ఎక్సచేంజ్ చేసుకున్నారు.
బంటి "అన్నా, ఆ రోజు వాళ్ళ దగ్గర ఒక సీక్రెట్ కేమెరా పెట్టాను... అందులో..."
వాణి "తెలుసు...."
బంటి "తెలుసా... ఎలా...."
వాణి చిన్నగా నవ్వి "నీ ఫోన్ హ్యాక్ చేశాను.."
బంటి హమ్మయ్యా అనుకోని మళ్ళి కోపంగా చూస్తూ కొట్టాలని అనుకోని మళ్ళి అది వదిన బాడీ కావడంతో ఏం చేయలేక పిడికిలి బిగించి నోటితో కొరుక్కుంటూ ఉన్నాడు.
ఇంతలోనే అనుమానం వచ్చి "మనం ఎక్కడకు వెళ్తున్నాం"
వాణి "ఇంటికి..." అని నవ్వుతూ బంటి మొహం చూసి "సుహాసిని దేవి ఇంటికి" అన్నాడు.
బంటి కోపం ఇక ఆపుకోలేక "నీకు అసలు బుద్ది ఉందా! ఇంత జరిగాక కూడానా... అసలు ఆ సుహాసినిని మనం కాపాడడం కోసం ఎన్ని తిప్పలు పడ్డాం.... కాని తను ప్రతి సారి ఆ సుధాకర్ కి ఫోన్ చేసి ఛీ... మనల్ని చస్తాం ఇప్పుడు వెళ్తే..."
వాణి "వాళ్ళు ముగ్గురు తోడూ దొంగలు అని నాకు ఎప్పటి నుండో తెలుసు...."
బంటి "వాట్...." అని నోరు తెరిచాడు.
వాణి, బంటిని చూసి నవ్వుతూ "ఒరేయ్ తమ్ముడు.... నీకు తెలిసింది గోరు అంత... తెలియంది కొండంత...."
బంటి ఆశ్చర్యంగా వాణిని చూస్తూ ఉంటే, వాణి లో ఉన్న కరణ్ నవ్వుకుంటూ ఉన్నాడు.
ఇంటిలో : సుహాసిని ఎదురుగా కూర్చున్న వాణి చుట్టూ చూస్తూ ఉంది.
ఇంటి బయట : సుధాకర్ మరియు సందీప్ ఇద్దరూ బంటిని చూస్తూ పళ్ళు నూరుకుంటూ ఉన్నారు. పేరుకు బంటినే అయినా తేడా వస్తే ఇద్దరినీ అక్కడే పాతి పెట్టేలా ఉన్నాడు. సందీప్ ఉడుకురక్తం తో ముందుకు అడుగు వేస్తె....
బంటి ఆవలిస్తూ.... ఒళ్ళు విరుస్తూ ఉన్నపుడు అతని టీ షర్ట్ నుండి కనపడుతున్న అతని బైజిప్స్ చూస్తూ సందీప్ వెనక్కి అడుగు వేశాడు.
లోపల నుండి పెద్దగా సుహాసిని గొంతు "నో...." అని వినిపించడంతో ముగ్గురు వేగంగా ఇంట్లోకి నడిచారు.
బంటి వేగంగా ఇంట్లోకి వచ్చి వాణిని చూడగా, వాణి సోఫాలో కూర్చొని ఉంది.
సుహాసిని కింద కూర్చొని వాణి ఇచ్చిన కాగితాలు చూస్తూ ఏడుస్తూ మొహానికి హత్తుకొని ఉంది.
సుధాకర్ మరియు సందీప్ ఇద్దరూ ముందుకు అడుగు వేయబోయి ఆగిపోయారు.
వాణి పైకి లేచి బంటిని చూసి "వెళ్దాం పద...." అని బయటకు నడిచారు.
ఈ సారి బంటి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే, వాణి కళ్ళు మూసుకొని ఉంది.
బంటి "అసలేం జరిగింది"
వాణి కళ్ళు తెరిచి "నాకు అర్ధం కావడం లేదు రా.... ఎలా మొదలు పెట్టాలో.... ఎటూ నుండి మొదలు పెట్టాలో.... ఎలా చెబితే మీ వదిన తక్కువ బాధ పడుతుందో...."
బంటి "నిజం దాస్తే మాత్రం ఇంకా ఎక్కువ బాధ పడుతుంది... పైగా నువ్వు ఇప్పుడు వదిన బాడీలో ఉన్నావ్" అన్నాడు.
వాణి, బంటిని చూస్తూ ఉండగా... ఎదో ఐడియా వచ్చి.... "ఇంటికి పదా... ఇవ్వాళా మొత్తం చెప్పేస్తాను"
బంటి "అది సరే.... సుహాసినికి ఏం చెప్పావ్.... అలా పడిపోయింది"
వాణి "వాళ్ళ ఆట ముగిసింది అంతే!"
కరణ్ తిరిగి వచ్చాక... కరణ్ మరియు వాణి ఇద్దరూ తిరిగి సోల్స్ ఎక్సచెంజ్ చేసుకున్నారు.
వాణి "ఏమయింది అండి.... మాట్లాడండి"
సుజాత కూడా కరణ్ ని చూస్తూ "ఏమయింది రా!" అని అడుగుతూ ఉంది.
కరణ్ తన చేతికి వాణి ఫ్యామిలీ యొక్క DNA రిపోర్ట్స్ చూపించాడు.
అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు.
కరణ్ "నా DNAని నా DNAతో మ్యాచ్ చేస్తే.... 100%" అని వస్తుంది.
అందరూ కరణ్ ని చూస్తూ ఉన్నారు.
కరణ్ "నా DNAని పేరెంట్స్ DNAతో మ్యాచ్ చేస్తే.... 99.99999%" అని వస్తుంది.
వాణి మరియు సుహాసిని ల DNA టెస్టింగ్ రిపోర్ట్ చూపించాడు. అక్కడ అలానే ఉంది.
వాణి "సుహాసిని... మా అమ్మ..."
కరణ్ "నా DNAని నా పేరెంట్ యొక్క బ్రదర్ లేదా సిస్టర్ తో మ్యాచ్ చేస్తే..... 99.9998" అని వస్తుంది.
వాణి మరియు సుధాకర్ ల DNA టెస్టింగ్ రిపోర్ట్ చూపించాడు
వాణి "సుధాకర్ ...." అంటూ ఆశ్చర్యంగా చూస్తూ "మా నాన్న కాదా" అని అడిగింది.
కరణ్ "మీ అమ్మ సుమారు ముప్పై సంవత్సరాల క్రితం.... బిజినెస్ ని స్టార్ట్ చేసింది. దానికి పెట్టిన పెట్టుబడి ఆమె మొదటి భర్త మిస్టర్ గురు నాథ్ గారి ఇన్సురెన్స్ మనీ...."
వాణి "అంటే...." అంటూ కళ్ళ నీళ్ళతో చూస్తూ అడిగింది.
కరణ్ "అవునూ.... ఆయనే మీ నాన్నా..."
వాణి "మా నాన్నకి ఏమయింది?" అంటూ కరణ్ ఇచ్చిన అప్పటి ఇన్సురెన్స్ రిలీజ్ ఫైల్ చూస్తూ ఉంది.
కరణ్ "మిస్టర్ గురు నాథ్.... కొండ మీద నుండి జారీ పడి చనిపోయినట్టు ఉంది.... కాని నిజం ఏమిటి అంటే.... మీ అమ్మ మీ నాన్నని తోసేసింది.... ఆ డబ్బు కోసం నిన్ను కన్నది... ఆ తర్వాత ఆమె లవర్.... సుధాకర్ ని పెళ్లి చేసుకోవడం కోసం నిన్నూ నిర్దాక్షణ్యంగా అనాధశరణాలయంలో వదిలి పెట్టారు"
వాణి ఎమోషనల్ గా గురు నాథ్ ఫోటో చూస్తూ కన్నీరు కార్చింది.
కరణ్ "మీ అమ్మ నిన్ను ఎప్పుడూ ప్రేమించలేదు.... వాళ్ళు ఎప్పుడూ నిన్ను ఫ్యామిలీ అనుకోలేదు.... ఎప్పుడూ నిన్ను ఒక శత్రువుగానే భావించింది"
వాణి వెక్కిళ్ళు పెట్టి ఏడవడం మొదలు పెట్టింది.
ఇంకా రెండూ ఎపిసోడ్స్ మాత్రమే.....