Thread Rating:
  • 100 Vote(s) - 2.51 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica #Dasara - అశ్వహృదయం
11.2
రాజి రెడ్డి ప్రస్తుతం, పెళ్ళాం  పిల్లలతో  కలిసి జిల్లా హెడ్  క్వార్టర్స్  లో  ఉంటున్నాడు ,  పిల్లలు ముగ్గురు అక్కడే  చదువుతూ ఉన్నారు.   సెలవులు ఉన్నప్పుడు  వీలు కుదిరినప్పుడల్లా  సొంత ఉరికి వచ్చే వారు,  అప్పుడు పల్లవి  దగ్గరికి వచ్చే వాళ్ళు.   పల్లవీ  మౌనికా ఇద్దరు మంచి స్నేహితులు అయ్యారు చిన్నప్పటి నుంచీ.
చూస్తూ ఉండగానే  జిల్లాకు  పోటీల కోసం వెళ్ళాల్సిన సమయం వచ్చేసింది.  
 కాలేజీ లో పోటీ  జరిగినప్పుడు అక్కడికి వచ్చిన  వాళ్ళు చెప్పిన దాని ప్రకారం  పోటీలలో  పాల్గొనే  విద్యార్తులకు అక్కడ హాస్టల్  లో ఉండడానికి ఏర్పాటు చేశారు.

పోటీ  ముందు రోజు సాయంత్రం బాల్రెడ్డి శివా , పల్లవి ని తీసుకొని జిల్లాకు వచ్చారు ,   వాళ్ళకు  కేటాయించిన  హాస్టల్  లో  ఇద్దరినీ వదిలి  , తను రాజి రెడ్డి ఇంటికి వెళ్లి  మరుసటి రోజు   ఇంటికి వెళ్ళిపోయాడు.
ఆ రోజు  రాత్రి  రాజి రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు   కౌనికాకు చెప్పినాడు , పల్లవి  ఎందుకు అక్కడికి వచ్చిందో.
“నేను రేపు పొద్దున్నే  వెళతాను చిన్నానా, మా  కాలేజీ  వాళ్ళు  కుడా పాల్గొంటున్నారు, అందుకే మేము అందరం  అక్కడే ఉంటాము”   అని చెప్పింది.
ప్రతి కాలేజీ నుంచి  మొదటి వచ్చిన వాళ్ళను  సెలెక్ట్ చేసుకొని , జిల్లాకు తీసుకొని వచ్చారు ,  మొత్తం దాదాపు  200  మంది  దాకా  వచ్చారు  ,   అందులో  దాదాపు 50 మంది అమ్మాయిలూ  ఉన్నారు.  మిగిలిన  150  మంది  అబ్బాయిలే.
హాస్టల్   లో  నోటీసు బోర్డు కి   రోజు వారీ పోటీలు  , ఎ  టైం కి  ఎం  జరుగుతుంది  అనే విషయాలు రాసి పెట్టారు. 
చివరి రోజు   జిల్లా  కలెక్టర్ తో పాటు   S.P  వస్తున్నారు  బహుమతి ప్రదానానికి.
ఉదయం లేచి , గ్రౌండ్  కి వెళ్ళాడు శివా,  అప్పటికే చాల మంది  గ్రౌండ్ కి వచ్చారు.   వాళ్ళతో పాటు  తను కూడా  కొద్దిసేపు ప్రాక్టీసు చేసి వెళ్ళాడు.  
10  గంటలకు  మొదటి  పోటీ  మొదలవుతుంది ,    ఒకటి తరువాత  ఒకటి , ఇలా  ప్రతి ఒక్కరు , ప్రతి పోటీ లో పాల్గొనే అవకాశం కల్గించారు.
పలహారం తిని, తను కుడా  రెడీ అయ్యి ,   షార్ట్  బనీయన్ వేసుకొని  గ్రౌండ్  కి వచ్చాడు. 
మరో రెండు నిమిషాల్ తరువాత  పల్లవి  వచ్చింది , తను  ట్రాక్ సూట్  లో  వచ్చింది.   “ఇదేంటి ఈ  డ్రెస్ లో వచ్చావు, ట్రాక్ సూట్  లో  లేదా నీకు”
“ఎం ఇది వేసుకొంటే  రానీరా  ఏంటి” అన్నాడు   రానీరేమో అనే భయంతో
“అలా ఎం కాదులే,  కాక పొతే అందరు ట్రాక్ సూట్ లో వస్తారు  కదా, అందుకే అడిగా”
“ఇక్కడికి రావడానికే , మీ నాన్న దగ్గర  డబ్బులు అప్పు చేశాడు మా నాన్న , ఇంక  ఆ  డ్రెస్   అవ్వి కావాలంటే   ఇంక ఎంత డబ్బు అవుతుందో ,   అయినా డ్రెస్ ఉంటె  నా  పోటీ లో  నెగ్గేది ,  ఈ డ్రెస్ తో నేగ్గలేమా   చూద్దాం”
“ఆబ్బా  , ఎదో   అలా అడిగాలే ,  దానికి విపరీతార్తాలు తీయకు,  పోటీ  లో నువ్వే  ఫస్ట్ వస్తావులే  ,  అల్  ది  బెస్ట్”  అంటూ  తన చేతిని  శివా చేతికి ఇచ్చి  విష్ చేసింది.  తను కూడా   విష్ చేశాడు. 
మొత్తం స్టేడియం  అంతా వినపడేట్లు మైకులు పెట్టారు,     మొదటి పోటీ   ఇంకో  10 నిమిషాల్లో మొదలు అవుతుంది , పోటీలో పాల్గొనే  వాళ్ళు అంతా పోటీ ప్రదేశానికి  రమ్మని  మైక్  లో  చెప్పారు.
“తప్పకుండా  నువ్వే  గెలవాలి మన ఉరికి , మన కాలేజీకి  పేరు తేవాలి  అంది” పల్లవి
“హాయ్ , పల్లవీ”  అంటూ ఇద్దరు అమ్మాయిలు  వచ్చారు.
“హాయ్” అంది  తను కుడా  వచ్చిన ఇద్దరినీ  చూస్తూ
“శివా , వీళ్ళు  మన ఉరి వాళ్ళే,  సినిమా  హల్లో  వీళ్ళ కోసం నువ్వు కొట్లాట పెట్టుకోన్నావు  గుర్తు ఉందా,  ఇది మౌనికా,  ఇది మృణాళినీ,  తను  మన ఉరి వాడే  శివా , ఆ రోజు  మీ కోసం  గొడవ పడి  వాళ్ళను  తన్నింది  తనే”
“వచ్చాక మాట్లాడత” అంటూ  అక్కడ నుంచి పోటీ ప్రదేశానికి వెళ్ళాడు.
"ఏంటి బికారి గాడిలా ఉన్నాడు ,  వీడు పోటీలో నేగ్గాడా"
"ఏయ్ , అలా అనకు , తను పేద వాడు అంత  మాత్రానా టాలెంట్  ఉండదా ఏంటి"
"ఏంటి  వాణ్ణి వేనుకేసుకొని వస్తున్నావు ,  కొంప దీసి  వాణ్ణి  లవ్ చేస్తున్నావా ఏంటి" అంది మౌనికా  నవ్వుతు. 
"ఎం  వాడు  లవ్ చేయడానికి పనికి రాడా  ఏంటి ? , చూసావుగా ఎలా ఉన్నాడో ,  ఈ  సినిమా హీరోకు తీసిపోని  బాడీ , ఇంక వాడి  ధైర్యం అంటావా ,   మన ఉరి చెరువు ఉందా  దాన్ని ఈ పక్కనుంచి ఆ పక్కకు  ఈదుకొంటు  వచ్చాడు, ఇంత వరకు ఆ చెరువును  ఎపక్క నుంచి  ఆ పక్కకు ఈదింది  ఇద్దరే  ఇద్దరు ఒకడు  శివా, రెండు   తన తాత.  మొన్న  ఊర్లో అందరు పదుల వేటకు వెళ్ళారా , మా నాయన కూడా  వెళ్ళాడు తుపాకీ తో     శివా వాళ్ళ నాయన వెళుతూ ఉంటె తను  కూడా  వెళ్ళాడు అంట , మా నాయన  తనను  ఎగతాళి చేస్తూ  తన వెనుక ఉండ మని చెప్పాడు అంట ,  కానీ   రెండు పందులు  మా నాయన్ని  తిన బోతే  తను రెండు చేతులతో  ఆ  ఒకే సారి  రెండింటినీ  చంపి మా  నాయన్ని  రక్షించాడు  తెలుసా,  వాడు  పెదోడే  కానీ  గుణం లో  వాణ్ణి  మించిన వాళ్ళు  లేరు,  ఎప్పుడైనా నేను మాట్లాడితే గానే మాట్లాడాడు , కాలేజీ లో చూశావా   అబ్బాయి లు మనకోసం , ఎలా ఎగబడతారో ,  వీడు మనం మాట్లాడినా కుడా తను మాత్రం మాట్లాడాడు  ఒక వేల అవసరం అయి   మాట్లాడితే  ఒకటో రెండో  మాటలు ముత్యాల్లా   రాలి పడతాయి వాడి నోటి నుంచి"


"ఏందే  వాడి మీద పెద్ద బుక్కు రాసేట్లు ఉన్నావే"
"నీకు వాడి గురించి తెలియదు  కదా, వాడిని నువ్వు ఇస్తాపడక పోయినా పరవా లేదు , కానీ అలా  నెగిటివ్  గా మాత్రం  మాట్లాడొద్దు  నా ముందు , కావాలంటే  పక్కకు వెళ్లి మాట్లాడుకో"
"అమ్మా తల్లీ , నీ రాకుమారుడిని ఎం అనను  లే , ఇంక  వదిలేయి , పద నీ హీరో ఎలా  బీట్ చేస్తాడో చూద్దాం"  అంటూ   పొటేలు జరిగే ప్లేస్ కు వెళతారు.  


పోటీ ప్రదేశం లో  దాదాపు  40 మంది దాకా ఉన్నారు,   రెండు బ్యాచ్  లలో  ఈ పోటీ జరుగుతుంది,   మొదట  20 మంది , ఆ తరువాత  20  మంది.    శివా ని రెండో బ్యాచ్  లో   వేశారు. 
ఊర్లో  చెక్కలు కొట్టి ఆ సౌండ్  తో    పోటీకి ప్రారంభించారు , కానీ ఇక్కడ పిస్టల్  సౌండ్  తో పోటీ  ప్రారంభిస్తారు.
మొదటి బ్యాచ్  పోటీ  ప్రారంభించారు ,   100  మీటర్లు  పరుగు పందెం.   
పోటీ జరిగిన  రెండు నిమిషాలకు  రెండో బ్యాచ్ రెడీ అయ్యింది ,  మొదటి బ్యాచ్ లో పాల్గొన్న  మొదటి 10 మంది  టైమింగ్స్  నోట్ చేసుకొన్నారు.      రెండో  బ్యాచ్ లో శివా  రెడీ అయ్యాడు.   తన  ద్యాస అంతా ఎదురుగా కనబడుతున్న  ఎరుపు రిబ్బెన్ మీదే ఉంది.  చెవులు మాత్రం  తుపాకి శబ్దం వినడం కోసం రెడీ అయ్యింది.   తన చుట్టూ  ఉన్న  జానాలు కనబడ లేదు  తనకు ,   ఎటువంటి శబ్దాలు వినబడ లేదు,   తన  శరీరం లోని శక్తి నంతా  కాళ్ళలో  కేంద్రీకరించి  రెడీ అయ్యాడు.
గన్  శబ్దం  వినబడగానే ,   గన్  లోంచి వచ్చే బుల్లెట్  లా   ముందుకు  దూకాడు.   శివాకు తెలుస్తూనే ఉంది  తన కాళ్ళు   గాల్లో  తేలుతూ ప్రయాణం చేస్తున్నాయి  అని ,    చుట్టూ  వున్నవి ఏమీ  తనకు కనబడలేదు , ఒక్కటే  ఎదురుగా ఉన్న రిబ్బన్ ,  తను ఎప్పుడైతే రిబ్బన్ తాకాడో , అప్పడు  తన చెవులు చుట్టూ ప్రేక్షకులు  కొట్టే  చప్పట్ల  శబ్దం వినబడింది.   తన వెనుక వచ్చే వాళ్ళు  కనబడుతున్నారు,    ప్రేక్షకుల్లో  సౌండ్  ని బట్టి తెలుస్తూనే ఉంది, తనే ముందు వచ్చాను అని.
“శివా , నువ్వే   వచ్చావు  ముందు”  అంటూ    ఈ చివర కూచొన్న  ప్రేక్షకుల్లోంచి   పల్లవి  కేక వినబడింది.  
ఓ  15 నిమిషాలు పట్టింది    గెలుపు పట్టిక తయారు చేయడానికి.    తనే ముందు ఉన్నాడు ,  తనకి రెండవ  వాడికి టైమింగ్  లో చాల తేడా ఉంది.
రెండవ పోటీకి   కొద్దిగా గ్యాప్ ఉంది, ఈ లోపల చాల మంది వచ్చి శివా  కి  కంగ్రాట్స్ చెప్పసాగారు.
“బావా ,  నువ్వు సూపర్” అంటూ ఓ  బుడ్డోడు వచ్చాడు.
ఓ క్షణం పాటు  వాడిని ఎక్కడ చుసానా  అని   గుర్తుకు తెచ్చుకోవడానికి ట్రై చేశాడు.  “ మా అక్క కూడా  వచ్చింది” అన్నాడు తన పక్కన ఉన్న అమ్మాయిని చూపిస్తూ,    తను  మల్లిక   అప్పుడు గుర్తుకు వచ్చింది ,  ఆ బుడ్డోడు మల్లికా తమ్ముడు.    పొన్నమ్మ చెప్పింది గుర్తుకు వచ్చింది , మల్లికా , తన తమ్ముడితో  కలిసి  ఇక్కడే చదువుతూ ఉంది ,  వాళ్ళ  నాన్నమ్మ  వాళ్లతో ఉంటుంది   అని.
“కంగ్రాట్స్  బావా” అంది మల్లికా  సిగ్గుపడుతూ.
“మీ ఊర్లో అస్సలు మాట్లాడ లేదు , ఇప్పుడు మాటలు బాగానే వస్తున్నాయే”
“అది సరే గానీ,   రాత్రికి ఇంటికి రా ,  భోంచేసుకొని వద్దువు గానీ”  అంది మల్లికా
“నాకు ఇక్కడ  హాస్టల్  లో ఫుడ్ పెడతారులే”
“పెడితే పెట్టనీ , మా ఇంటికి రాకూడదా ఏంటి”
“ఇప్పుడు వద్దులే ,  లాస్ట్ రోజు వస్తా, ఇక్కడ ఉంటె  ప్రాక్టిస్   కి కొద్దిగా టైం దొరుకుతుంది.
“ఉంటారా సాయంత్రం వరకూ”
“ఆ ,  నువ్వు అన్నింటి లో పేర్లు ఇచ్చావు అంట కదా,  ఉరి నుంచి నీ విషయాలు అన్నీ తెలుసుకొన్నా ,  అక్కడ అన్నింటి లోను నువ్వే  ఫస్ట్ వచ్చావని తెలిసింది, రోజు వస్తాను లే”
“సరే అయితే” అక్కడ  నుంచి  రెండవ పోటీ జరిగే ప్రదేశానికి  బయలు దేరాడు.
“శివా  , ఉండు”   అంటూ పల్లవి  తన ఫ్రెండ్స్ తో వచ్చింది.
“నీ  పోటీ ఎప్పుడు ?”
“2 గంటలకు ,   ఇదిగో  మౌనికా కంగ్రాట్స్ చెప్తాను అంటే తీసుకొని వచ్చాను.”  అంది   పక్కన ఉన్న  మౌనికాను చూపిస్తూ.
“కంగ్రాట్స్  శివా,  మొదట సారి నిన్ను చూసినప్పుడు , పల్లవి నిన్ను ఉరికే పొగుడుతుంది అనుకొన్నాను , కానీ  నీలో  మాంచి స్టఫ్  ఉంది ,  అందర్నీ  బీట్ చేసి  ఫస్ట్  వచ్చావు, చాల  సంతోషం గా ఉంది”  అంది చెయ్యి ముందుకు చాపి.
తన చేతిని  మౌనికాకు  అందించి  “థాంక్స్” అన్నాడు.
“ఏంటి ఇవ్వి చేతులులా  లేక  సుత్తులా, ఇంత   బండగా ఉన్నాయి ఏంటి”  అంది  శివా చేతిని పట్టుకొని నలుపుతూ.
“ఏయ్ , అంతా చూస్తున్నారు , చెయ్యి వదులు” అంటూ శివా  తన నుంచి  చేతిని లాక్కొని   పోటీ వైపు  బయలు దేరాడు
శివా  వెనక్కు తిరిగి కొద్ది దూరం వెళ్ళగానే  శివా  వైపు చూస్తున్న మౌనికా   షాక్ తో అలాగే  నిలబడి పోయింది.
“ఏమయ్యిందే ?   ఏంటి అలా ఉంది పోయావు?”
“ఎం లేదు ఓ   డౌట్  వచ్చింది  ,  శివా  తో మరో సారి మాట్లాడ  దామా”
“ఇప్పుడు పోటీకి  వెళ్ళాడు కదా , అందులో కూడా  మెదట వస్తాడు , అప్పుడు తనకు కంగ్రాట్స్ చెప్పే దానికి వెళదాం అప్పుడు నీకు ఎం డౌట్స్ ఉన్నాయో  అన్నీ అడుగు , ఇప్పుడు disturb చెయ్యద్దు” అంది పల్లవి  అక్కడి నుంచి  వాళ్ళను  రెండో పోటీ జరిగే ప్రదేశానికి తీసుకొని వెళుతూ.
 
శివా  వెళుతూ ఉండగా  మౌనికా శివా  మోకాలి కింద చూసింది ,   అప్పుడు  సూర్యుడు  తన కిరణాలను   అక్కడే కేంద్రీక రించినట్లు  అనిపించింది  తనకి  అక్కడో  నల్లగా  శివా కాళ్ళు  ఉన్న కలర్  కంటే వేరే కలర్ చర్మం  కనిపించింది, కానీ  అది నిజమే  , కాదో  తెలుసుకొనే లోపు తను వెళ్లి పోయాడు.
తను  ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్న వాడు  తన ఊర్లో నె ఉన్నాడా ,  తనను  రెండో సారి కుడా  ఆపద నుంచి కాపాడాడు , నేనే  గుర్తించ లేదు,  తాతయ్య  చెప్పిన  రక్షకుడు  నా జీవితాన్ని చక్కదిద్దే  వాడు  తనే నా     అని ఆలోచిస్తూ   పల్లవి వెనుక  రెండో పోటీ జరిగే ప్రదేశానికి చేరుకుంది.
 
Like Reply


Messages In This Thread
RE: #Dasara - అశ్వహృదయం - by siva_reddy32 - 06-10-2024, 01:47 PM



Users browsing this thread: 135 Guest(s)