07-10-2024, 10:09 PM
172. ఇదే నేను అయితేనా..... 1.0
లావణ్య:
జీవితంలో స్వర్గం అంటే ఏంటో తెలుసా! మనం ప్రేమిస్తున్న మనిషి మన ఎదురుగా ఉండి మనం ఎంత సేపైనా వాళ్ళను చూస్తూ గడిపేయడమే....
నరకం అంటే ఏంటో తెలుసా! మనం ప్రేమిస్తున్న మనిషి వేరే వ్యక్తిని ప్రేమిస్తూ ఉండడం చూడడం.. ఆ మనిషి ఛీ కొడుతున్న బుజ్జగిస్తూ ఎన్ని తిట్లు చీదరింపులు భరిస్తున్నా వాళ్ళతోనే ఉండడం.
"కూ" అని పెద్ద శబ్దం చేసుకుంటూ వాళ్ళు ఉన్న ట్రైన్ పట్టాల పై వేగంగా పరుగులు పెడుతుంది. ట్రిప్ టూ గోవా... వాళ్ళ హనీమూన్ ప్లాన్ చెప్పండి టికెట్స్ బుక్ చేస్తా అని చెప్పా... అలా కుదరదు.. నెల రోజుల ప్లాన్... అప్పటికప్పుడు ఏం మూడ్ వస్తే అది చేస్తాం అన్నారు.
ఎంత లవింగ్ కపుల్ అనుకున్నా.... కాని ఇప్పుడు నా ఎదురుగా కూర్చున్న జంటని చూస్తూ ఉంటే నాకు అలా అనిపించడం లేదు.
క్రిష్, కాజల్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటే, తను మాత్రం క్రిష్ వైపు కోపంగా చూస్తూ ఉంది. అదే నేనయితే క్రిష్ ని బాగా చూసుకునే దాన్ని.
![[Image: IMG-20241006-104148-760.jpg]](https://i.ibb.co/7252hWx/IMG-20241006-104148-760.jpg)
కాజల్ గ్లాస్ డోర్ దగ్గర స్టైల్ కూర్చొని ఉంటే, క్రిష్ తన పక్కనే కూర్చొని ఆమె మీద చేతులు వేస్తూ, ఆమె తోసేస్తూ ఉంటే బ్రతిమలాడుతూ బుజ్జగిస్తూ ఉన్నాడు.
వాళ్ళ రోమాన్స్ చూడలేక ఒక సారి బాత్రూంకి వెళ్లి వచ్చాను. కాజల్ కూడా కావాలనే చేస్తున్నట్టు ఉంది ఒక్కో సారి నలిపించుకుంటుంది. ఒక్కో సారి తోసేస్తుంది.
ఒక్కో సారి కోపంగా చూసి పక్కకు తిరుగుతుంది.
క్రిష్ మాత్రం అలుపెరుగని బాటసారిలాగా డాడి చేస్తూనే ఉన్నాడు.
ఇంతలో దూరంలో కూర్చున్న ఒక ముసలావిడ "మీ ఇద్దరూ ఏంటి?" అని అడిగింది.
వావ్ ఈ ముసలమ్మకు నిజంగా దండ వేసి దండం పెట్టాలి అంత దరిద్రంగా అడిగింది ఏంటి? మరీనూ....
క్రిష్ నవ్వుతూ "మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం, హనీమూన్ కి వెళ్తున్నాం"
ఆవిడ మాత్రం నమ్మలేదు, నమ్మనట్టు స్పష్టంగా కనిపిస్తుంది.
క్రిష్ ఇంకా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఆవిడ "సర్లే.... అయినా నాకెందుకు లే" అన్నట్టు చూసింది.
క్రిష్, కాజల్ వైపు చూసి తను ఏమయినా చెబుతుంది ఏమో అన్నట్టు చూశాడు.
ఆమె ఏ సమాధానం చెప్పకుండా అవతలికి తిరిగింది.
ముసలావిడ "ఏమ్మా.... నిన్ను ఏమయినా ఇబ్బంది పెడితే... చెప్పూ అమ్మా నా బిడ్డ సెక్యూరిటీ అధికారి... ఫోన్ చేస్తే..." అంటూ ఆగింది.
క్రిష్ షాకింగ్ గా ఆమె వైపు చూసి కాజల్ వైపు చూశాడు. తను ఏ మాత్రం సమాధానం చెప్పక పోగా.... తనకేం పట్టనట్టు ఉంది.
క్రిష్ కోపంగా పైకి లేచాడు. కాజల్ కూడా అతని వైపే చూస్తూ ఉంది, కాని ఆమె మొహంలో కోపం తగ్గినా వెనక్కి తగ్గాలని లేదు.
క్రిష్ కోపంగా బయటకు వెళ్లి కొద్ది సేపటి తర్వాత వచ్చి, కాజల్ పక్కన కాకుండా లావణ్య పక్కన కూర్చున్నాడు. కాని తాకకుండానే ఉన్నాడు.
కాని కాజల్ మాత్రం కోపంగా చూస్తూనే ఉంది, క్రిష్ కూడా ఆమె వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు. ఇద్దరి మధ్య కొద్ది సేపూ చూపుల యుద్ధం జరిగింది.
క్రిష్ "బామ్మ గారు.... ఈ అమ్మాయి నా వైపు చూస్తుంది, మీ కొడుకు సెక్యూరిటీ ఆఫీసర్ కి కొంచెం చెప్పరా.... " అన్నాడు.
ముసలావిడ "మనవడా! నాకున్న అనుభవం మొత్తం కలిపి ఒక మాట చెప్పనా...."
అందరూ ఆవిడనే చూస్తూ ఉన్నారు.
ముసలావిడ "మొగుడు పెళ్ళాల మధ్యలో దూర కూడదు" అని తల వాల్చుకొని పడుకుంది.
ట్రైన్ లో ఉన్న మిగిలిన వాళ్ళు అందరూ నవ్వేశారు.
కాజల్ కూడా నవ్వడంతో, క్రిష్ కూడా వెళ్లి ఆమె పక్కనే కూర్చున్నాడు.
లావణ్య లోయర్ బెర్ట్ లో పడుకొని నిద్ర పోతే.... క్రిష్ మరియు కాజల్ ఇద్దరూ పై బెర్త్ లలో ఎదురెదురుగా పడుకున్నారు.
హుమ్మ్.. మొగుడు పెళ్ళాలు ఇలా ఎవరైనా ఉంటారా.... ఇదే నేను అయితేనా.....
![[Image: Lavanya-Tripathi-10.jpg]](https://i.ibb.co/6Y1sjRf/Lavanya-Tripathi-10.jpg)
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them