07-10-2024, 09:06 PM
8. పెళ్లి వారమండి!
వాణి "బంటి... మా అమ్మని, మా నాన్న మరియు తమ్ముడు నుండి కాపాడుతున్నావ్ కదా...."
బంటి ఏం చెప్పాలో అర్ధం కాక సరే అన్నట్టు తల ఊపాడు.
వాణి సంతోషంగా నవ్వింది.
బంటి:
వాణి వదిన తన తల్లి సుహాసిని బాద్యత నాకు అప్పగించి, తను మరియు అన్నయ్య ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఇద్దరూ రొమాన్సు చేసుకుంటూ అమ్మకు నాకు తెగ దొరికేశారు. ఇక మా అమ్మ తప్పదని ఇద్దరినీ కూర్చోబెట్టి పెళ్లి చేస్తే కాని మీ తిక్క కుదరదు అని చెప్పి ఇద్దరిని గుడికి తీసుకొని వెళ్లి అక్కడకక్కడే పెళ్లి చేసేసింది.
అన్నకు పెళ్లి జరుగుతుంది అందులోనూ సర్ప్రైజ్ పెళ్లి జరుగుతుంది అంటే ఆ తమ్ముడు ఎంత కష్టపడాలో అంత కంటే ఎక్కువ కష్ట పడ్డాను. పని చేయాలో కాని పని చేసినట్టు కనపడకూడదు. చాలా కష్టపడ్డాక మా అన్న గాడు నాకు కాకుండా మా అమ్మకి థాంక్స్ చెప్పాడు. మా వాణి వదిన నయం... "థాంక్స్" చెప్పింది. అబ్బా.... పోయిన సారి వీడు మెమరీ లాస్ అయినపుడు నేను అల్లరి చేస్తా అని చెప్పలేదంట. ఈ సారి కనక దొరికేతేనా.... నువ్వు కుక్కవి రా అని చెప్పి డాగ్ హౌస్ లో పడుకోబెడతా... అలాగే కుక్కలా అరిపిస్తా.... నా ఆలోచనలలో నేను ఉండి నవ్వుకుంటూ ఉంటే, వాణి వదిన నన్ను చూసి నా భుజం మీద చేయి వేసి, "రా... బంటి..." అని తీసుకొని వెళ్లి నాకు ఒక బైక్ చూపించింది.
అది కొత్త బైక్...
కరణ్:
వాహ్... ఈ పొట్టి నయాలు... అందరికి నచ్చేస్తాడు. మా నాన్న బ్రతికి ఉన్నప్పుడు, ఆ తర్వాత మా అమ్మ కూడా అందరూ వాడికి సపోర్ట్ చేసే వాళ్ళే. మా అమ్మ అయితే ఒకటే మాట "నువ్వు ఎప్పుడూ ఫస్ట్ వస్తావు.... రా.... మీ తమ్ముడు పోయిన సారి కంటే మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు... నా కొడుక్కి ఎన్ని తెలివితేటలో" అంటూ సంబరపడుతూ వెళ్లి వాడిని ముద్దు పెట్టుకుంటుంది.
ఇంటికి నేను తీసుకొని వచ్చే పెద్ద కప్ కూడా చివర పెట్టి మధ్యలో వాడు తీసుకొని వచ్చే చిన్న కప్ పెట్టేవాళ్ళు. ఒక్కో సారి నాకు కోపం వచ్చేసేది, తాతయ్య దగ్గరకు వెళ్లి రెండూ రోజులు కనపడకుండా ఉండేవాడిని. ఈ దొంగ నా కొడుకు చుట్టుపక్కల అందరికి నేను వాడి దగ్గర దొంగ తనం చేశా అని దొరికితే సిగ్గు పడి పారి పోయా అని చెప్పేవాడు. ఒక రోజు అందరికి చెబుతూ నాకు కనపడ్డాడు, నన్ను చూసి "అన్నా!" అని పరిగెత్తుకుంటూ అమ్మ వెనక దాక్కున్నాడు. నేను కోపంగా వెంట పడితే.... మా నాన్న నన్ను ఆపి చిన్నపిల్లాడు రా! క్షమించు అనే వాళ్ళు.
కాని అదృష్టం ఏంటి అంటే అందరికి వీడు చెప్పేది అబద్దాలు అని అందరికి తెలుసు. అందుకే క్షమించాను.
వాణిని నేను ఇష్టపడుతున్నా అని తెలిసి.... వెళ్లి వాణికి నేను అమ్మాయిలకు కడుపు చేసి అబార్షన్లు చేయిస్తా అని చెప్పి వచ్చాడు. ఆ తర్వాత నుండి వాణి నన్ను చూసిన చూపు ఇప్పటి వరకు మర్చిపోలేను. ఆ తర్వాత వాణి నా గురించి తెలుసుకొని నాతొ గౌరవంగా ఉండడం మొదలు పెట్టింది. బహుశా అప్పుడే మా ఇద్దరి మధ్య స్నేహం పుట్టి అది ప్రేమగా మారింది ఏమో...
మా నాన్న చనిపోయినపుడు అనుకుంటా వాడు బాగా ఏడ్చాడు. మా నాన్నకి వాడంటే చాలా ఇష్టం. అందుకే అంతలా ఏడ్చాడు, వాడికి నాకు ఎపుడూ అంత ఇదిగా పడకపోయినా వాడు ఏడుస్తూ ఉంటే, వాడిని అలా చూడడం నా వల్ల కాలేదు. అప్పుడు అనుకున్నా ఇక నుండి వీడు నాకు తమ్ముడు అయినా కొడుకు స్థానం అని.... ఆ విషయం వాణికి చెబితే, తను కూడా అర్ధం చేసుకొని తల్లిలా చూసుకుంటా అని చెప్పింది.
వాణి:
కరణ్, నన్ను చూసే చూపులు నాకు కొత్తగా అనిపించాయి. కరణ్ వాళ్ళ అమ్మకి ఏం చెప్పాడో నాకు తెలియదు కాని సుజాత మేడం అప్పటి నుండి నన్ను ప్రేమగా చూసుకునేది. నేను మేడంకి సెక్రటరీ అయినా నన్ను కూతురులా చూసుకునేది.
నిజానికి మా అమ్మ పేరు మీద 'యస్' గ్రూప్స్ ఉన్నప్పటికి, అందులో నాకు ట్రైనింగ్ జాబ్ కావాలని అడిగితే, సుహాసిని దేవి ఒప్పుకోలేదు. కాని ఆ తర్వాత సెక్రటరీకి ట్రైనీ గా జాయిన్ అయి కొన్ని రోజుల్లోనే చైర్మన్ కి సెక్రటరీ అయ్యాక తిరిగి రమ్మని అడిగారు కాని నాకు ఇష్టం లేదు.
సుజాత మేడం మరియు కరణ్ తో నేను చేసే దొంగ చూపుల ప్రేమలు, బంటి చేసే అల్లరి పనుల మధ్య నాకు జీవిస్తూ ఉన్నట్టు ఉంటుంది. కాని నాకు సుహాసిని గారి దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడూ ఒక కుటుంబం అనిపించలేదు.
బంటి మా ఇద్దరికీ సర్పైజ్ గా మ్యారెంజ్ అరేంజ్ చేస్తే చాలా సంతోషించాను. వెంటనే నా అసిస్టెంట్ కి కాల్ చేసి బంటి కోసం బైక్ తెప్పించాను. నిజమే... బంటి కోసం చేయగలను... గర్వంగా నా పవర్ చూపించగలను, సందీప్ నాకు ఎప్పుడూ తమ్ముడు అనిపించలేదు. నేను ఎంత చేసినా వాడికి తక్కువే అదే బంటికి చిన్న చాక్లెట్ ఇప్పించినా సంతోషంగా తీసుకొని నవ్వేస్తాడు.
కరణ్ కి, బంటి అంటే చాలా ఇష్టం. కాని ఇష్టం లేనట్టు నటిస్తాడు అంతే. వాళ్ళ సిబిలింగ్ గొడవలు చూస్తే నాకు చాలా బాగుంటుంది. నాకు ఉన్న ఆలోచన అల్లా ఒక్కటే.... కరణ్ ని ఇంతకు ముందే ఎందుకు ఓకే చేయలేదు.
సుజాత:
వాణి బైక్ తీసుకురాగానే, నాకు ఆశ్చర్యం వేసింది. బైక్ కొనాలని అందరూ అనుకుంటారు, కాని నిముషాల మీద తెప్పించి వాడి ముందు పెట్టడం అంటే అది మామూలు విషయం కాదు. నా కోడలు పవర్ మరియు ట్యాలెంట్ చూసి నాకు గర్వం అనిపించింది.
ఎప్పుడూ వీళ్ళకు ఎలాంటి వాళ్ళు వస్తారో అని భయం వేసేది. కాని వాణిని చూస్తే నాకు హమ్మయ్యా అనిపించింది. ఈ ముగ్గురు నాకు ముగ్గురు పిల్లలులాగా అనిపిస్తారు. వాణి ఫ్యామిలీ సమస్యలను నెత్తి మీద పెట్టుకొని ఇద్దరూ మోసారు.
ఒకరికి సమస్య వస్తే అందరూ కలిసి పోరాడారు. ఇది నిజంగా చాలా మంచి విషయం. ఇదే ఫ్యామిలీ అంటే...
కానీ, 'యస్' గ్రూప్ ఈ మధ్య బిజినెస్ లో నన్ను డీ కొడుతుంది. నాకు రావాల్సిన ప్రాజెక్ట్ లను పంతం పట్టి మరీ లాగేసుకుంటుంది. సుహాసిని మరియు సుధాకర్ లు బిజినెస్ ఫీల్డ్ లో ఇలా చేస్తారు అని అసలు అనుకోలేదు.
సుహాసిని నాకు వార్నింగ్ లెటర్ పంపింది.... వాణిని అప్పగించాలి లేదా... నా బిజినెస్ ని నాశనం చేస్తా అని.
పిల్లలకు చెప్పాలని ఉంది కాని నవ్వుతున్న వాళ్ళ మొహాల్లో బాధ కంగారు చూడదలుచుకోలేదు.
బంటి:
నా దగ్గర చాలా బైక్స్ ఉన్నాయి. అయినా సరే సర్పైజ్ అయినట్టు చూసి వదినకు థాంక్స్ చెప్పి ఆ బైక్ ఎక్కి పోజ్ లు ఇచ్చాను. వదిన, అన్న ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఇద్దరూ అలానే ఉండాలి. అమ్మ కూడా నవ్వుతుంది.
వాళ్ళ మొహాల్లో బాధ, కంగారు చూడదలుచుకోలేదు.
ఫోన్ కాల్ :
వాణి "నువ్వు ఇలా చేస్తావు అనుకోలేదు బంటి.... నీ వల్ల మా అమ్మ ప్రమాదం లో ఉంది"
బంటి "వదినా.. అదీ" అంటూ చెప్పాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాడు.
వాణి "బంటి.. ప్లీజ్ నన్ను వెళ్లనివ్వు" అంటూ కాల్ కట్ చేసి బయటకు వెళ్ళింది.
బంటి "ఆహ్...." అని అరిచాడు.
ఇప్పుడు ఏం చేయాలి?
ఇప్పుడు ఏం చేయాలి?
వదినా.... వదినా.... ఇలా జరిగితే అన్న ఎప్పటికి క్షమించడు....
ఇప్పుడు ఏం చేయాలి?
ఇప్పుడు ఏం చేయాలి?
ఇంకా లాస్ట్ 3 ఎపిసోడ్స్.....
ఎపిలాగ్ లో సెక్స్ సీన్ ఉంటుంది.