Thread Rating:
  • 100 Vote(s) - 2.51 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica #Dasara - అశ్వహృదయం
 12.1            - నిరీక్షణ  ముగిసింది
శివా నేనా  తనను రక్షించింది  చిన్నప్పుడు , తను  ఇంత దగ్గరగా ఉన్నా తను గుర్తించలేదు ,  పల్లవీ  తను అంటే  చాల ఇష్టం ఉన్నట్లు ఉంది , ఇప్పుడు తను  ఎం చెప్పాలి పల్లవీకి. చిన్నప్పుడు  జరిగిన విషయం తను పల్లవీకి చెప్పలేదు ,  ఇప్పుడు చెపితే  తనకు  నేను కల్పించి చెప్పాను అని అనుకోదు  కదా, శివాకు   నాకున్న కస్టాలు ఎలా చెప్పేది , తనను నా  వాణ్ణి  ఎలా చేసుకొనేది ,   ఉన్న ఒక్కటే మార్గం పల్లవి , తన ఇంటి విషయాలు ఏవీ పల్లవీకి  తెలియవు ,  నాన్న   ఊర్లో అందరికీ మంచిగానే ఉంటాడు, నేను నాన్న ఇలాంటి వాడు అని చెప్పినా ఎవ్వరు నమ్మరు  , ఒక వేల  నాన్నకు తెలిస్తే   , నా జీవితం తొందరగా ముగిసిపోతుంది . ఎలాగైనా  ఈ విషయాలు శివాకు  చెప్పాలి   ముందు అన్నీ పల్లవీకి చెప్పాలి  తన ద్వారా శివాకి  చెప్పాలి.  అని ఓ  పథకం  తన మనసులో  రచించు కొన్నాక   తన లోకం లోంచి ఎం జరుగుతుందా   అని ప్రస్తుతా నికి వచ్చింది.
“నేను చెప్పానా ,  చూడు ఇప్పుడు  తనే  దీంట్లో కూడా   ఫస్ట్  వచ్చాడు”  అంటూ    నోట్లో చెయ్యి పెట్టి గట్టిగా ఈల  వేసింది.
అక్కడ  పోటీ చూడడానికి వచ్చని వారు అందరు , ఈల ఎవరబ్బా  వేసింది అనుకోంటు  అంతా  మౌనికా, పల్లవి   వాళ్ళు  కూచొన్న  వైపు చూడ సాగారు.
“నిన్ను   తన్నాలి , అలా మగ రాయుడిలా  ఈల  వేయడం  ఎంటే”
“తనకి మనం సపోర్ట్ చేయక పొతే , ఎవ్వరు సపోర్ట్ చేస్తారు” అంటూ మరో మారు  ఈల వేసింది.  ఆ ఈల  సౌండ్ విని శివా కుడా  వీల్ల వైపు చూశాడు.
అప్పుడు  గమనించాడు మౌనికా  చూపు  తన కాళ్ళ వైపు చూడ్డం.  ఏంటి తను  కూడా  ఇప్పుడు  క్లాసు పీకుతుందా  షార్ట్ మీద అనుకొంటూ  నవ్వుతు వాళ్ళ వైపు వచ్చాడు.
“కంగ్రాట్స్  , శివా   మిగిలిన  అన్నింటి లోను నువ్వే ఫస్ట్ రావాలి” అంది పల్లవి ,
“శివా , ఆ  మోకాలి  కింద ఉన్నది ఏంటి అది” అంది శివా మోకాలి  కింద చెయ్యి  చెయ్యి చూపిస్తూ  కౌనికా.
“ఇదా, నా  పుట్టు మచ్చ”
“ఇది నీకు చిన్నప్పటి నుంచీ ఉందా”
“అందుకే గా దాన్ని పుట్టు మచ్చ అంటారు, చిన్నప్పటి నుంచీ  ఉంది”
“నువ్వు ఎప్పుడైనా , మీ  ఊర్లో కాకుండా  వేరే   గుడికి వెళ్ళావా ఎప్పుడైనా”
“వెళ్లాను , చాలా సార్లు,  నేను   వెళుతున్నా  మరో పోటీ ఉంది” అంటూ తను అక్కడ నుంచి వెళ్ళాడు.
“ఏమైందే  మౌనీ ,  దేనికి   శివా పుట్టు మచ్చ మీద పడింది నీ కన్ను”
“నీకో  విషయం చెప్పాలి”
“నాకు తెలీకుండా  ఏమైనా దాచావా?”
“కొన్ని విషయాలు ,నేను చిన్నగా ఉన్నప్పుడు జరిగాయి , వాటిని నీకు చెప్పలేదు”
“సరే లే చెప్పు  , టైం ఉందిగా”  అంది 
“మృణాళినీ  , నువ్వు వెళ్లి  ఐస్క్రీం  తిని మాక్కూడా  తీసుకొని  రా పో” అని  మౌనికా చెల్లిని అక్కడ నుంచి పంపింది.
“ఇప్పుడు చెప్పు , నీ  చెల్లి వెళ్ళింది”
మౌనికా   తనకు  చిన్నప్పుడు గుడిలో జరిగిన  విషయం చెప్పింది,  అప్పుడు  తనను రక్షించి  న అబ్బాయి కోసం  చిన్నప్పటి నుంచి  వెతుకుతూ ఉంది,  ఇన్ని రోజులు   మన పక్కనే ఉండి  కూడా  , నేను తనే అనే విషయం  కనుక్కో లేక పోయాను.    నాకు  కూడా  అదే ప్లేస్ లో పుట్టు మచ్చ  ఉంది.  అంటూ   తన పుట్టు మచ్చ  చూపించింది.
“అవును  నీకు కుడా  నిజంగా అక్కడే ఉంది”
“నీకు   ఇంకో విషయం కూడా  చెప్పాలి”  అంటూ   తన  తల్లి ఎలా  చనిపోయింది,  తన తండ్రి   తల్లి ఆస్తి కోసం ఎలా ఎదురు చూస్తూ ఉన్నాడు ,  తన తాత  తన కోసం రాసిన విల్లు గురించి   అది ఎప్పుడు తన చేతికి వస్తుందో , ఆ తరువాత తన తండ్రి నుంచి  తన ప్రాణానికి ఎటువంటి ప్రమాదం ఉందొ  తన 21  వ ఏట.   అంతవరకూ  తను  ఏమీ చేయలేడు  అని    తన  మనసులో ఉన్న  కలత నంతా  తనతో కక్కేసింది.
“ఇంత  విషయాన్ని నీ లోపల  దాచుకొని నువ్వు ఎలా ఉన్నావే  ఇంత  నిమ్మలంగా” అంది పల్లవి.
“ఎం చేయను , ఎవరిని నమ్మను   నీకు తెలుసుగా  మా నాన్న  గురించి  ఎవరికీ  చెప్పినా ఆయన అటువంటి వాడు  అని  చెప్పినా ఎవ్వరు నమ్మరు, అందుకే   నాలో నేనే కుమిలి పోతున్నా”
“నాకు చెప్పావుగా,  ఇప్పుడు దీన్ని గురించి ఎదో  ఒకటి ఆలోచిద్దాము, మనకు ఇంకా  కొద్దిగా టైం ఉంది”.
“మరి శివా  తో  ఈ విషయాలు  ఎప్పడు చెప్పాలి?”
“శివాకి చెప్పడం ఎందుకు ?  శివాకి  దానికి ఎం సంబందం”
“నన్ను  చిన్నప్పుడే రక్షించాడు , ఆ తరువాత  కూడా  రక్షించాడు,  మా తాత  కుడా  చిన్నప్పుడే చెప్పాడు  , నేను అలాంటి వాడి రక్షణలో ఉంటె నా జీవితం  క్షేమంగా ఉంటుంది అని  అన్నాడు, అందుకే  శివా కి  ఈ విషయాలు అన్నీ చెప్పి తనను మనకు హెల్ప్ చేయమని చెప్పాలి,  నీవు చూసావుగా ,   మా ఇద్దరికీ ఒకే  చోట పుట్టు మచ్చ కూడా  ఉంది ,  ఇదే  మా ఇద్దరినీ కలుపుతుంది అని నేను అనుకోంటు ఉన్నాను”  అంది 
“ఎంటే నువ్వు చెప్పేది ,  శివా  కు చెప్పి నీకు హెల్ప్  చేయమని చెప్పాలా ఏంటి ?  తనకు ఎం తెలుసు , తను నిన్ను ఎలా రక్షిస్తాడు”
“ఏమో  అవన్నీ , నాకు తెలియదు , నాకు తెల్సింది అంతా  ఒకటే , మా ఇద్దరికీ  ఒకే చోట పుట్టుమచ్చ ఉంది,   తను నా కోసమే పుట్టాడు అనిపిస్తుంది   అందుకే  నాకు రెండు సార్లు  ఆపద వచ్చినప్పుడు  తను నా పక్కనే ఉండి  నన్ను రక్షించాడు అది ఒక్కటే తెలుసు , మా తాత  కుడా  చిన్నప్పుడు  కూడా  అదే చెప్పాడు.  నిన్ను రక్షించే  వాడినే నువ్వు చేసుకో తల్లీ  అప్పుడే , నీ జీవితం   క్షేమంగా ఉంటుంది. నువ్వే ,  ఇప్పుడు  ఈ విషయాలు అన్నీ శివాకు  చెప్పాలి ,  నువ్వు తనకు బాగా క్లోజ్” అంది
“సరే చూద్దాం  , ఇప్పుడు   పోటీలు  అయిపోనీ ,  పోటీల కంటే ముందు చెప్తే  తను పోటీల మీద  ద్రుష్టి పెట్టలేడు ,  అవి అయిపోయాక   చెప్దాము ,  అంత  వరకు  అగు, నువ్వు ఎం చెప్పకు” అని పల్లవి మౌనికా   ఉత్సాహం  మీద  నీళ్ళు చిలకరించింది.   
“ఇంకా  3 రోజులు నేను ఎలా ఉండగలను తనకు చెప్పకుండా”
“ఎంటే   , తన  వంటి మీద మచ్చ  చూసి 3 నిమిషాలు కూడా  కాలేదు ,  అప్పుడే  తన మీద  అంత ద్యాస  ఎందుకు?”
“తన వంటి మీద మచ్చ చూసి  3 నిమిషాలే అయ్యింది , కానీ  ఆ  వ్యక్తిని  చూడడం కోసం,   ఎన్ని సంవత్సరాల  నుంచి ఎదురుచూస్తూ ఉన్నానో  తెలుసుగా,  ఇప్పుడు తెలిసీ చెప్పలేక పోతున్నా,  ఇన్ని  సంవత్సరాల  కంటే  ఈ రెండు రోజులే కష్టంగా  ఉండేట్లు ఉన్నాయి”
“సరే,  ఇక్కడే ఉన్నావుగా,  ఎదురుగా ఉన్నాడుగా   వాడి పని కానీ  ఆ తరువాత చెప్దాం  లేదంటే రెండే  రొండు రోజులు ఆగు  ఆతరువాత  దగ్గర ఉండి  నేనే చెప్తా అంతా” సరేనా  అంది పల్లవి.
చేసేది ఏమీ లేక  ఓకే చెప్పింది  మౌనికా , ఆ తరువాత జరిగే పోటీలు చూడడం లో మునిగి పోయారు.
ఆ రోజు  మద్యానం పల్లవీ  తన పాల్గొన్న వాటిలే  ఒక  దాంట్లో  మొదట వచ్చింది  మిగిలిన వాటిలో   వెనుక బడి పోయింది.   తను మొదట వచ్చిన  పోటీ  దగ్గర శివా ఉన్నాడు , తను మొదట రాగానే  వెళ్లి  కంగ్రాట్స్  చెప్పాడు  తన చేతిని  పల్లవీ  చేతిలో వేసి పక్కనే ఉన్న  మౌనిగా తనని అదే పనిగా చూడ్డం   గమనించాడు , కానీ అదేం  పట్టించు కోకుండా  తరువాత  జరిగే పోటీల  కోసం ప్రిపేర్  కాసాగాడు.
మొత్తం శివ  8 పోటీలకు  పేర్లు ఇచ్చాడు  ఈ రోజు  3  ,  రేపు  4  ఆ తరువాత రోజు  1  ,  అప్పటికే రెండు పోటీలు జరిగాయి  ఆ రెండింటిలో  తనే మొదట వచ్చాడు,  ఇంకోటి  ఇంకో   అర గంటలో జరుగుతుంది అనగా ,  మల్లికా  వచ్చింది  తన దగ్గరికి.
“మరో మారు కంగ్రాట్స్  బావా”  అంది
“థాంక్స్  మల్లికా, మీ తమ్ముడు ఏడీ ?” అన్నాడు చుట్టూ చూస్తూ.
“ఇందాకే  వాడు ఇంటికి వెళతాను అంటే , పంపించి వచ్చా  అవ్వ  వాడు  ఉరికి వెల్లారు  అక్కడ అవ్వ   అక్కకు బాగాలేదు అంట  , అందుకే అవ్వ  వెళతాను  అంటే పంపించి  వచ్చాను”
“వాళ్ళు ఇద్దరే  వెళ్ళగలరా?, నువ్వు తోడూ వెళ్ళాల్సింది”
“వెళతారు ,  నువ్వు ఇక్కడ ఒక్కడివే ఉన్నావుగా  నీకు తోడుగా  ఉంటాలే , అందుకే నిలబడ్డా” అంది 
“మీ ఉరికి వచ్చినప్పుడు అస్సలు  మాట్లాడ లేదు , ఇప్పుడు  ఇంటికే రమ్మంటున్నావు”
“అప్పుడు నీ గురించి  పూర్తిగా తెలీదులే , ఇప్పుడు  అంతా  తెలుసుగా”
“సరే  ఈరోజు వీలు కాదులే , రేపు  4 పోటీలు ఉన్నాయి  అవ్వి అయ్యాక  ఎల్లుండి  ఒకటే ఉంటుంది , కావాలంటే రేపు వెళదాం లే , నాకు  ఇంకోటి ఉంది ఈ రోజు”
“సరే అయితే,  అది అయ్యాక  వెళతాను  నేను, నువ్వు వెళ్లి ప్రాక్టీసు చేసుకో”  అంటూ తను  జనం లో కలిసి పోయింది.
తను  ప్రాక్టీసు ప్లేస్ కి వచ్చి  తన  ప్రాక్టీసు  తను చేసుకో సాగాడు.
Like Reply


Messages In This Thread
RE: #Dasara - అశ్వహృదయం - by siva_reddy32 - 07-10-2024, 07:48 PM



Users browsing this thread: Ash143, 129 Guest(s)